ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 13-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం

Mar 13 2026 3:40 AM | Updated on Mar 13 2026 10:19 AM

Rasi Phalalu: Daily Horoscope On 13-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.దశమి తె.6.08 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాషాఢ రా.1.18 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ఉ.9.32 నుండి 11.17 వరకు,దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.20 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: రా.7.56 నుండి 9.40 వరకు.

సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు ఒత్తిళ్లు.

వృషభం.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం.... కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. శుభవార్తలు వింటారు.

సింహం.... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

కన్య.... కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. బంధువులతో వివాదాలు.

తుల.. ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గుతాయి. ధనలాభ సూచనలు.

వృశ్చికం.... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు.... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి.

మకరం.... ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో  అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మీనం.. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement