తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో 12 వారం ఎలిమినేషన్ జరిగింది. దివ్య ఎలిమినేట్ అయింది. మరి వెళ్లేముందు హౌస్‌లో ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
అనర్హురాలిగా సంజనా
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేందుకు ఎవరికి అర్హత లేదో.. వారి ఫోటోను చెట్టు నుంచి తీసేయాలన్నాడు నాగ్. మొదటగా భరణి మాట్లాడుతూ.. హౌస్ హార్మోని దెబ్బ తింటోందంటూ సంజనా ఫోటో తీసేశాడు. రీతూ మాట్లాడుతూ.. ఎదుటివాళ్లు చెప్పేది అర్థం చేసుకోదంటూ దివ్యను అనర్హురాలిగా అభిప్రాయపడింది. దివ్య.. రీతూ ఫోటో తీసేసింది. పవన్, సుమన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ.. సంజనాకు అర్హత లేదన్నారు.

దేశముదురుగా ఇమ్మూ
ఎక్కువమంది సంజనాకే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. తర్వాత ఇమ్మాన్యుయేల్.. ఆడ గొంతుతో అమ్మా అని పిలిచి పిలిచి.. పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ పాట విని నాగ్ సైతం చప్పట్లు కొట్టాడు. హౌస్‌మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని పోస్టర్స్ వదిలాడు. ఇమ్మూని దేశముదురుగా.. తనూజని జగదేక వీరుడు అతిలోక సుందరిగా, పవన్- రీతూ గీతాగోవిందం, కల్యాణ్ రేసుగుర్రం, భరణి.. హాయ్ నాన్న, సంజనా.. చంద్రముఖి, సుమన్.. బాబు బంగారం, దివ్య.. భాగమతిగా పోస్టర్లు వేశారు.
దివ్య ఎలిమినేట్
నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా.. చివరకు సుమన్, దివ్య మిగిలారు. వీరిలో దివ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేట్ అవగానే భరణి (Bharani Shankar) చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన దివ్య.. నేనైతే 100% ఇచ్చాను. రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల నా గేమ్ దెబ్బ తింది అని పేర్కొంది. తర్వాత హౌస్‌మేట్స్ గేమ్‌పై రివ్యూ ఇచ్చింది.

తనూజతో గొడవే లేదు
పవన్.. నీకోసం నువ్వు ఆడు, త్యాగం చేయకు అని సలహా ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్.. ఆల్‌రౌండర్, ఆలోచనలు తగ్గించుకుంటే నిన్ను ఆపే వాళ్లే లేరంది. సంజనా.. మనిషి మంచావిడ, కానీ మాటతో అంతా పోగొట్టుకుంటుందని, స్ట్రాంగ్‌గా ఉండమంది, తనూజ.. మేమిద్దరం కొట్టుకుంటాం, జుట్టు పట్టుకుని లాక్కుంటాం అని అందరూ అనుకుంటారు. కానీ మా మధ్య అలాంటిదేం లేదు. నువ్వింకా ఆడి ముందుకెళ్లు.. ఇంకా చెప్పడానికి ఏం లేదని పేర్కొంది.
గెలవాలని కోరుకుంటా
కల్యాణ్‌కు ఇండస్ట్రీ అంటే పిచ్చి, కచ్చితంగా నువ్వు హీరో అయిపోవాలి అంది. రీతూ.. బబ్లీ గర్ల్, చాలా చిన్న పిల్ల, ఎక్కువ ఎమోషనల్ అవకని సూచించింది. భరణి మా అన్నయ్య, తను గెలవాలని కోరుకుంటా.. గేమ్ బాగా ఆడండి, బయటకు వచ్చాక కూడా నేను మీ చెల్లినే అంటూ భావోద్వేగానికి లోనైంది. సుమన్.. ఎమోషనల్ అవకండి, గేమ్ గట్టిగా ఆడండి అని చెప్పుకొచ్చింది. చివరగా భరణి.. దివ్యను ఉద్దేశిస్తూ బిగ్‌బాస్ హౌస్ ఒక యోధురాలిని మిస్ అవుతుందన్నాడు.


