సాక్షి, అనంతపురం: చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా అనంతపురంలో అరటి రైతులు కదం తొక్కారు. సోమవారం ఉదయం జేఎన్‌టీయూ నుంచి కలెక్టరేట్ దాకా అరటి గెలలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించగా.. శింగనమల ఇంచార్జి శైలానాథ్ పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు.

‘‘చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసింది. అరటి రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గెలలు కొనే నాథుడే లేక చెట్లకే వాడిపోతున్నాయి. వైఎస్ జగన్‌ను చూసి పాలన ఎలా చేయాలో నేర్చుకోండి. పవన్ కల్యాణ్‌కు రైతుల గురించి అవగాహనే లేదు. ఆయన గురించి మాట్లాడుకోవడమే వేస్ట. అరటి పంటలను తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గిట్టుబాట ధర కల్పించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.


