పల్నాడు జిల్లా: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యా ్రక్టెస్ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైసూ్కల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు.


