ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. గృహ, వాహనయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 03-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. గృహ, వాహనయోగాలు

Mar 3 2026 4:34 AM | Updated on Mar 3 2026 4:34 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు,ఫాల్గుణ మాసం, తిథి: పౌర్ణమి సా.5.01 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: మఖ ఉ.7.31 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.3.34 నుండి 5.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.40 నుండి 9.28 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.46 వరకు, అమృత ఘడియలు: రా.1.12 నుండి 2.50 వరకు, హోలీ పండగ. పాక్షిక చంద్రగ్రహణం.

సూర్యోదయం : 6.22
సూర్యాస్తమయం : 6.02
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం... కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలలో నిరుత్సాహపడతారు. ఉద్యోగాలలో మార్పులు.

వృషభం... దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం... సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం.... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొత్త యత్నాలు విఫలం. ఆకస్మిక ప్రయాణాలు.

సింహం...... పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య.... కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. శారీరక రుగ్మతలు.

తుల.... వ్యాపారాలలో ముందంజ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం.  వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు.

వృశ్చికం... నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

ధనుస్సు... ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో చిక్కులు. కార్యక్రమాలలో అవాంతరాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

మకరం...... కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత. రాబడి అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కుంభం... కొత్త పనులు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విజయాలు.

మీనం.... సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement