గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.చతుర్దశి సా.5.31 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: శ్రవణం రా.9.04 వరకు, తదుపరి ధనిష్ఠ్ఠ, వర్జ్యం: రా.1.12 నుండి 2.51 వరకు, దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.20 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.35 వరకు,అమృత ఘడియలు: ఉ.10.01 నుండి 11.41 వరకు.
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం : 5.56
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దూరపు బంధువుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం.... వ్యవహారాలలో గందర గోళం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు.
మిథునం.... శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి..
కర్కాటకం...... పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. విద్యార్థులకు నూతన అవకాశాలు.
సింహం..... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య...... ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు కొంత గందరగోళం.
తుల..... చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం.
వృశ్చికం.... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగప్రాప్తి.
ధనుస్సు... వ్యవహారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహపరుస్తాయి. విద్యావకాశాలు చేజారతాయి.
మకరం.... చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. దైవదర్శనాలు.
కుంభం.... పనులలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. బంధుమిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తన డకన సాగుతాయి. నిరుద్యోగులకు కొద్దిపాటి ఒత్తిళ్లు.
మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.


