పల్నాడు జిల్లా: మండల పరిధిలోని ఉప్పలపాడు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అందించాల్సిన మజ్జిగను కుక్క తాగుతూ పలువురికి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు తిన్న ఆహారం తింటే రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు ఉందని భయపడ్డారు. అయితే, ఎటువంటి ఇబ్బంది కలగక పోవటంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
దీనిపై కేర్‌టేకర్‌ను వివరణ కోరగా అప్పటికే విద్యార్థులు భోజనాలు ముగించారని, కుక్క తిన్న ఆహారాన్ని పారవేశామన్నారు. పాఠశాలలో కుక్కల,కోతుల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండరని విమర్శలున్నాయి. 600 పైగా విద్యారి్థనులు ఉన్న వసతి గృహంలో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. కానీ అలా జరగటం లేదని తల్లిదండ్రులు అంటున్నారు.


