బిగ్‌బాస్ షో అంటేనే బూతులకు కేరాఫ్ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్ హౌస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్‌బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.
హౌస్‌లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్ పట్ల సంజన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్ అంటూ 'కల్యాణ్' లో క్లాస్ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కల్యాణ్‌పై చీప్ కామెంట్లు చేసింది.
మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని లైవ్ ఎపిసోడ్స్‌లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్‌ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్‌బాస్ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో సంజనను హోస్ట్ నాగార్జున నిలదీస్తారా..? లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్‌బాస్‌లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.
Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??
Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b— Edits reposter (@Inspiritmodee) October 24, 2025


