ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 20-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి

Feb 20 2026 3:59 AM | Updated on Feb 20 2026 4:28 AM

Rasi Phalalu: Daily Horoscope On 20-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.తదియ ప.3.38 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.9.20 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.7.19 నుండి 8.53 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: సా.4.31 నుండి 6.06 వరకు.

సూర్యోదయం : 6.29
సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... కొన్ని కార్యాలు వాయిదా. సన్నిహితులతో వివాదాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు.

వృషభం... చర్చలు సఫలం.  ఆకస్మిక ధనలబ్ధి. విలువైన సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

మిథునం...... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యక్రమాలు కొన్ని  సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వృత్తులు, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం.... ప్రయాణాల్లో ఆటంకాలు కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు కొన్ని సమస్యలు.

సింహం.... ఆస్తివివాదాలు.  చేపట్టిన కార్యాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని చికాకులు. శారీరక రుగ్మతలు.

కన్య.... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపారాల్లో పురోగతి. దైవదర్శనాలు. వత్తులు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల... బాకీలు వసూలవుతాయి. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.వివాహయత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం... పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యం సహకరించదు. రుణయత్నాలు. ఉద్యోగాల్లో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కళాకారులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. శారీరక రుగ్మతలు.

ధనుస్సు... కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులు.

మకరం.... కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి.  వృత్తులు, వ్యాపారాలు మరింత రాణిస్తాయి. వస్తులాభాలు.

కుంభం..... కుటుంబంలో చికాకులు. ధనవ్యయం.  దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. బంధువుల కలయిక. శారీరక రుగ్మతలు. పారిశ్రామికవర్గాలకు శ్రమ తప్పకపోవచ్చు.

మీనం..... కార్యక్రమాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తులు, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement