ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Telugu Horoscope On Mar 8th To Mar 14th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Mar 8 2026 12:16 AM | Updated on Mar 8 2026 10:43 AM

Weekly Horoscope Telugu 08-03-26 To 14-03-2026

మేషం..
రుణఒత్తిడులు తీరి ఊపిరిపీల్చుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. వారం మధ్యలో  ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం...
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. బంధువులతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. మధ్యలో నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయ్ర,పయాసలు. బంధువులతో తగాదాలు. నలుపు, నేరేడు రంగులు.  కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ముఖ్యమైన  వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల అభిప్రాయాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం...
మొదట ∙మందకొడిగా ఉన్నా రానురాను అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనయోగం. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఆశలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు.  కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

సింహం..
ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉన్నా అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. సంఘంలోనూ, కుటుంబంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మంచి హోదాలు రావచ్చు.  రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు. వారం మధ్యలో దైవదర్శనాలు. ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

కన్య...
బంధుమిత్రుల ఒత్తిడులు మరింత పెరుగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. ఆలోచనలు కలసిరావు. కొత్త వ్యక్తుల పరిచయం కొంత ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ కొంతమేర ఫలిస్తుంది. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబసభ్యుల నిర్ణయాలపై అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు రాగలవు. గులాబీ, లేత పసుపు రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల...
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. వాహనయోగం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరించి లాభాలు అదుకుంటారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు.  శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
కొన్ని సమస్యలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు అ«ధిగమించి ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. బం«ధువులతో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీ ప్రతిపాదనలు, ఆలోచనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకువేస్తారు. ఉద్యోగులకు రావలసిన బకాయిలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, ఎరుపు రంగులు. . శివపంచాక్షరి పఠించండి.

మకరం...
మిత్రులతో సందడిగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో మానసిక ఆందోళన. అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు. . లక్ష్మీస్తుతి మంచిది.

కుంభం...
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయం అందిస్తారు. ఒక లేఖ ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మీనం...
చేపట్టిన పనులలో అవాంతరాలు తొలగుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు శ్రమానంతరం దక్కుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువుల ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలలో ఒత్తిడులు తొలగుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమై చేయూతనందిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Advertisement
 
Advertisement
Advertisement