breaking news
Banana farmers
-
కదంతొక్కిన అరటి రైతు
అనంతపురం: ఆరుగాలం పంటను పండించిన అనంత రైతన్న.. దాన్ని అమ్ముకోలేక పొలాల్లోనే ట్రాక్టర్‌తో దున్నేసే పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతును పూర్తిగా విస్మరించిన చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం శైలజానాథ్ నేతృత్వంలో అనంతపురంలో అరటి రైతులు కదం తొక్కారు. ఓటీఆర్‌ఐ నుంచి కలెక్టరేట్ వరకూ అరటి గెలలతో వినూత్న నిరసన తెలిపారు.అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో రైతులు వేలాది మంది పాల్గొన్నారు. అరటి గెలలను తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట పడేశారు. ‘కేజీకి రెండు రూపాయలకు కూడా కొనుగోలు చేసే వారు లేరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అరటి పంటలను తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
హలో ఇండియా.. ఓసారి ఏపీ వైపు చూడండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీఎత్తున ధర్నా చేస్తున్న ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘‘సేవ్ ఫార్మర్స్’’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘‘హలో ఇండియా... ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడి పనిచేసిన రైతులకు దక్కిన దారుణమైన ప్రతిఫలం ఇది. అరటిపండ్లు మాత్రమే కాదు, ఉల్లిపాయల నుంచి టమాట వరకు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికి మోసం చేశారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసమేనని నిరూపితమైంది.📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరటి పండ్లను టన్నుకు సగటున రూ.25 వేల ధరకు రైతులు అమ్ముకున్నారు. రైతులు ఎప్పుడూ నష్టపోకుండా చూసుకోవడానికి రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాం. నాటి మా నిబద్ధత వేలాది కుటుంబాలను కాపాడింది. గిట్టుబాటు ధరలకు పంటల ఉత్పత్తులను విక్రయించుకుని లబ్ధి పొందేలా రైతులకు తోడుగా నిలిచాం. కానీ నేడు చంద్రబాబు రైతులను వారి ఖర్మకు వదిలేశారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే మౌనరాగం ఆలపిస్తున్నారు. నేడు ఆహారం విలువ 50 పైసలైతే దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’
తాడేపల్లి: ‘రాష్ట్రంలోని రైతుల దుస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’అంటూ రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి గళమెత్తారు వైఎస్ జగన్. సేవ్ ఏపీ ఫార్మర్స్హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.ఇదీ రైతుల దుస్థితి..కిలో అరటిపండ్లు రైతుల వద్ద నుంచి రూ. 50 పైసలకే అమ్ముడవుతున్నాయని రాష్ట్రంలోని రైతుల దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. అగ్గిపెట్ట, బిస్కెట్ కంటే కూడా అరటిపండు చౌకయ్యిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే చివరకు రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది అని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరటి పండ్లే కాదు ఉల్లినుంచి టమోట వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. మార్కెట్ లో మాత్రం అరటిపండ్లు రూ. 60 నుంచి 70 వరకూ విక్రయిస్తున్నారని అన్నారు. ఈ డబ్బులంతా మధ్యలోని దళారుల జేబుల్లోకే వెళుతున్నాయని రైతులకు మాత్రం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదన్నారు. దీంతో ఆవేదనతో రైతులు తమ పంటను రోడ్లపై పడివేస్తున్నారన్నారు.బొప్పాయి ధర కూడా మార్కెట్‌ను బట్టి మారిపోతుందని రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదన్నారు. ఉల్లి టమాట ధరలు కూడా మార్కెట్లో రూ1. నుంచి రూ.3 వరకూ పలుకుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేది ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అంతే కాకుండా విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఉచిత పంట బీమా లేదు. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరటి పండ్ల ధర టన్ను రూ. 25 వేలు పలికేదాని అంతేకాకుండా రైతులకోసం ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లు నడిపామన్నారు. తమ ప్రభుత్వంలో కృతనిశ్చయంతో రైతులకు ఎంతో మేలు చేశామని, రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. కానీ నేడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
AP: అరటి పళ్లను నేలపై వేసి నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యం.. అనంతలో అరటి రైతుల ఆగ్రహం (చిత్రాలు)
-
Anantapur: ఇక్కడ రైతులు ఆకలితో చస్తుంటే నువ్వు నీ కొడుకు చేసేది ఇదా..
-
ఖబడ్డార్ చంద్రబాబు.. నీ ప్రభుత్వం అంతు చూస్తాం
-
కదం తొక్కిన అనంత అరటి రైతులు.. వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, అనంతపురం: చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా అనంతపురంలో అరటి రైతులు కదం తొక్కారు. సోమవారం ఉదయం జేఎన్టీయూ నుంచి కలెక్టరేట్ దాకా అరటి గెలలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించగా.. శింగనమల ఇంచార్జి శైలానాథ్ పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసింది. అరటి రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గెలలు కొనే నాథుడే లేక చెట్లకే వాడిపోతున్నాయి. వైఎస్ జగన్‌ను చూసి పాలన ఎలా చేయాలో నేర్చుకోండి. పవన్ కల్యాణ్‌కు రైతుల గురించి అవగాహనే లేదు. ఆయన గురించి మాట్లాడుకోవడమే వేస్ట. అరటి పంటలను తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గిట్టుబాట ధర కల్పించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. రైతుల నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
Banana Farmers: వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి అధికారులు మాకు ఫోన్ చేసి..
-
బ్రాహ్మణపల్లి అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
Watch Live: అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
-
అరటి రైతు అరణ్య రోదన
-
వైఎస్ జగన్ ప్రజాదర్బార్
వైఎస్సార్ కడపలో కొనసాగుతోన్న వైఎస్ జగన్ రెండోరోజు పర్యటనపర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో వివాహ కార్యక్రమానికి హాజరుఅనంతరం బ్రాహ్మణపల్లె అరటి తోటల పరిశీలన, రైతులతో మాట్లాడటంపులివెందులలో లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శవేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాస సందర్శనసాయంత్రం 7 గంటల వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్రాత్రి పులివెందులలోనే బసగురువారం ఉదయం 8 గంటలకు తిరుగు ప్రయాణం -
పులివెందుల: అరటి రైతుల కష్టాలు విన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో భాగంగా.. బ్రహ్మణపల్లి అరటి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కలిశారు. వైఎస్ జగన్‌కు రైతులు ఆకుపచ్చ కండువా కప్పి తోటల పరిశీలనకు ఆహ్వానించారు. సాగు నష్టాన్ని స్వయంగా వైఎస్ జగన్ పరిశీలిస్తూ.. వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. రెట్టింపు నష్టాలు వాటిల్లుతున్నాయని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ హయాంలో అరటి రైతుల కోసం రూ. 20.15 కోట్లతో ఈ భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్‌లో అరటి కాయలను శుభ్రపరిచే యూనిట్‌తో పాటు 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్, 30.6 కిలోవాట్ల కోల్డ్ స్టోరేజ్, ఆరు కూలింగ్ సెల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లలో తగిన ధర లభించే వరకు రైతులు అరటి, నారింజ పండ్లను 40 రోజుల పాటు నిల్వ చేసుకునే కెపాసిటితో నిర్మించారు. అలాగే.. ప్లాంట్ ఆవరణలో 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వే బ్రిడ్జ్ నిర్మించారు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్మార్గంగా దీనిని మూసేయించింది. ఇదీ చదవండి: బాబు పాలనలో గిల‘గెల’! -
బాబు పాలనలో దారుణంగా పతనమైన అరటి ధరలు
సాక్షి, అమరావతి: అరటి రైతు ఆక్రందన.. అరణ్యరోదనగా మారింది. ఓ పక్క చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ముందెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న అరటి రైతును ఆదుకునేందుకు కనీస చర్యలూ తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇలాంటి విపత్తు వేళ నిజంగా రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, మానవత్వం పాలకుల్లో ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్వయంగా రంగంలోకి దిగాలి. అన్నదాతకు అండగా నిలవాలి. ఆపన్న హస్తం అందించాలి. తక్షణమే జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న అరటిని కొనుగోలు చేసి ప్రభుత్వమే స్వయంగా మార్కెటింగ్ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొక్కుబడి సమీక్షలు, కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది తప్ప రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ ముందుకేసిన పాపాన పోలేదు. మిరప.. పొగాకు.. మామిడి.. ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతోనూ బాబు సర్కారు చెలగాటమాడుతోంది. టన్ను రూ.1,000కు దిగజారిన ధర..రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకుపైగా సాగవుతోంది. ఇక్కడ మాత్రమే సాగయ్యే జీ–9 వెరైటీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. ఇది పూర్తిగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులవుతున్నాయి. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తున్నా యి. టిష్యూకల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు అనంతపురం, నంద్యాల జిల్లాలలో డిసెంబర్ నుంచి మార్చి వరకు, వైఎస్సార్ కడప నుంచి జనవరి నుంచి మే వరకు కొనసాగుతుంది. రెండో పంట పిలకల ద్వారా వచ్చే పంట (రెండో పంట) జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. 2023–24లో టన్ను రూ.30వేలకు పైగా పలికింది. అలాంటిది చంద్రబాబు సర్కారు అసమర్థ విధానాల వల్ల ప్రస్తుతం టన్ను రూ.1,000 పలకడం గగనమైపోయింది.సంక్షోభానికి కారణమిదే..ఈ ఏడాది మహారాష్ట్రలో ఉన్న సాగు విస్తీర్ణం 30నుంచి 40 శాతం పెరిగింది. మరొక వైపు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా అరటి సాగు మొదలైంది. సాధారణంగా మహారాష్ట్రలో ఏటా అక్టోబర్ కల్లా పంట కోతలు పూర్తయ్యేవి. దీంతో నవంబర్ నుంచి ఢిల్లీ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌కు వచ్చేవారు. ఈసారి మహారాష్ట్రలో ఏరియా పెరగడం వలన కోతలు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి ఉత్తర భారతదేశానికి ఏపీతో పోలిస్తే రవాణా ఖర్చులు తక్కువ. ఉదాహరణకు ఒక లారీ ట్రాన్స్‌పోర్టు చేయాలంటే ఏపీ నుంచి ఢిల్లీకి రూ.60 వేల నుంచి రూ.70వేలు ఖర్చవుతుండగా, మహారాష్ట్ర నుంచి రూ.30 వేల నుంచి రూ.40వేలు ఖర్చవుతుంది. పంట ఉన్నంత కాలం అక్కడ నుంచే కొనుగోలు చేసేందుకు ఢిల్లీ వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పిలక ద్వారా వచ్చే రెండో పంట (రెటూన్ క్రాప్) కోతకొచ్చింది. ధరల పతనాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా అక్టోబర్ రెండో వారం వరకు కిలో రూ.8 నుంచి రూ.10 వరకు పలికిన ధర కాస్తా ఆ తర్వాత క్రమేపి క్షీణించి రూపాయికి దిగజారింది.చంద్రబాబుకు నిజంగా మానవత్వం ఉండి ఉంటే..వైఎస్ జగన్ హయాంలో కరోనా విపత్తు వేళ కూడా ఇదే రీతిలో ధరలు పతనమవుతున్న సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని అరటి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని అండగా నిలిచింది. ఈ విధంగా దాదాపు 16వేల టన్నులకుపైగా అరటిని కొనుగోలు చేసి సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందజేసింది. ఒక్క అరటే కాదు.. ఆ తర్వాత బత్తాయికి ధర లేనప్పుడు కూడా ఇదే రీతిలో చొరవ తీసుకుని 4,109 టన్నుల బత్తాయిని రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీపై అందజేసింది. కిలో రూపాయికి కూడా కొనేవాడు లేకపోవడంతో రేయింబవళ్లు కంటికిరెప్పలా పెంచిన పచ్చని అరటి తోటలను తమ చేతులతోనే నేలకూల్చేస్తూ..పంటలను దున్నేస్తుంటే సీఎం చంద్రబాబు కనీసం మానవత్వం చూపడం లేదు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈపాటికే చొరవ తీసుకుని రైతుల నుంచి కనీసం కిలో రూ.15 నుంచి రూ.20 మధ్య కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగ దారులకు సబ్సిడీపై పంపిణీ చేయడం లేదా కనీసం మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందించే ఆలోచన చేసేవారు. కానీ అలా చేయలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసినప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి.. ఢిల్లీ వ్యాపారులతో అనుసంధానం చేయండి అంటూ ఆదేశాలివ్వడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి ప్రత్యక్ష చర్యలూ తీసుకున్న పాపాన పోవడం లేదు. ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఢిల్లీ వ్యాపారులతో ట్రేడర్స్ మీట్స్ అంటూ హంగామా చేస్తున్నారు.బహిరంగ మార్కెట్లో కిలో రూ.40–100రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని బహిరంగ మార్కెట్లో అరటి నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 పలుకుతున్నాయి. కాస్త పెద్ద సైజు (ఎక్స్‌పోర్టు క్వాలిటీ) అయితే కిలో రూ.60 నుంచి రూ.80 కూడా పలుకుతున్నాయి. హైపర్ మార్కెట్లలో అయితే కిలో రూ.100 కూడా పలుకుతున్నాయి. చివరికి అరటి పంట ఎక్కువగా ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లోనూ కిలో రూ.40కు తక్కువ అమ్మడం లేదు. కానీ అరటి పండించే రైతుకు మాత్రం కిలో రూపాయికి మించి పలకడం లేదు. మధ్యలో ఈ సొమ్ములంతా దళారుల మాటున అధికార టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. కారణం ప్రధాన అరటి మార్కెట్లతోపాటు సీమలోని మార్కెట్ యార్డులన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేయాలంటే పచ్చ ముఠాలకు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. దీంతో ఇక్కడి టీడీపీ నేతలు వ్యాపారులతో కుమ్మక్కై.. రైతులకు ధర లేకుండా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. -
ధర పతనం.. అరటి రైతులకు శోకం
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: తీపి పంట అరటి.. రైతు నోరు చేదు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించి దిగుబడి రావడం, ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడం, దేశీయంగా అరటి ధరలు గణనీయంగా పడిపోవడం, జిల్లా రైతులకు శాపంగా మారింది. ధరలు తగ్గడంతోపాటు ఎగుమతులు కూడా పెద్దగా సాగకపోవడంతో అరటి రైతులు విలవిలలాడుతున్నారు. (Banana Prices Drop In AP)ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరటి సాగు అధికం. ఒక్క కోనసీమ జిల్లాలోనే సుమారు 25,204 ఎకరాల్లో అరటి పంట సాగు జరుగుతోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ సాగు అధికం. డెల్టాలోనే కాకుండా లంక గ్రామాల్లో అరటి ఏక పంటగాను, కొబ్బరిలో అంతర పంటగా సాగవుతోంది. మొత్తం సాగులో 80 శాతం తెల్ల అరటి, కర్పూరం కాగా, మిగిలిన 20 శాతం కూర అరటి, అమృతపాణి, ఎర్ర చక్కెర కేళీ వంటి రకాలు పండిస్తున్నారు.ఈసారి సీన్ రివర్స్సాధారణంగా కార్తిక మాసంలో అరటి ధరలు అధికంగా ఉంటాయి. కాని ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. కార్తిక మాసం మొదలైన నాటి నుంచి అరటి ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రావులపాలెం, అంబాజీపేట మార్కెట్ యార్డులలో అరటి ధరలు పరిశీలిస్తే కర్పూరం కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200 చొప్పున ఉంది. చక్కెర కేళీ (తెలుపు) రూ.150 నుంచి రూ.250 వరకు, బుషావళి రూ.125 నుంచి రూ.200 వరకు, బొంత (కూర అరటి) రూ.150 నుంచి రూ.200 వరకు, అమృతపాణి రూ.200 నుంచి రూ.350 వరకు, చక్కెర కేళీ (ఎరుపు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడున్న ధరలకు గెలకు అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటే కాని రైతులకు గిట్టుబాటు కాదు. పైగా ఈ ధరలు నాణ్యత ఉన్న గెలలకు మాత్రమే. ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న గెలలు చాలా నాసిరకంగాను, చిన్న సైజువి కావడంతో ధరలకు మరింత కోత పెడుతున్నారు. (Banana Farmers Struggles In AP)నాణ్యత లేక ధరాఘాతం గత నెలలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలకు అరటి తోటలు పెద్ద ఎత్తున నేలనంటిన విషయం తెలిసిందే. జిల్లాలో 3,379.90 ఎకరాల్లో పంట నేలకొరిగి దెబ్బతింది. తుపాను బారి నుంచి తప్పించుకున్న చోట్ల గాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయింది. దీనివల్ల చెట్టు శక్తి కోల్పోవడంతో ఆ ప్రభావం గెలలపై పడింది. దీనివల్ల ఇప్పుడు కోత కోస్తున్న గెలల్లో 60 శాతం నాసిరకం గెలలు, మరో 20 శాతం మధ్యస్థంగా ఉండే మొరటు (నాణ్యమైన) గెలలు, మరో 20 శాతం మొరటు గెలలు వస్తున్నాయని రావులపాలెం మార్కెట్ యార్డు వ్యాపారులు చెబుతున్నారు.పది రోజులుగా పెరిగిన మంచు కూడా అరటి కాయల దిగుబడిని దెబ్బ తీస్తోంది. కాయల సైజు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆశించిన ధరలు రావడం లేదంటున్నారు. దీనివల్ల రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. సీజన్లో ఇక్కడ నుంచి రోజుకు 25 నుంచి 30 లారీల అరటి (లారీకి సగటున 800 గెలలు) చొప్పున రోజుకు 25 వేల గెలలు ఎగుమతి జరిగేది. ఇప్పుడు కేవలం 15 వేల నుంచి 18 వేల గెలలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.నలువైపులా పోటీరాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో దశాబ్దకాలంగా అరటి సాగు అధికంగా ఉన్నా అక్కడ జి–9 మాత్రమే పండించేవారు. ఇప్పుడు కర్పూరం అధికంగాను, అమృతపాణి, చక్కెర కేళీలు అధికంగా సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి మొరటు 80 శాతం వరకు వస్తున్నాయి. దీనితో అక్కడ అరటికి డిమాండ్ పెరిగింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అరటి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌కు ఎగుమతి అధికం. ఎర్ర చక్కెర కేళి మాత్రం తమిళనాడు వెళుతోంది. ఈ ఏడాది శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాది కొత్తగూడెంలో కూడా అరటి విస్తారంగా సాగు జరిగింది. మంచి దిగుబడి కూడా వస్తోంది. దీంతో ఉత్తరాదికి ఆయా జిల్లాల నుంచి ఎగుమతి అధికంగా ఉండడంతో ఇక్కడ అరటికి డిమాండ్ తగ్గింది.(Banana Farmers Challenges)తమిళనాడుకు ఎర్ర చక్కెర కేళీ ఎగుమతి అధికం. సీజన్లో దీని ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇప్పుడు దిగుబడి నాణ్యత లేని కారణంగా రూ.200 నుంచి రూ.300కు పడిపోయింది. గతంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిది మినీ వ్యాన్ల అరటి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ఇది నాలుగు వ్యాన్లకు మించడం లేదు. పైగా తమిళనాడు నుంచి బొంత అరటి ఇక్కడకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీని ధర కూడా తక్కువగా ఉండడం విశేషం.సంక్రాంతి వరకు డిమాండ్ వచ్చేలా లేదురావులపాలెం మార్కెట్‌కు పదిహే ను రోజులుగా నాణ్యత లేని గెలులు అధికంగా వస్తున్నాయి. తుపాను ప్ర భావం, మంచు వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. ధర పడిపోయింది. రాయలసీమలో పంట పెరగడం కూడా ధర పెరుగుదలకు అడ్డంకిగా మారింది. పండగల సీజన్ పూర్తవడంతో సంక్రాంతి వరకు డిమాండ్ వ చ్చేలా లేదు. – కోనాల చంద్రశేఖర్, అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం మండలంగాలులు దెబ్బ తీశాయితుపాను వల్ల ఈదురు గాలులకు అరటి తోటలకు పెద్ద దెబ్బ తగిలింది. గెలలు సరిగా తయారవడం లేదు. దీనివల్ల ధర రావడం లేదు. తుపాను ముందు గెల రూ.200 నుంచి రూ.400 వరకు ఉంది. ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదు. గెలలు తయారవుతున్న సమయంలో గాలులు దెబ్బ తీశాయి.– పిల్లా గంగాధర్, అరటి రైతు, అంబాజీపేట -
అరటి రైతు ఆక్రందన
అనంతపురం అగ్రికల్చర్, కడప అగ్రికల్చర్/లింగాల: నాణ్యమైన అరటి పంటకు పేరుగాంచి, గల్ఫ్ దేశాలకు సైతం ఎగుమతులు చేసిన అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల రైతులు నేడు దీనావస్థ ఎదుర్కొంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. అయితే, పెట్టుబడులు కూడా దక్కని కనిష్ఠ స్థాయికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి. గెలలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు. కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేశారు. మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. రూ.లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. రూ.కోట్లలో నష్టపోతున్నా... చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. కరోనా లాంటి తీవ్ర విపత్తు తర్వాత తొలిసారి ధరలు పతనం అయ్యాయని పేర్కొంటున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించని చంద్రబాబు సర్కారు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల అరటి రైతుల కష్టాలు, కడగండ్లు పట్టించుకునే స్థితిలో చంద్రబాబు సర్కారు లేదు. కనీసం మద్దతు ధర కూడా ప్రకటించలేదు. అనంతపురం జిల్లాలో 40వేల ఎకరాల్లో అరటిసాగు అవుతుంది. లక్షన్నర టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ–క్రాప్ ప్రకారమే 32 మండలాల్లోని 13 వేల మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాల్లో వేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 700 ఎకరాల్లో అరటి సాగైంది. ఎకరాకు 22–25 టన్నుల దిగుబడి వచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది 8 లక్షల టన్నులపైగా అరటి పంట వస్తుందని అంచనా. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతు కుదేలయ్యాడు. జిల్లా వ్యాప్తంగా 20,231 ఎకరాల్లో అరటి సాగైంది. లింగాల, పులివెందుల, కాశినాయన, వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అత్యధికంగా పంటను డోజర్లతో తీసేస్తున్నారు. లింగాల మండలంలో మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురు గాలులతో అరటి రైతులకు అపార నష్టం సంభవించింది. మార్చిలో తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, పార్నపల్లె, పెద్దకుడాల గ్రామాల్లో 567 హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోయింది. ఏప్రిల్‌లో లింగాల, చిన్నకుడాల, రామనూతనపల్లె, గుణకణపల్లె, మురారిచింతల తదితర గ్రామాల్లో 488 హెక్టార్లలో తోటలు కూలిపోయాయి. 9 నెలలైనా ఇంతవరకు ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ అందలేదని రైతులు వాపోతున్నారు. ధరలు నెలలోనే రూ.వెయ్యికి పతనం అరటిలో రెండేళ్లలో మూడు పంటలు తీస్తారు. మొక్క నాటిన తర్వాత ఏడు నెలలకు మొదటి గెల వస్తుంది. మొత్తంగా 10 నెలల కాలంలో మొదటి పంట పూర్తవుతుంది. తర్వాత 8 నెలలకు రెండో పంట పండిస్తారు. ఈ రెండు విడతలు కచి్చతం. కొందరు మూడో విడత కూడా సాగు చేస్తారు. ప్రస్తుతం రెండో మూడో విడత కోతలు జరగుతున్నాయి. నెల కిందట టన్ను రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముడవగా పెట్టుబడులు దక్కాయి. క్రమంగా టన్ను రూ.వెయ్యి, రూ.2 వేలకు పతనమైంది. దీంతో రైతులు తోటలు వదిలేస్తున్నారు. కాయలు మాగిపోతున్నా అడిగేవారు లేనందున ట్రాక్టర్లతో పారబోస్తున్నారు. టన్ను కనీసం రూ.12 వేలైనా పలికితే కాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. డిసెంబర్ నుంచి మొదటి పంట కోతలు మొదలవుతాయని, ఇవే ధరలుంటే తమ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తుతున్నారు. అయినా చంద్ర బాబు సర్కారు చోద్యం చూస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకు వెళ్లే యోచనలో అరటి రైతులు మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన వైఎస్సార్ కడప జిల్లా అరటి రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో పరిహారం ఇప్పించాలని కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయంమార్చి 23న పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో అరటి తోటలు కూలిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ మరుసటి రోజే తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి పర్యటించారు. కూలిన తోటలను చూసి చలించిపోయారు. రైతులకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెలలోపే నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వానిదంతా హడావుడే.. పైసా సాయం లేదు వైఎస్ జగన్ లింగాల మండలంలో పర్యటిస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అదే రోజు పార్నపల్లె, కోమన్నూతల గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వం నుంచి అరటి రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి కూడా రైతులను ఆదుకుంటామని చెప్పారు. హెక్టార్‌కు రూ.30 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని గొప్పలు పోయారు. ఇంతవరకు చిల్లిగవ్వ అందలేదని అరటి రైతులు వాపోతున్నారు. పైసా రాలేదు.. మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా 4 ఎకరాల్లోని అరటి పంట పూర్తిగా కూలిపోయింది. ఆదుకుంటామని అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పైసా సాయం చేయలేదు. అరటి సాగుకు సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాను. నష్టాల ఊబిలో కూరుకుపోయా. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. –వందలపల్లె కేశవ, అరటి రైతు, తాతిరెడ్డిపల్లె, వైఎస్సార్ కడప జిల్లాఎదురుచూపులే మిగిలాయి... చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు మాటలు చెప్పి వెళ్లిపోయారు. ఇంతవరకు నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వైఎస్ జగన్ వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందించారు. ఈ ప్రభుత్వంలో ఎదురుచూపులు తప్ప ఎలాంటి ఫలితం లేదు. – పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, వైఎస్సార్ కడప జిల్లా పెట్టుబడి కూడా కష్టమే.. మూడు ఎకరాల్లో అరటి సాగుకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశాను. పంట కోతకు వచి్చనా అడిగేవారు లేరు. కొట్టేవారు కనిపించడం లేదు. కాయలు మాగిపోతున్నాయి. ధర రూ.వెయ్యి అంటున్నా దానికీ ముందుకురావడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. మొక్కలు, నాటడం, వేసవిలో కాపాడుకోవడం, కూలీలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చు అన్నీ లెక్కేస్తే భయమేస్తోంది. – బండి శివనారాయణ, ముచ్చుకోట, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లాటన్ను రూ.400 చొప్పున ఇచ్చేశా 15 ఎకరాల్లో అరటి సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చుపెట్టా. తెలంగాణ నుంచి లారీ కోడి పెంట రూ.60 వేలకు కొన్నాను. పంట చేతికొచ్చినా ధరల్లేక నష్టాలు భరిస్తున్నా. 5 ఎకరాల పంట మూడో విడత కోతకు సిద్ధంగా ఉంది. ధర కోసం 15 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేదు. టన్ను రూ.400 ప్రకారం 10 టన్నులు ఇచ్చేసి దున్నేస్తున్నా. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. – బానా నాగేశ్వరరెడ్డి, కడవకల్లు, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా -
అరటి రైతు ఆర్తనాదం
సాక్షి, అమరావతి: వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే వరుసగా మామిడి ఉల్లి, టమాటా, చీని ధరలు పతనం కాగా తాజాగా అరటి ధర టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నారు. రాష్టంలో 2.74 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతుండగా సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్ కడప, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే కర్పూరం, చక్కరకేళి రకాలను దేశీయంగా వినియోగిస్తుండగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సాగయ్యే గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు కాగా దాంట్లో అరటి ఉత్పత్తి 74 లక్షల టన్నుల పైమాటే. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుండగా 15 టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ఏడాదిగా ధర లేక దిగాలు.. రావులపాలెం మార్కెట్‌కు 60 శాతానికి పైగా వచ్చే కర్పూర రకం అరటి టన్ను రూ.1,000–3500 పలుకుతుండగా మిగిలిన రకాల ధరలు టన్ను రూ.1,000 నుంచి రూ.3 వేలకు మించి పలకడం లేదు. ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలతో పాటు మరోవైపు మహారాష్ట్రలో పండే అరటి ఇదే సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్‌కు రావడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. లోకల్ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో అరటి అమ్మకాలు లేక వ్యాపారస్తులు ధరలు తగ్గించేశారు. ఒక్కసారిగా అరటి ధరలు పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర లేక పంట కోయకపోవడంతో తోటల్లోనే అరటి కాయలు మాగిపోతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో రికార్డు ధరలుఅరటిలో ఎక్కువ కాలం నిల్వ ఉండే రకం గ్రాండ్ 9 (జీ–9). విదేశాలోŠల్ మంచి డిమాండ్ ఉన్న ఈ రకం రాయలసీమలో ఎక్కువగా సాగవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రోత్సాహంతో అరటి సాగు విస్తరించడమే కాకుండా ధరలు కూడా రికార్డు స్థాయిలో పలికాయి. విదేశాలకు ఎగుమతయ్యే జీ–9 రకం నాడు టన్ను రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పలికింది. దీంతో ఆ ఐదేళ్లూ అరటి రైతులు మంచి లాభాలనే ఆర్జించారు. రికార్డు స్థాయిలో ఎగుమతులు జరగడంతో అనంతపురం నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను కూడా నడిపారు. కొనుగోలు చేసేవారు లేరు ఐదు ఎకరాల్లో అరటి సాగు చేయగా ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. వర్షాలతో అరటి కాయలకు తెగుళ్లు సోకుతాయనే భయంతో మందుల పిచికారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక్క గెల కూడా కోయలేదు. కొనేవారులేక పక్వానికి వచ్చిన పండ్లను ఏం చేయాలో పాలు పోవడంలేదు. – బొజ్జా ఓబుళరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాల, వైఎస్సార్ కడప జిల్లా తీవ్రంగా నష్టపోయా... 10 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. 120 టన్నుల దిగుబడులొచ్చాయి. కొనుగోలు చేసే నాథుడే కరువయ్యారు. తీవ్రంగా నష్టపోతున్నాం. కనీసం పెట్టుబడులు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. – సారెడ్డి శివప్రసాద్‌రెడ్డి, లింగాల, వైఎస్సార్ కడప జిల్లా -
వరమివ్వని ఉద్యానం
‘గ్రోత్ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అరటి, మిర్చి, టమాట రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్ నైన్ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది. మిరప, టమాట రైతుల కన్నీళ్లు మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్ మార్కెట్లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. చీనీ రైతులకూ చేదు గుళికలే.. రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది.ప్రభుత్వమే ఆదుకోవాలి రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. సుమారు రూ. లక్ష పెట్టు బడి పెట్టా. «గిట్టుబాటు ధర లేకపోవటంతో పంటను తోటలోనే వదిలేశా. టమాట పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– బసవరాజు, దొడగట్ట, కళ్యాణదుర్గంమార్కెటింగ్ సౌకర్యం లేదు2 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ. లక్ష చొప్పున రెండు లక్షల వరకూ పెట్టుబడి పెట్టా. పంట ఉత్పత్తుల ఎగుమతులకు సరైన సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – నాగరాజు, పెద్దజలాలపురం గ్రామం, శింగనమల, మండలం -
అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
-
బీమా ఎగ్గొట్టావు 'పరిహారం కట్టు బాబూ': వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో... అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.పెట్టుబడి సాయం... సున్నామన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం. పంటల ధరలు దారుణంగా పతనం.. రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలంఅరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా. – పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలంపెట్టుబడి సాయం ఏది?మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు. – పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంఎప్పుడూ చూడలేదుపదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. – దినేష్‌కుమార్‌రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం -
‘సిగటోక’ చిత్తవ్వాలిక.. నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ.. అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్‌టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్‌టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. నివారణా చర్యలు సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి -
అరటి సాగు.. రైతన్నలకు కాసుల వర్షం
రాజంపేట టౌన్: అరటి సాగు అనగానే రైతులకు, ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు. అనాదిగా ఈ నియోజకవర్గాల్లోని రైతులు అధికంగా అరటి సాగుచేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రస్తుతం ఉన్న ధరలు ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం టన్ను (బాక్సుల్లో ఎగుమతి చేసేవి ) 18వేల రూపాయలకు పైగా ధర పలుకుతుంది. ఈ విధానంలో ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు ఖర్చులు పోను పది లక్షల రూపాయల వరకు లాభాలను అర్జిస్తున్నారు. అలాగే గెలలతో ఎగుమతి చేసే అరటి 16వేల రూపాయిలకు పైగా ధర పలుకుతోంది. ఈ విధానంలో అరటిని ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు తొమ్మిది లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉంటే 2017వ సంవత్సరంలో ఇలాంటి ధరలే పలికాయి. అనంతరం ఇంతటి ధర ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేక పోవడంతో రైతులకు లాభాలు అంతంత మాత్రమే ఉండేవి. హెక్టారుకు డెబ్బై టన్నుల దిగుబడి ఈ ఏడాది అరటి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. హెక్టారుకు దాదాపు 70 టన్నుల దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులు ఘననీయంగానే ఆదాయం పొందుతున్నారు. ఒక హెక్టారు అరటి పంట సాగు చేసేందుకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇందువల్ల టన్ను 18 వేలకు విక్రయించే వారికి ఖర్చులు పోను పది లక్షలకు పైగా, 16వేలకు విక్రయించే రైతులకు తొమ్మిది లక్షలకు పైగా మిగులుతుంది. ప్రస్తుతం పచ్చఅరటి, అమృతపాణి, కర్పూర చక్కర కేలి, సుగంధాల రకాల అరటిని రైతులు కోస్తున్నారు. ధర పెరుగుదల ఎందుకంటే..... అరటి పిలకలను పూడ్చిన తర్వాత ఏడాదికి పంట చేతికి వస్తుంది. గత ఏడాది మే నెలలో వేసిన పంట ఇప్పుడు చేతికి వచ్చింది. అయితే గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సంభవించిన భారీ వరదలకు అనేక మందికి చెందిన అరటి తోటలు వరల ధాటికి కొట్టుకు పోయాయి. ఫలితంగా పంట భారీగా తగ్గింది. ప్రస్తుతం అమాంతంగా పెరిగిన ధరలకు పంట తక్కువగా ఉండటమేనని రైతులు అంటున్నారు. అస్సలు ఊహించలేదు ప్రస్తుతం అరటి పంటకు ఉన్న ధరను అసలు ఊహించలేదు. నేను పదకొండు ఎకరాల్లో అరటి సాగుచేశాను. వరదలకు నా పంట దెబ్బతినలేదు. ప్రస్తుతం ఉన్న ధరకు నాకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదాయం వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. – ముక్కా చెంగల్‌రెడ్డి, రైతు, కొర్లకుంట, ఓబులవారిపల్లె మండలం ఐదు రాష్ట్రాలకు ఎగుమతి రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గాల్లోని రైతులు పండించే అరటి నాణ్యత ఉంటుంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులు పంట కోతకు రావడానికి రెండు నెలల ముందు నుంచే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. ఈ నియోజకవర్గాలకు చెందిన రైతులు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తమ పంటను ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం చాలామంది రైతులకు చెందిన పంట కోతకు రావడంతో పల్లెసీమల నుంచి జోరుగా అరటి రవాణా సాగుతుంది. -
లాక్‌డౌన్‌తో అరటి రైతులు కష్టాల్లో పడ్డారు
-
వైఎస్ జగన్‌కు కష్టాలు చెప్పుకున్న అరటి రైతులు
-
ఆదుకుంటుందనే నమ్మకంలేదు
♦ సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ అకాల వర్షాలతో నిలువునా నష్టపోయిన అరటి రైతులు ♦ పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటన ♦ అరటి రైతుల దుస్థితి చూసి చలించిపోయిన జననేత సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి. పంట ఏపుగా ఉంది. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఫలసాయం దక్కుతుందని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వడగండ్ల వాన రావడం, గంటలో అరటి తోటలు నేలపాలు కావడం జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో మానవత్వంతో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం రైతులకు లేదు. పంటనష్ట పరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, తుదకు పంటల బీమా సొమ్ము సైతం ఇవ్వకపోవడమే’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కళింగర పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. నేలమట్టమైన అరటితోటల రైతన్నల ఆవేదనను చూసిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. నల్లపురెడ్డిపల్లెలో పంటలు పరిశీలిస్తున్న తరుణంలో ఆదినారాయణ అనే రైతు బోరున విలపిస్తూ తన ఆవేదనను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చే పరిహారం తోటలు చదును చేసుకునేందుకు కూడా సరిపోదని తెలిపారు. అకాల వర్షాలు వల్ల అరటి రైతులకు పంట నష్టం సంభవిస్తే కనీసం రూ.50వేలకు పైబడి పరిహారం అందేలా విధివిధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నిలువునా నష్టపోయిన రైతులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని జగన్ కోరారు. అధికారులు అంచనాలు రూపొందించడం మినహా పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతోనే రైతులకు విపత్తుల పరిహారం అందలేదని ఆరోపించారు. ఇదే విషయమై కలెక్టర్, ముఖ్యమంత్రికి లేఖలు రాయనున్నట్లు తెలిపారు. అవసరమైతే రైతుల పక్షాన ధర్నా సైతం నిర్వహిస్తానని జగన్ చెప్పారు. పర్యటనలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్బాష, కడప మేయర్ కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతన్న వెన్ను విరిచిన గాలివాన
-
అరటి రైతులను ఆదుకుంటాం
మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకా పులివెందుల/రూరల్ : నియోజకవర్గంలోని అరటి రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం అరటి కాయల వ్యాపారులు, రైతులతో విడివిడిగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పులి వెందుల ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్షల రూపాయ లు పెట్టుబడులు పెట్టి అరటి పంటను సాగు చేస్తున్నారన్నారు. ఢిల్లీ, హర్యానా, జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలలో అకాల వర్షాల కారణంగా ధరలు తగ్గిపోయాయన్నారు. దీంతోపాటు కాయలు ఎక్కువ లారీలు మార్కెట్‌కు వస్తుండటంతో ధర లు తగ్గిన విషయం వాస్తవమేనన్నారు. ట్రాన్స్పోర్ట్ ధరల తగ్గింపు పులివెందుల నుంచి ఢిల్లీకి అరటి కాయలను తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లతో చర్చించి ధరల తగ్గింపునకు చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రైతులకు వివరించారు. పులివెందులనుంచి 16 టన్నులు ట్రాన్స్పోర్ట్కు రూ.55వేలు ఉండగా.. ప్రస్తుతం ఆపరేటర్లు రూ.60వేలనుంచి రూ.65వేలకు పెంచారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ధరను రూ.10వేలు తగ్గించి తీసుకోవడంతో ట న్నుపై రైతుకు రూ.600 పెరిగే అవకాశం ఉందన్నారు. కావున ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు రూ.10వేలు తగ్గించి తీసుకోవాలని మాజీ మంత్రి వై ఎస్ వివేకా సూచించగా.. అందుకు ఆపరేటర్లు సైతం అంగీకరించారు. నేటి నుంచి టన్నుకు రూ.8,500నుంచి రూ.9వేలతో కొనుగోలు అరటి కాయలు టన్ను బుధవారం నుం చి రూ.8,500నుంచి రూ.9వేలతో ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేసేలా వ్యాపారులు, రైతులతో వైఎస్ వివేకానందరెడ్డి చర్చించారు. అనంతరం రైతుల సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. వారం, 10రోజులలో ధరలు మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు.


