గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.త్రయోదశి రా.7.03 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుష్యమి ఉ.8.39 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.01 నుండి 10.34 వరకు, దుర్ముహూర్తం: సా.4.27 నుండి 5.14 వరకు, అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 6.23
సూర్యాస్తమయం : 6.02
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... ముఖ్య కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం. కళాకారులకు గందరగోళం.
వృషభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం... బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చిక్కులు. పారిశ్రామికవేత్తలు పర్యటనలు వాయిదా వేస్తారు.
కర్కాటకం... ఇంటర్వ్యూలు అందుతాయి. కార్యక్రమాలలో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.
సింహం..... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో సామాన్యస్థితి. సోదరులతో కలహాలు.
కన్య....... చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
తుల... దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆలయాల దర్శనాలు. ఉద్యోగాలలోవిశేష ఆదరణ.
వృశ్చికం.. బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో స్థానచలనం.
ధనుస్సు.... కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మకరం.... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ఆస్తిలాభ సూచనలు. బంధువులను కలుస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం..... పరపతి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.
మీనం..... కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.


