ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ఆస్తిలాభం పొందుతారు | Rasi Phalalu: Daily Horoscope On 27-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ఆస్తిలాభం పొందుతారు

Feb 27 2026 12:06 AM | Updated on Feb 27 2026 12:06 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.ఏకాదశి రా.10.31 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆరుద్ర ప.11.06 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.26 నుండి 11.57 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: లేవు, సర్వ ఏకాదశి.

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం     :  6.01
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగావకాశాలు. కీలక నిర్ణయాలు.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

సింహం: పనుల్లో ప్రతిబంధకాలు..పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలోకొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

తుల: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. రుణయత్నాలు.పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం. భూ, వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం: రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement