గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.తదియ ఉ.10.27 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: శ్రవణం తె.5.54 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ఉ.8.59 నుండి 10.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు,అమృత ఘడియలు: సా.6.51 నుండి 8.32 వరకు.
సూర్యోదయం : 6.30
సూర్యాస్తమయం : 5.27
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
వృషభం.... బంధువర్గంతో తగాదాలు. వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
మిథునం.... వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు.
కర్కాటకం..... ఆసక్తికర సమాచారం అందుతుంది.. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వ్యాపార విస్తరణయత్నాలు .. ఉద్యోగులకు అనుకూల మార్పులు.
సింహం.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం
కన్య.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.
తుల.... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.
వృశ్చికం.... పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
ధనుస్సు... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆస్తి తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు.
మకరం.... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.
కుంభం.. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.
మీనం... నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.


