ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 26-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Feb 26 2026 12:04 AM | Updated on Feb 26 2026 12:20 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.దశమి రా.12.41 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: మృగశిర ప.12.38 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.8.30 నుండి 10.00 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.36 వరకు, అమృత ఘడియలు: రా.1.43 నుండి 3.13 వరకు.

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

మిథునం: చిన్ననాటి మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కుటుంబ సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు.

కన్య: నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

తుల: రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

ధనుస్సు: నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి.  విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మకరం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.

కుంభం: శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement