తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో శనివారం రాత్రి ఒక వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మండలంలోని వినగడపకు చెందిన వివాహిత తోటమూలలోని ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు తోటమూల సెంటర్లో ఆటో కోసం వేచి ఉండగా, కార్ల సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుడు చెన్నోజు అశోకచారి, మెకానిక్ రాజేష్ కారులో ఆమె వద్దకు వచ్చారు.
తాము ఇంటివద్ద దింపుతామని నమ్మించి ఆమెను కారులో ఎక్కించుకున్నారు. గంపలగూడెం శివారులో ఆమెకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. వివాహిత ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


