గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.నవమి తె.4.26 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి దశమి, నక్షత్రం: మూల రా.11.03 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: రా.9.17 నుండి 11.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.09 నుండి 10.57 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు,అమృత ఘడియలు: ప.3.54 నుండి 5.50 వరకు.
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.... దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు.
వృషభం.... ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.
మిథునం.... వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.
కర్కాటకం... వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు.
సింహం.... వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ప్రయత్నాలు మందగిస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య... కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. దైవచింతన. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.
తుల..... విద్యార్ధులు ప్రతిభ చాటుకుంటారు. కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక అశాంతి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.
ధనుస్సు.... అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మకరం.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనారోగ్యం
కుంభం... కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం... కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వాహనయోగం.


