ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. శుభవార్తలు వింటారు | Rasi Phalalu: Daily Horoscope On 25-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. శుభవార్తలు వింటారు

Feb 25 2026 3:50 AM | Updated on Feb 25 2026 8:31 AM

Rasi Phalalu: Daily Horoscope On 25-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.నవమి రా.3.00 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: రోహిణి ప.2.17 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ఉ.6.50 నుండి 8.19 వరకు, తదుపరి రా.7.30 నుండి 9.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.52 నుండి 12.36 వరకు, అమృత ఘడియలు: ఉ.11.10 నుండి 12.41 వరకు, తదుపరి తె.4.22 నుండి 5.51 వరకు (తెల్లవారితే గురువారం).

సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం :  6.01
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం...  పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

వృషభం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం..... శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

సింహం..... అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య.... కొన్ని కార్యక్రమాలు వాయిదా  వేస్తారు. బంధువులతో తగాదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

తుల.... ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

వృశ్చికం... రుణాలు తీరతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

ధనుస్సు... శుభవార్తలు వింటారు. పనులు చకచకా సాగుతాయి.  ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త పరిచయాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మకరం... ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం... కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మీనం.... కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement