ఈ ఏడాది ఆరంభంలో తొక్కిసలాట జరిగి శ్రీవారి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా టీటీడీ పాఠం నేర్వేలేదు. ఎప్పటిలాగే భక్తులు దర్శన టికెట్ల కోసం వచ్చారు. కానీ, వాళ్లకు సరిపడా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ మరోసారి విఫలమైంది.
భక్తులను నియంత్రించలేని చోట లాఠీ ఛార్జీ చేసి చెదరగొట్టిన పరిస్థితులు కనిపించాయి.
ఈ పరిణామాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీఐపీల కోసం పాకులాడే టీటీడీ పెద్దలు.. సామాన్యుల సంగతి ఎందుకు పట్టించుకోరని నిలదీస్తున్నారు.
అయితే టీటీడీ అటు పోలీసులు కళ్ల ముందు పరిస్థితులు కనిపిస్తున్నా.. అలాంటిదేం లేదని చెబుతుండడం గమనార్హం. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద గురువారం నాటి దృశ్యాల ఇవిగో..


