మేషం..
ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు, ఆత్మీయులు వెన్నంటి ఉండి సహాయపడతారు. విద్యార్థులకు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు నూతన పదవీయోగం. పసుపు, గులాబీ రంగులు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒత్తిడులు. వారాహీ స్తోత్రం పఠించండి.
వృషభం..
చేపట్టిన పనులు అనూహ్యమైన రీతిలో పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలకు అందరి ఆమోదం లభిస్తుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. రావల్సిన బాకీలు వసూలవుతాయి. శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పురోభివృద్ధి ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, తెలుపు. వారం మధ్యలో అనారోగ్యం. మానసిక ఒత్తిడులు. దూర ప్రయాణాలు. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.
మిథునం...
ముఖ్యమైన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి విషయంలో సమస్యలు వాహనాలు, ఇల్లు కొనుగోలు యత్నాలలో అవాంతరాలు. ధార్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసభ్యుల వైఖరి కొంత గందరగోళం కలిగిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో చిక్కులు రాగల సూచనలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. . పారిశ్రామికవేత్తలు, కళాకారులు, అవకాశాలు చేజారవచ్చు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. వారం మధ్యలో ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. «నూతన పరిచయాలు. శ్రీవేంకటేశ్వరుని పూజించండి.
కర్కాటకం...
ముఖ్యమైన పనుల్లో విజయం. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.. ఆస్తి వివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. క్రీడాకారులు, కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. నీలం, తెలుపు రంగులు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో కలహాలు. ఆంజనేయ దండకం పఠించండి.
సింహం.....
ఆలోచనలు కలసివస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవానికి లోటు లేకుండా గడుస్తుంది. నిరుద్యోగుల జీవితాశయం నెరవేరే సమయం. రావలసిన సొమ్ము కొంత వరకూ అందుతుంది. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలను స్వాగతిస్తారు. వ్యాపారాలను కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆశ్చర్యకరమైన సమాచారం రావచ్చు. నీలం, ఆకుపచ్చ రంగులు. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా సమస్యలు. మానసిక ఆందోళన. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య.....
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు రాగలవు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. కళాకారులు, పరిశోధకులకు ఊహించని అవకాశాలు దక్కే సూచనలు. ఎరుపు,గులాబీ రంగులు. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు రావచ్చు. శివస్తోత్రాలు పఠించండి.
తుల....
వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ముఖ్యమైన పనులుు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం గతం కంటే మెరుగుపడి ఉత్సాహంతో గడుపుతారు. కుటుంబసభ్యులు, పలుకుబడి మరింత పెరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవర్తమానాలు. గులాబీ, చాక్లెట్ రంగంలు. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.. ఆప్తులతో వివాదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం ...
చేపట్టిన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం మరింత మెరుగుపడుతుంది. వాహనయోగం. పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు. ప్రారంభంలో నిరాశ పర్చినా క్రమేపీ అనుకూలిస్తాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. వారం ప్రారంభంలో ఖర్చులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు....
ముఖ్యమైన పనులను సజావుగానే పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయ దర్శనాలు. దైవరాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు. గులాబీ, పసుపు రంగులు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.
మకరం....
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, స్నేహితులతో వివాదాలు పరిష్కార మవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవర్తమానాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.
కుంభం....
కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఎటువంటి బాధ్యతలైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలు సజావుగా సాగి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. నలుపు, పసుపు రంగులు. వారం చివరిలో దూరప్రయాణాలు. బంధువులతో మనస్పర్ధలు. ఒత్తిడులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మీనం...
ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. అందరిలోనూ మీ ప్రతిభను నిరూపించుకుంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆదాయం అనుకోని విధంగా పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు పొందుతారు. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. కళాకారులు, క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. నీలం, తెలుపు రంగులు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీలక్ష్మీనృసింహ కరావలంబం పఠించండి.


