breaking news
Divya Nikhita
-
'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్‌కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా గేమ్స్ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్‌లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది. భరణిని నామినేట్ చేసిన ఇమ్మూఅయితే తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్‌కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్ తగ్గిపోతోందని కారణం చెప్పాడు. ఎమోషనల్ డ్రామా ఎక్కువైందిరీతూ.. దివ్యను నామినేట్ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్‌ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్ చేశాడు గౌరవ్. కల్యాణ్.. నిఖిల్‌ను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్ -
ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు అయింది భరణి పరిస్థితి. దివ్య.. తనూజ గొడవపడి అసలు సంబంధమే లేని భరణిని మధ్యలోకి లాగారు. నాతో మాట్లాడొద్దని తనూజ.. మీ పేరొచ్చినప్పుడు మాట్లాడలేరా? స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి అని దివ్య.. భరణిపై ప్రతాపం చూపించారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్7వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..తడబడిన సాయికెప్టెన్సీ కంటెండర్స్‌ను సెలక్ట్ చేసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. వారిలో ఎవర్ని సైడ్ చేయాలి? ఎవర్ని ముందుకు తీసుకెళ్లాలన్న బాధ్యతను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో కంటెండర్కు సపోర్ట్‌గా నిలబడ్డారు. రాము.. తనూజకు సపోర్ట్ చేస్తానని ఇచ్చిన మాట కోసం భరణిని తీసేశాడు. సాయి శ్రీనివాస్ దివ్యను తీసేయబోతే.. నిన్ను కాపాడుకుంటూ వచ్చా, నన్నే తీస్తున్నావా? అని ధమ్కీ ఇచ్చింది.చివరకు ముగ్గురుదెబ్బకు జడుసుకున్న సాయి (Sreenivasa Sayee).. రీతూ పేరెత్తాడు. నేనేం చేశానని ఆమె ఉగ్రరూపం ఎత్తడంతో సుమన్ పేరు ప్రస్తావించాడు. వాళ్లిద్దరూ నోరేసుకుని పడిపోయారని నామీదకు వచ్చావా? అని సుమన్ ఆగ్రహించాడు. దీంతో సాయి మళ్లీ తను మొదట చెప్పినట్లుగా దివ్యను గేమ్‌లో అవుట్ చేశాడు. నిఖిల్.. సుమన్‌ను తీశాడు. అలా చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్.. ముగ్గురు మిగిలారు. సరిగ్గా ఇప్పుడే దివ్య చక్రం తప్పింది. టార్గెట్ తనూజతనూజ, రీతూ ఉంటే.. రీతూనే తీస్తానన్న ఆమె సడన్‌గా మనసు మార్చుకుని తనూజను సైడ్ చేసింది. అది తట్టుకోలేకపోయిన తనూజ.. మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేశావ్.. భరణిగారి వల్లే తీసేశావ్ అని ఆగ్రహించింది. మధ్యలో నా పేరెందుకొచ్చిందని భరణి షాకై చూశాడు. తనూజను తీసేయవనే ఆ కుర్చీ ఇచ్చానని కల్యాణ్ అంటే.. ఆమె ఉంటే ఇమ్మూకి గెలుపు కష్టమవుతుందనే తనూజను తీసేశానని దివ్య బదులిచ్చింది.దివ్యపై భరణి ఉగ్రరూపంమీ పర్సనల్స్ బయట పెట్టుకో, హౌస్‌లో కాదని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పి ఆవేశంగా లోపలకు వెళ్లిన తనూజ గుక్కపెట్టి ఏడ్చింది. ఆమె మాటలు విన్నారా? ఇప్పుడు హ్యాపీయా? నా గేమ్‌లో మీ పేరెందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అని అందరి ముందే భరణిపై అరిచింది. కాసేపటికి ఒంటరిగా ఉన్న భరణి దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చా? అని అడిగింది. ఆయన కోపంగా ఉన్నాడని అర్థమై ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అరిచినందుకు సారీ చెప్దామని వచ్చానంది. ఏం మాట్లాడాలి? నామీద అరవడం ఫస్ట్ టైమా? నువ్వేదో అంటావ్.. తనేదో అంటుంది. ఇలాగైతే నేను ఊరుకోనుమధ్యలో నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అవసరమైతే తనతో తర్వాత మాట్లాడతా కదా.. అని భరణి సీరియస్ అయ్యాడు. దీంతో ఆమె సారీ చెప్పి కెప్టెన్ రూమ్‌లోకి వెళ్లిపోయింది. మా మమ్మీడాడీని చూస్తే కూడా నాకు భయమయలేదు. ఆయన కళ్లలో అంత కోపం చూశాను.. నాకు ఆయన అన్నయ్యే కావచ్చు.. కానీ, అది బయటకెళ్లాక చూసుకుంటానిక.. ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని ఇమ్మాన్యుయేల్‌తో అంది. తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్‌కు ఓ గేమ్ పెట్టగా అందులో ఇమ్మూ గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు. దివ్య ఎత్తుగడ వల్ల తనూజకు జనాల్లో సింపతీ రావడం ఖాయం. ఈ ఎపిసోడ్‌తో తనూజ కప్పు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: హౌస్‌లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే! -
దివ్య ఇచ్చిన షాక్‌తో బోరుమని ఏడ్చిన తనూజ.. ఎంతో కష్టపడ్డానంటూ..
కెప్టెన్సీ ఎవరు కాదనుకుంటారు? అందరూ కోరుకునేదే, అందరికీ బాగా కావాల్సిందే! బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతోంది. అయితే కంటెండర్లకు డైరెక్ట్‌గా గేమ్ పెట్టకుండా.. హౌస్మేట్స్ సాయంతో గెలిచే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మాత్రమే మిగిలారు. ఏ హౌస్‌మేట్ అయితే రైలెక్కి కూర్చుంటాడో అతడు ఒకర్ని రేసు నుంచి తీసేయొచ్చు. మోసం చేసిన దివ్య?అలా ఒక్క కుర్చీ కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. కల్యాణ్ చేతిలో కుర్చీ ఉంటే.. నేను చెప్పేది విను అంటూ అతడికి నచ్చజెప్పి కుర్చీలో కూర్చుంది దివ్య. నా సపోర్ట్ ఇమ్మాన్యుయేల్‌కు అని చెప్తూ.. తనూజను గేమ్‌లో అవుట్ చేసింది. అది విని షాకైన తనూజ.. నీకు కొంచెమైనా ఉందా? వ్యక్తిగత కారణాలతో ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావ్? అని కోప్పడింది. తనూజను ఎలిమినేట్ చేయవు అన్నందుకే కల్యాణ్ నీకు కుర్చీ ఇచ్చాడని గుర్తు చేసింది. చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లుఇంతలో కల్యాణ్ కూడా మధ్యలో కలగజేసుకుంటూ.. నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద విషయమే కాదు, నిన్ను నమ్మి ఇచ్చానని తలపట్టుకున్నాడు. మళ్లీ కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన బాధలో ఉన్న తనూజ.. నాతో మాట్లాడకు, నీకేమైన పర్సనల్స్ ఉంటే హౌస్ బయట పెట్టుకో అని దివ్యకు చెప్పి, ఆ వెంటనే బోరుమని ఏడ్చేసింది. కెప్టెన్ అవాలని చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి ఓదారుస్తుంటే కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ మాట్లాడొద్దు అని వేడుకుంది. ఇక చివర్లో రీతూ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ! -
పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!
డిమాన్ పవన్ టాస్క్‌ల వీరుడు.. అతడితో పోటీపడితే ఓటమి తథ్యం అని హౌస్‌మేట్స్‌కు బాగా తెలుసు. వీళ్లందరికంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు మరీ ఎక్కువ తెలుసు. అందుకే.. అతడ్ని సైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అదెలాగో బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్ ఔట్రెబెల్స్ దివ్య, సుమన్.. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను ఎవరికీ అనుమానం రాకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. రెండో టాస్కులో భాగంగా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు. కానీ, ఉదయాన్నే ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టారు. దివ్య అయితే.. ప్యాకెట్స్ ఎవరు కొట్టేశారో.. ప్లీజ్, ఇచ్చేయండి అని మహానటిలా నటించేసింది. ఈ దొంగతనం టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందున హౌస్‌లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించవ్చన్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. నిఖిల్‌ను తప్పిస్తున్నట్లు చెప్పింది.కెప్టెన్‌కు ఎదురుతిరిగిన గౌరవ్పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో రీతూ (Rithu Chowdery) హస్తం ఉందని తనపైనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రాము సరదాగా.. ఏమో దివ్యనే రెబల్ కావొచ్చేమో అన్నాడు. నిఖిల్ మాత్రం.. సీరియస్‌గానే దివ్య రెబల్ అని తేల్చేశాడు. మరోవైపు కిచెన్‌లో మళ్లీ గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేయమని గౌరవ్‌కు ఆర్డరేసింది దివ్య. ఇంకా బ్రేక్‌ఫాస్టే తినలేదు.. అప్పుడే లంచ్‌కోసం ప్రిపరేషన్ ఏంటి? అని గౌరవ్ వాదించాడు. భోజనమే ఉండదుఈ గొడవ ముదరడంతో.. గౌరవ్‌ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వాష్‌రూమ్స్ క్లీన్ చేయాలని ఆర్డరేసింది కెప్టెన్ దివ్య. తాను ఆ పని చేయనని గౌరవ్ మొండికేయగా.. అలాగైతే రేపు నీకు భోజనమే ఉండదని దివ్య బెదిరించింది. ఇదిలా ఉంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓటింగ్ వేయాలన్నాడు బిగ్‌బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారన్నాడు. దీంతో కొందరు కావాలని పవన్ పేరు చెప్పి అతడిని ఈజీగా సైడ్ చేశారు. దెబ్బకు జడుసుకున్న రీతూఅనంతరం ఓ హారర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ భయపడుతూనే టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత దివ్య.. ధైర్యంగా లోనికి వెళ్లి వచ్చింది. అనంతరం రీతూ.. తనకు భయమనేదే లేదు, ఆడపులి అని బిల్డప్ కొడుతూ లోపలకు వెళ్లింది. కానీ అక్కడున్న దెయ్యాల గెటప్స్ చూసి నిలువెల్లా వణికిపోయింది. చివర్లో మాత్రం ఓ నవ్వు నవ్వి దెయ్యాలు సైతం జడుసుకునేలా చేసింది. ఈ గేమ్‌లో తనూజ గెలిచింది.చదవండి: జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి -
మాధురి నోటికాడి కూడు లాక్కుంటారా? దివ్య ఓవరాక్షన్ ఏంటో?
బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss Telugu 9)లో ఏది జరిగినా ఒకరోజు ఆలస్యంగా చూపిస్తారు. అలా శుక్రవారం రోజు జరిగినదాన్ని నేడు ఎపిసోడ్లో చూపించనున్నారు. ఇక ఫ్రైడే అంటే పెద్దగా టాస్కులేవీ ఉండవు. కేవలం ఫన్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇటువంటి ఫన్ గేమ్స్ దగ్గరా గొడవ పడొచ్చని నిరూపించారు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్స్.తిండి దగ్గర లొల్లితాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ పూర్తయ్యాక అందరూ ప్లేటులో బిర్యానీ వేసుకుని ఆవురావురుమని ఆరగించారు. ఓపక్క అందరూ తింటుంటే మాధురి అప్పుడే వచ్చి ప్లేటులో బిర్యానీ వేసుకోబోయింది. అది చూసిన భరణి, దివ్య వెంటనే ఆపేశారు. వేరే టీమ్‌కు ఇంకా పీసులు వెయ్యలేదు, వారికి వేశాక మీకు పెడతాను అని భరణి అడ్డుకున్నాడు. దీంతో మాధురి హర్టయిపోయింది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది. ఆయనకు నోరు లేదా?చిన్నచిన్నవాటికెందుకిలా.. అని భరణి (Bharani Shankar) వివరించబోయాడు. ఇంతలో దివ్య.. మధ్యలో కలగజేసుకుని మాట్లాడటంతో మాధురి అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది. ప్లేటు పట్టుకున్నప్పుడు అలా అనేస్తే ఎలా తింటాం? అతడు అడుగుతున్నదానికి సమాధానం చెప్తున్నా.. మధ్యలో ఈమె (దివ్య) వివరణ ఇవ్వడం దేనికి? ఆయనకు నోరు లేదా? మాట్లాడలేడా? అని మాధురి.. కల్యాణ్ ఎదుట తన కడుపులో ఉన్నదంతా కక్కేసింది.మీ గేమ్ మీరు ఆడండిఇక ఈ గొడవయ్యాక తనూజ.. భరణితో ఇది మీ గేమ్ మీరు ఆడండి.. మధ్యలో దివ్య ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంది. నిజమే.. దివ్య ఇలా భరణిపై పెత్తనం చెలాయిస్తే అది అతడికే నెగెటివ్ అయి మళ్లీ ఎలిమినేట్ అవడం ఖాయం. మరి భరణి ఏం చేస్తాడో చూడాలి! చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన -
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లో రీఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఆడియన్స్ భరణికే ఓట్లు గుద్దిపడేశారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి నిష్క్రమించింది. పర్మినెంట్ హౌస్‌మేట్ అయిన భరణికి బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదేంటో శుక్రవారం (అక్టోబర్ 31వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..భరణి చేతిలో పవర్ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయమని భరణి (Bharani Shankar)కి పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అతడు ఈ వారం తనకు సపోర్ట్ చేసినవారికే ఛాన్స్ ఇస్తానన్నాడు. మాధురి మాత్రం అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వమంది. భరణి మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ అవలేని వారికే ఛాన్స్ ఇస్తానంటూ.. అతడి పేరుతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను సెలక్ట్ చేశాడు. రీతూను సెలక్ట్ చేయకపోవడంతో ఆమె కాస్త హర్టయింది.తనూజ వర్సెస్ కల్యాణ్రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. బెండకాయలు పాడైపోయేలా ఉన్నాయని, వాటితో కూర వండాలంది. చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలూ కుర్మా కావాలని కల్యాణ్ అడిగాడు. అడిగినవన్నీ చేసిపెట్టేందుకు సర్వెంట్లం కాదు, అన్నిట్లో వేలు పెట్టకు.. అంటూ కల్యాణ్‌పై రెచ్చిపోయింది తనూజ. అతడు కూడా వెనక్కు తగ్గలేదు. అన్నీ నీకు నచ్చినట్లే చేయాలంటే కుదరదంటూ కౌంటరిచ్చాడు. ఇలా కాసేపు వీరిద్దరూ గొడవపడ్డారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లకు డీజే టాస్క్ పెట్టాడు. డీజే డ్యాన్స్ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ప్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచినట్లు. రాము సంచాలక్‌గా వ్యవహరించాడు. ఎలాగో అందరూ ఊహించినట్లే నిఖిల్, సాయికి ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. భరణిని కూడా లైట్ తీసుకున్నారు. దివ్య, తనూజకు మాత్రం పోటాపోటీగా మద్దతు పలికారు. బొమ్మలా నిల్చున్న భరణిదీంతో వీళ్లిద్దరూ రెండో రౌండ్లో పాల్గొన్నారు. అయితే ఈ రౌండ్ ప్రారంభమవడానికి ముందే దివ్య తెలివిగా.. భరణికి సపోర్ట్ చేసేవారి దగ్గరికెళ్లి సాయం చేయమని అడిగింది. దీంతో రాము, సుమన్, సంజన.. ఇలా చాలామంది ఆమెకు మాటిచ్చి ఆ మాటపై నిలబడ్డారు. రెండో రౌండ్లో తనూజ కోసం మాధురి, రీతూ, డిమాన్, కల్యాణ్ నిలబడ్డారు. దివ్య కోసం ఇమ్మూ, గౌరవ్, సుమన్, సాయి, సంజన నిల్చున్నారు. ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. ఈ గేమ్‌లో భరణి.. ఎటూ తేల్చుకోలేక మధ్యలో నిలబడి సినిమా చూడటం విశేషం!కెప్టెన్‌గా దివ్యతనూజ.. గతవారం కూడా టాప్ 2దాకా వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తనకు దుఃఖం ఆగలేదు. రీతూ ఓదారుస్తుంటే మాధురి మాత్రం తన దుమ్ము దులిపేసింది. అందరినీ నమ్ము.. అది ఏడిస్తేనే బాగుంటుంది. ఏడవినవ్వవే.. ఎంత దారుణం.. నాన్న నాన్న అని వెళ్లిపట్టుకో అంటూ ఫైర్ అయింది. తనూజ మాత్రం ఏడుస్తూనే.. ఇప్పుడైనా నమ్ముతావా? నా గేమ్ నేను ఆడుతున్నా.. మాటలకు వస్తారు, కానీ సపోర్ట్ చేయరు అంటూ బాధపడింది. అందరినీ బతిమాలుకోవడం అలవాటైన రీతూ.. అదే పని చేసి రేషన్ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది. ఈ మధ్య అరుపులు, ఆజమాయిషీతో ఓవర్ చేస్తున్న దివ్య.. కెప్టెన్‌గా ఎలా ఉంటుందో చూడాలి!చదవండి: ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్ -
దివ్య, ఇమ్మూ అసలైన తోపులు.. ఓవర్ చేసిన శ్రీజ.. మరోసారి బైబై!
హౌస్‌లో టెంపరరీ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. కానీ, బయట వస్తున్న సింపతీ, అభిమానం చూశాక గర్వం తలకెక్కింది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (అక్టోబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అన్నం మీద అలిగిన మాధురితనూజ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయిందో కానీ కిచెన్‌లో ఒకటే గొడవలు.. ఈ సారి ఆ గొడవల్లో మాధురి బలైంది. అన్నం మీద అలిగి కూర్చుంది. తను తినకుండా ఉంటే భరణి (Bharani Shankar) చూసి తట్టుకోలేకపోయాడు. అతడే కాదు, సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. ఇలా అందరూ తినమని బతిమాలారు. అందరూ పదేపదే అడిగేసరికి కాదనలేక తినేసింది. అలక తగ్గిపోయాక తనూజతో కలిసిపోయి తనకు జడేసింది.తనూజకి పొగరు: శ్రీజమధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూర కాస్త మిగిలింది, కావాలనుకున్నవాళ్లు రండని పిలిచింది తనూజ (Thanuja Puttaswamy). దీంతో సాయి సహా మరికొందరు వెళ్లి కూర వేసుకున్నారు. కాసేపటికి శ్రీజ.. కర్రీ ఉందా? అని అడగ్గా తనూజ స్పందించలేదు. దాంతో శ్రీజ.. నేను టెంపరరీ హౌస్మేట్ని అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు.. ఆమె(తనూజ)కు పొగరని ఇందుకే అన్నానంటూ ఫైర్ అయింది. ఇక్కడ పవన్.. తనూజకోసం స్టాండ్ తీసుకోవడం గమనార్హం!కల్యాణ్‌ను చిత్తు చేసిన ఇమ్మూఇక బిగ్‌బాస్.. కట్టు-పడగొట్టు టాస్క్‌ను రద్దు చేసి మరో గేమ్ ఇచ్చాడు. భరణి పరిస్థితి బాలేనందున అతడి కోసం దివ్య ఆడింది. శ్రీజ ఈ గేమ్‌లో అట్టర్ ఫ్లాప్ అవగా దివ్య అలవోకగా ఆడి గెలిచేసింది. మరో గేమ్‌లో శ్రీజ కోసం కల్యాణ్, భరణి కోసం రాము బరిలో దిగారు. ఇందులో కల్యాణ్ చకచకా ఆడి గెలిచేశాడు. తర్వాతిచ్చిన టాస్క్‌లో మాత్రం కల్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు. భరణి కోసం ఆడిన ఇమ్మూ మరోసారి తన పవర్ చూపించాడు. ఇలా భరణి రెండు టాస్కులు గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు.హర్టయిన పవన్అయితే శ్రీజ కోసం తాను ఆడతానన్నా తన పేరు లెక్కలోకి తీసుకోకపోవడంపై డిమాన్ పవన్ హర్టయ్యాడు. టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది. ఈజీ గేమ్.. కల్యాణ్ ఆడలేకపోయాడు అని కామెంట్ చేశాడు. ఈ విషయంలో పవన్-శ్రీజకు గొడవ అయింది. తర్వాత కల్యాణ్.. గేమ్‌లో ఓడిపోయినందుకు శ్రీజకు సారీ చెప్పాడు. సారీ చెప్తే గూబ పగిలిపోద్ది.. అన్నీ మనమే గెలుస్తామా? అంటూ ఫ్రెండ్‌ను ఓదార్చింది. శ్రీజ రెండోసారి ఎలిమినేట్గతంలో నామినేషన్స్‌లో ఉన్నప్పుడు పవన్ సేవ్ చేయడం వల్లే శ్రీజ మరికొన్ని వారాలు హౌస్‌లో ఉంది. అతడే మొన్నటి టాస్క్‌లో దెబ్బలు తగిలించుకుని మరీ శ్రీజను గెలిపించాడు. అయినా పవన్‌ను పక్కనపెట్టడం ఏంటో ఆమెకే తెలియాలి! హౌస్‌లో ఆమె చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఓట్లు కూడా సరిగా పడలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అవగా భరణి హౌస్‌లో ఉండిపోయాడని తెలుస్తోంది.చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్ -
వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్‌లో శ్రీజ, భరణి రీఎంట్రీ!
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణి రాకతో ఆనందభాష్పాలుభరణి (Bharani Shankar) హౌస్‌లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్‌కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.దివ్యను పట్టించుకోని భరణినిఖిల్.. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.నామినేషన్స్‌లో ఎనిమిది మందిశ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్‌లో ఉంటారన్నాడు బిగ్‌బాస్.రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్ -
బిగ్‌బాస్‌లో బాడీ షేమింగ్.. దివ్యపై సంజన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ షో అంటేనే బూతులకు కేరాఫ్ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్ హౌస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్‌బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.హౌస్‌లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్ పట్ల సంజన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్ అంటూ 'కల్యాణ్' లో క్లాస్ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కల్యాణ్‌పై చీప్ కామెంట్లు చేసింది.మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని లైవ్ ఎపిసోడ్స్‌లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్‌ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్‌బాస్ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో సంజనను హోస్ట్ నాగార్జున నిలదీస్తారా..? లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్‌బాస్‌లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b— Edits reposter (@Inspiritmodee) October 24, 2025 -
నాన్న అందుకే వెనకబడ్డాడు! ఆకాశానికెత్తి పాతాళంలో పడేశారు!
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్‌బాస్ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్‌కు తొలి, చివరి కారణం! తన కోసం తగ్గిన భరణిబిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్‌ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ కూడా చేశాడు.టాప్ 1 అని..కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్‌కార్డ్‌గా సరాసరి హౌస్‌లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్ అవుతున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఆ పని చేసుంటే..కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్ ఆడుంటే ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, ఇక అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి! -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్
బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత షో పరుగులు పెడుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని వ్యక్తి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే గతవారంలో ప్రేక్షకుల ఓటింగ్‌తో ప్రమేయం లేకుండానే షాకింగ్ ఎలిమినేషన్‌తో శ్రీజ దమ్ము బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్‌లలో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అందరూ దివ్య, రాములలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ, బిగ్‌బాస్ అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశాడు. ఒక టాప్ కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి పంపించేశాడు.ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అదివారం బిగ్‌బాస్ నుంచి బయటకు రానున్నారు. కేవలం ఎక్కువ బాండిగ్స్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్ తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆపై అతని గేమ్ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టాప్‌లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండటంతో గేమ్‌పై పట్టు కోల్పోయారు. ముఖ్యంగా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై అతనితోనే దివ్య ఉండటంతో నమ్మేశాడు. దీంతో ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఏకంగా తనను నామినేట్ చేసిన వారందరూ హౌస్ నుంచి వెళ్లిపోయారని కూడా కామెంట్ చేశారు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్లిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట పతనానికి దారి తీసింది. కేవలం తన స్వయం కృతాపరాధం వల్లే భరణ ఎలిమినేట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే, ఎలాంటి నెగటివిటి లేకుండా బిగ్‌బాస్ నుంచి వచ్చేశారు. -
మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి అయితే ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. బుధవారం అటు సంజనతో ఇటు దివ్యతో గొడవలు పెట్టేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చూస్తుంటే 38వ రోజు గట్టిగానే డ్రామా ఉండబోతుందనిపిస్తోంది.ఉదయం లేవడం లేవడమే.. వంటగదిలోకి వచ్చిన మాధురి, బాత్రూమ్లో ఉంచిన తన స్టిక్కర్స్‌ని ఎవరు తీశారని సీరియస్ అయింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో.. నావి ఎందుకు తీస్తున్నావ్? అయినా నీకు దొంగతనం అలవాటేగా అని రెచ్చిపోయింది. మరోచోట కెప్టెన్ కల్యాణ్‌తో దివ్య మాట్లాడుతూ.. వీళ్లంతా మెంటల్ గాళ్లు అని రెండు మూడు రోజుల క్రితం వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి నోరు జారింది. స్మార్ట్, మెంటలో కాదు ఏదోటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చంది.(ఇదీ చదవండి: తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!)దీని తర్వాత కిచెన్‌లో ఉన్న ఎగ్ దోశలు వేసుకున్న మాధురి, కొంత కూర కూడా ప్లేటులో వేసుకుంది. నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారని దివ్య అడిగేసరికి.. కొద్దిగా వేసుకున్నాను అని మాధురి సమాధానమిచ్చింది. ఒక్క సెకన్ అరవకండి అని దివ్య అనేసరికి.. వచ్చిన నుంచి గొడవ పడాలని చూస్తున్నావా అంటూ మాధురి సీరియస్ అయింది. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పింది.పర్సనల్‌గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే.. నాకు అస్సలు అవసరం లేదమ్మా, మీ బాండింగ్‌లు నాకెందుకు వాట్ ఏ జోక్, మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? నాన్న నాన్న అనుకుంటూ అని దివ్యని ఎగతాళి చేస్తున్నట్లు మాధురి మాట్లాడింది. ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని మాధురి సామెత చెబుతూ తనూజవైపు చూసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?) -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్‌పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్‌ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్‌గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి -
మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్‌రూమ్‌కు!
ఏమాటకామాట.. ఈ సీజన్‌కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్‌గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడుబిగ్బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్‌లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్బాస్ఇక బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్‌గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు. అందరి నిర్ణయం ఒక్కటేదీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను. సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూఅలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్‌గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.ఒంటరివాడ్ని అయిపోయా!నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్‌లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్‌లో ఉండొచ్చని బలంగా నమ్మారు.చదవండి: దీపికా పదుకొణెకు మరో బిగ్ సినిమా ఛాన్స్ -
వాళ్లను టాప్ 5లో పెట్టిన వైల్డ్‌కార్డ్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. అయితే దానికంటే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులను వారి ఆట,మాట ఆధారంగా వరుస ర్యాంకుల్లో నిల్చోబెట్టమన్నాడు. దాదాపు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అలాగే హౌస్‌మేట్స్‌కు ర్యాంకులిచ్చింది. రెండుమూడు మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నాయి.ర్యాంకింగ్..భరణిని టాప్ 1లో, ఇమ్మాన్యుయేల్‌ను రెండో స్థానంలో, సంజనాను మూడు, డిమాన్ పవన్‌ను నాలుగు, తనూజను ఐదో స్థానంలో నిలబెట్టింది. సుమన్, రీతూ, ప్రియ, హరీశ్, శ్రీజ, కల్యాణ్, రాము, ఫ్లోరాకు వరుసగా ఆరు నుంచి 13 స్థానాలిచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్నవారు మాత్రేమ కెప్టెన్సీకి పోటీ పడతారని ప్రకటించాడు బిగ్‌బాస్.కెప్టెన్సీ టాస్క్వీరితోపాటు దివ్యను కూడా కంటెండర్‌గా అనౌన్స్ చేశాడు. వీళ్లకు తప్పిస్తారా? గెలిపిస్తారా? అన్న గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భరణి, ఇమ్మాన్యుయేల్ చివరి వరకు పోరాడారు. హౌస్మేట్స్ సహకారంతో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్సీకి పోరాడి ఓడియాడు. మూడోసారి మాత్రం గెలిచి దక్కించుకున్నాడు. మరి ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించేశారా? లేదంటే బిగ్‌బాస్ మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్


