గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.ఏకాదశి ప.1.47 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: మూల ప.3.55 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.2.09 నుండి 3.54 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: ఉ.8.50 నుండి 10.34 వరకు, శుక్రమూఢమి ఆఖరు, మతత్రయ ఏకాదశి.
సూర్యోదయం : 6.33
సూర్యాస్తమయం : 5.56
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృషభం.... పనులు ముందుకు సాగక నిరాశచెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం.... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం అందుతుంది. భూవివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
కర్కాటకం.... రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
సింహం.... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు విరమిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.
కన్య.... వ్యవహారాలలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
తుల... అనుకున్న పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.
వృశ్చికం.. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
దనుస్సు... ఆహ్వానాలు అందుతాయి. వ్యతిరేక పరిస్థితుల్లో మార్పులు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం... మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కుంభం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
మీనం... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.


