సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్ | Medak Sarpanch Nomination with Lover in Sangareddy | | Sakshi
Sakshi News home page

సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్

Dec 1 2025 7:27 AM | Updated on Dec 1 2025 7:27 AM

Medak Sarpanch Nomination with Lover in Sangareddy |

సంగారెడ్డి టౌన్‌: ప్రేమించిన యువతితో సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడో యువకుడు. జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాళ్లపల్లి సర్పంచ్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్‌ వేయించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.

దీంతో చంద్రశేఖర్‌గౌడ్‌ శ్రీజతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయించి, తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మద్దతుగా నిలిచాడు. వారితో కలిసి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌గౌడ్, శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే తాళ్లపల్లి గ్రామపంచాయతీని ఏకగ్రీవంగా చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్‌ పడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement