గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.త్రయోదశి సా.4.39 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.7.43 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.11.55 నుండి 1.34 వరకు, దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.11 వరకు, అమృత ఘడియలు: ప.12.51 నుండి 2.34 వరకు; రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు, యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు, సూర్యోదయం: 6.32, సూర్యాస్తమయం: 5.57.
మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయ దర్శనాలు. విద్యావకాశాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
వృషభం: మిత్రులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. బంధువుల కలయిక. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.
సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: పనులు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాల్లో మార్పులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మకరం: పలుకుబడి పెరుగుతుంది. కార్యజయం. బంధువుల నుంచి సహాయం. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
కుంభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. దైవచింతన. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.
మీనం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. కార్యజయం. కొన్ని వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.


