పుట్లూరు: అరటి ధరల భారీ పతనం ఓ రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. గిట్టుబాటు ధర లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలోని పుట్లూరులో చోటు చేసుకుంది. గురువారం(డిసంబర్ 4వ తేదీ) నాగలింగం అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
అరటి ధరలు దారుణంగా పతనం కావడంతో పెట్టుబడులు రాకు ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు ఎకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశాడు. పంట చేతికి వచ్చిన సమయంలో ధర పడిపోవడంతో నాగలింగం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


