గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.సప్తమి తె.5.34 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి అష్టమి, నక్షత్రం: స్వాతి తె.5.53 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి విశాఖ, వర్జ్యం: ఉ.9.53 నుండి 11.35 వరకు, దుర్ముహూర్తం: సా.4.24 నుండి 5.09 వరకు, అమృత ఘడియలు: రా.8.18 నుండి 10.01 వరకు.
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.54
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
వృషభం... నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
మిథునం... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం..... వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు.
సింహం... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
కన్య..... వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు.
తుల.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు.
వృశ్చికం.... రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .
ధనుస్సు.... బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మకరం... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులలో విజయం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కుంభం.. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్య సూచనలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
మీనం.. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.


