ఈ రాశి వారికి నూతన వ్యక్తులు పరిచయం.. వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 14-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతన వ్యక్తులు పరిచయం.. వస్తులాభాలు

Feb 14 2026 12:51 AM | Updated on Feb 14 2026 12:51 AM

Rasi Phalalu: Daily Horoscope On 14-02-2026 In Telugu

   గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.ద్వాదశి ప.3.28 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: పూర్వాషాఢ సా.6.04 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.2.39 నుండి 4.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.07 వరకు,అమృత ఘడియలు: ప.12.44 నుండి 2.21 వరకు.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం     :  5.57
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: మిత్రులు, కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

వృషభం:  మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటంకాలు.

మిథునం: చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కర్కాటకం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. కొత్త విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: కష్టానికి ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: భూవివాదాలు నెలకొంటాయి. సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తుల: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. కొత్త సంస్థల స్థాపన. విందువినోదాలు. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికం: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పాత మిత్రుల కలయిక. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు

కుంభం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement