ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు | Today Telugu Horoscope On February 12th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఉద్యోగులకు పదోన్నతులు

Feb 12 2026 3:48 AM | Updated on Feb 12 2026 9:42 AM

Rasi Phalalu: Daily Horoscope On 12-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.దశమి ప.11.48 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: జ్యేష్ఠ ప.1.29 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.10.17 నుండి 12.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.36 వరకు, అమృత ఘడియలు: లేవు.

సూర్యోదయం : 6.33
సూర్యాస్తమయం :  5.56
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం..  సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం... రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

మిథునం... ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం..... ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

సింహం..... ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులు, సోదరీలతో విభేదాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కన్య... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు.అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

తుల.... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి.  పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం..  కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. యత్నకార్యసిద్ధి. దైవచింతన. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు.... ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

మకరం....... ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement