గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.నవమి ప.9.38 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: అనూరాధ ప.10.52 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.5.04 నుండి 6.50 వరకు, దుర్ముహూర్తం: çప.11.52 నుండి 12.36 వరకు, అమృత ఘడియలు: రా.3.40 నుండి 5.28 వరకు.
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.55
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
వృషభం... పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులకు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మిథునం.. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం..... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
సింహం...... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య.... ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
తుల.... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. మిత్రులతో మాటపట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం.... నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కార్యజయం. ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు.
ధనుస్సు... ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మకరం..... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. ఉద్యోగయత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
కుంభం... కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మీనం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.


