ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 15-02-26 To 21-02-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Feb 15 2026 12:04 AM | Updated on Feb 15 2026 12:04 AM

Weekly Horoscope Telugu 15-02-26 To 21-02-2026

మేషం...
అనుకూల పరిస్థితుల మధ్య ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.  ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగుపడుతుంది. ఆస్తి విషయాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, నేరేడురంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృషభం.....
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  నిరుద్యోగుల యత్నాలు సఫలీకృతమవుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మిథునం....
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు సైతం తీరుస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్య ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు.  లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శారీరక రుగ్మతలు. ఎరుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం...
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం. వాహనాలు, భూములు సమకూరతాయి. ఉద్యోగయత్నాలలో కదలికలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో  అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. శ్రమాధిక్యం. నీలం, పసుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య...
ఆర్థిక పరిస్థితి కొంతమెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తుల వ్యవహారంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. కళారంగం ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

తుల...
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.  గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. నేరేడు, ఎరుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం...
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. సోదరులు, మిత్రులతో మనస్పర్ధలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. చిన్ననాటివిషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, లేత నీలం రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు...
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంటాబయటా అనుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అ«ధిగమిస్తారు. కళారంగం వారికి అవకాశాలు  పెరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత నీలం రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం..
కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సందేశాలు అందుతాయి. బంధువులతో మంచీచెడ్డా విచారిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ప్రముఖులు పరిచయం కాగలరు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి పొందుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. శ్రమా«ధిక్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం...
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరుగవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం....
అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపార లావాదేవీలు మొదట్లో నిరాశ పర్చినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఊహించిన మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement