ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలలో లాభాలు | Today Telugu Horoscope On March 8th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలలో లాభాలు

Mar 8 2026 2:59 AM | Updated on Mar 8 2026 10:42 AM

Rasi Phalalu: Daily Horoscope On 08-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పంచమి రా.8.20 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: స్వాతి ప.1.03 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం: రా.7.09 నుండి 8.54 వరకు, దుర్ముహూర్తం: సా.4.28 నుండి 5.15 వరకు, అమృత ఘడియలు: తె.5.43
నుండి 7.27 వరకు.

సూర్యోదయం : 6.18
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆలయాల దర్శనాలు. ఉద్యోగాలలోవిశేష ఆదరణ.

వృషభం.... పనులు అనుకున్న సమయానికి పూర్తి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

మిథునం.... బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో స్థానచలనం.

కర్కాటకం... పనుల్లో  ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

సింహం.... చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కన్య... పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో సామాన్యస్థితి. సోదరులతో కలహాలు.

తుల.... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ఆస్తిలాభ సూచనలు. బంధువులను కలుస్తారు.  వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం... కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.

ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం.... పరపతి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.

కుంభం... ముఖ్య కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం. కళాకారులకు గందరగోళం.

మీనం... బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చిక్కులు. పారిశ్రామికవేత్తలు పర్యటనలు వాయిదా వేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement