ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 22-02-26 To 28-02-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Feb 22 2026 4:32 AM | Updated on Feb 22 2026 4:48 AM

Weekly Horoscope Telugu 22-02-26 To 28-02-2026

మేషం...
శ్రమపడినా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వేడుకలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, లేత నీలం రంగులు, హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం...
వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు, అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మిథునం...
పనులు సజావుగా పూర్తి కాగలవు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మనస్సాక్షికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చే వారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు, గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం...
ఆత్మీయులు మరింత చేయూతనందిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. పెండింగ్‌ వ్యవహారాలు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం చివరిలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం....
రాబడి ఆశాజకనంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.  గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య....
అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో కొంత శ్రమ పడాల్సివస్తుంది. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మీకు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్‌ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారుల యత్నాలలో కదలికలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు రంగులు,  శివాష్టకం పఠించండి.

తుల...
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు, దేవీస్తుతి మంచిది.

వృశ్చికం...
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు. బంధువులు లేదా స్నేహితుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు, రియల్‌ ఎస్టేట్‌ల వారికి శుభవార్తలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, ఆంజనేయస్వామి దండకం పఠించండి.

ధనుస్సు...
రాబడి ఆశాజనకమే. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప వివాదాలు. లేత ఎరుపు, నేరేడు రంగులు, దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం...
కార్యజయం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం...
కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమిస్తారు. బంధువులు, మిత్రులతో  ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కార్యక్రమాలు కొన్ని సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, తల్లి తరఫు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో వృ«థా ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు,  ఆదిత్య హృదయం పఠించండి.

మీనం....
అనుకున్న పనుల్లో  ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు. విష్ణుధ్యానం చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement