గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.విదియ సా.4.49 వరకు తదుపరి తదియ, నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.58 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.36 వరకు, అమృత ఘడియలు: ప.1.54 నుండి 3.27 వరకు.
సూర్యోదయం : 6.29
సూర్యాస్తమయం : 5.58
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.... సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి.కార్యజయం. వృత్తులు, వ్యాపారాలలో మరింత సానుకూలత.
వృషభం..... కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో ప్రత్యేకత చాటుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
మిథునం.... దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తులు, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.
కర్కాటకం.... స్నేహితుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు. అనుకున్న కార్యాలలో జాప్యం. దూరపు బంధువుల కలయిక. ఆధ్యాత్మిక చింతన.
సింహం....... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తులు, వ్యాపారాలలో మరింత అనుకూలత.
కన్య.... వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు.
తుల.... పనులు కొన్ని నెమ్మదిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు ఉంటాయి.
వృశ్చికం.... కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. వ్యాపారులకు సామాన్యం. ప్రయాణాలు వాయిదా. కళాకారులకు నిరుత్సాహం.
ధనుస్సు..... చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. బాకీలు వసూలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మకరం...... ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు.ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం...... కొత్త ఉద్యోగావకాశాలు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల్లో పాల్గొంటారు.వృత్తులు, వ్యాపారాలు సామాన్యం.
మీనం... కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆదాయానికి మించి ఖర్చులు. ఉద్యోగాల్లో ఒత్తిడులు. వ్యయప్రయాసలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు.


