ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు | Rasi Phalalu: Daily Horoscope On 28-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు

Feb 28 2026 3:12 AM | Updated on Feb 28 2026 3:12 AM

Rasi Phalalu: Daily Horoscope On 28-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.ద్వాదశి రా.8.38 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: పునర్వసు ఉ.9.45 వరకు తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.24 నుండి 6.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.07 వరకు, అమృత ఘడియలు: ఉ.7.26 నుండి 8.57 వరకు.

సూర్యోదయం :    6.24
సూర్యాస్తమయం     :  6.01
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువిరోధాలు. పనులు మందగిస్తాయి.  వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

వృషభం:  కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు.ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మిథునం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో డీలాపడతారు. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

సింహం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కన్య: కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. ఆలయాల దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో కొంత ఉపశమనం.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.

వృశ్చికం: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో శ్రమ ఫలించదు.

ధనుస్సు: అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి.

మకరం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది. దైవ దర్శనాలు.

కుంభం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. విందులువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో హోదాలు. కుటుంబసమస్యలు తీరతాయి.

మీనం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో మరింత శ్రమించాలి. ఉద్యోగాలలో  కొన్ని ఇబ్బందులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement