శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.అష్టమి ఉ.7.30 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ ఉ.8.16 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.12.42 నుండి 2.28 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.48 వరకు, అమృత ఘడియలు: రా.11.20 నుండి 1.04 వరకు.
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.54
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. కొత్త విద్యావకాశాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కర్కాటకం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కన్య: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
తుల: పరిచయాలు పెరుగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.
ధనుస్సు: అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులు నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు పనిభారం నుంచి బయటపడతారు.


