గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.చవితి ప.2.04 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: రేవతి రా.8.21 వరకుతదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.50 నుండి 10.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.07 వరకు,అమృత ఘడియలు: సా.5.56 నుండి 7.30 వరకు.
సూర్యోదయం : 6.29
సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: కార్యక్రమాలలో కొంత జాప్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. కళాకారులకు చికాకులు.
వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతప్తికరంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విలువైన వస్తువులు సేకరిస్తారు. దేవాలయాల సందర్శనం. ఉద్యోగయోగం. వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
కర్కాటకం: వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. శారీరక రుగ్మతలు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి.
సింహం: రాబడికి మించి ఖర్చులు.. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కళాకారులకు కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు.
కన్య: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.
తుల: ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు.. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం.కళాకారుల యత్నాలు సఫలం.
వృశ్చికం: కొన్ని కార్యక్రమాలలో జాప్యం. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.
మకరం: ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. కీలక నిర్ణయాలు. శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తి లాభం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కుంభం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప శారీరక రుగ్మతలు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.
మీనం: కార్యక్రమాలు అనుకున్న విధంగాసాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.


