ఈ రాశి వారికి శుభవార్తలు.. రాబడి పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 22-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు.. రాబడి పెరుగుతుంది

Feb 22 2026 2:28 AM | Updated on Feb 22 2026 2:28 AM

Rasi Phalalu: Daily Horoscope On 22-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.పంచమి ప.12.10 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: అశ్విని రా.7.02 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.3.13 నుండి 4.44 వరకు, దుర్ముహూర్తం: సా.4.26 నుండి 5.12 వరకు, అమృత ఘడియలు: ప.12.10 నుండి 1.41 వరకు.

సూర్యోదయం :  6.29
సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం..... ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం.... ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

మిథునం.... ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దేవాలయ దర్శనాలు.

కర్కాటకం..... కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విందువినోదాలు.

సింహం.... రావలసిన బాకీలు అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. చోరభయం. మానసిక అశాంతి.

కన్య.... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. విలువైన వస్తువులు జాగ్రత్త.

తుల.... కష్టానికి తగ్గ  ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. రాబడి పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

వృశ్చికం... చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గుతుంది.బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు నిరుత్సాహం.

ధనుస్సు... కార్యక్రమాలలో ఆటంకాలు. వథా ఖర్చులు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.

మకరం... రాబడి ఆశాజనకంగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.పాతబాకీలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం... ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

మీనం... కార్య్రక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దేవాలయదర్శనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement