గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.దశమి ప.2.35 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: కృత్తిక ఉ.7.51 వరకు, తదుపరి రోహిణి తె.6.09 వరకు (తెల్లవారితే గురువారం), వర్జ్యం: రా.10.45 నుండి 12.14 వరకు, దుర్ముహూర్తం: ప.11.50 నుండి 12.34 వరకు, అమృత ఘడియలు: రా.3.10 నుండి 4.39 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.49
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
వృషభం.... కొత్త విషయాలు గ్రహిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
కర్కాటకం.... కుటుంబంలో అనుకూలం. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
సింహం.... నూతన పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
కన్య.... రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
తుల.... రాబడికి మించి ఖర్చులు. కొత్త బాధ్యతలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం.... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి కొనుగోలులో పురోగతి. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
ధనుస్సు.... కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మకరం.... కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కుంభం... సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మీనం... వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.


