ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 15-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు

Mar 15 2026 3:18 AM | Updated on Mar 15 2026 3:18 AM

Rasi Phalalu: Daily Horoscope On 15-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.7.15 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: శ్రవణం తె.4.25 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ఉ.7.14 నుండి 8.55 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.18 వరకు, అమృత ఘడియలు: సా.5.23 నుండి 7.05 వరకు. మతత్రయ ఏకాదశి.

సూర్యోదయం : 6.13
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.. చిన్ననాటి మిత్రులను కలుస్తారు.  ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

వృషభం... కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండవచ్చు.

మిథునం..... ప్రయాణాలలో అవాంతరాలు.. పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. విందువినోదాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. .

సింహం.... బంధువులతో వివాదాలు తీరతాయి. విందువినోదాలు. ఆస్తిలాభం సూచనలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. దైవచింతన.

కన్య..... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో మార్పులు.

తుల.... మిత్రులతో  తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యసమస్యలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఒత్తిడులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

వృశ్చికం.... నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. పనుల్లో పురోగతి. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు.. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

ధనుస్సు.... పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటుంది. ,ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం..... శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు.

కుంభం... శ్రమాధిక్యం. కొన్ని పనులలో అవాంతరాలు. బంధువులతో విభేదాలు.  ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిభారం.

మీనం.... నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి,ధనలాభాలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement