ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 09-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి

Feb 9 2026 4:04 AM | Updated on Feb 9 2026 4:13 AM

Rasi Phalalu: Daily Horoscope On 09-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.అష్టమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: విశాఖ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.11.57 నుండి 1.43 వరకు, దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.20 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.35 వరకు, అమృత ఘడియలు: రా.10.35 నుండి 12.20 వరకు

సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం :  5.54
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సమర్థతను చాటుకుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కళాకారులకు నూతనోత్సాహం.

వృషభం..... ప్రముఖ వ్యక్తుల సహాయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం.

మిథునం.... ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. శ్రమ మరింత పెరుగుతుంది..

కర్కాటకం.. కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో అవరోధాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం.

సింహం.... మిత్రుల నుంచి సహాయం. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విందువినోదాలు. విద్యార్థులకు శుభవర్తమానాలు.

కన్య.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. ప్రయాణాలలో మార్పులు.

తుల... ఆకస్మిక ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఆలయాల దర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం.

వృశ్చికం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగులకు శ్రమకు ఫలితం కనిపించదు.

ధనుస్సు... రహస్య విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మకరం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కుంభం... బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు. కళాకారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. శ్రమాధిక్యం.

మీనం.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. కొన్ని పనుల్లో ఆటంకాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement