ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి | Rasi Phalalu: Daily Horoscope On 05-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి

Feb 5 2026 4:04 AM | Updated on Feb 5 2026 8:17 AM

Rasi Phalalu: Daily Horoscope On 05-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.చవితి రా.2.04 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఉత్తర రా.12.53 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ఉ.7.35 నుండి 9.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.07 వరకు తదుపరి ప.2.54 నుండి 3.36 వరకు, అమృత ఘడియలు: సా.5.26 నుండి 7.06 వరకు, సంకటహర చతుర్థి.

సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.53
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృషభం... బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

మిథునం... సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.

కర్కాటకం... మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.

తుల.... వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు.

వృశ్చికం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.

ధనుస్సు... కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

మకరం.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం... వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

మీనం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.

Advertisement
 
Advertisement
Advertisement