గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: పౌర్ణమి తె.4.16 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: పుష్యమి రా.12.47 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.9.26 నుండి 10.57 వరకు, దుర్ముహూర్తం: సా.4.20 నుండి 5.05 వరకు, అమృత ఘడియలు: సా.6.40 నుండి 8.11 వరకు, మాఘపౌర్ణమి.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.51
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం..... చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభం... ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం..... కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం.... ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
సింహం....... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
కన్య.... గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల.... నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
వృశ్చికం... మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు.... శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం.... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మీనం.... శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.


