Corporate
-
భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్‌లో తేడా!
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ మహిళ శారికా యాదవ్.. షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె భారతదేశం vs అమెరికా కార్పొరేట్ పని సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను వివరించింది.అమెరికాలో పనిచేసే ఉద్యోగులు తమ పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం, డాక్టర్ అపాయింట్మెంట్లు వంటి వ్యక్తిగత పనుల కోసం.. ముందుగానే తమ ఆఫీస్ క్యాలెండర్లో సమయం బ్లాక్ చేసుకుంటారు. ఆ సమయంలో ఇతరులు మీటింగ్స్ పెట్టకుండా గౌరవిస్తారు. ఒకవేళ మీటింగ్ అవసరం వచ్చినా, ముందుగా ఉద్యోగిని అడిగి సమయం ఖరారు చేస్తారు. అక్కడ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం కంపెనీల పని సంస్కృతిలో భాగంగా మారిందని శారికా యాదవ్ పేర్కొన్నారు.భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడ సెలవు తీసుకోవాలంటే.. ఉద్యోగులు మేనేజర్లకు పూర్తి వివరణ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనేక కంపెనీల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలా మంది తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. కొందరు అమెరికా వర్క్ కల్చర్‌లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంగీకరించగా, మరికొందరు ప్రతి దేశానికి ప్రత్యేకమైన పని విధానం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు భారతదేశంలో ఉద్యోగులపై ఉండే ఒత్తిడి కారణంగా చాలామంది స్వంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Sarika Yadav | Indian Blogger in America (@sarika_in_america) -
యువత కోసం.. సరికొత్త బీమా పాలసీ
నేటి తరం యువత మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్టివ్ యువ’ పేరుతో సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాకుండా, పాలసీదారులు నిత్యం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.ప్రతిరోజూ కనీసం 10 వేల అడుగులు నడవడం లేదా ఒకే వ్యాయామ సెషన్లో 300 కేలరీలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు రివార్డులు పొందవచ్చు. మెరుగైన ‘హెల్తీ హార్ట్ స్కోర్’ కొనసాగించిన వారు తమ వార్షిక ప్రీమియంలో 100 శాతం వరకు తిరిగి పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. బీమాను కేవలం అత్యవసర వైద్య సాయంలా కాకుండా, రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చేలా ‘యాక్టివ్ యువ’ను రూపొందించినట్లు కంపెనీ సీఈవో మయాంక్ బత్వాల్ తెలిపారు. -
భారత్ వృద్ధి.. పెట్టుబడి విధానాల్లో మార్పు!
ఆర్థిక సంస్కరణల అనంతరం దేశీయంగా చాలా కాలం పాటు ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్లు వృద్ధి చెందినప్పటికీ, అవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ముందుకు సాగలేదు. ఆర్థిక విస్తరణపై ప్రభుత్వ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ రంగానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. క్యాపిటల్ మార్కెట్లు అప్పుడప్పుడు మాత్రమే తమ ఉనికిని చాటుకునేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది.ఆర్థిక ప్రగతి, క్యాపిటల్ మార్కెట్లు వేర్వేరుగా కాకుండా ఒకదానికొకటి దన్నుగా ఉండే ఏకీకృత వ్యవస్థగా భారత్ ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ మార్పు తాత్కాలికమైనది కాదు..నిర్మాణాత్మకమైనది. భారత్ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలనుకునే మదుపర్లకు ఇది ఎంతో కీలకంగా ఉండనుంది.పెట్టుబడి విధానాల్లో నిర్మాణాత్మక మార్పుభారతీయులు పొదుపు చేయడంలో ముందుంటారు. అయితే, చారిత్రకంగా మన దేశంలోని గృహ పొదుపు మొత్తాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారం లేదా బ్యాంక్ డిపాజిట్ల వంటి భౌతిక ఆస్తులలోకే వెళ్లేవి. ఇవి వ్యక్తిగతంగా భద్రతను ఇచ్చినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు అందవలసిన దీర్ఘకాలిక మూలధన లభ్యత పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడది మారుతోంది.గృహాల పొదుపు మొత్తాలు క్రమంగా ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల వంటి మార్కెట్ ఆధారిత సాధనాల వైపు మళ్లుతున్నాయి. మార్చి 2026 నాటికి, దేశీయంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) పరిమాణం రూ. 79.5 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఈ రంగం రెండంకెల వార్షిక వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది ఆషామాషీ మార్పు కాదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజల భాగస్వామ్యం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి.డిజిటలైజేషన్ దన్నుడిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దన్నుతోనే క్యాపిటల్ మార్కెట్లు అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమవుతోంది. 2026 మార్చి ఆఖరు నాటికి 144 కోట్లకు పైగా ఆధార్ ఐడీలు, 57.7 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు, 125 కోట్ల మంది మొబైల్ యూజర్లు, రోజువారీ రూ. 95,000 కోట్లకు పైగా విలువ చేసే లావాదేవీల పరిమాణంతో యూపీఐ వ్యవస్థలాంటివి భారత డిజిటల్ విప్లవానికి పునాది వేశాయి.ఆధార్ ఆధారిత ఈకేవైసీ, యూపీఐ చెల్లింపులు, కాగితరహిత పద్ధతుల వల్ల పెట్టుబడి పెట్టడానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయాయి. సామాన్యుల భాగస్వామ్యం పెరగడమే కాకుండా, మధ్యవర్తులపరమైన ఖర్చులు తగ్గి మార్కెట్లు మరింత అందుబాటులోకి వచ్చాయి.క్యాపిటల్ మార్కెట్ సంస్థల ప్రాముఖ్యతఈ మార్పులో క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థ, అంటే, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, రిజిస్ట్రార్లు, బ్రోకర్లు, వెల్త్ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలు కేవలం మార్కెట్‌ను అందుబాటులోకి తేవడమే కాకుండా, పారదర్శకతను పెంపొందించడానికి, నిరంతర వృద్ధికి కూడా దోహదపడుతున్నాయి. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లలో కనిపిస్తున్న వృద్ధికి, రిటైల్ మదుపర్ల భాగస్వామ్యానికి ఇవే ప్రధాన ఆధారం. ఇలాంటి సంస్థల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మదుపర్లు ప్రయోజనం పొందవచ్చు.క్యాపిటల్ మార్కెట్లలో భాగస్వామ్యం ఉండే సంస్థలతో రూపొందిన ఇండెక్స్‌లలో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు ఉపయోగపడే ఒకానొక మార్గం. ట్రేడింగ్ పరిమాణం పెరగడం వల్ల లాభపడే ఎక్సేంజీలు, కొత్త డీమ్యాట్ ఖాతాల వల్ల లబ్ధి పొందే డిపాజిటరీలు, నిర్వహణలోని ఆస్తుల పెరుగుదలతో ఆదాయం పొందే అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు, వ్యవస్థకు అడ్మినిస్ట్రేషన్‌పరంగా కీలక వెన్నెముకగా వ్యవహరించే సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలు ఈ ఇండెక్స్‌లలో ఉంటాయి. మార్కెట్ భాగస్వామ్యం పెరిగే కొద్దీ ఈ వ్యాపారాలు కూడా సహజంగానే వృద్ధి చెందుతాయి.మదుపర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలు..ఆదాయాలు పెరుగుతూ, పొదుపు, పెట్టుబడులు పెరిగే కొద్దీ దేశీ క్యాపిటల్ మార్కెట్లు, ఎకానమీతో పాటే మరింతగా వృద్ధి చెందుతాయి. ప్రైవేట్ రంగానికి, మౌలిక సదుపాయాలకు, ఆవిష్కరణలకు ఇవి నిధులు సమకూరుస్తాయి. క్యాపిటల్ మార్కెట్ ఆధారిత రంగాల్లో పెట్టుబడి పెట్టడం అంటే భారత భవిష్యత్తు వృద్ధిలో భాగస్వాములు కావడమే. దీర్ఘకాలికంగా ఈ రంగం ఇచ్చే ఫలితాలను అందుకోవడానికి ’ప్యాసివ్ స్ట్రాటజీ’ వంటి విధానాలను మదుపర్లు పరిశీలించవచ్చు. -
చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
భారతదేశం ఎదుగుదలకు తయారీ రంగం చాలా కీలకమని కేంద్రమంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తయారీ రంగ వృద్ధి గురించి బిల్డింగ్ ఎనర్జీ సూపర్-ఇంటెలిజెన్స్ 'శుభమ్ మిశ్రా' ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.భారతదేశలో తయారీ రంగ అభివృద్ధిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి పెద్ద కంపెనీల రూపంలో కాకుండా.. చిన్న భాగాల తయారీ సంస్థల్లో, సరఫరా వ్యవస్థల్లో జరుగుతోంది. ఉదాహరణకు.. 2014లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు దీని విలువ 115 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇది భారత పరిశ్రమల వేగవంతమైన ఎదుగుదలకు నిదర్శనం అని శుభమ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.ఐఫోన్ తయారీలో భారత్యాపిల్ కంపెనీ సరఫరా వ్యవస్థలో.. భారతదేశం కీలక పాత్ర పోషించడం కూడా ఒక పెద్ద మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఐఫోన్ తయారీలో భారతదేశం పాత్ర చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో గణనీయమైన శాతం భారత్‌లోనే తయారవుతోంది. ఇది భారతీయ పరిశ్రమల నైపుణ్యం పెరుగుతోందనడానికి ఒక ఉదాహరణ.మిశ్రా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అసలు అభివృద్ధి చిన్న పరిశ్రమల పనితీరులో ఉంది. హోసూర్ వంటి ప్రాంతాల్లో చిన్న సంస్థలు అతి సూక్ష్మ ప్రమాణాలతో భాగాలను తయారు చేయడం నేర్చుకుంటున్నాయి. ఇలాంటి నైపుణ్యాలే ఒక దేశాన్ని పరిశ్రమల శక్తిగా మార్చుతాయి.చైనాలా భారత్భారతదేశాన్ని మిశ్రా ప్రారంభ దశలో ఉన్న చైనాతో పోల్చారు. చైనా ఒక్కసారిగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారలేదు. 2003 నుంచి 2018 మధ్య నెమ్మదిగా, క్రమంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో కూడా ప్రపంచం ''వాళ్లు కేవలం అసెంబ్లీ పని చేస్తున్నారు'' అని భావించింది. కానీ అదే చిన్న చిన్న పురోగతులు తరువాత చైనాను ప్రపంచ తయారీ శక్తిగా నిలబెట్టాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి దశలో ఉందని ఆయన సూచించారు.Very well said, Shubham. The real strength of manufacturing is never glamorous.It grows quietly in workshops, factory floors and industrial sheds, long before the world notices it in economic rankings or headlines.India’s manufacturing future won’t be built only by giant… https://t.co/2BblFgxVy6— anand mahindra (@anandmahindra) May 15, 2026దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. దేశ ఆర్థికాభివృద్ధి పెరగాలంటే, కేవలం కొన్ని పెద్ద కంపెనీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), ఫ్యాక్టరీలు, వర్క్‌షాప్‌లు, సరఫరా సంస్థల కలిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నిజమైన అభివృద్ధి..అనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. తయారీ రంగం బయటకు కనిపించేంత గొప్పగా ఉండదు. కానీ నిజమైన అభివృద్ధి అనేది ఫ్యాక్టరీలలో, యంత్రాల మధ్య, పరిశ్రమల షెడ్లలో జరుగుతుంది. చిన్న పరిశ్రమలు తమ పనిలో నాణ్యతను పెంచుకుంటూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటున్నాయి. ఇవే భవిష్యత్తులో భారతదేశాన్ని బలమైన దేశంగా నిలబెడతాయి.దేశం ఎదగాలంటే..దేశం ఎదగాలంటే.. ముఖ్యంగా MSMEsకు ప్రభుత్వ మద్దతు అవసరమని చెప్పారు. మంచి రహదారులు, ఇండస్ట్రియల్ పార్కులు, త్వరితగతిన అనుమతులు, తక్కువ నియంత్రణ సమస్యలు ఉంటే పరిశ్రమలు వేగంగా ఎదుగుతాయి. పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వడం సరిపోదు. మధ్య తరహా సంస్థలకు సులభమైన వ్యాపార వాతావరణం కల్పించడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. -
UIDAI సూపర్ అప్డేట్.. ఇక mAadhaar బంద్!
mAadhaar యాప్ త్వరలో నిలిచిపోతుందని.. యూజర్లు కొత్తగా ప్రారంభమైన ఆధార్ యాప్ వైపు మారాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొత్తగా అందుబాటులోకి రానున్న.. ఆధార్ యాప్ క్యూఆర్ బేస్డ్ ఆధార్ షేరింగ్, ఫేస్ ఆథెంటికేషన్, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ లాక్ కంట్రోల్, మెరుగైన ప్రైవసీ ఎంపికలను కలిగి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దీనిని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ సూచించింది.యాప్ డౌన్లోడ్ - సెట్అప్ విధానం➤యూజర్లు కొత్త ఆధార్ యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యూఐడీఏఐ తన అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా డౌన్లోడ్ లింక్ అందజేస్తోంది.➤యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, యూజర్ తమ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబరును ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫేస్ ఆథెంటికేషన్ కూడా అవసరం అవుతుంది.➤లాగిన్ పూర్తయిన తరువాత.. యూజర్ సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేయాలి, లేదా ఫింగర్‌ప్రింట్/ఫేస్ అన్‌లాక్ ద్వారా యాప్‌ను సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. తరువాత, ఆధార్ ప్రొఫైల్‌ను మాన్యువల్‌గా యాప్‌లో ఎంటర్ చేసి మరో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.➤ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబ సభ్యులు కూడా వేర్వేరు ఆధార్ ప్రొఫైల్స్.. యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒకే డివైస్‌లో అనేక ప్రొఫైల్స్ సపోర్ట్ అవుతాయని యూఐడీఏఐ వెల్లడించింది. ఇది కుటుంబాలకు ఆధార్ సేవలను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.➤ప్రతి ఆధార్ వివరాలు సరిగ్గా పనిచేస్తున్నాయని ధృవీకరించిన తర్వాత, యూజర్లు పాత mAadhaar యాప్ తొలగించవచ్చు.యాప్‌లో ముఖ్యమైన మార్పులుకొత్త ఆధార్ యాప్ ముఖ్యంగా ప్రైవసీ అండ్ డిజిటల్ వెరిఫికేషన్ మీద దృష్టి పెట్టింది. ఆధార్ కార్డు ఫోటోకాపీలు పంచుకునే అవసరం లేకుండా, యూజర్లు క్యూఆర్ ఆధారిత సురక్షిత పద్ధతిలో గుర్తింపును ధృవీకరించవచ్చు.ప్రయోజనాలుఆధార్ కార్డు ఫోటోకాపీలు ఇవ్వకుండా గుర్తింపు ధృవీకరణ.ఆధార్ సమాచారం యాక్సెస్, షేరింగ్ పై యూజర్‌కు పూర్తి నియంత్రణ.యాప్ ద్వారా నేరుగా ఆధార్ సేవలను నిర్వహించవచ్చు.అదనపు గుర్తింపు ధృవీకరణకు ఫేస్ ఆథెంటికేషన్ సపోర్ట్.ఆధార్ ఆథెంటికేషన్‌ను స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా సురక్షితంగా నియంత్రించుకోవడం.The #mAadhaar App is retiring soon. Now experience a smarter, faster, and more secure digital journey with the new #AadhaarApp. From secure QR-based #Aadhaar sharing to enhanced privacy controls and seamless access to Aadhaar services — the new app is designed to make your… pic.twitter.com/snfeUx4Rgr— Aadhaar (@UIDAI) May 15, 2026 -
సమస్యగా మారిన వర్క్ ఫ్రమ్ హోమ్!
ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం చాలామంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తూ సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం కొంతమందికి ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తోంది. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.ఆ ఇంజనీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది తనకు మొదటి వర్క్ ఫ్రం హోమ్ అనుభవం. తాను సహజంగా చాలా యాక్టివ్ పర్సన్, అయితే.. ఇంట్లో ఒంటరిగా పని చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతున్నట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే బద్ధకంగా, అలసటగా అనిపిస్తోందని తెలిపారు. దీని కారణంగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఉత్సాహం తగ్గిపోయిందని వివరించారు.అతను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి పనిచేసే గది. ఆ గదిలో కిటికీలు లేవని, పొరుగింటి గోడ ఉండటం వల్ల సహజ కాంతి అసలు లోపలికి రాదని పేర్కొన్నారు. రోజంతా సూర్యకాంతి లేకుండా గదిలో ఉండటం వల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సూర్యకాంతి లేకపోవడం వల్ల విటమిన్ డీ లోపం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చని చాలామంది వైద్యులు చెబుతుంటారు.అంతేకాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ తన లైఫ్ స్టైల్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. పని స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే నిద్ర లేవడం, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కువగా AI టూల్స్ ఉపయోగించి కోడింగ్ చేయడం వల్ల శారీరక కదలికలు తగ్గిపోయాయని చెప్పారు. ముందులా తీవ్రంగా ఆలోచిస్తూ.. కోడింగ్ చేసే అనుభూతి కూడా లేకపోవడంతో పని పట్ల ఆసక్తి తగ్గుతోందని తెలిపారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ముందుగా విటమిన్ డీ, ఐరన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోమని సూచించారు. మరికొందరు గదిలో సూర్యకాంతి, తాజా గాలి లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాయామం చేయడం, జిమ్‌కు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే కిటికీలు ఉన్న గదిలో పని చేయడం మంచిదని సలహా ఇచ్చారు.కొంతమంది నెటిజన్లు “వర్క్ ఫ్రం హోమ్ నిజానికి శక్తిని ఆదా చేస్తుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవడం ఒక పెద్ద ప్రయోజనం. కానీ సరైన జీవనశైలి లేకపోతే అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని పేర్కొన్నారు. మరికొందరు తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
ఆరేళ్లలో తొలిసారిగా లాభాల్లోకి!
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా దాదాపు ఆరేళ్లలో తొలిసారిగా లాభాల్లోకి మళ్లింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 51,970 లాభం ప్రకటించింది. చెల్లించాల్సిన ఏజీఆర్ బాకీలకు సంబంధించి కేంద్రం నుంచి వెసులుబాటు లభించడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వొడాఫోన్ ఐడియా రూ. 7,167 కోట్ల నష్టం నమోదు చేసింది. క్యూ4లో ఆదాయం 3 శాతం పెరిగి రూ. 11,229 కోట్ల నుంచి రూ. 11,332 కోట్లకు చేరింది. ఏజీఆర్‌పరమైన ఊరటని పరిగణనలోకి తీసుకోకుంటే.. నష్టం నాలుగో త్రైమాసికంలో రూ. 5,515 కోట్లుగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 24,059 కోట్లుగా ఉంది.మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి యూజర్ల సంఖ్య 19.28 కోట్లుగా ఉంది. మిగతా అన్ని టెల్కోలతో పోలిస్తే ప్రతి యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అతి తక్కువగా రూ. 190గా ఉన్నప్పటికీ, వృద్ధి మాత్రం అత్యధికంగా 8.3 శాతంగా నమోదైంది. మరోవైపు, ప్రమోటర్ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన సూర్యజ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రూ. 4,730 కోట్లు సేకరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకోసం 430 కోట్ల వరకు వారంట్లను జారీ చేయనుంది. -
కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!
వ్యాపారంలో విజయం సాధించాలంటే.. కేవలం డబ్బు, తెలివి, కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. ఒక నిజమైన వ్యాపారవేత్తకు అత్యంత ముఖ్యమైన ఆస్తులు రెండు. అవి అతని మెదడు, జీవితాంతం నేర్చుకునే తపన. వీటితో పాటు అతని సలహాదారుల బృందం ఉండాలి అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత కియోసాకి.ప్రతి వ్యాపారవేత్త తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ప్రపంచం ప్రతిరోజూ మారుతోంది. కొత్త ఆలోచనలు, సాంకేతికతలు, మార్కెట్ మార్పులు వస్తూనే ఉంటాయి. నేను అన్నీ తెలుసుకున్నాను అని భావించే వ్యక్తి ఎప్పటికీ ఎదగలేదు. కాబట్టి వ్యాపారవేత్త ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి.ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడైనా.. ఒంటరిగా ఉంటే ఏమీ సాధించలేడు. ఒక మంచి బృందం ఉన్నప్పుడు మాత్రమే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రతి మనిషికి ఇతరుల సహాయం అవసరం. వ్యాపారంలో కూడా ఇదే నిజం. మంచి సలహాదారులు ఉంటే వ్యాపారం బలంగా నిలబడుతుంది.వ్యాపారవేత్తకు అవసరమైన సలహాదారులుబుక్ కీపర్: వ్యాపారంలో వచ్చే ప్రతి రూపాయి లెక్కను కచ్చితంగా నమోదు చేస్తాడు. సరైన లెక్కలు లేకపోతే వ్యాపారం గందరగోళంలో పడుతుంది.అకౌంటెంట్: పన్నులు, ఆర్థిక ప్రణాళికలు, ఖర్చులకు సంబంధించిన సలహాలు ఇస్తాడు.అటార్నీ: చట్టపరమైన సమస్యల నుంచి వ్యాపారాన్ని రక్షిస్తాడు.మార్కెటింగ్ మేనేజర్: ఉత్పత్తిని ప్రజలకు చేరవేస్తాడు. మంచి మార్కెటింగ్ లేకపోతే మంచి ఉత్పత్తి కూడా గుర్తింపు పొందదు.ప్రొడక్ట్ డెవలపర్: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందిస్తాడు.బ్యాంకర్: ఆర్థిక సహాయం, పెట్టుబడులపై మార్గనిర్దేశం చేస్తాడు.బంగారం, వెండి బ్రోకర్: విలువైన లోహాలలో పెట్టుబడులపై సలహా ఇస్తాడు.స్టాక్ అండ్ బాండ్ బ్రోకర్: షేర్లు, బాండ్లు వంటి పెట్టుబడులపై అవగాహన కల్పిస్తాడు.Entrepreneurs most important assets:1: Their brain and dedication to life long learning.2: Their team of advisors.Who is on your team of advisors?Do you have?1: Book keeper for accurate numbers2: Accountant3: Attorney4: Marketing manager5: Product…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 16, 2026 ఈ టీమ్ కలిసి పనిచేస్తే, వ్యాపారవేత్తకు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఒంటరిగా పని చేసే మేధావి కంటే, మంచి సలహాదారులతో కూడిన బృందం మంచి విజయాన్ని సాధిస్తుంది.పాఠశాలలో చదుకునేటప్పుడు తప్పులు చేసే టీచర్ శిక్షిస్తారు. అందుకే చాలామంది ఉపాధ్యాయులు వ్యాపార ప్రపంచంలో పెద్దగా ఎదగలేరని కియోసాకి అన్నారు. నిజ జీవితంలో తప్పులు చేయడం సహజం. వాటి నుంచి నేర్చుకోవడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం! -
ఇటలీ స్పేస్ సదస్సులో ఇన్–స్పేస్
ఇటలీలో నిర్వహించిన స్పేస్ మీటింగ్స్ వెనిటోలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) సారథ్యంలో భారత్ నుంచి తొమ్మిది స్పేస్ టెక్ కంపెనీలు పాల్గొన్నాయి. ధృవ స్పేస్, ఆస్ట్రోగేట్ ల్యాబ్స్, వ్యోమ్ఐసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా కెప్లర్ ఏరోస్పేస్, ఆస్ట్రోబేస్ మొదలైనవి అక్కడి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే అంతరిక్ష రంగానికి సంబంధించి సాంకేతిక, వాణిజ్య భాగస్వామ్య అవకాశాలపై ఇరు దేశాల సంస్థలు చర్చించాయి. -
జీసీసీ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్‌గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్‌తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్‌లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
ఎయిర్టెల్ స్టైలే వేరు..
ముంబై: గత దశాబ్దకాలంగా పలు దేశీ ఐటీ కంపెనీలు తమ దగ్గరున్న నిధులను ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్‌లు, డివిడెండ్ల రూపంలో పంచేందుకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయని టెలికం దిగ్గజం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. తమ రంగాల్లోని కొత్త తరం వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో అవి విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అయితే, ఎయిర్టెల్ ఆ బాటలో వెళ్లదని మిట్టల్ స్పష్టం చేశారు. టెలికం కంపెనీలు వృద్ధి అవకాశాలు అందించే అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాల్సిందనేనని, లేకపోతే వెనుకబడిపోయే రిస్క్ లు ఉంటాయన్నారు. కాబట్టి తాము ఇటు బైబ్యాక్‌లు, డివిడెండ్లు ఇస్తూనే అంతర్జాతీయంగా టెలికం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన సందర్భంగా తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యాపార విస్తరణపై ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్‌లు, డివిడెండ్ల రూపంలో తమ దగ్గరున్న నిధులను మరీ ఎక్కువగా వెచ్చిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 16 దిగ్గజ ఐటీ కంపెనీలు, షేర్హోల్డర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్ల మొత్తాన్ని బైబ్యాక్‌లు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ. 95,400 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికం. పదేళ్లలో వారసులకు వ్యాపార పగ్గాలు .. వచ్చే దశాబ్దకాలంలో వ్యాపార పగ్గాలను తన వారసులకు అప్పగించనున్నట్లు మిట్టల్ చెప్పారు. అలాగే, భారతి ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ సంస్థ భారతి టెలికం తిరిగి 50 శాతం పైగా వాటాను దక్కించుకునేలా చూడాలనేది తన ఆకాంక్ష అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతి టెలికంకి ఎయిర్‌టెల్‌లో 40.47 శాతం వాటాలు ఉన్నాయి. 10 శాతం మేర వాటాలు పెంచుకోవాలంటే ప్రస్తుత షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కనీసం రూ. 1 లక్ష కోట్లు అవసరమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు. -
వచ్చే 6 నెలలు ఎలా ఉంటుందంటే.. భయంకర ఆందోళన
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే నెలల్లో వ్యాపార రంగాలు ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక ప్రముఖ టెక్స్టైల్ ఫౌండర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల, కంపెనీలలో సామూహిక లేఆఫ్‌లపై ఆయన చేసిన హెచ్చరికలు నెట్టింట వైరల్‌గా మారాయి.‘రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకం’టెక్స్టైల్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అక్షయ్ జైన్ తన 'ఎక్స్' పోస్ట్‌లో వ్యాపారాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల సరఫరా దెబ్బతిని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల రాబోయే ఆరు నెలలు కంపెనీలకు అత్యంత బాధాకరంగా మారబోతున్నాయి. ఖర్చులు గనుక ఇదే వేగంతో పెరిగితే, పలు రంగాలలో సామూహిక ఉద్యోగాల తొలగింపులతో పాటు వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది," అని జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా తక్కువ మార్జిన్లతో నడిచే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ముడి పదార్థాల ధరల పెరుగుదల "అస్సలు భరించలేనిది" గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మందగమనం రెండేళ్లు ఉండొచ్చుఅక్షయ్ జైన్ పోస్ట్‌పై స్పందిస్తూ పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఆర్థిక మందగమనం కేవలం ఆరు నెలలతో ముగిసేది కాదని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) మళ్లీ కోలుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఒక వినియోగదారుడు అంచనా వేశారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయం, కార్మికుల కొరత, మార్కెట్లో వినియోగదారుల డిమాండ్ తగ్గడం వంటి అంశాలు యువ పారిశ్రామికవేత్తలకు మునుపెన్నడూ లేని సవాలును విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రభావం కేవలం టెక్స్టైల్ రంగానికే పరిమితం కాదని.. వ్యవసాయం, ఉత్పాదక రంగం, ఐటీ, ముడిసరుకు ఆధారిత పరిశ్రమలన్నింటిపై పడుతుందని మరో నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, ఆ ప్రభావాన్ని తట్టుకోవడం భారతదేశానికి కూడా పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరించారు.ధరలు పెంచలేక.. నష్టాలు భరించలేక..ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ, కస్టమర్ల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వ్యాపారాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు 20% కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, మార్కెట్లో డిమాండ్ పడిపోతుందనే భయంతో ఉత్పత్తుల ధరలను పెంచలేకపోతున్నామని ఒక పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో వ్యాపారాన్ని విస్తరించడం అసాధ్యంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితి!ట్రావెల్ ఎసెన్షియల్స్ రంగానికి చెందిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన అనుభవాన్ని పంచుకుంటూ.. ప్రయాణాలు తగ్గడం వల్ల తమ అమ్మకాలు అప్పుడే పడిపోయాయని తెలిపారు. "కోవిడ్-19 మహమ్మారి సమయంలో మాస్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చి మా కంపెనీని గట్టెక్కించాం. కానీ ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా, మరింత సవాలుగా ఉంది. ఇప్పుడు మాకు పెద్ద ఫ్యాక్టరీ సెటప్, వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి అనిశ్చిత సమయంలో ఏ వస్తువులను తయారు చేయాలో, వేటిని విక్రయించాలో అర్థం కావడం లేదు" అని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేరుగా సామాన్య వ్యాపారాలపై చూపిస్తున్న ప్రభావంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.The next 6 months are going to be very painful for businesses due to rising costs. We might be looking at mass layoffs and companies closing down in many sectors. Current rates of raw materials due to war are absolutely unsustainable.— Akshay G Jain (@Ajain112) May 16, 2026 -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. 2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్‌పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు. వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు ఏఐ ఎకోసిస్టమ్‌లో ‘బిల్డ్–పార్ట్నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్‌ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్‌వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్‌లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు. భారత్‌లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్‌లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది. కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా, బ్యాంకింగ్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్ భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్‌లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. -
ల్యాప్‌టాప్, ఏఐ.. వ్యాపారంలో విజయం: కియోసాకి
పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాబర్ట్ కియోసాకి.. తాజాగా పెద్ద కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయనే విషయంపై స్పందించారు. AI సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించగలరు అని పేర్కొన్నారు.ఈ కాలంలో పెద్ద కంపెనీలకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయనే భావన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా తన ఇంటి వంటగదిలో కూర్చొని, కేవలం ల్యాప్‌టాప్, ఏఐ సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని నిర్మించగలడని కియోసాకి పేర్కొన్నారు.ఒకప్పుడు పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి, ఉద్యోగులు, ఆఫీస్, మార్కెటింగ్ టీమ్, మౌలిక సదుపాయాలు అవసరమయ్యేవి. కాబట్టి వ్యాపారం అనేది ధనికులకు మాత్రమే లేదా పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి ఒంటరిగా.. చాలామంది చేసే పనులు చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆఫీసులు లేకపోయినా, ఇంట్లో నుంచే వ్యాపార నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధించవచ్చు. AI సహాయంతో ఒక వ్యక్తి పెద్ద కంపెనీల మార్కెటింగ్ విభాగం కంటే ఎక్కువ కంటెంట్‌ను తయారు చేయగలడు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగలడు. కస్టమర్లకు త్వరగా స్పందించగలడు. మార్కెట్లో వచ్చే మార్పులకు పెద్ద కంపెనీల కంటే వేగంగా.. అనుగుణంగా మారగలడని కియోసాకి అన్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహాపెద్ద కంపెనీలకు డబ్బు, వనరులు ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు వేగం గొప్ప ఆయుధం ఉంది. ఈ రోజుల్లో వేగంగా ఆలోచించి, వేగంగా అమలు చేసే వారే గెలుస్తున్నారు. పెద్ద సంస్థలు ఒక నిర్ణయం తీసుకునేలోపు.. చిన్న వ్యాపారులు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఏ రంగంలో అయినా.. తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సొంతం అవుతుందని కియోసాకి చెబుతున్నారు. -
టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ 2025-26లో మొత్తం రూ. 28 కోట్ల వేతనం అందుకున్నారని. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికమని కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది.అయితే.. టాటా గ్రూప్ అండ్ టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ దిగ్గజం నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోకుండా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి సిట్టింగ్ ఫీజుగా కేవలం రూ. 4.2 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా సంస్థ తన వార్షిక నివేదిక తెలిపింది.కృతివాసన్ ప్యాకేజీలో ప్రాథమిక వేతనం రూ. 1.67 కోట్లు కాగా.. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు, ప్రయోజనాలు రూ.1.43 కోట్లు. పర్ఫామెన్స్ బేస్డ్ కమీషన్ కింద రూ.25 కోట్లు ఉన్నాయి. సంస్థ వార్షిక నివేదిక ప్రకారం, సీఈఓ వేతనం టీసీఎస్ ఉద్యోగుల మధ్యస్థ పారితోషికం కంటే 332.8 రెట్లు ఎక్కువ. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ వేతనం 5.1 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.భారతదేశంలో జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు సగటు వార్షిక జీతాల పెరుగుదల 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపులు లభించాయి. టీసీఎస్ తన మార్చి త్రైమాసిక నికర లాభంలో 12.22 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ. 13,718 కోట్లను ఆర్జించింది.ఇదీ చదవండి: 600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్! -
600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్!
ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక ఉద్యోగ అభ్యర్థికి వచ్చిన రిజెక్షన్ మెయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.సాధారణంగా కంపెనీలు అభ్యర్థిని తిరస్కరించేటప్పుడు.. క్వాలిఫికేషన్, స్కిల్స్ వంటివి చూస్తాయి. తమకు అవసరమైన స్కిల్ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటాయి. లేకుంటే రిజెక్ట్ చేస్తాయి. కానీ.. అభ్యర్థి పనిచేసిన పాత ఆఫీస్ 600 మీటర్ల దూరంలో ఉండటం వల్ల రిజెక్ట్ చేస్తున్నట్లు కంపెనీ మెయిల్ ద్వారా వెల్లడించింది.కంపెనీకి సంబంధించిన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కారణం చదివిన తరువాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సాధారణంగా కంపెనీలలో గోప్యత అనేది ఉద్యోగి బాధ్యత. కాబట్టి దీనికి కొన్ని సెక్యూరిటీ పాలసీలు ఉంటాయి. కానీ.. కేవలం భౌగోళిక దూరం ఆధారంగా ఉద్యోగిని తిరస్కరించడం అనేది చాలా మందికి అర్థం కాని విషయం అయ్యింది.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయిన తరువాత, చాలామంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఇది పాతకాలపు ఆలోచన అని విమర్శించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా చేరవచ్చు. కాబట్టి, కేవలం ఆఫీసుల మధ్య దూరం ఆధారంగా గోప్యత భంగం కలుగుతుందని భావించడం సరైనది కాదని అన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు! -
ఆ రాష్ట్రంలో క్యాబ్, బైక్ ట్యాక్సీలపై నిషేధం!
నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి బుక్ చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ క్యాబ్, రైడ్ సేవలను నిలిపివేయాలని.. యాపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్స్ నుంచి సంబంధిత యాప్స్ తొలగించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమంగా బైక్, ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి రాసిన లేఖలో వెల్లడించారు. ఆ కంపెనీల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాపిడోకు అగ్రిగేటర్ లైసెన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో, 2022 చివరిలో బైక్ ట్యాక్సీలతో కొనసాగుతున్న వివాదం ప్రారంభమైంది. రాపిడో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, జనవరి 2023 నాటికి అన్ని బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేశారు. చివరికి బైక్ ట్యాక్సీల కోసం ఒక అగ్రిగేటర్ విధానాన్ని రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
భారతీయ ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా అవతరించడమే తమ అంతిమ లక్ష్యమని దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. కంపెనీ వార్షిక నివేదిక (2025-26)లో భాగంగా వాటాదారులకు రాసిన లేఖలో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ ఈ కీలక విషయాలను వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో ఏఐ సాంకేతికతకు ఒక కీలక మలుపు అన్నారు. క్లయింట్లు కేవలం ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాల్లో పెద్ద ఎత్తున ఏఐని విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు.టాప్ క్లయింట్ల మొదటి ఛాయిస్..టీసీఎస్ గ్లోబల్ మార్కెట్లో తన పట్టును ఎంత బలంగా నిలుపుకుందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఏడాదికి 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే కంపెనీ అగ్రశ్రేణి 139 క్లయింట్లలో.. ఏకంగా 130 మంది తమ ఏఐ సేవల భాగస్వామిగా టీసీఎస్‌ను ఎంచుకున్నారని కృతివాసన్ ప్రకటించారు.‘ఏఐ సృష్టిస్తున్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ-నేతృత్వంలోని టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా మారాలనే సాహసోపేతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మౌలిక సదుపాయాలు నుంచి ఇంటెలిజెన్స్ వరకు ఫుల్ స్టాక్ ఏఐ సేవలను అందించడమే మా వ్యూహం’ అని కృతివాసన్ చెప్పారు.మూడు రెట్లు పెరిగిన ఏఐ శ్రామిక శక్తిఈ భారీ సాంకేతిక మార్పును తట్టుకునేందుకు వీలుగా టీసీఎస్ తన శ్రామిక శక్తిని దూకుడుగా సన్నద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 2,70,000 మందికి పైగా ఉద్యోగులు అధునాతన ఏఐ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.డిజిటల్ ప్రాజెక్టులు..గ్లోబల్ మార్కెటతోపాటు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో టీసీఎస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని సీఈఓ హైలైట్ చేశారు.గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్: రూ. 5 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వ కొనుగోళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా దీనిని విస్తరించింది.ఎస్బీఐ యోనో 2.0: 10 భాషల్లో ఏకంగా 20 కోట్ల మంది వినియోగదారులకు అత్యంత వేగవంతమైన సేవలు అందించేలా దీనిని అప్‌గ్రేడ్ చేసింది.ఈ-పాస్‌పోర్ట్: కోటికి పైగా ఈ-పాస్‌పోర్ట్‌ల జారీతో పౌర సేవలను ఆధునీకరించింది.ఆర్బీఐ డేటా మేనేజ్మెంట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక విశ్లేషణల కోసం 250 టీబీ డేటాను నిర్వహించగల అత్యాధునిక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్‌ను నిర్మించింది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!
ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిన్‌ఫ్లూయెన్సర్ అంకుర్ వారికూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో విజయవంతంగా నడుస్తూ దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగిన తన ఆన్లైన్ లెర్నింగ్ (అప్‌స్కిల్లింగ్ కోర్సులు) వేదికను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో అటు వ్యాపార వర్గాలు, ఇటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గత ఆరేళ్లుగా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ ఈ వ్యాపారాన్ని ఇకపై ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అర్థం లేదు అని వారికూ స్పష్టం చేయడం గమనార్హం.రూ.100 కోట్ల విక్రయాలు.. రూ.25 కోట్ల లాభాలు!తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ అంకుర్ వారికూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘రూ.100 కోట్ల విలువైన నా కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నాను. 2020లో మేము ఈ వెంచర్‌ను ప్రారంభించినప్పుడు ఇది ఇంతటి భారీ విజయాన్ని అందుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు మా కోర్సుల్లో చేరారు. రూ.100 కోట్ల అమ్మకాలు జరిగాయి, అలాగే రూ.25 కోట్ల నికర లాభాలను కూడా ఆర్జించాం. వ్యాపారపరంగా ఇంత పెద్ద సక్సెస్ ఉన్నప్పటికీ.. దీనిని ఇలాగే కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని వారికూ పేర్కొన్నారు. అయితే, ఈ హఠాత్తు నిర్ణయానికి గల పూర్తి కారణాలను, తన తదుపరి కార్యాచరణను త్వరలో ఒక ప్రత్యేక వీడియో ద్వారా పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తిరుగులేని సామ్రాజ్యం2020లో కోర్సుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన అంకుర్ వారికూ, చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే టాప్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా యువతకు కెరీర్ గైడెన్స్, పర్సనల్ ఫైనాన్స్, టైమ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై కోర్సులను అందిస్తూ భారీ డిజిటల్ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయనకు.. యూట్యూబ్‌లో 7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4 మిలియన్ల ఫాలోవర్లు, ఎక్స్‌లో 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలువారికూ చేసిన ఈ ప్రకటన డిజిటల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఆన్లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నారా? అని ఒక యూజర్ ప్రశ్నించగా.. వారికూ సమాధానమిస్తూ.. ‘అవును, అది కూడా ఒక కారణంగా ఉంది’ అని బదులివ్వడం ఐటీ, ఎడ్టెక్ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరికొందరు నెటిజన్లు దీన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్న గిమ్మిక్ (పబ్లిసిటీ స్టంట్) అని కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
టెక్ దిగ్గజాల మధ్య చైనా ‘కున్ఫీ’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విందులో ఒక ఆసక్తికరమైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలై యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న ఒక చైనా మహిళ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. దాంతో తనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఆమె.. చైనాలోనే అత్యంత ప్రతిభావంతురాలైన స్వయంకృషి గల మహిళా పారిశ్రామికవేత్త, ‘లెన్స్ టెక్నాలజీ’ వ్యవస్థాపకురాలు జౌ కున్ఫీ. తన కంపెనీకి అత్యంత కీలకమైన ఇద్దరు గ్లోబల్ కస్టమర్ల మధ్య ఆమె కూర్చోవడం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యత సంతరించుకుంది.అట్టడుగు స్థాయి నుంచి బిలియనీర్ వరకు..టెక్ దిగ్గజాల మధ్య సముచిత స్థానం సంపాదించుకున్న జౌ కున్ఫీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆమె ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు..1970లో హునాన్ ప్రావిన్స్‌లోని ఒక పేద గ్రామంలో జన్మించిన జౌ, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేవలం 15 ఏళ్ల వయసులోనే చదువు మానేశారు. బతుకుదెరువు కోసం షెన్జెన్ నగరానికి వలస వెళ్లి అక్కడి ఫ్యాక్టరీల్లో కార్మికురాలిగా పనిచేశారు.1993లో, 23 ఏళ్ల వయసులో తన బంధువుల సహాయంతో కొంత మూలధనాన్ని సమకూర్చుకుని బావోన్ జిల్లాలోని ఒక నివాస భవనంలో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. రిస్ట్ వాచ్ గ్లాస్లపై స్క్రీన్ ప్రింటింగ్ చేయడంతో ఆమె వ్యాపార ప్రస్థానం మొదలైంది.ఆ తర్వాత దశాబ్ద కాలానికి, ఆమె కష్టార్జితంతో ‘లెన్స్ టెక్నాలజీ’ సంస్థ రూపుదిద్దుకుంది.యాపిల్‌తో భాగస్వామ్యం2007లో స్మార్ట్‌ఫోన్ రంగాన్నే విప్లవాత్మకంగా మార్చేసిన ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరుణంలో లెన్స్ టెక్నాలజీకి అదృష్టం వరించింది. ఐఫోన్ స్క్రీన్ కవర్ గ్లాస్ సరఫరాదారుగా యాపిల్ సప్లై చైన్‌లో లెన్స్ టెక్నాలజీ చోటు దక్కించుకుంది. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు విక్రయాలు సాధించడంతో యాపిల్ సంస్థ లెన్స్‌కు అతిపెద్ద కస్టమర్‌గా మారింది. 2010ల ప్రారంభం నాటికి లెన్స్ టెక్నాలజీ వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా యాపిల్ నుంచే రావడం విశేషం.ఈ విజయంతో మార్చి 2015లో షెన్జెన్లోని ‘చినెక్స్ట్ ఇండెక్స్’లో లెన్స్ నమోదైంది. తద్వారా జౌ కున్ఫీ చైనాలోనే అత్యంత ధనవంతురాలైన సెల్ఫ్-మేడ్ మహిళగా అవతరించారు. అనంతరం 2025లో ఈ సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పబ్లిక్ లిస్టింగ్ సాధించింది.మస్క్ కంపెనీలతో బంధం2016 నుంచి టెస్లా సంస్థతో ప్రారంభమైన అనుబంధం లెన్స్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. స్మార్ట్-కాక్‌పిట్, బాహ్య నిర్మాణ విడిభాగాల తయారీలో గ్లాస్, మెటల్, టచ్ మాడ్యూల్స్ విభాగాల్లో లెన్స్ తన నైపుణ్యాన్ని చాటుకుంది. గత డిసెంబర్లో ఇన్వెస్టర్ల వేదికగా లెన్స్ టెక్నాలజీ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఒక ప్రధాన ఉత్తర అమెరికా కస్టమర్‌తో తాము దశాబ్ద కాలంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ కస్టమర్ ప్రధాన వ్యాపారాలైన స్మార్ట్ కాక్పిట్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు (ఆప్టిమస్), కమర్షియల్ ఏరోస్పేస్ (స్పేస్ఎక్స్)ల్లో తాము భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొంది. శాటిలైట్ గ్రౌండ్ రిసీవర్ల కోసం బాహ్య నిర్మాణాత్మక మాడ్యూల్స్, అంతరిక్ష ప్రయోగాల కోసం అల్ట్రా-థిన్ ఫోటోవోల్టాయిక్ గ్లాస్ మాడ్యూల్స్‌ను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ పేరు అధికారికంగా వెల్లడించనప్పటికీ అది ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.గ్లోబల్ టెక్ మహారథులైన టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌ల నమ్మకాన్ని గెలుచుకున్న జౌ కున్ఫీ రాబోయే రోజుల్లో ఏఐ హార్డ్‌వేర్ తయారీ వ్యూహాలతో ముందుకెళ్లనున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
కోయిల గూటి కొమ్మలు.. విశ్వాన్ని శాసించిన శక్తులు!
వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే వ్యూహాత్మక చతురత, సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపించే అద్భుత దార్శనికత, ఎంతటి సంక్షోభంలోనైనా వెనకడుగు వేయని ఉక్కు సంకల్పం.. ప్రపంచ శ్రేణి బిలియనీర్లలో మనం సాధారణంగా చూసే లక్షణాలివి. అయితే, గ్లోబల్ టెక్ ఐకాన్స్ అయిన స్టీవ్ జాబ్స్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్.. ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ థామస్‌ల జీవితాల్లో ప్రపంచానికి పెద్దగా తెలియని, అత్యంత ప్రభావవంతమైన ఒక కామన్ పాయింట్ ఉంది. వారంతా ‘దత్తత’ సంతానమే!అననుకూల పరిస్థితుల నడుమ అస్థిరతలను అధిగమించి దత్తత తీసుకున్న కుటుంబాల ఆదరణతో వారు ఎలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారో వివరించే ప్రత్యేక విశ్లేషణ ఇది.స్టీవ్ జాబ్స్..యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పుట్టుక ఒక సంక్లిష్ట పరిస్థితిలో జరిగింది. పీహెచ్డీ చేస్తున్న సిరియన్ విద్యార్థి అబ్దుల్ ఫత్తా జందాలీ, స్విస్-జర్మన్ సంతతికి చెందిన జోవాన్ స్కీబుల్ దంపతులకు ఆయన జన్మించారు. అయితే, జోవాన్ తల్లిదండ్రులు వీరి సంబంధాన్ని నిరాకరించడంతో ఆమె ‘క్లోజ్డ్ అడాప్షన్’ ప్రక్రియను ఎంచుకోవాల్సి వచ్చింది.మొదట ఒక ధనిక జంట జాబ్స్‌ను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చినా మగపిల్లాడు అని తెలియగానే వెనక్కి తగ్గారు. ఆ తర్వాత శ్రామిక వర్గానికి చెందిన పాల్, క్లారా జాబ్స్ దంపతులు స్టీవ్‌ను దత్తత తీసుకున్నారు. తమ ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అతడిని ఉన్నత చదువులు చదివిస్తామని వారు జాబ్స్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాటిచ్చారు.తనను పెంచిన తల్లిదండ్రుల పట్ల జాబ్స్ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉండేవారు. వారే నా నిజమైన తల్లిదండ్రులు అని ఆయన గర్వంగా చెప్పుకునేవారు. తనను కన్న తల్లిదండ్రులను కేవలం ఒక స్పెర్మ్, ఎగ్ బ్యాంక్‌గా మాత్రమే ఆయన అభివర్ణించడం గమనార్హం. పాల్, క్లారాల పెంపకంలో లభించిన స్వేచ్ఛ, ఉత్సుకతలే ఆ తర్వాత కాలంలో యాపిల్, పిక్సర్ వంటి విప్లవాత్మక సంస్థల స్థాపనకు పునాది వేసాయి.జెఫ్ బెజోస్ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అసలు పేరు ‘జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్సెన్’. ఆయన జన్మించిన 17 నెలలకే తల్లి జాక్లిన్ తండ్రి నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరి తల్లిగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. జెఫ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పుడు క్యూబా వలసదారుడైన మిగ్యుల్ మైక్ బెజోస్‌ను జాక్లిన్ వివాహం చేసుకున్నారు.మైక్ బెజోస్ జెఫ్‌ను చట్టబద్ధంగా దత్తత తీసుకుని తన ఇంటిపేరును ఇచ్చారు. మైక్ అందించిన స్థిరమైన కుటుంబ వాతావరణం, క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత జెఫ్ బెజోస్ జీవితాన్ని మలుపు తిప్పాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో జెఫ్ ప్రయోగాలకు మైక్ పూర్తి మద్దతునందించారు. దత్తత ద్వారా లభించిన ఈ అవకాశం తనలో వ్యూహాత్మక ఆలోచనలను, అపజయాలను తట్టుకునే శక్తిని పెంచిందని బెజోస్ పలుమార్లు గుర్తుచేసుకున్నారు.లారీ ఎల్లిసన్సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ బాల్యం మరింత సంఘర్షణలతో కూడుకున్నది. న్యూయార్క్ నగరంలో 19 ఏళ్ల ఒంటరి తల్లికి జన్మించిన లారీ, చిన్నప్పుడే తీవ్రమైన న్యూమోనియా బారిన పడ్డారు. అనారోగ్యం, పేదరికం కారణంగా ఆమె లారీని దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చికాగోలో నివసించే ఆమె అత్తామామలు లిలియన్, లూయిస్ ఎల్లిసన్ లారీని చేరదీశారు.తల్లిగా మారిన అత్త లిలియన్ లారీకి ఎనలేని ప్రేమను పంచగా మామ లూయిస్ కఠినంగా, దూరంగా ఉండేవారు. చికాగో సౌత్ సైడ్‌లోని నిరాడంబర వాతావరణం, ఈ సంక్లిష్ట కుటుంబ పరిస్థితులు లారీలో తీవ్రమైన ఆశయాన్ని పెంచాయి. తన 12వ ఏట దత్తత వాస్తవాన్ని గ్రహించిన లారీ 48 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తనను కన్న తల్లిని కలవలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణమే ఆయనను ఒక పట్టుదల కలిగిన విజేతగా మార్చింది.డేవ్ థామస్ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ ‘వెండీస్’ వ్యవస్థాపకుడు డేవ్ థామస్ జీవితం కూడా దత్తతతో ముడిపడి ఉన్నదే. రెక్స్ డేవిడ్ థామస్‌గా జన్మించిన ఆయనను న్యూజెర్సీకి చెందిన రెక్స్, ఔలేవా థామస్ దంపతులు శిశువుగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు. అయితే, ఐదేళ్ల వయసులోనే దత్తత తల్లిని కోల్పోవడం, ఆ తర్వాత వరుస కుటుంబ నష్టాలు ఆయనను కుదిపేశాయి. దత్తత ప్రాధాన్యతను గుర్తించిన ఆయన అనాథ పిల్లలకు శాశ్వత గృహాలను కల్పించేందుకు ‘డేవ్ థామస్ ఫౌండేషన్ ఫర్ అడాప్షన్’ను స్థాపించి సమాజానికి సేవ చేస్తున్నారు.ఈ నలుగురు బిలియనీర్ల కథలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పుట్టుక లేదా తొలినాళ్లలో అస్థిరతలు మనిషి భవిష్యత్తును నిర్ణయించలేవు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అందించిన ప్రేమ, మార్గదర్శకత్వం, స్థిరత్వమే ఈ ముగ్గురిని గ్లోబల్ టెక్ దిగ్గజాలను, ఒక వ్యాపార సామ్రాజ్యాధినేతను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకున్న వీరి జీవితాలు నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకం.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
మేక్మైట్రిప్ కొత్త అప్డేట్.. వాయిస్‌తోనే బుకింగ్!
భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ తన ఏఐ బేస్డ్ ట్రావెల్ అసిస్టెంట్ ‘మైరా’లో కొత్త అప్‌గ్రేడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ అప్డేట్ ముఖ్య ఉద్దేశ్యం.. వినియోగదారుల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసి, సెర్చింగ్ నుంచి చెల్లింపు వరకు మొత్తం ఒకే ఇంటర్ఫేస్లో పూర్తి చేయగలిగేలా చేయడం. అవసరమైతే వాయిస్ ఆధారిత విధానంలో కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.'మైరా 2.0' ఇప్పుడు సాధారణ సెర్చ్‌లను మాత్రమే కాకుండా, చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన ప్రయాణ అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుని పరిష్కారం చూపుతుంది. ఉదాహరణకు.. కుటుంబ ప్రయాణాల కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న హోటల్స్, వృద్ధుల కోసం సౌకర్యాలు లేదా వీసా సంబంధిత సమాచారం వంటి అంశాలను ఒకే చోట అందిస్తుంది. దీంతో వినియోగదారులు అనేక వెబ్సైట్లను పరిశీలించాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై పూర్తి సమాచారం పొందగలుగుతారు.ఈ కొత్త వెర్షన్లో.. వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. తెలుగు సహా ఎనిమిది భాషల్లో.. వాయిస్ ద్వారా సెర్చ్, ఎంపికలు, బుకింగ్ వంటివి పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాయిస్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాస్‌పోర్ట్ లేదా ఇతర డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే, వాటి వివరాలను ఆటోమేటిక్‌గా గుర్తించి బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.మరో ముఖ్యమైన డెవలప్మెంట్ ఏమిటంటే.. చెల్లింపు ప్రక్రియను కూడా సంభాషణలోనే పూర్తి చేయగలగడం. వినియోగదారులు సెర్చ్ చేయడం, ఎంపిక చేయడం, కన్ఫర్మ్ చేయడం,పేమెంట్ చేయడం వరకు అన్ని దశలను ఒకే ఇంటర్ఫేస్లో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా, బుకింగ్ మధ్యలో కూడా వినియోగదారులు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, దీంతో ప్రక్రియ మధ్యలో ఆగిపోకుండా కొనసాగుతుంది. -
జాబ్ వదిలి బిజినెస్ చేస్తే.. జీవితం ఇంత కష్టమా?
ఉద్యోగం చేసే చాలామంది.. జాబ్ వదిలేసి సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇలాంటి సలహాలే చాలామంది చెబుతుంటారు కూడా. కానీ అదంతా తప్పు, అనుకున్నంత సులభమేమీ కాదంటున్నారు.. యువ వ్యాపారవేత్త మెహుల్ అగర్వాల్. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ క్రియేటర్.. యువ వ్యాపారవేత్త మెహుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో సర్వత్రా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇందులో ఉద్యోగాన్ని వదిలి సొంత వ్యాపారం ప్రారంభించడం ఎంత కష్టమైన ప్రయాణమో ఆయన నిజాయితీగా వివరించారు.సాధారణంగా చాలామంది 'జాబ్ వదిలేస్తే స్వేచ్ఛ వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది' అని భావిస్తారు. కానీ జాబ్ వదిలేశాక తెలుస్తుంది ఎన్ని బాధ్యతలు పెరుగుతాయో. ఈ విషయాలను ఆయన తన అనుభవం ద్వారా వెల్లడించారు.మెహుల్ ప్రకారం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిన మొదటి రోజు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఉదయం త్వరగా లేచి తన కంపెనీ భవిష్యత్తు కోసం వచ్చే మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేశాడు. కొత్త ప్రయాణం ప్రారంభమవుతోందనే ఆనందం అతనిలో కనిపించింది. రెండో రోజు ఆ ప్రణాళికను మళ్లీ మార్చి మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. అయితే.. మూడో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన నిర్ణయం సరైందా కాదా అనే అనుమానాలు మొదలయ్యాయని మెహుల్ తెలిపాడు.భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక భయం, ఆందోళన కలిగాయని చెప్పాడు మెహుల్ వీడియోలో వెల్లడించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్ పని మాత్రమే అప్పగించేవాడు, కానీ ఇప్పుడు అన్ని పనులు తానే చూసుకోవాల్సి వచ్చిందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ఒక వ్యాపారవేత్త ఎదుర్కొనే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.అయితే.. తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదని మెహుల్ పేర్కొన్నాడు. ఎందుకంటే నచ్చని, ఒత్తిడి కలిగించే ఉద్యోగాన్ని వదిలి, నచ్చిన పనిచేస్తూ ముందుకు వెళ్తున్నా అని వివరించాడు. వ్యాపారాన్ని నిర్మించే ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని కూడా తెలిపాడు. ఇది జీవితంలో మనసుకు నచ్చిన పనిని చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహాచేసేపనిలో కేవలం విజయం మాత్రమే కాదు.. అపజయం, కష్టాలు వస్తాయని.. ఆత్మవిశ్వాసం తగ్గినా రోజులు కూడా ఉన్నాయని మెహుల్ వీడియోలో వెల్లడించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి భావోద్వేగాలను తాము కూడా ఎదుర్కొన్నామని కొందరు వెల్లడించారు. మరికొందరు వ్యాపార జీవితంలోని ఒత్తిడి, అనిశ్చితి గురించి నిజాయితీగా మాట్లాడినందుకు ఆయనను ప్రశంసించారు. -
అదానీపై యూఎస్ ఆరోపణల ఉపసంహరణ
భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీపై మోపిన క్రిమినల్ మోసం, లంచం ఆరోపణలను కొట్టివేయడానికి అమెరికా న్యాయ శాఖ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చర్యలు ప్రారంభించారు. గత ఏడాది కాలంగా అదానీ గ్రూప్‌ను వెంటాడుతున్న ఈ చట్టపరమైన అంశం ఒక్కసారిగా తొలగిపోవడం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో చర్చకు దారితీసింది.ఫెడరల్ ప్రాసిక్యూషన్‌లో నాటకీయ మార్పుభారతదేశంలో లాభదాయకమైన సౌర శక్తి ఒప్పందాలను దక్కించుకోవడానికి దాదాపు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించారనేది అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు ఇతర అధికారులపై ఉన్న ప్రధాన ఆరోపణ. అమెరికా పెట్టుబడిదారుల నుంచి బిలియన్ల డాలర్ల మూలధనాన్ని సేకరించే క్రమంలో ఈ విషయాన్ని దాచిపెట్టి వారిని తప్పుదోవ పట్టించారని 2024 చివరలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అప్పటి అమెరికా అధికారులు కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ నేరారోపణలను విరమించుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సాక్ష్యాధారాల సమగ్రంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.తెరపైకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. యూఎస్ ప్రాసిక్యూటర్లు ఈ ఆరోపణలను ఉపసంహరించుకుంటే ప్రతివాది తరఫున అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందనే ప్రతిపాదన ఈ నిర్ణయం వెనుక కీలక పాత్ర పోషించినట్లు సదరు కథనం పేర్కొంది. అమెరికా ఫస్ట్ విధానాన్ని నమ్మే ట్రంప్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఈ ఆర్థిక దౌత్యం నడిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.రాజకీయ సమీకరణాలుఈ కేసు ఉపసంహరణ అంతర్జాతీయ రాజకీయాలు, అమెరికా న్యాయ వ్యవస్థల కలయికపై తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత, వ్యూహాత్మక సంబంధాలు ఈ పరిణామానికి ముఖ్యమైన నేపథ్యంగా కనిపిస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ఉన్నత స్థాయి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలపై ఆరోపణలను పక్కన పెట్టడం వెనుక అమెరికాకు ఉన్న అంతర్గత వ్యాపార, భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం పూర్తిగా కేసు యోగ్యతలపై(మెరిట్స్) మాత్రమే ఆధారపడి తీసుకుందని యూఎస్ న్యాయ శాఖ స్పష్టం చేసింది.‘ఇది అదానీ గ్రూప్‌నకు లభించిన భారీ విజయం. తమపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని వారు మొదటి నుంచి చెప్తున్న వాదనకు ఈ నిర్ణయంతో బలం చేకూరింది’ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ విశ్లేషించింది. మరోవైపు, పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ చట్టపరమైన కార్యకర్తలు ఈ చర్యను విమర్శిస్తున్నారు. ఇంతటి భారీ అంతర్జాతీయ అవినీతి కేసును ఇలా అర్ధాంతరంగా కొట్టివేయడం వల్ల భవిష్యత్తులో కార్పొరేట్ అవినీతిపై జరిగే పోరాటాలు బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
బెంగళూరు టెక్కీ ఐడియాపై నెటిజన్ల డిబేట్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నగరంలో జీవన వ్యయం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, నిత్యావసరాలు.. ఇలా చాలా వాటికి అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ ఉద్యోగాలు చేసే వారి కోసం ఓ బెంగళూరు యువకుడు కొత్త ఆలోచన ప్రతిపాదించాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.. ఉచిత వైఫై, ఫుల్ ఏసీ, మొబైల్/ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లతో మాల్స్‌లోనే రోజంతా ప్రశాంతంగా ఆఫీస్ పని చేసుకోవచ్చంటూ అతడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది.సీక్రెట్ స్పాట్స్ఇన్స్టాగ్రామ్లో అమోల్ నారంగ్ అనే కంటెంట్ క్రియేటర్ ‘బెంగళూరులో ఉచితంగా ల్యాప్‌టాప్‌పై కూర్చుని పని చేయండి - పార్ట్ 1’ అనే శీర్షికతో ఒక వీడియోను పంచుకున్నాడు. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ మాల్‌ను ఎంచుకున్న అతడు, అక్కడ చట్టబద్ధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా పని చేయవచ్చో ఐదు లొకేషన్లతో సహా వివరించాడు. ‘వైట్‌ఫీల్డ్‌లో ఉచిత వైఫై, ఏసీ ఎలాంటి ఛార్జీ లేకుండా రోజంతా పని చేయవచ్చు’ అంటూ ఆ యువకుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Amol Narang (@amol_narang)నెటిజన్ల స్పందనఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఐడియా భలే ఉందే అని మెచ్చుకుంటుంటే, మెజారిటీ ఐటీ నిపుణులు, నెటిజన్లు మాత్రం ఇందులోని ఇబ్బందులను, భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
10 ఏళ్లలో తదుపరి తరానికి పగ్గాలు..
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భవిష్యత్తు ప్రణాళికలపై ఆ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో కంపెనీ బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇదే క్రమంలో భారతీ టెలికాం వాటాను తిరిగి 50 శాతానికి పైగా పెంచుకోవాలన్న తన వ్యక్తిగత ఆకాంక్షను ఆయన పంచుకున్నారు.వారసత్వానికి రోడ్ మ్యాప్..ప్రస్తుతం సెప్టెంబర్ 30, 2031 వరకు ఐదేళ్ల కాలానికి బోర్డు ఛైర్మన్‌గా తిరిగి నియమితులైన మిట్టల్, తన పదవీకాలం ముగిసే సమయానికి సంస్థను పటిష్టమైన స్థితిలో వారసులకు అందించాలని భావిస్తున్నారు. గతంలో భారతీ టెలికాం 51% వాటాను కలిగి ఉండేది. ప్రస్తుతం ఇది కొంత తగ్గినప్పటికీ తాను తప్పుకునే సమయానికి తిరిగి 51% లేదా కనీసం 50% పైగా వాటాను ప్రమోటర్ల చేతుల్లోకి తీసుకురావాలని మిట్టల్ ఆశిస్తున్నారు.సంస్థాగత నిర్మాణంకంపెనీ నిర్వహణ మొత్తం ఒకే గొడుగు కింద ఉండాలని, ప్రమోటర్లు నియంత్రణ వాటాదారులుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ‘ఇంతటి భారీ పరిమాణం ఉన్న సంస్థలో 10% వాటాను పెంచడం అంటే చిన్న విషయం కాదు, కానీ అది నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
25 ఏళ్ల అనుభవం.. టెక్కీ ఆవేదన!
సాఫ్ట్వేర్ రంగం అంటే ఒకప్పుడు రాయల్ లైఫ్, భారీ ప్యాకేజీలు, నిరంతర అవకాశాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అపారమైన అనుభవం, అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ ఉద్యోగ వేటలో ఎదురవుతున్న సమస్యలు టెక్కీలను కుంగదీస్తున్నాయి. తాజాగా అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.25 ఏళ్ల అనుభవం..ఆండ్రూ అనే టెక్కీకి సాఫ్ట్వేర్ రంగంలో పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు విజయవంతంగా వ్యాపారాలను నడిపిన ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ, గత కొంతకాలంగా ఆయన పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఏకంగా 2,000 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం గమనార్హం.‘నేను అసలు ఉద్యోగానికి పనికిరానా అని నాకే సందేహం కలుగుతోంది. నా 25 ఏళ్ల అనుభవాన్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) ఫిల్టర్ చేసేస్తున్నాయా? లేదా నా రెజ్యూమె ఫార్మాట్లో లోపం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు’ అంటూ ఆండ్రూ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.తిరస్కరిస్తున్న ఏఐ వ్యవస్థలు?నేటి కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియ అంతా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల (ఏటీఎస్) చేతుల్లో ఉంది. వందలాది ఈమెయిల్స్ పంపినా సుమారు 100 మంది హైరింగ్ మేనేజర్లను నేరుగా సంప్రదించినా ఆండ్రూకు ఒక్క స్పందన కూడా రాలేదు. అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న భయం కంపెనీల్లో ఉండవచ్చని లేదా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారా అనే చర్చ దీనితో మొదలైంది. ‘ఇది కేవలం నా కెరీర్ సమస్య మాత్రమే కాదు. నా జీవన ప్రమాణాలను, నన్ను నమ్ముకున్న వారిని ప్రభావితం చేస్తోంది. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందేమో’ అని ఆండ్రూ వాపోయారు.సోషల్ మీడియాలో సలహాలుఆండ్రూ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పలువురు నిపుణులు భిన్న సలహాలు ఇస్తున్నారు. ‘సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నుంచి కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ బ్రోకరేజ్ వంటి రంగాలకు మారండి’ అంటు కొందరు సూచిస్తున్నారు. ‘మీ అనుభవంతో మరొకరికి ఉద్యోగం చేయడం కంటే మీరే యజమానిగా మారి స్టార్టప్ ప్రారంభించండి’ అని మరికొందరు సలహా ఇచ్చారు.I have a hard time believing that I am just unhireable. But I have an even harder time believing that my 25 years of experience is somehow negated by the format of my resume.But, after over 2,000 applications, I am not sure what else to think. And, out of the dozens of emails…— andrewthecoder (@_andrewthecoder) May 11, 2026ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారీగా లే-ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఆండ్రూ ఉదంతం కేవలం ఒక్క వ్యక్తి సమస్య మాత్రమే కాదు. గ్లోబల్ టెక్ మార్కెట్లో సీనియర్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న అనిశ్చితికి అద్దం పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవ వనరుల విలువను కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్‌తో అంచనా వేయడం వల్ల ఇలాంటి ప్రతిభావంతులు నిరాశకు గురవుతున్నారు. కంపెనీలు తమ నియామక ప్రక్రియను మరింత మానవీయ కోణంలో పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి! -
సామ్ ఆల్ట్మాన్ ఓ నమ్మకద్రోహి!
ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఎలాన్ మస్క్ వర్సెస్ ఓపెన్ ఏఐ న్యాయ పోరాటం కీలక దశకు చేరుకుంది. కృత్రిమ మేధ భవిష్యత్తును శాసించే ఈ కేసులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో గురువారం ముగింపు వాదనలు జరిగాయి. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఒక అబద్ధాల కోరు అని, లాభాపేక్ష లేని సంస్థను తన సొంత లాభాల కోసం వాడుకున్నారని మస్క్ తరఫు న్యాయవాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు, మస్క్ తీరును ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’గా ఓపెన్ ఏఐ అభివర్ణించింది.ముగింపు వాదనల్లోని ముఖ్యాంశాలుమస్క్ తరఫు న్యాయవాది స్టీవెన్ మోలో వాదనలు వినిపిస్తూ, సామ్ ఆల్ట్మాన్ కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మాజీ బోర్డు సభ్యులు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్స్కెవర్ సహా ఐదుగురు సాక్షులు ఆల్ట్మాన్ తీరును తప్పుబట్టారని గుర్తు చేశారు. ‘ఈ కేసులో సామ్ ఆల్ట్మాన్ విశ్వసనీయతే అసలు ప్రశ్న. మీరు అతడిని నమ్మకపోతే ఈ కేసులో ప్రతివాదులు గెలవలేరు’ అని మోలో జ్యూరీకి విన్నవించారు.150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంఓపెన్ ఏఐ సంస్థను మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలకు తాకట్టు పెట్టి సంస్థ అసలు ఆశయమైన మానవాళి సంక్షేమాన్ని విస్మరించారని మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన నష్టానికి గాను సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా) నష్టపరిహారాన్ని మస్క్ కోరుతున్నారు. ఈ మొత్తాన్ని లాభాపేక్ష లేని సంస్థకే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని కోరారు.ఓపెన్ ఏఐ ఎదురుదాడిఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్ మస్క్ వాదనలను కొట్టిపారేశారు. ‘మస్క్‌కు కొన్ని రంగాల్లో అపారమైన ప్రతిభ ఉండొచ్చు కానీ, ఏఐ విషయంలో మాత్రం కాదు. ఇక్కడ గెలవాలంటే ఆయన చేయగలిగింది కేవలం కోర్టుకు రావడమే’ అని ఎద్దేవా చేశారు. ఏఐ రంగంలో మస్క్ వెనకబడిపోయారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సారా ఎడ్డీ వాదించారు.‘సెలెక్టివ్ ఆమ్నేసియా’.. మస్క్‌పై విమర్శలు2018లోనే సంస్థకు నిధుల అవసరం ఉందని మస్క్‌కు తెలుసని, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు లాభాలు చూశాక కోర్టుకు రావడం వెనుక దురుద్దేశం ఉందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని కీలక పత్రాలను తాను చదవలేదని మస్క్ చెప్పడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తకు ‘సెలెక్టివ్ ఆమ్నేసియా’ (కావాల్సినవి మాత్రమే గుర్తుంచుకోవడం) ఉందని విమర్శించారు.మైక్రోసాఫ్ట్ పాత్రపై వివాదంఓపెన్ ఏఐ చేస్తున్న ప్రతి తప్పులోనూ మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉందని మస్క్ న్యాయవాదులు ఆరోపించారు. అయితే, తాము కేవలం బాధ్యతాయుతమైన పెట్టుబడిదారులమని, సంస్థ అంతర్గత నిర్ణయాల్లో జోక్యం లేదని మైక్రోసాఫ్ట్ న్యాయవాది రస్సెల్ కోహెన్ స్పష్టం చేశారు.తదుపరి ఏం జరగబోతోంది?ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ సోమవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది.మస్క్ గెలిస్తే: ఓపెన్ ఏఐ బోర్డులో భారీ మార్పులు, భారీ జరిమానా, సంస్థను తిరిగి లాభాపేక్ష లేనిదిగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.మస్క్ ఓడిపోతే: ఓపెన్ ఏఐ తన 1 ట్రిలియన్ డాలర్ ఐపీఓ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది.ఇదీ చదవండి: ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్ -
ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఐటీ దిగ్గజం ఒరాకిల్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. వ్యాపార పునర్నిర్మాణం, నియామక అవసరాల్లో మార్పులను సాకుగా చూపుతూ ఇప్పటికే ఎంపికైన విద్యార్థులకు ఇచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లను, ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లను (పీపీఓ) సామూహికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో వందలాది మంది మేధావుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.ఒకే రోజులో 50కి పైగా ఆఫర్లు రద్దుసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్ వేదికగా బాధితులు తమ ఆవేదనను పంచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్, ఖరగ్‌పూర్ సహా ఎన్ఐటీలు, బిట్స్ పిలానీ క్యాంపస్‌ల నుంచి విద్యార్థులను ఒరాకిల్ ఎంపిక చేసుకుంది. డే-1 ప్లేస్‌మెంట్‌లోనే ఏడాదికి రూ.35 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీలతో ఈ ఆఫర్లు లభించాయి. అయితే కంపెనీ ఈ నియామకానలు రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో ఇప్పడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్లయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేవలం ఒకే రోజులో వివిధ క్యాంపస్‌ల నుంచి 50కి పైగా ఆఫర్లను కంపెనీ రద్దు చేసింది.వన్ స్టూడెంట్ - వన్ ఆఫర్ఐఐటీలు, ఎన్ఐటీలలో కఠినమైన ప్లేస్మెంట్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఒక విద్యార్థికి ఒక కంపెనీలో ఉద్యోగం వస్తే ఆ విద్యార్థి తదుపరి వచ్చే ఏ ఇతర కంపెనీ ఇంటర్వ్యూలకు హాజరుకాకూడదు. ‘మేము ఎంతో కష్టపడి డే-1 కంపెనీలో ఆఫర్ సాధించాం. కానీ ఇప్పుడు ఒరాకిల్ ఆఫర్ వెనక్కి తీసుకోవడంతో అటు పాత ఉద్యోగం లేదు.. ఇటు ఇతర కంపెనీలకు దరఖాస్తు చేసే అవకాశం పోయింది. ప్లేస్మెంట్ సీజన్ ముగింపు దశకు రావడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’ అని ఒక విద్యార్థి వాపోయారు.వరంగల్ ఎన్ఐటీ విద్యార్థుల ఆవేదననేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), వరంగల్ విద్యార్థులు సైతం ఈ ప్రభావానికి బలయ్యారు. అంతర్గత పునర్నిర్మాణం, హెడ్ కౌంట్ మార్పుల వల్ల తన పీపీఓ రద్దు చేసినట్లు ఒక విద్యార్థి లింక్డ్ఇన్లో వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎన్ఐటీ వరంగల్ ‘సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్’ విద్యార్థుల తప్పిదం లేకపోయినా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఇప్పుడు ఈ విద్యార్థులు స్వతంత్రంగా(ఆఫ్ క్యాంపస్) ఉద్యోగాలు సాధించాల్సి ఉందని చెప్పింది.ఏఐ విప్లవం.. ఉద్యోగాల కోత!ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. అందులో భారతదేశం నుంచి సుమారు 12,000 మంది (40%) ఈ కోతలకు గురయ్యారు. క్లౌడ్, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, ఇంజినీరింగ్, నెట్ సూట్ ఇండియా డెవలప్మెంట్ వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు జరిగాయి.ఇదీ చదవండి: ఉగాండా గతి మార్చిన భారత్ -
చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.మిస్సౌరీకి చెందిన సెనేటర్ ఎరిక్ ష్మిత్, ఎక్స్ (X) వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వీసా కార్యక్రమాలు అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాలను తగ్గిస్తూ, అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టే “గ్లోబల్ వీసా కార్టెల్”గా మారిందని పేర్కొన్నారు.“అమెరికన్ పన్ను చెల్లింపుదారుల సబ్సిడీలతో బిలియన్ల డాలర్లు ఇప్పుడు భారతదేశానికి ప్రవహిస్తున్నాయి. అవి అమెరికన్లకు కాకుండా విదేశీ కార్మికుల శిక్షణకు ఉపయోగపడుతున్నాయి” అని ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. తన వాదనకు ఉదాహరణగా చిలుకూర్ బాలాజీ ఆలయ చిత్రాన్ని షేర్ చేసిన ష్మిత్, దీనిని “వీసా టెంపుల్”గా అభివర్ణించారు. అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ, పాస్‌పోర్ట్‌లకు ఆశీర్వాదాలు పొందుతారని ఆయన పేర్కొన్నారు.“హైదరాబాద్‌లో ‘వీసా కార్టెల్’కు సొంతంగా ఒక వీసా దేవాలయం కూడా ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.ఇక విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది భారతీయులేనని, వారికి పన్ను చెల్లింపుదారుల సబ్సిడీతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని ష్మిత్ ఆరోపించారు. “వారు తర్వాత హెచ్-1బీ, గ్రీన్ కార్డుల వైపు వెళ్తుంటే, భారీ విద్యారుణాలతో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా, భారతీయ వీసా హోల్డర్లు వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటారని, పెద్ద టెక్ కంపెనీలు ఈ వీసా వ్యవస్థల ద్వారా అమెరికన్ ఉద్యోగాలను మళ్లిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. “మెరిట్ స్థానంలో ఇప్పుడు జాతి ఆధారిత ప్రాధాన్యత చోటు చేసుకుంది” అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని చిలుకూర్ బాలాజీ ఆలయం ఎన్నో ఏళ్లుగా “వీసా దేవాలయం”గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీసా ఇంటర్వ్యూలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.కాగా, అమెరికా హెచ్-1బీ వీసా ఆమోదాల్లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తుండగా, చైనా వాటా సుమారు 12 శాతంగా ఉంది.The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.American workers shouldn’t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు!
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో.. పొదుపు, ఖర్చుల విషయంపై నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు.ఖర్చులను, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వర్క్-ఫ్రమ్-హోమ్‌ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరివర్తనను వేగవంతం చేయాలని హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక నోట్ ద్వారా వెల్లడించారు.విదేశీ ప్రయాణాలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని, దేశీయ విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలని సూచించారు. అంతే కాకుండా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లి సమావేశాలు నిర్వహించదానికి బదులు, ఆన్లైన్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని అన్నారు.We in RPG have responded to our PM’s call with austerity and responsible resource allocations. I hope other corporates will follow suit. pic.twitter.com/Bhv0RVUFjq— Harsh Goenka (@hvgoenka) May 14, 2026ఉద్యోగుల పని విధానంలో కూడా మార్పులు సూచించారు. ఇంటి నుంచే పని చేయగల ఉద్యోగులను ''వర్క్ ఫ్రమ్ హోమ్'' విధానంలో పనిచేయాలని ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఈ విధానం విజయవంతంగా అమలైనందున, ఇప్పుడు కూడా అది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థకు సంబంధించిన భవిష్యత్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు కార్‌పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ
డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ తన ఐపీఓకు ముందు.. ఆకాష్ అంబానీని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 5 సంవత్సరాల కాలానికి ఎండీగా నియమించినట్లు మే 7నాటి ఫైలింగ్‌లో పేర్కొంది.ఆకాష్ అంబానీ అక్టోబర్ 2014 నుంచి జియో ప్లాట్‌ఫామ్స్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (RJIL) బోర్డులో ఉన్నారు. జూన్ 2022లో ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలో 2016లో ప్రారంభమైన ఆరు నెలల లోపే జియో 100 మిలియన్ల చందాదారుల మార్కును సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 30,000 కోట్లకు పైగా లాభాన్ని.. రూ. 1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. -
ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు: పీయూష్ గోయల్ పిలుపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు ట్రిలియన్ డాలర్ల మార్కునకు చేర్చాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన దీనిపై మాట్లాడారు.ప్రపంచవ్యాప్తంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా సుంకాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రికార్డు స్థాయిలో 863.11 బిలియన్ డాలర్లకు (4.6 శాతం వృద్ధి) పెరిగినట్టు మంత్రి చెప్పారు. ఇందులో వస్తు ఎగుమతులు 0.93 శాతం పెరిగి 441.78 బిలియన్ల డాలర్లుగా ఉంటే, సేవల ఎగుమతులు 8.71 శాతం పెరిగి 421.32 బిలియన్ డాలర్లకు చేరినట్టు వెల్లడించారు. మరో 137 బిలియన్ డాలర్లు పెంచుకోవడం ద్వారా ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాలని కోరారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మద్దతు..పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకోవడం ద్వారా ఆయా మార్కెట్లలో భారత ఉత్పత్తులకు ద్వారాలు తెరుస్తున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు.భారత వస్తువులకు అంతర్జాతీయ విపణిలో ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 2021 నుంచి ఇప్పటివరకు తొమ్మిది కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు గుర్తు చేశారు. ఇందులో నాలుగు అమల్లోకి రాగా, మిగిలిన ఐదు వచ్చే 12 నెలల్లో ఆచరణలోకి రానున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి చిలీ, మాల్దీవులతో ఒప్పందాలు పూర్తవుతాయని.. కెనడా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, రష్యాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. -
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ: రెండేళ్లలో రూ. 84 వేలకోట్లు!
గత రెండేళ్లలో రూ.84,000 కోట్లకు పైగా పెట్టుబడుల మద్దతుతో, తెలంగాణ జీవ శాస్త్రాల పర్యావరణ వ్యవస్థ సుమారు 145 బిలియన్ డాలర్ల విలువను చేరుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన విస్తరణగా నిలిచింది.పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (టిఎల్ఎస్ఎఫ్) 7వ బోర్డు సమావేశంలో ఈ పరివర్తనాత్మక పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. టిఎల్ఎస్ఎఫ్ సీఈఓ శక్తి ఎం. నాగప్పన్, తన దశాబ్ద కాల పదవీకాలంలో ఈ రంగం సాధించిన వృద్ధిపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరియు గౌరవనీయ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుల శక్తివంతమైన నాయకత్వంలో గడిచిన రెండేళ్లు ఒక కీలక మలుపు అని ఆయన నొక్కి చెప్పారు.తెలంగాణాలో 2016 నుంచి జీవశాస్త్ర రంగం దాదాపు మూడు రెట్లు అభివృద్ధి చెందింది. దీనితో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ అండ్ హెల్త్ టెక్ ఆవిష్కరణలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది.ఒక విశేషమైన ఘనత ఏమిటంటే, ప్రపంచంలోని అగ్రగామి పది లైఫ్ సైన్సెస్ కంపెనీలలో తొమ్మిదింటికి చెందిన సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఘనత సాధించిన, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం ఇదే. పటిష్టమైన విధాన కార్యాచరణ విధానాలు, వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు మరియు లక్షిత సంస్థాగత నిర్మాణం వంటివి దీనికి కీలక చోదకాలుగా ఉన్నాయి. ఇవి తెలంగాణను సమగ్రమైన ప్రపంచ పర్యావరణ వ్యవస్థగా సుస్థిరం చేస్తున్నాయి.ఈ పరివర్తన దశలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్ది, విస్తరించడంలో చూపిన నాయకత్వానికి బోర్డు ఏకగ్రీవంగా సీఈఓ శక్తి ఎం. నాగప్పన్‌ను ప్రశంసించింది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభినందనలను నమోదు చేసింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను 'సలహాదారు (లైఫ్‌సైన్సెస్)'గా నియమించిందని, అలాగే ఆయన తెలంగాణ లైఫ్‌సైన్సెస్ ఫౌండేషన్ బోర్డులో కొనసాగుతారని బోర్డు పేర్కొంది. -
ఏఐ కోసం 30 శాతం సిబ్బందిపై వేటు..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. ప్రముఖ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ ‘గిట్‌ల్యాబ్’ తన మొత్తం శ్రామిక శక్తిలో ఏకంగా 30 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నా భారత్‌లో మాత్రం కొత్త నియామకాలకు కంపెనీ మొగ్గు చూపుతుండటం గమనార్హం.ఏఐ కోసం పునర్నిర్మాణంజనవరి 2026 నాటికి గిట్‌ల్యాబ్‌లో మొత్తం 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన 30 శాతం కోత ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీ సీఈఓ బిల్ స్టేపుల్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ మార్పులను ధ్రువీకరించారు. ‘ఏజెంటిక్ ఏఐ యుగంలో మాకున్న ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యయ నియంత్రణ ద్వారా వచ్చే పొదుపును తిరిగి ఏఐ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వాలంటరీ సెవరెన్స్ విండో (స్వచ్ఛంద విరమణ) అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 1, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.భారత్‌పై గిట్‌ల్యాబ్ ఆసక్తిప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నప్పటికీ భారత్‌లో మాత్రం గిట్‌ల్యాబ్ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో భారతదేశానికి సంబంధించి 20కి పైగా ఉద్యోగ ప్రకటనలను కంపెనీ పోస్ట్ చేసింది. అందులో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, కస్టమర్ సక్సెస్ ఇంజినీర్ వంటి పాత్రలున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ రిమోట్ (ఇంటి నుంచే పని) పద్ధతిలో ఉండటం విశేషం. గిట్‌ల్యాబ్ తన కార్యకలాపాలు సాగించే దేశాల సంఖ్యను తగ్గించుకుని భారత్, అమెరికా వంటి కీలక మార్కెట్లపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.నిజమైన పెట్టుబడా? తొలగింపులకు సాకా?గిట్‌ల్యాబ్ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఏజెంట్ల గురించి వ్యాసాలు రాస్తూ, మరోవైపు సిబ్బందిని తొలగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ అన్నట్లుగా.. కొన్ని కంపెనీలు తమ అసమర్థతను దాచుకోవడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుతున్నాయా? అనే సందేహాలను నిపుణులు లేవనెత్తుతున్నారు. ‘ఇది వాస్తవంగా ఏఐ కోసం చేస్తున్న మార్పా? లేక 2026లో ఏఐ పేరు చెప్పి చేస్తున్న సాధారణ తొలగింపా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మెటా, అమెజాన్ వంటి దిగ్గజాల బాటలోనే గిట్‌ల్యాబ్ పయనిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత్ వంటి దేశాల్లో నియామకాలు చేపట్టడం సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా టెక్ ప్రపంచంలో మనుషుల స్థానాన్ని యంత్రాలు (ఏఐ) భర్తీ చేస్తున్నాయా అనే చర్చకు గిట్‌ల్యాబ్ తాజా నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన -
జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్
యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్ జెడ్‌లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు. జెన్ ఎక్స్ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి. వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్‌ను మలుచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌లో తమ ప్రొఫైల్‌లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్‌లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది. 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్ఇన్ ఈ వివరాలు రూపొందించింది. వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్ టూల్స్ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది. 85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు. తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు. భారత్‌లో జెన్‌జెడ్ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు. ఏఐతో అందరికీ అవకాశాలు..‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్ఇన్ భారత మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన -
సౌండ్ తగ్గిన ఎయిర్టెల్
మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 34 శాతం క్షీణించి రూ. 7,325 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ప్రధానంగా చట్టబద్ధ పన్ను లయబిలిటీలకు చేపట్టిన వన్‌టైమ్ కేటాయింపులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ.11,022 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 55,383 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 47,876 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో దేశీ విభాగం నుంచి 8 శాతం వృద్ధితో రూ. 39,566 కోట్లు లభించింది. మొబైల్ సరీ్వసుల విభాగం నుంచి దీనిలో రూ. 28,831 కోట్లు లభించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 245 నుంచి రూ. 257కు మెరుగుపడింది. ఇది 5 శాతం వృద్ధికాగా.. పెట్టుబడి వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 16,066 కోట్లుగా నమోదయ్యాయి. పోస్ట్‌పెయిడ్ విభాగంలో 8 లక్షల కస్టమర్లు జత కలవడంతో ఈ సంఖ్య 2.9 కోట్లకు చేరింది.పూర్తి ఏడాదికి..మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్టెల్ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 26,995 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 33,556 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 22 శాతం జంప్‌చేసి రూ. 2,10,973 కోట్లను తాకింది. వెరసి తొలిసారి ఆదాయం రూ. 2 లక్షల కోట్లను దాటడంతోపాటు.. 66.5 కోట్ల కస్టమర్ల మార్క్‌ను అధిగమించిన దేశీ కంపెనీగా నిలిచినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. పూర్తిఏడాదికి కంపెనీ పెట్టుబడి వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 47,522 కోట్లకు చేరాయి. నికర రుణ భారం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లకు తగ్గింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన -
గోల్డ్ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!
సాక్షి, బిజినెస్ డెస్క్: పసిడి, వెండిపై సుంకాల మోతతో ఆభరణాల మార్కెట్ గందరగోళంలో పడింది. దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిల్వలను నిలబెట్టుకునేందుకు, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూసుకునేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కొత్త కొనుగోళ్ల కోసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పాత వాటిని కొత్త వాటికి మార్చుకునేలా ప్రోత్సహించడం ద్వారా రీసైక్లింగ్‌కి ఊతమివ్వనుంది.అయితే, అదే సమయంలో స్మగ్లింగ్ రిస్కులు పెరుగుతాయని, ఆభరణాల వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పసిడి, వెండి దిగుమతులపై సుంకాల మోత పలు సమస్యలకు దారి తీస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనితో వజ్రాభరణాల పరిశ్రమ మరింత గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ రిస్కులు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.పరిశ్రమకు వెన్నెముకలాంటి లఘు, చిన్న, మధ్యతరహా తయారీదార్లు ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటూ ఉండగా, తాజా పరిణామం అశనిపాతంలా మారుతుందన్నారు. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల సాధారణంగానే ధరలు పెరుగుతాయని, కాకపోతే కొనుగోళ్లను తగ్గించడానికి ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పసిడి రేట్లు రెట్టింపైనప్పటికీ దిగుమతులు అదే నిష్పత్తిలో తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో సుంకాల పెంపులాంటి చర్యల వల్ల స్మగ్లింగ్‌కి ఊతం లభిస్తుందని, ఎగుమతి వ్యయాలు పెరిగిపోతాయని ఎగుమతిదార్లు తెలిపారు.‘పొదుపు చర్యలు, బులియన్ దిగుమతులపై సుంకాల పెంపు వల్ల వ్యాపారం మరింత కష్టతరం అవుతుంది. గ్రే మార్కెట్, స్మగ్లింగ్ పెరిగి, ఎకానమీలో సమాంతర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసే ముప్పు ఉందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది’ అని అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, వ్యవసాయ సెస్సులన్నీ కలగలిసిన దిగుమతి సుంకాల పెంపుతో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 27,000 మేర భారం అవుతుందని చెప్పారు. సుంకాలను పెంచడం వల్ల బంగారం రేట్లు మరింత పెరగడం తప్ప దిగుమతులకు అడ్డుకట్ట పడటం చాలా అరుదని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరీట్ భన్సాలీ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్‌కి దన్ను.. పసిడి దిగుమతి సుంకాల పెంపుతో స్వల్పకాలికంగా ఆభరణాల విక్రయ పరిమాణం తగ్గుతుందని జ్యుయలర్లు తెలిపారు. అయితే, డిమాండ్ స్థిరంగానే ఉండొచ్చని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, భారీ క్రూడాయిల్ ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు పెంచిన సుంకాలు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. పరిమాణంపరంగా 10–15% ప్రభావం పడినప్పటికీ, విలువపరంగా లావాదేవీలు అధిక స్థాయిలోనే ఉంటాయన్నారు.వినియోగదారులు తేలికపాటి ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపొచ్చన్నారు. మరో వైపు, సంస్కృతి, పెట్టుబడులపరంగా బంగారానికి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసే వారి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. సుంకాల పెంపు వల్ల గోల్డ్ రీసైక్లింగ్ పెరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుతో ‘నేషన్ ఫస్ట్ గోల్డ్4 ఇండియా’ కార్యక్రమాన్నిఆవిష్క రించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఎండీ కల్యాణరామన్ తెలిపారు. -
హైదరాబాద్‌లో 4 రెట్లు పెరిగిన అమెజాన్ బజార్ కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందుబాటు ధరల్లో ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అంతర్భాగంగా ఉన్న అమెజాన్ బజార్‌కి (Amazon Bazaar) సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగినట్లు అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కస్టమర్ల చేరిక నాలుగు రెట్లు పెరగ్గా, విజయవాడ, గుంటూరు, వరంగల్ తదితర నగరాలు కూడా ముందు వరుసలో ఉన్నట్లు వివరించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1,200 మంది పైచిలుకు విక్రేతలు ఉన్నట్లు తెలిపారు. బజార్లో రూ. 99 నుంచి రూ. 600 ధర శ్రేణిలో మూడు కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల ఫ్యాషన్, గృహోపకరణలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ మొదలైన కేటగిరీల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోకి మరింత విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు లాల్వానీ చెప్పారు. డెలివరీ అసోసియేట్స్‌కి హెల్త్ కవరేజీ మరోవైపు, దేశవ్యాప్తంగా 90,000 మంది డెలివరీ అసోసియేట్స్‌కి హెల్త్ కవరేజీని విస్తరిస్తున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ (ఆపరేషన్స్) సలీమ్ మెమన్ తెలిపారు. రూ. 1.5 లక్షల వరకు మెడిక్లెయిమ్, రూ. 10,000 వరకు ఓపీడీ ప్రయోజనాలు, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ మొదలైనవి వీటిలో ఉన్నట్లు వివరించారు. డెలివరీ అసోసియేట్స్ కోసం ఉచిత హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అసోసియేట్స్ సంక్షేమంపై రూ. 2,800 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా వీటిని చేపట్టినట్లు మెమన్ చెప్పారు. -
జుకర్‌బర్గ్ రికార్డు బద్దలు..
సాధారణంగా 22 ఏళ్ల వయసు అంటే కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మలుచుకునే దశ. కానీ, భారత సంతతికి చెందిన సూర్య మిధా ఆలోచనలు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాను సవాల్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త కేవలం 22 ఏళ్లకే సుమారు 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18,000 కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్’గా అవతరించారు. ఈ క్రమంలో ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నెలకొల్పిన రికార్డును సైతం ఆయన అధిగమించడం విశేషం.జుకర్‌బర్గ్ కంటే వేగంగా..గతంలో మార్క్ జుకర్‌బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ క్లబ్లో చేరగా సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందుగానే (22 ఏళ్లకే) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా కేవలం తన వినూత్న ఏఐ స్టార్టప్ ద్వారా ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.విజయానికి బాటలుసూర్య మిధా తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్‌లతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ సంస్థ ఈ అద్భుత విజయానికి కీలకంగా నిలిచింది. ఇది సాధారణ నియామక సంస్థ కాదు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్లాట్‌ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వగల, పరిశోధన చేయగల నిపుణులను గుర్తించి పెద్ద కంపెనీలకు అనుసంధానిస్తుంది. అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేయడం నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ ఏఐని ఉపయోగిస్తుంది. ఈ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది.మెరుపు వేగంతో వాల్యుయేషన్పెట్టుబడిదారుల నమ్మకమే మెర్కోర్ విజయ రహస్యం. బెంచ్‌మార్క్, ఫెలిసిస్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో ఈ స్టార్టప్ విలువ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి 2025లో 100 మిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక ఆదాయం, సెప్టెంబర్ నాటికే 500 మిలియన్ డాలర్లకు పెరగడం ఏఐ రంగంలోనే ఒక రికార్డు.సిలికాన్ వ్యాలీలో కొత్త ఒరవడిసూర్య మిధా ప్రస్థానం విలక్షణమైనది. చర్చా వేదికల్లో పరిచయమైన ముగ్గురు మిత్రులు తమ స్టార్టప్ కల కోసం కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు. నేడు ఏఐ రంగం కేవలం చాట్‌బాట్‌లకే పరిమితం కాకుండా.. రిక్రూట్మెంట్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఎలా విప్లవం తీసుకురాగలదో మెర్కోర్ నిరూపించింది. భవిష్యత్తు అంతా ఏఐదే అని ఐటీ నిపుణులు చెబుతున్న మాటలను సూర్య మిధా నిజం చేసి చూపించారు. భారత సంతతికి చెందిన ఈ యువకుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
విజయ్ మాల్యాకు ఉద్యోగిని ట్వీట్..
భారతీయ స్టార్టప్ రంగం అంటేనే సాహసోపేతమైన ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. తాజాగా ఒక స్టార్టప్ ఉద్యోగి చేసిన పని, దానికి తన బాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరారీలో ఉన్న వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను తమ కంపెనీ ఈవెంట్ కోసం అద్దెకు ఇవ్వాలని కోరుతూ ఒక ఉద్యోగి ఏకంగా మాల్యాకే ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.అసలేం జరిగింది?భారతదేశంలో ‘క్రియేటర్ ఎకానమీ’ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ‘లూప్’ అనే కొత్త ప్రోడక్ట్‌ను మే 21న లాంచ్ చేసేందుకు ఒక టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ టీమ్ సభ్యురాలు అనుష్క సింగ్ అనే యువతి, తమ లాంచ్ నైట్ కోసం గోవాలోని ఐకానిక్ కింగ్ ఫిషర్ విల్లా అయితే బాగుంటుందని భావించింది. ఏమాత్రం తటపటాయించకుండా నేరుగా విజయ్ మాల్యాను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది.‘హాయ్ విజయ్ మాల్యా, నా పేరు అనుష్క సింగ్. మే 21న మేము ‘లూప్’ను లాంచ్ చేస్తున్నాము. ఇందుకోసం 1000 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒక రాత్రి కోసం మీ కింగ్ ఫిషర్ విల్లాను మాకు అద్దెకు ఇవ్వగలరా? మీరు ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధం. ఒకవేళ అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ప్రస్తుతం అది ఎవరి ఆధీనంలో ఉందో వారికైనా నన్ను రిఫర్ చేయండి’ అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.అనుమతి లేకుండానే..తన అనుమతి లేకుండా ఉద్యోగి చేసిన ఈ పోస్ట్‌ను చూసి సదరు కంపెనీ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి దినేష్ సింగ్ ఆశ్చర్యపోయారు. అయితే, ఆమెను మందలించడానికి బదులు ఆమెలోని ధైర్యాన్ని అభినందిస్తూ ఇంటర్నెట్ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, నేను పని చేయాలనుకుంటున్న టీమ్ ఇలాగే ఉండాలి’ అని పేర్కొంటూ ఆయన రెండు ఆఫర్లను ప్రకటించారు.1. అనుష్క చేసిన పోస్ట్‌కు లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విట్టర్)లో 1,000 రీపోస్టులు వస్తే ఎలాగైనా ఆ విల్లాను బుక్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.2. ఒకవేళ రీపోస్టుల సంఖ్య 5,000 దాటితే మొత్తం గ్రోత్ టీమ్‌ను వారి ఇష్టం వచ్చిన దేశానికి అంతర్జాతీయ పర్యటనకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.విజయ్ మాల్యాను ఉద్దేశించి రాస్తూ, ‘మీరు ఇది చదువుతుంటే ఇకపై నిర్ణయం మీదే. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. మా లాంచ్ ఈవెంట్‌ను ఆమే నడిపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం మీ విల్లానే కావాలని ఆమె నిర్ణయించుకుంది’ అని దినేష్ సింగ్ పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ఇది జెన్-జెడ్ నేతృత్వంలోని స్టార్టప్ మార్కెటింగ్ సరికొత్త దశలోకి ప్రవేశించిందని నిరూపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు, ‘ఆ విల్లా ప్రస్తుతం మాల్యా ఆధీనంలో లేకపోయినా ఈ ప్రయత్నం ద్వారా ఆ టీమ్‌కు లభిస్తున్న పబ్లిసిటీ అమోఘం’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
సిలికాన్ వ్యాలీలో ‘దేశీ’ నెట్వర్క్
సిలికాన్ వ్యాలీలో భారతీయ నిపుణుల ఆధిపత్యంపై మరోసారి చర్చ మొదలైంది. గూగుల్‌లో పనిచేసిన ఒక మాజీ కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయులు ఒక రహస్య నెట్‌వర్క్‌ను నడుపుతున్నారని, అనైతిక మార్గాల్లో తమ వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు అమెరికన్లలో, ఇటు భారతీయ టెక్కీలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఏమిటా ఆరోపణలు?జీబీ న్యూస్ రూపొందించిన ‘హెచ్-1బీ డాక్యుమెంటరీ’ కోసం స్టీఫెన్ వివియన్ అనే మాజీ గూగుల్ కాంట్రాక్టర్ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్‌లో పనిచేసే భారతీయ ఉద్యోగులు తమ స్నేహితులకు లేదా పరిచయస్తులకు ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను ముందుగానే లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతీయులు కేవలం ఇండియన్స్‌నే నియమించుకోవడానికి ఇష్టపడుతున్నారని, దీనివల్ల అర్హత ఉన్న ఇతరులకు అన్యాయం జరుగుతోందని వివియన్ పేర్కొన్నారు. ‘నేను ఒక భారతీయ వ్యక్తితో స్నేహం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఈ రహస్యాలు తెలిశాయి. ఇంటర్వ్యూలు పూర్తిగా గోప్యంగా ఉండాలి. కానీ వారు ఆ ప్రశ్నలను పంచుకుంటున్నారు. నిజాయితీ లేని అంశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.నెట్టింట ముదిరిన యుద్ధంవివియన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మెజారిటీ నిపుణులు ఆయన మాటలను కొట్టిపారేస్తూ, భారతీయ టెక్కీల ప్రతిభను తక్కువ చేయడమేనని మండిపడుతున్నారు. ‘భారతీయులు ప్రపంచస్థాయి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారంటే అది వారి సామర్థ్యం. ఒక కఠినమైన జాబ్ మార్కెట్లో పోటీ పడలేక మొత్తం జాతీయతపై నిందలు వేయడం మీ పక్షపాతాన్ని చూపిస్తుంది’ అని ఒక నెటిజన్ స్పందించారు.ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త రిచర్డ్ హనానియా స్పందిస్తూ, ‘ఈ వ్యక్తి ఒక డెలివరీ మేనేజర్ మాత్రమే, గూగుల్‌లో కీలక నిర్ణయాధికారి కాదు. ఒక కాంట్రాక్టర్ మాటలను పట్టుకుని భారతీయ నిపుణులందరినీ స్కామర్లుగా ముద్ర వేస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే, వివియన్‌కు మద్దతు ఇచ్చే వారు కూడా లేకపోలేదు. ఐటీ రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వారు తమ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన
కొవిడ్ పరిణామాల తర్వాత ఐటీ ఉద్యోగులు తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బాట పట్టిన తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు తెరలేపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును గౌరవిస్తూ తమ సంస్థలో తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రధాని పిలుపుదేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పౌరులు, సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు, నేషన్ ఫస్ట్ అనే గ్రాఫిక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. అనవసర ప్రయాణాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేయడాన్ని ప్రోత్సహించాలి. విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం, బంగారం కొనుగోళ్లపై నియంత్రణ అనే అంశాలున్నాయి.‘ఒక సంస్థగా మేము ఇటీవలి కాలంలో పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచి పనిచేసే విధానానికి మారాం. అయితే, ప్రధాని విజ్ఞప్తి నేపథ్యంలో మేము మా నిర్ణయాన్ని పునసమీక్షించుకోబోతున్నాం’ అని వెంబు స్పష్టం చేశారు.ఆచరణలో జోహోశ్రీధర్ వెంబు తన పోస్ట్‌లో జోహో ఇప్పటికే అంతర్గతంగా తీసుకుంటున్న మార్పులను కూడా వివరించారు. ‘సంస్థకు చెందిన పొలాల్లో సహజ సిద్ధమైన సాగు పద్ధతులను అవలంబిస్తున్నాం. డీజిల్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని చెప్పారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.శ్రీధర్ వెంబు ప్రతిపాదన కేవలం ఒక కంపెనీ నిర్ణయంగా చూడలేమని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని తగ్గించే ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మరిన్ని ఐటీ దిగ్గజాలు ఇదే బాటలో నడిస్తే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, దీనివల్ల ప్రభావితమయ్యే అసంఘటిత రంగ కార్మికులకు సరైన పరిష్కారం అందించాలి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
ఐటీ దిగ్గజం దిక్సూచీ
భారతీయ సమాచార సాంకేతిక (ఐటీ) రంగ ముఖచిత్రాన్ని మార్చివేసిన దార్శనికుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి. భారతీయ ఐటీ పరిశ్రమ పితామహుడుగా కీర్తించబడే ఆయన కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు నైతిక విలువల పాఠాలు నేర్పిన గురువు. ‘సాధారణ జీవనం - ఉన్నత ఆలోచన’ అనే సిద్ధాంతాన్ని తూచతప్పకుండా పాటించే మూర్తి పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. విజయం, నాయకత్వ లక్షణాలపై ఇటీవల ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద తెలియజేశాం.మూర్తి టాప్ కోట్స్ఒక గొప్ప నాయకుడికి తన సమక్షంలో ఉన్న ప్రజలను మరింత సమర్థులుగా మార్చగలిగే సామర్థ్యం ఉండాలి.అనుభవం నుంచి నేర్చుకోవడం సంక్లిష్టంగా ఉంటుంది. వైఫల్యం కంటే విజయం నుంచి నేర్చుకోవడం చాలా కష్టం. మనం విఫలమైతే కారణాల గురించి తప్పకుండా ఆలోచిస్తాం, కానీ విజయం మన గత చర్యలన్నింటినీ విచక్షణారహితంగా సరైనవని నమ్మేలా చేస్తుంది.ఎక్కువ వాగ్దానం చేసి తక్కువ ఇవ్వడం కంటే, తక్కువ వాగ్దానం చేసి అంతకు మించి డెలివరీ చేయడం ఉత్తమం. ఇందుకోసం చట్టాలను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు.పురోగతి అనేది తరచుగా మనసు, మనస్తత్వం మధ్య ఉండే వ్యత్యాసానికి సమానం.ఓడ షిప్‌యార్డ్‌లో ఉన్నప్పుడు చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ వాటిని నిర్మించేది అక్కడే ఉండటానికి కాదు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ప్రయాణం సాగుతుంది.మీ హోదా వల్ల మీరు స్టార్ అవ్వరు; మీరు కంపెనీకి ఎంత విలువను జోడిస్తున్నారనే దానిపైనే మీ స్టార్ హోదా ఆధారపడి ఉంటుంది.మీరు ఎక్కడ మొదలుపెట్టారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎలా, ఏమి నేర్చుకుంటున్నారు అనేదే ముఖ్యం. నేర్చుకునే నాణ్యత బాగుంటే మీ అభివృద్ధి గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది.విలువల పునాదిపై నిర్మించిన సామ్రాజ్యం ఎప్పటికీ కూలిపోదు.ఇదీ చదవండి: సామాన్యుడిపై భారమా? దేశాభివృద్ధికి మార్గమా? -
100 ఏళ్ల బజాజ్: 1.30 లక్షల ఉద్యోగులు!
భారతదేశపు అత్యంత పురాతన వ్యాపార సంస్థలలో ఒకటిగా, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అతిపెద్ద గ్రూపులలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, నేడు 100 ఏళ్ల వ్యాపార ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి ఆర్థికాభివృద్ధి వరకు దేశ గమనంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, పరోపకారి, పారిశ్రామికవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ 1926లో ముంబైలో ఈ గ్రూప్‌ను స్థాపించారు. మహాత్మా గాంధీ ఐదవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఆయన వేసిన పునాదులతో, నేడు బజాజ్ గ్రూప్ దేశంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒకరికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.100 కంటే ఎక్కువ కంపెనీలు, 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు.. త్వరలో ఆరోగ్య సంరక్షణ (healthcare) రంగంలోకి అడుగుపెట్టబోతున్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో భారత అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ వంటివి ఈ గ్రూపులోని కొన్ని లిస్టెడ్ కంపెనీలు.దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ, బజాజ్ కుటుంబానికి పంపిన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు, "బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఈ మైలురాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సంస్థకైనా వందేళ్ల ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఆ సంస్థ దీర్ఘకాలిక ఉనికిని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, తరతరాల పాటు తన ప్రాముఖ్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ప్రారంభమైన బజాజ్ గ్రూప్, మన దేశ అభివృద్ధిలోని అనేక దశలలో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక రంగంలో ఒక భాగంగా ఉంది. ఇది వివిధ రంగాలలో కార్యకలాపాలు సాగిస్తూ.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలు అందించే ఒక వైవిధ్యభరితమైన కంపెనీగా ఎదిగింది.గడిచిన దశాబ్దాలుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి మైలురాళ్లు గతంలో అందించిన కీలక సహకారాలను గుర్తు చేసుకోవడానికి, అలాగే వృద్ధి, సుస్థిరత, అందరినీ కలుపుకునిపోయే పురోగతి పట్ల నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.తయారీ రంగం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి పోటీతత్వంలో భారత్ నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. బజాజ్ గ్రూప్ వంటి లోతైన మూలాలు, అనుభవం ఉన్న సంస్థలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.ఈ చిరస్మరణీయ సందర్భంలో బజాజ్ గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో కూడా దేశాభివృద్ధిలో ఈ సంస్థ నిరంతర పురోగతిని మరియు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, శిశు ఆరోగ్యం, విద్య, రక్షణపై దృష్టి సారించిన బజాజ్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు (CSR), ఇప్పటివరకు 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో బజాజ్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సాయంత్రం వేళ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ కుటుంబం పోషించిన పాత్ర నుంచి, వర్తక వ్యాపారం నుంచి తయారీ.. ఆర్థిక సేవల రంగం వైపు సాగిన మార్పు వరకు, అలాగే నేడు వారి వ్యాపారాలు ముందుండి నడిపిస్తున్న సరికొత్త సాంకేతికత వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమం ముఖ్యాంశాలలో బజాజ్ కుటుంబ సభ్యుల ప్రసంగాలు, గ్రామీ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపోజర్ రికీ కేజ్(Ricky Kej) మరియు ఆయన బృందం ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు జమ్నాలాల్ బజాజ్ మరియు మహాత్మా గాంధీపై రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ (Kathni Karni Eksi) అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ‘100 ఇయర్స్ ఆఫ్ బజాజ్’ లోగోను ఆవిష్కరించారు. -
మోదీ మాట.. అదే బాటలో ఐటీ కంపెనీలు!
కరోనా విపత్తు రోజుల మాదిరి తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానానికి మళ్లాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మర్నాడే ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఇందుకు అనుకూలంగా స్పందించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఐటీ కంపెనీలు రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ నమూనా (కొన్ని రోజులు కార్యాలయం, కొన్ని రోజులు ఇంటి నుంచి)కు వీలుగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ విధులు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.‘‘పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో కంపెనీలు క్యాంపస్‌లలో ఇంధన నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి. అవసరం లేని వసతుల వినియోగాన్ని క్రమబద్దీకరించుకుంటున్నాయి. అవసరానికి అనుగుణంగా రిమోట్, హైబ్రిడ్ పని నమూనాలతో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి’’అని నాస్కామ్ తన ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా పరిణామాలను గమనిస్తున్నామని.. పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వంతో సంప్రదిస్తూ, సమన్వయంతో దీన్ని అధిగమిస్తామని పేర్కొంది.నాస్కామ్‌లో 3,500 ఐటీ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కొన్ని అంశాలపై పిలుపునివ్వడం తెలిసిందే. కరోనా సమయంలో అనుసరించిన వర్చువల్ (ఆన్లైన్) సమావేశాలు, సదస్సులతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. -
ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో)
భారతదేశంలో ఉద్యోగ సంస్కృతి మరింత కఠినమైపోతోందని, కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని కంపెనీలు ఆరోపిస్తుంటే.. సంస్థలు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాయని ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.. నెట్టింట హల్చల్ చేస్తోంది.గుర్లీన్ అనే మహిళకు, ఒక సంస్థ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించినప్పటికీ.. కంపెనీ కఠినమైన పర్యవేక్షణ విధానాల కారణంగా తిరస్కరించింది. ఈ సంఘటన ఆధునిక ఉద్యోగ సంస్కృతి, ఉద్యోగుల గోప్యత, మరియు రిమోట్ వర్క్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.గుర్లీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నంతసేపు కెమెరా (వెబ్‌క్యామ్) ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా.. ప్రతి 10 నిమిషాలకు ఉద్యోగి కంప్యూటర్ స్క్రీన్‌షాట్ తీసి పనితీరును కూడా సంస్థ పరిశీలిస్తుందని వెల్లడించింది.ఉద్యోగులపై ఇలాంటి నిరంతర నిఘా చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, ఒత్తిడి కలిగిస్తున్నదని గుర్లీన్ పేర్కొన్నారు. ఈ విధంగా ఉద్యోగికి శిక్షలాగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Gurleen (@sprinkleofgurleen_)వర్క్-ఫ్రం-హోమ్ విధానం అసలు ఉద్దేశం.. ఉద్యోగులకు సౌకర్యం, స్వేచ్ఛ, సమతుల్య జీవనశైలిని అందించడం. కానీ ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ వల్ల ఉద్యోగులు భయంతో పనిచేయాల్సి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. సంస్థలు మనుషులను నియమించుకుంటున్నాయా? లేక రోబోలను నియమించుకుంటున్నాయా? అని ఆమె ప్రశ్నించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఉద్యోగులపై అధిక నిఘా పెట్టడం అనేది నమ్మకంలేని పని సంస్కృతికి సంకేతమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు.. ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు కార్యాలయంలో పని చేసే ఉద్యోగాల కంటే ఎక్కువ ఒత్తిడిగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరికొందరు కంపెనీల విధానాలను సమర్ధించారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
వీఐపీ సంస్కృతిపై నిరసన
పెరుగుతున్నచమురు ధరలు, రవాణా కష్టాల నేపథ్యంలో సామాన్య పౌరుడి అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఒకవైపు చమురు వినియోగాన్ని తగ్గించాలని, విలాసాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యులు కనీస ప్రయాణ సౌకర్యాల కోసం పశువుల్లా కొట్టుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ చర్చను మరోసారి తీవ్రతరం చేసింది.‘మేము ఇంధనాన్ని వృధా చేయడం లేదు'సోషల్ మీడియా వేదిక ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా అనురాధ తివారీ అనే యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. కిక్కిరిసిన రైలులోకి ప్రవేశించడానికి ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న దృశ్యాలను ఆమె పోస్ట్ చేశారు. ‘సామాన్య ప్రజలు ఇంధనాన్ని వృధా చేయడం లేదు. ఎన్నికల ర్యాలీలు, కిలోమీటర్ల పొడవున వీఐపీ కాన్వాయ్‌ల్లో, వందలాది కార్లతో ఇంధనాన్ని వృధా చేసేది రాజకీయ నాయకులే. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె ఘాటుగా స్పందించారు.ప్రజల అసహనంచమురు దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే క్రమంలో.. ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వ విజ్ఞప్తులు కేవలం సామాన్యులకేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా స్పందనలు‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో సామాన్యులను పశువుల్లాగా, ఉన్నత వర్గాలను రాజుల్లా చూస్తున్నారు’ అని ఒక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాను. ప్రతిఫలంగా నా కుటుంబంతో ఇలాంటి నరకప్రాయమైన ప్రయాణం చేయాలా?’ అని మరొకరు నిలదీశారు. వీఐపీ సంస్కృతిని రద్దు చేయడంతోపాటు రాజకీయ నాయకులను సేవకులుగా చూసేలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.Common people are not the ones wasting fuel. They are struggling just to survive.It’s politicians who waste fuel with hundreds of cars in election rallies & long VIP convoys.Time to end this entire VIP culture ! pic.twitter.com/XesgTlZa39— Anuradha Tiwari (@talk2anuradha) May 11, 2026వాస్తవ పరిస్థితులు - సవాళ్లువార్తా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్య తగ్గిపోవడం, రద్దీ పెరగడం సామాన్యులకు శాపంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సామాన్య ప్రజలతో కలిసి రైళ్లలో ప్రయాణించే సంప్రదాయం ఉంది. మన దేశంలో మాత్రం వీఐపీ అంటేనే ప్రత్యేకమైన ప్రోటోకాల్, సామాన్యులకు ఇబ్బంది కలిగించే ట్రాఫిక్ ఆంక్షలుగా మారిపోయింది. ఇంధన పొదుపు మంత్రం కేవలం సామాన్యుడికే కాకుండా, పాలకులకు కూడా వర్తించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నది మేధావులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
సాయంత్రం 6 దాటితే అపరాధ భావం
ఆఫీసు పని అయిపోయింది.. గడియారం ఆరు దాటింది.. కానీ సీటులోంచి లేవాలంటే ఏదో తెలియని భయం. ‘అప్పుడే వెళ్లిపోతున్నావా?’ అని బాస్ అడుగుతాడేమో అన్న సందేహం. రోజంతా కష్టపడి పని చేసినా, ఉదయం ఆఫీస్‌కు త్వరగా వచ్చినా.. సమయానికి ఇంటికి బయలుదేరితే ‘హాఫ్ డేనా?’ అంటూ సెటైర్లు. ఇదీ సగటు భారతీయ ఉద్యోగి నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి. సరిగ్గా ఇదే అంశంపై ‘24 నార్త్ స్టార్’ వ్యవస్థాపకురాలు నిస్తా త్రిపాఠి చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.యూరప్‌లో.. భారత్‌లో..నిస్తా త్రిపాఠి తన పోస్ట్‌లో భారత్, యూరప్ దేశాల పని సంస్కృతి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. ఆమె విశ్లేషణ ప్రకారం..యూరోపియన్ స్టైల్: యూరప్ దేశాల్లోని ఆఫీస్ ఉద్యోగులు సాయంత్రం 5 గంటలకే ఎటువంటి సంకోచం లేకుండా ‘రేపు కలుద్దాం’ అని సిస్టమ్స్ లాగ్ ఆఫ్ చేస్తారు. గడువులోగా పనులు పూర్తి చేయడంలో వారు ఏమాత్రం వెనుకబడరు. కానీ పని గంటల తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు.భారతీయ విధానం: ఇక్కడ ఉద్యోగి ఎంత సామర్థ్యంతో పని చేశాడనే దానికంటే, ఎన్ని గంటలు ఆఫీసులో కూర్చున్నారనే దాన్ని బట్టే వారి అంకితభావాన్ని కొలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న అసహనంభారతీయ బహుళజాతి కంపెనీల్లో (ఎంఎన్సీ) పనిచేసే వారు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య టైమ్ జోన్. అమెరికా, యూరప్ క్లయింట్ల కోసం భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కూడా మీటింగ్‌లకు హాజరుకావాల్సి వస్తోంది. దీనివల్ల ఉద్యోగుల వ్యక్తిగత సమయం హరించుకుపోతోందని, 24/7 అందుబాటులో ఉండటం వల్ల ఉత్పాదకత పెరగకపోగా ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోందని త్రిపాఠి పేర్కొన్నారు. ‘కంపెనీలు తమ సమయాన్ని, శక్తిని కాపాడుకునే వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి’ అని చెప్పారు.ఏం చేయాలంటే..కొత్త తరం ఉద్యోగులు ఇప్పుడు స్మార్ట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. సంస్థలు తమ పని సంస్కృతిని మార్చుకోకపోతే మేధో వలసలు పెరిగే ప్రమాదం ఉందని ఈ చర్చ హెచ్చరిస్తోంది. ఒక ఉద్యోగి సంతోషంగా ఇంటికి వెళ్లినప్పుడే, మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలడని కార్పొరేట్ దిగ్గజాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో ఇప్పుడు చర్చంతా ‘జెన్ జీ’ గురించే. 1997 నుంచి 2012 మధ్య జన్మించి, ప్రస్తుతం కెరీర్ ప్రారంభించిన ఈ యువతరంపై కార్పొరేట్ ప్రపంచం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీతో సాన్నిహిత్యం ఉన్న ఈ తరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వెలువడిన నివేదికలు విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నాయి.మూణ్ణాళ్ల ముచ్చటేనా?ప్రముఖ విద్యా, కెరీర్ సలహా సంస్థ ‘ఇంటెలిజెంట్’ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 60 శాతం మంది యజమానులు తాము నియమించుకున్న జెన్ జీ ఉద్యోగులను కేవలం కొద్ది నెలల్లోనే తొలగించారు. దాదాపు 1,000 మంది హైరింగ్ మేనేజర్ల అభిప్రాయాలను సేకరించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ప్రతి ఆరుగురు యజమానుల్లో ఒకరు వెనకాడుతున్నారు.పనితీరు బాగోలేని 79% మంది జెన్ జీ ఉద్యోగులకు శిక్షణ (పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్) ఇచ్చినప్పటికీ అందులో 60% మంది చివరకు ఉద్యోగాలు కోల్పోయారు.74% మంది మేనేజర్లు ఇతర తరాల వారితో పోలిస్తే జెన్ జీతో పనిచేయడం అత్యంత కష్టమని సర్వేలో చెప్పారు.ఉద్వాసనకు దారితీస్తున్న ప్రధాన కారణాలుకారణంశాతం (సుమారుగా)చొరవ చూపకపోవడం50%ప్రొఫెషనలిజం లోపం46%బలహీనమైన కమ్యూనికేషన్ స్కిల్స్39%విమర్శలను తట్టుకోలేకపోవడం38%సమస్య పరిష్కార సామర్థ్యం లేకపోవడం34%వారానికి 20% మంది ఆలస్యంగా ఆఫీసుకు రావడం, కార్యాలయానికి తగని దుస్తులు ధరించడం, పని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి యజమానులను కలవరపెడుతున్నాయి.'స్నోఫ్లేక్' సిండ్రోమ్.. ఫీడ్‌బ్యాక్ అంటేనే భయం!యజమానులు ప్రధానంగా ఫిర్యాదు చేస్తున్న మరో అంశం.. విమర్శలను స్వీకరించలేకపోవడం. మేనేజర్లు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలను కూడా వీరు వ్యక్తిగత విమర్శలుగా భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే వీరిని సోషల్ మీడియాలో ‘స్నోఫ్లేక్’ అని పిలుస్తున్నారు. అంటే చిన్న విషయాలకే కుంగిపోయే మనస్తత్వం కలవారని అర్థం. తమ తొలగింపు ఉదంతాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ కొందరు సానుభూతి పొందుతుంటే, మరికొందరు ఆఫీస్ కల్చర్‌ను తప్పుబడుతున్నారు.ఆధారపడటం పెరిగింది.. ఆత్రుత తగ్గింది!బ్యాంక్రేట్ సర్వే ప్రకారం.. దాదాపు 70% మంది జెన్ జీ యువత ఆర్థికంగా ఇంకా తమ తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కెరీర్లో ఎదగాలనే తపన, స్వతంత్రంగా ఉండాలనే ఆత్రుత వారిలో తగ్గడానికి కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖర్చు చేస్తూ పిల్లలను ఆదుకోవడం వారి వృత్తిపరమైన ఎదుగుదలకు పరోక్షంగా అడ్డంకిగా మారుతోంది.నాణేనికి మరోవైపుజెన్ జీపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ భవిష్యత్తు వారిదే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం, 2025 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25% పైగా వీరిదే వాటా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వీరికి ఉన్న పట్టు కంపెనీలకు ఎంతో కీలకం. అంతేకాకుండా, కేవలం జీతం కోసమే కాకుండా.. మానసిక ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత కోసం వీరు గళం విప్పుతున్నారు. పాతకాలపు కఠినమైన పని పద్ధతులను సవాలు చేస్తూ మరింత స్నేహపూర్వకమైన పని వాతావరణం కావాలని కోరుకుంటున్నారు.కంపెనీల అంచనాలు, కొత్త తరం ఆలోచనల మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చకపోతే భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జెన్ జీ ఉద్యోగులు వృత్తిపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు కంపెనీలు కూడా వారి మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా తమ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
భారత్ సొంత ఏఐ ఇన్ఫ్రాను నిర్మించుకోవాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థకు సంబంధించి భారత్ సొంతంగా మౌలిక సామర్థ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాల్లో భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఇంధన భద్రత, డిజిటల్ ఇన్ఫ్రాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు–2026లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయపరమైన విభజనల నేపథ్యంలో దశాబ్దాల నాటి గ్లోబలైజేషన్ భావనలకు కాలం చెల్లుతోందన్నారు.‘సెమీకండక్టర్లు ఇప్పుడు రాజకీయ అస్త్రాలుగా మారాయి. డేటాను జాతీయ వనరుగా భావిస్తున్నారు. క్లౌడ్ ఇన్ఫ్రాను ఆయుధంగా మలచుకుంటున్నారు. ఇక ఏఐ సదుపాయాలను డేటా సెంటర్ల రక్షణ గోడల మాటున నిర్మించుకుంటున్నారు’ అని అదానీ పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో డిజిటిల్ మౌలిక సదుపాయాలపై దాడుల గురించి ప్రస్తావిస్తూ... ఇంధన భద్రత, డిజిటల్ భద్రత అనేవి ఏ దేశానికైనా రెండు మూల స్తంభాలుగా మారాయని అభిప్రాయపడ్డారు.‘ఇంధన వనరులను నియంత్రించే దేశ పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలాగే డిజిటల్ కంప్యూటింగ్‌ను కంట్రోల్ చేసే దేశ మేధోపరమైన భవిష్యత్తుకు తిరుగుండదు. ఈ రెండింటినీ నియంత్రించే దేశమే రాబోయే శతాబ్దాన్ని తీర్చిదిద్దుతుంది’ అని అదానీ తెలిపారు.ఏఐని సాఫ్ట్‌వేర్‌గా చూడొద్దు...భారత్ ఏఐని కేవలం ఒక సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే కాకుండా... ఎనర్జీ, డేటా సెంటర్లు, చిప్‌లు, నెట్‌వర్క్‌లు, కంప్యూటింగ్, ప్రతిభ వంటి రంగాల వ్యాప్తంగా ఒక వ్యూహాత్మక ఇన్‌ఫ్రాగా పరిగణించాలని అదానీ చెప్పారు. ‘భారత్ తన మేధో భవిష్యత్తు కోసం ఈ ఏఐ ఇన్ఫ్రాను అద్దెకు తీసుకుంటే సరిపోదు. స్వదేశంలోనే సొంతంగా నిర్మించుకోవడంతో పాటు, సామర్థ్యాలను విస్తరించాలి’ అని నొక్కిచెప్పారు. తయారీ, రవాణా, మొబిలిటీ, డిజిటల్ సర్వీసుల వ్యాప్తంగా నెలకొన్న భారీ దేశీ డిమాండ్ అనేది పెద్దయెత్తున ఏఐ, ఎనర్జీ ఇన్ఫ్రా నిర్మాణానికి దోహదం చేస్తోందన్నారు.భారత్‌లో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఇప్పటికే 500 గిగావాట్లను అధిగమించిందని, భవిష్యత్తులో భారత్ ఏఐ ఎకానమీ కోసం విద్యుత్, కంప్యూటింగ్ ఎకోసిస్టమ్‌లలో భారీ స్థాయి పెట్టుబడులు అవసరమవుతాయని వివరించారు. ఏఐని అవకాశాలను హరించే శక్తిగా కాకుండా ఉత్పాదకతను పెంచేదిగా, ఉద్యోగాలను కల్పించేదిగా, ఎంట్రప్రెన్యూర్లకు చేదోడుగా నిలిచేదిగా, భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాధనాలుగా రూపొందించాలని అదానీ పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్ డేటా సెంటర్ బిజినెస్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌లో అతిపెద్ద గిగావాట్ స్లాయి డేటా సెంటర్ క్యాంపస్‌ను విశాఖలో నిర్మించేందుకు గూగుల్‌తో జట్టుకట్టిన విషయాన్ని కూడా అదానీ గుర్తుచేశారు. -
భవిష్య కిరణం
కొన్ని సంవత్సరాల క్రితం... ‘ఎందుకలా భయపడుతున్నావు?’ అని ఆ అమ్మాయిని అడిగారు కిరణ్ మజుందార్ షా. ‘కంపెనీ నిర్వహణకు నా వయసు సరిపోదేమో’ అని సందేహించింది ఆ అమ్మాయి. ‘నేను బయోకాన్ ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని చెప్పి ఆమెను ఒప్పించారు కిరణ్. బయోకాన్ అనుబంధ సంస్థ ‘బికార’ ఫౌండర్–సీఈవోగా ఆ అమ్మాయి తనను తాను నిరూపించుకుంది. ఆ అమ్మాయి పేరు... క్లెయిర్ మజుందార్. కిరణ్ మజుందార్ షా మేనకోడలు. బయోకాన్ వ్యాపార సామ్రాజ్య వారసురాలిగా తెర ముందుకు వచ్చారు క్లెయిర్ మజుందార్....ప్రఖ్యాత బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ నిర్వహణ బాధ్యతలను చైర్పర్సన్ మజుందార్ షా నుంచి ఆమె మేనకోడలు క్లెయిర్ మజుందార్ షా స్వీకరించనున్నారు.– బంగారు కుండ‘నాకు ఒక బంగారు కుండ దొరికితే, తీవ్రమైన వ్యాధులను నయం చేసే కొత్తమందులను తయారు చేయడానికి ఆ కుండను అత్తయ్యకు ఇస్తాను’ అని ఆరేళ్ల వయసులో ఎరిక్ మజుందార్ ఒక కుండ బొమ్మ వేసి కాగితంపై రాశాడు. ఆ అబ్బాయి క్లెయిర్ సోదరుడు. విశేషం ఏమిటంటే అప్పుడెప్పుడో రాసిన ఆ బొమ్మల కాగితం ఇప్పటికీ కిరణ్ మజుందార్ షా దగ్గర భద్రంగా ఉంది.‘ఆరేళ్ల వయసులో ఎరిక్ నాకు పంపిన అందమైన సందేశం ఇది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కిరణ్.ఎరిక్ తన గౌరవనీయ అత్తయ్యకు బంగారు కుండ ఇవ్వలేదు. అయితే కిరణ్ మాత్రం ఎరిక్ సోదరి, తన ప్రియమైన కోడలు క్లెయిర్ మజుందార్‌కు ‘బయోకాన్ బాధ్యతలు’ అనే బంగారు కుండను ఇచ్చారు!– అడుగడుగునా సవాళ్లే... అయినా సరే...కిరణ్ మజుందార్ షా అసాధారణ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. గాలివాటుగా లేదా అదృష్టవశాత్తూ వచ్చింది కాదు. ఒక గ్యారేజీలో 1978లోప్రారంభమైన ఆమె ప్రయాణం... ప్రతికూల వాతావరణం లో సవాళ్లను అధిగమిస్తూ నిరంతర పోరాటంగా సాగింది.బయోటెక్నాలజీ అంటే పెద్దగా ఎవరికి తెలియని రోజుల్లో పెట్టుబడుల కోసం అన్వేషించడం, బయోటెక్నాలజీని పెద్దగా గుర్తించని కాలంలో పాజిటివ్‌గా ముందుకు సాగడం, స్వల్పకాలిక లాభాలపై దృష్టి సారించే మార్కెట్లతో పోరాడటం... ఇలా ఎన్నో అనుభవాలు కిరణ్‌కు ఉన్నాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ కూడా ఆవిష్కరణల ఆధారిత బయోటెక్ వ్యవస్థను నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు.‘నేను విజయం సాధించే వరకు నాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు’ అంటారు కిరణ్ మజుందార్ షా.– క్లెయిర్ది నల్లేరుపై నడక కాదుబయోకాన్ సామ్రాజ్య వారసురాలిగా క్లెయిర్ మజుందార్‌ది నల్లేరు మీద నడక కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. ‘సవాళ్లను అధిగమించి సత్తా చాటడంలో తన మేనత్తను గుర్తుతెస్తోంది’ అనిపించుకోవాలి.వ్యాపారం, ఔషధ ఆవిష్కరణలో పునరావిష్కరణ(రీఇన్వేషన్) కిరణ్ కార్యాచరణ సూత్రం. కంపెనీకి సంబంధించి ప్రతి దశాబ్దంలోనూ ఒక కీలక మలుపు ఉండేది. మొదటి మలుపు... పారిశ్రామిక ఎంజైమ్‌లపై దృష్టి సారించడం.ఆ తరువాత దశాబ్దంలో బయోకాన్ ఇన్సులిన్‌పై దృష్టి సారించి ప్రపంచంలోని టాప్ 3 ఇన్సులిన్ తయారీదారులలో ఒకరిగా నిలిచారు. 2009 తరువాత పేటెంట్ పొందిన బయోలాజికల్ ఔషధాల రివర్స్–ఇంజినీరింగ్ వెర్షన్లు అయిన బయోసిమిలర్స్‌పై దృష్టి సారించి భారతదేశపు ఏకైక గ్లోబల్ బయోసిమిలర్ సంస్థగా, ప్రపంచంలోని టాప్ 5 సంస్థలలో ఒకటిగా నిలిచింది బయోకాన్.→ ధైర్యం ఇచ్చి... దారి చూపారుఅమెరికాలోని బయోకాన్ అనుబంధ సంస్థ బికారాకు నాయకత్వం వహించడానికి ఒక సీఈవో కావాలని కిరణ్ అనుకొని అందుకోసం తన మేనకోడలైన క్లెయిర్ మజుందార్‌ను ఎంపిక చేసుకున్నారు. క్లెయిర్ మజుందార్ బయోలాజికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ నుండి ఎంబీఏ, స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి క్యాన్సర్ బయాలజీలో పీహెచ్డీ చేశారు.‘థర్డ్ రాక్ వెంచర్స్’ అనే వెంచర్ క్యాపిటల్(వీసి) సంస్థలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేసేవారు. బికారాలో చేరడానికి మొదట్లో ఆమె విముఖత వ్యక్తం చేశారు.‘ఈ వయసులో అంత పెద్ద బాధ్యతలను నిర్వహించలేను’ అనేది క్లెయిర్ విముఖతకు కారణం. అలా అని అత్తయ్య ఊరుకోలేదు.‘నేను బయోకాన్ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని క్లెయిర్‌ను ఒప్పించారు కిరణ్. అలా బికారలో ఫౌండర్–సీఈవోగా చేరి సత్తా చాటారు క్లెయిర్ మజుందార్. అమెరికాలోని వెంచర్ క్యాపిటల్ కమ్యూనిటీతో పనిచేసిన అనుభవం మూల«ధనాన్ని ఆకర్షించడంలో ఆమెకు సహాయపడింది.కిరణ్ ఆరోజు ఇచ్చిన ఆ ధైర్యమే భవిష్యత్‌లో క్లెయిర్ మజుందార్‌ను ముందుకు నడిపించనుంది. అందుకే ఆమె నా వారసురాలునా వారసురాలికి మూడు లక్షణాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవి... రిస్క్ తీసుకునే సామర్థ్యం, వ్యూహాత్మకంగా ఆలోచించే తత్వం, విలువను సృష్టించే నైపుణ్యం. నేను బయోకాన్‌కు యజమానిని. నా సంస్థను మంచి వ్యక్తికి అప్పగించానని నేను నిర్థారించుకోవాలి. నా మేడకోడలు క్లెయిర్‌ను నా వారసురాలిగా చూస్తున్నాను. ఆమెలో నేను కోరుకునే మూడు లక్షణాలు ఉన్నాయి. కంపెనీని క్లెయిర్ విజయవంతంగా నడిపించగలదని నమ్ముతున్నాను.– కిరణ్ మజుందార్ షా -
పెట్రోల్ రేట్ల పెంపు తప్పదా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రోజుకు రూ.1,600–1,700 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత నుంచి 10 వారాల్లో వీటి నష్టం రూ.లక్ష కోట్లకుపైనే ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ.. దేశీయంగా వాటి ధరలను సవరించకుండా ఓఎంసీలు (బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్) విక్రయిస్తుండడంతో వాటిపై మోయలేనంత భారం పడుతోంది.ఒకవైపు అధిక ధరలు కొనుగోలు చేసి, తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గించడం తెలిసిందే. తద్వారా నెలకు రూ. 14,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. లేదంటే ఓఎంసీలపై ఈ నష్టం మరింతగా ఉండేది. అయితే, ఇలా ఎంత కాలం పాటు అవి ఈ స్థాయిలో భారాన్ని మోస్తాయన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను పెంచొచ్చన్న వార్తలు వినిపించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఎంతో కొంత ధరలు పెంచక తప్పనిసరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిత్యం వేల కోట్ల నష్టం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జపాన్, యూకే తదితర దేశాల్లో పెట్రోల్ ధరలను 30 శాతం వరకు పెంచడం గమనార్హం. అయినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడరాదన్న కేంద్రం విధానం మేరకు.. ఇక్కడ ఓఎంసీలు గతం నుంచి ఉన్న ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. గ్యాస్ ధరలను అవి కొంత వరకు సవరించినప్పటికీ.. వాటి కొనుగోలు కంటే వసూలు తక్కువగానే ఉంది. ఫలితంగా ఈ సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,600 నుండి 1,700 కోట్ల నష్టం వాటిల్లుతోంది.ఓఎంసీలు సొంత ఆదాయంతోనే ముడి చమురు కొనుగోలు, శుద్ధి చేపడుతుంటాయి. రోజురోజుకూ నష్టాలు పెరుగుతుండడంతో ముడి చమురు కొనుగోలు కోసం అవి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఎంత మేరకు పెంచాలి, ఎప్పుడు పెంచాలి? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటున్నారు. -
56 దేశాల్లో భారతీయులకు బంపర్ ఆఫర్!
వేసవి విడిదికి తోడు ఈద్ సెలవులు దగ్గరపడుతుండటంతో అంతర్జాతీయ పర్యాటకానికి భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత పాస్‌పోర్ట్ శక్తిసామర్థ్యాలపై తాజా 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్' ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఉన్న 75వ స్థానం నుంచి స్వల్పంగా పడిపోయినప్పటికీ, భారతీయులు వీసా ముందస్తు దరఖాస్తు అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలను చుట్టిరావచ్చు.ర్యాంకింగ్‌లో హెచ్చుతగ్గులు..గ్లోబల్ వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల భారత్ ఈసారి క్యూబా, సెనెగల్ వంటి దేశాలతో కలిసి 78వ స్థానాన్ని పంచుకుంది. అయితే, గమ్యస్థానాల పరంగా చూస్తే భారత్ బలం స్థిరంగానే ఉంది. 2025లో 57 దేశాలకు వీసా లేకుండా ప్రవేశం ఉండేది. అది జనవరి 2026 నాటికి 55 దేశాలకు తగ్గింది. ప్రస్తుతం గాంబియా చేరికతో 56 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్ పెరిగింది.ఎక్కడికి ఎలా వెళ్లొచ్చు?భారత పౌరులకు ప్రస్తుతం 30 దేశాలు పూర్తిస్థాయిలో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, 23 దేశాలు 'వీసా-ఆన్-అరైవల్' (వచ్చిన తర్వాత వీసా), మరో 3 దేశాలు 'ఈటీఏ' (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) పద్ధతిలో అనుమతిస్తున్నాయి.వీసా రహిత ప్రవేశం ఉన్న దేశాల్లో అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కుక్ దీవులు, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైతీ, జమైకా, కజకస్తాన్, కిరిబాటి, మకావో (ఎస్.ఎ.ఆర్ చైనా), మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, నేపాల్, నియు, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, థాయ్ లాండ్, ది గాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనాటు ఉన్నాయి.వీసా-ఆన్-అరైవల్ (VOA) అనుమతిస్తున్న దేశాల్లో బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావు, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, పలావు దీవులు, ఖతార్, సియెర్రా లియోన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, తైమూర్-లెస్టే, తువాలు, జింబాబ్వే ఉన్నాయి.ఇక కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశాలు ఈటీఏ విధానంలో ప్రవేశం కల్పిస్తున్నాయి.పర్యాటకుల చూపు.. 'సమీప' దేశాల వైపు..ఈద్ సెలవుల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, కనీస డాక్యుమెంటేషన్‌తో ప్రయాణించే వీలున్న ఆసియా, మధ్యప్రాచ్య దేశాలపై భారతీయులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, మలేషియా, మాల్దీవులు వంటి దేశాలు వీసా సరళీకరణను ప్రకటించడంతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.ర్యాంకింగ్‌లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇది మన పాస్‌పోర్ట్ బలహీనత కంటే ఇతర దేశాల వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల సంభవించినదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు సంబంధిత దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. -
సునీల్ మిట్టల్‌కు సీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం
భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌కు ప్రతిష్టాత్మకమైన 'సీఐఐ ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్' పురస్కారం లభించింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత ఆర్థిక పురోగతికి మరియు పారిశ్రామిక రంగానికి సునీల్ మిట్టల్ అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2007లో తాను సీఐఐ అధ్యక్షుడిగా పనిచేసిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. భారతీయ పరిశ్రమలు విదేశీ దిగుమతులపై (ముఖ్యంగా బంగారం) ఆధారపడటం తగ్గించి, స్వదేశీ పెట్టుబడులు, తయారీ (Make in India) పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు (ముఖ్యంగా మధ్యప్రాచ్యం) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని పరిశ్రమలు పాటించాలని కోరారు. బంగారం దిగుమతులపై వ్యామోహం తగ్గించుకోవాలన్నారు. పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లడం, నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎయిర్టెల్ సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 31,000 కోట్ల భారీ పెట్టుబడులను (CapEx) వెచ్చించినట్లు ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఐటీ విజేతలు మారుతున్నాయ్
ఒక స్టార్టప్. రెండేళ్ల కిందట దాని వార్షికాదాయం 10 కోట్ల డాలర్లు. మరిప్పుడు? ఏకంగా 3 వేల కోట్ల డాలర్లకు చేరబోతోంది. అమెరికన్ సిలికాన్ వాలీ దీన్ని పండగ చేసుకుంటుంటే... భారత ఐటీ రంగం వణికిపోతోంది. మన స్టాక్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఏంటా స్టార్టప్? మన మార్కెట్లతో సంబంధమేంటి? మన ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్ స్టోరీ. (రమణమూర్తి మంథా)భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు గడిచిన ఏడాదిలో 30 శాతం పడిపోయింది. ఐదేళ్ల దీర్ఘకాలాన్ని తీసుకున్నా నెగెటివ్ రిటర్న్‌లే చూపిస్తోంది. కారణం... 2004లో లిస్టయిన తరవాత తొలిసారిగా ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో వృద్ధి లేదు. పైగా క్షీణించింది. మరో దిగ్గజం ఇన్ఫోసిస్.. వచ్చే ఏడాది తమ ఆదాయ వృద్ధి 1.5 నుంచి 3 శాతాన్ని మించకపోవచ్చంటూ బలహీనమైన గైడెన్స్ ఇచ్చింది. వీటన్నిటినీ మించి ఐటీ రంగంలో హైరింగ్ దారుణంగా పడిపోయింది. వీటన్నిటికీ కారణం... ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్. సిలికాన్ వాలీ పండగ చేసుకుంటున్నది కూడా ఆంత్రోపిక్ అనే ఏఐ అద్భుతాన్ని చూసి. మన మార్కెట్లను భయపెడుతున్నది కూడా ఈ ఏఐనే. మరిపుడు మన ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? మన ఐటీ స్టోరీ ముగిసినట్లేనా?ఇది ముగింపు కాదు... కొత్త ఆరంభందీన్ని మన ఐటీ రంగం కథ ముగిసినట్లు కాకుండా కొత్త కథ ఆరంభంగా చూడాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ మన దేశంలోనూ కొత్త విజేతల్ని తయారు చేస్తోంది. ఏఐ ఇంజనీరింగ్, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఇండ్రస్టియల్ ఏఐ, చిప్ తయారీ వ్యవస్థలకు సంబంధించిన కంపెనీలు మెల్లగా వెలుగులోకి వస్తు న్నాయి. ఈ కొత్త కంపెనీల రేస్ ఇప్పటికే మొదలైంది కూడా. ఆంత్రోపిక్ వేగానికి తీసిపోకుండా!!. ఉద్యోగాలు రిస్కులో ఉన్నట్లేనా?ఐటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రంగంలో కొన్ని విభాగాల ఉద్యోగులు డేంజర్ జోన్లోకి వచ్చేశారు. ఆయా కంపెనీలు ఏఐని వాడటం మొదలుపెట్టే కొద్దీ వీరి అవసరం, ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది కనక... ఇప్పుడు కాకుంటే కొన్నాళ్ల తరవాత అయినా వీరి ఉద్యోగం ప్రమాదంలో పడొచ్చన్నది నిపుణుల మాట. ప్రధానంగా టెస్టింగ్, బేసిక్ కోడింగ్, సపోరి్టంగ్ రోల్స్‌లో ఉండేవారు, డాక్యుమెంటేషన్ చేసేవారు, బీపీఓ వాయిస్ ప్రాసెసింగ్‌లో ఉండేవారు ఈ ప్రమాదాన్ని త్వరగా ఎదుర్కొంటారనేది ఏఐ నిపుణుల వార్నింగ్.టెస్టింగ్, డాక్యుమెంటేషన్, వాయిస్ ప్రాసెసింగ్ వంటి ఏఐ చేసే పనుల్లో ఉన్నవారు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ... ఏఐ ఇంటిగ్రేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రా, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాలలో భారీగా కొత్త ఉద్యోగాలు పుట్టుకు రాబోతున్నాయనే ది నిపుణుల మాట. ఎందుకంటే ఏఐ వాడకం పెరుగుతున్న కొద్దీ వీరి అవసరం కూడా పెరుగుతుంది. పైపెచ్చు ఏఐ వాడటంలో ఎదుర య్యే సవాళ్ల నుంచి మరిన్ని విభాగాలు పు ట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. సరే... ఇ దంతా ఉద్యోగాల గురించి అనుకుందాం. మరి కంపెనీల మాటేంటి? ఇన్వెస్టర్ల సంగతేంటి? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలు వీక్ గైడెన్స్, డీల్స్ నెమ్మదించటం, వృద్ధి తగ్గిపోవటం వంటి కారణాల వల్ల ఇప్పటికే బాగా నష్టపోయాయి. కాకపోతే కొన్ని మధ్య తరహా ఐటీ కంపెనీలు, ఏఐపై దృష్టి పెట్టిన కంపెనీలు ఈ పతనాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఏఐని వేగంగా అందుకోవటం, పాత కాలపు కాంట్రాక్టులను తగ్గించుకోవటం, డిజిటల్‌పై ఎక్కువగా దృష్టి పెట్టడం వీటిని కొత్త విజేతలుగా మారుస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో కొన్ని...పర్సిస్టెంట్ సిస్టమ్స్: బలమైన ఏఐ, క్లౌడ్-డిజిటల్ ఇంజినీరింగ్ఎల్టీఎం (మైండ్‌ట్రీ): ఏఐ ఆధారిత మార్పును త్వరగా అందుకోవటంకోఫోర్జ్: డిజిటల్‌పై ఫోకస్, ప్రత్యేకమైన నైపుణ్యంఎంఫసిస్: బీఎఫ్ఎస్ఐ + క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ కేపీఐటీ: ఆటో సాఫ్ట్వేర్ + ఎంబెడెడ్ సిస్టమ్స్ఏఐ దిశగా జరుగుతున్న మార్పుల్లో కొన్ని మధ్యశ్రేణి కంపెనీలు దిగ్గజాల్ని మించి పెరిగే అవకాశముందన్నది విశ్లేషకుల మాట. భవిష్యత్ విజేతలు ఇవేనా..?ఏఐ ఇన్ఫ్రా రంగంలోని కంపెనీలు డేటా సెంటర్లు, జీపీయూలు, క్లౌడ్ ఇన్ఫ్రా, నెట్వర్కింగ్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌లోని సంస్థలు ఈ పరిధిలోకి వస్తాయి. నెట్వెబ్ టెక్నాలజీస్, తేజస్ నెట్వర్క్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, కేనెస్ టెక్నాలజీ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి.ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కంపెనీలు ఏఐ వృద్ధి చెందాలంటే దానికి చిప్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ కావాలి. కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఎలెక్సీ, సైయంట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ కంపెనీలు ఏఐని ఉపయోగించటం పెరుగుతున్న కొద్దీ ఏఐ సెక్యూరిటీ, అమలు, గవర్నెన్స్, ఆడిట్ సిస్టమ్స్ వేగంగా పెరగాల్సిన అవసరముంది. దీంతో పాటు వెండర్లకు పనులు ఔట్‌సోర్సింగ్‌పై ఇవ్వటం కన్నా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అవసరం పెరుగుతుంది. మొత్తం ప్రాజెక్టుల్ని ఔట్‌సోర్సింగ్‌కి ఇచ్చే బదులు భారత కంపెనీలు నేరుగా ఏఐ టీమ్స్‌ను తయారు చేసుకోవటం మొదలుపెడతాయి. వీటిని ఏ కంపెనీలు త్వరగా అందిపుచ్చుకుంటే అవి విజేతలుగా మారతాయి.దీన్నిబట్టి అర్థమయ్యేది ఒక్కటే. భారత ఐటీ రంగం రికవరీ కాకుండా పోదు. కాకపోతే మునుపటిలా కాదు. ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందనే మాదిరి కాకుండా ఏఐని ఎక్కువగా ఏ కంపెనీలైతే అందిపుచ్చుకుంటాయో అవి వేగంగా పెరుగుతాయి. కొత్త ఐటీ విజేతలు పుట్టుకొస్తాయి. పాత మోడల్...ఎక్కువమంది ఉద్యోగులంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎన్ని గంటలు పనిచేస్తే అంత బిల్లింగ్. అంటే ఇక్కడ సమయానికే విలువ. పెద్ద పెద్ద క్యాంపస్‌లు తప్పనిసరి. క్యాంపస్ సైజును బట్టే కంపెనీకి విలువ.యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి ఫ్రెషర్స్‌ను తీసుకోవటం సంప్రదాయం. కొత్త విజేతల తీరు...ఏఐ ప్రొడక్టివిటీని ఎంత పెంచితే... రెవెన్యూ అంత పెరుగుతుంది. ఫలితాన్ని బట్టే బిల్లింగ్. ఆ పనిని గంటల్లో చేసినా... రోజుల్లో చేసినా తేడా లేదు. చిన్న చిన్న ఏఐ టీమ్‌లుంటాయి. ఆ టీమ్ చేసే పనే కంపెనీ విలువను నిర్దేశిస్తుంది.ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఇలా ఏ విధానమైనా... ఏఐ స్పెషలిస్టుల్నే తీసుకుంటారు. -
హెల్త్ క్లెయిమ్ తిరస్కరిస్తే కుదరదిక!
హెల్త్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను సకాలంలో దాఖలు చేయకపోతే బీమా సంస్థలు నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంటాయి. కానీ, ఇకపై అలా కుదరదు. నిర్ణీత గడువులోపు సాధ్యపడక, ఆలస్యంగా ఫైల్ చేసినా.. నిబంధనలకు అనుగుణంగా మదింపు చేయాల్సిందే. రూపాయితో సహా చెల్లించాల్సిందే. ఏప్రిల్ 20న బొంబే హైకోర్టు ఈ దిశగా ఇచ్చిన తీర్పు పాలసీదారులకు ఆర్థిక ఉపశమనం కాగా.. నిబంధనలు పాలసీదారులకు అనుకూలంగా ఉన్నా, ఇంతకాలం తమకు అనుకూలంగా మలుచుకుంటున్న బీమా సంస్థలకు కనువిప్పే. అసలైన క్లెయిమ్ దరఖాస్తులను ఆలస్యంగా దాఖలు చేశారని చెప్పి తిరస్కరించడం కుదరదని హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. కనుక అర్థం పర్థం లేని కారణాలతో హెల్త్ క్లెయిమ్‌కు తిరస్కారం ఎదురైతే.. మిన్నకుండిపోవక్కర్లేదు. కారణం తెలుసుకుని బీమా సంస్థను నిలదీయొచ్చు. బిల్లు మొత్తాన్ని రాబట్టుకోవచ్చు. బొంబే హైకోర్టు తీర్పు పాలసీదారుల హక్కులను పరిరక్షించేదిగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. సీపీ రవీంద్రనాథ్ మీనన్ అనే వ్యక్తి తన హెల్త్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను బీమా సంస్థ పెట్టిన నిర్దేశిత గడువు దాటిన తర్వాత దాఖలు చేశాడు. నిబంధనల్లో పేర్కొన్నట్టు 90 రోజుల్లోగా క్లెయిమ్ దాఖలు చేయనందున దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సమాధానం ఇచ్చింది. దీంతో పాలసీదారుడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. కేవలం ఆలస్యంగా క్లెయిమ్ దాఖలు చేశారంటూ తిరస్కరించడం చట్టం కింద చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తరహా నిబంధనలు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1872లోని సెక్షన్ 28(బి)ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. చట్టపరిధిలో అర్హత కలిగిన క్లెయిమ్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించరాదని తేల్చి చెప్పింది. హెల్త్ పాలసీలకు సంబంధించి సమయ నిబంధనలు చెల్లనివి, అమలు చేయరానివిగా పేర్కొంది. ఒప్పంద నిబంధనలు నిజమైన హక్కులను రద్దు చేయలేవంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలో చెప్పిన తీర్పు ఆధారంగా బొంబే హెకోర్టు ఈ కేసులో బీమా సంస్థ వాదనను తోసిపుచ్చింది. పాలసీదారుడి క్లెయిమ్‌కు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయాలని, ఆ మొత్తంపై 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు జారీ చేసింది.నగదు రహితం – రీయింబర్స్మెంట్నగదు రహితం: ఇందుకు సంబంధించి ఆస్పత్రులు 2024/2026 ఐఆర్డీఏఐ మాస్టర్ సర్క్యులర్‌ను అనుసరిస్తున్నాయి. దీని ప్రకారం బీమా సంస్థ నగదు రహిత క్లెయిమ్‌కు ముందస్తు అనుమతి అన్నది గంటలోపు మంజూరు చేయాలి. డిశ్చార్జ్ క్లెయిమ్‌కు 3 గంటల్లోపు అనుమతి జారీ చేయాలి. ఆలస్యం చేస్తే.. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉండేందుకు అయ్యే వ్యయాలను సైతం బీమా సంస్థ చెల్లించాల్సిందే. రీయింబర్స్మెంట్ క్లెయిమ్: ముందుగా సొంత పాకెట్ నుంచి చెల్లింపులు చేసి, తర్వాత బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ కోసం క్లెయిమ్ దాఖలు చేసుకోవడం. సాధారణంగా 30 రోజులు మించకుండా ఈ క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఎందుకు కాల పరిమితులు? → క్లెయిమ్‌లకు సంబంధించి బీమా కంపెనీలు కాల పరిమితులు నిర్ణయించడం వెనుక.. వీలైనంత త్వరలో వాటిని మదింపు చేయడం ద్వారా వాస్తవ సమాచారాన్ని గుర్తించడం సులభతరమవుతుందనే. → ఒకవేళ, క్లెయిమ్ దాఖలు ఆలస్యం అవడం వెనుక సహేతుక కారణాలుంటే తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు సైతం చెబుతున్నాయి. → ఒంటరి వ్యక్తులు ఐసీయూలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కావొచ్చు. అలాంటప్పుడు వారు కోలుకుని ఫైల్ దాఖలు చేయడానికి సమయం తీసుకోవచ్చు. అలాంటప్పుడు క్లెయిమ్ తిరస్కరించడం సహేతుకం కానేకాదు. → ఆరు నెలల తర్వాత క్లెయిమ్ దాఖలు చేసినా సరే, అందుకు సరైన కారణం ఉంటే బీమా సంస్థ అర్హతలకు లోబడి మదింపు చేయాలి. అంతేకానీ కాలహరణం పేరుతో తిరస్కరించకూడదు. ఒకవేళ పాలసీదారుడు మోసం చేసేందుకే జాప్యం చేశాడని బీమా సంస్థ నిరూపిస్తే తప్ప క్లెయిమ్‌కు తిరస్కారం కుదరదు. → బీమా సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్లు (టీపీఏలు/బీమా తరఫున క్లెయిమ్ వ్యవహారాలు చూసే సంస్థలు) క్లెయిమ్‌కు సంబంధించి, ఏవైనా అదనపు డాక్యుమెంట్లు అవసరమైతే నేరుగా ఆస్పత్రుల నుంచి తీసుకోవాలని ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. → ఆరోగ్య బీమా రక్షణ అన్నది అవసరంలో ఆదుకోవడానికే. కానీ, సాంకేతిక కారణాలు చూపి నో చెప్పేందుకు కాదని కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. ఆలస్యం అయితే..?→ ఆందోళన చెందాల్సిన పనే లేదు. డిలే కండోనేషన్ లెటర్‌ను క్లెయిమ్ పత్రాలకు జత చేయండి. → అందులో పాలసీ నంబర్, పేషెంట్ పేరు స్పష్టంగా ఉండాలి. → ఆలస్యం అయినందుకు కారణాన్ని వివరించండి. → న్యాయమైన క్లెయిమ్‌లను సాంకేతిక కారణాల పేరుతో తిరస్కరించరాదన్న ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు, బొంబే హైకోర్టు తీర్పును ఉదహరించండి. సకాలంలో స్పందించండి..→ క్లెయిమ్ దాఖలు ఆలస్యం అయినా అర్హత ఉంటుందని చెప్పి నిర్లక్ష్యం పనికిరాదు. → డిశ్చార్జ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా క్లెయిమ్ దాఖలుకు ప్రయత్నించండి. → క్లెయిమ్ దాఖలుకు సమయం పట్టేట్టు ఉంటే బీమా సంస్థకు ముందుగానే దానిపై సమాచారం ఇవ్వండి. → ఒంటరి వ్యక్తులు అయితే ఈ విషయంలో మరొకరి సహకారం తీసుకోవడం మంచిది. → డిశ్చార్జ్ సమ్మరీ నుంచి, ప్రతి బిల్లు ఒరిజినల్ కాపీలు, పాలసీదారుడి ఆధార్, పాన్ కాపీల వరకు ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. గతంలో తిరస్కరించినవి అయితే..?→ క్లెయిమ్‌ను ఆలస్యంగా దాఖలు చేశారన్న కారణంతో లోగడ తిరస్కరించినట్టయితే.. తాజాగా మరోసారి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. → బొంబే హైకోర్టు తీర్పును ప్రస్తావించండి. తన క్లెయిమ్‌ను తిరిగి మదింపు వేయాలని కోరొచ్చు. → ఇప్పటి వరకు అర్హత కలిగిన దరఖాస్తులను సైతం ఆలస్యంగా దాఖలు చేశారన్న కారణంగా బీమా సంస్థలు తిరస్కరిస్తూ వచ్చాయి. కానీ, ఇకపై కొంత మార్పును ఆశించొచ్చు. పాలసీదారులు సైతం కాల నియమాల గురించి అవగాహనతో, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది. తిరస్కరిస్తే..?→ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే బీమా కంపెనీలోని గ్రీవెన్స్ సెల్‌ను సంప్రదించాలి. → స్పందన లేకపోతే బీమా అంబుడ్స్‌మన్ దృష్టికి తీసుకెళ్లాలి. → అప్పటికీ ఉపయోగం లేకపోతే కోర్టును ఆశ్రయించడమే మార్గం. – సాక్షి, వెల్త్ డెస్క్ -
తగ్గిన నష్టాలు.. దూసుకెళ్తున్న స్విగ్గీ!
ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ (ఇన్‌స్టామార్ట్) సంస్థ స్విగ్గీ మార్చి త్రైమాసికంలో పనితీరును బలోపేతం చేసుకుంది. కన్సాలిడేటెడ్ నష్టం రూ.800 కోట్లకు తగ్గింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.1,081 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం.. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.5,610 కోట్ల నుంచి రూ.7,448 కోట్లకు పెరిగిపోయాయి.స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) 15 త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 22.6 శాతం పెరిగి రూ.9,006 కోట్లుగా నమోదైంది.ఫుడ్ డెలివరీ విభాగంలో వార్షిక ఎబిట్డా రూ.1,000 కోట్లను దాటింది.‘ఇన్‌స్టామార్ట్’ (క్విక్ కామర్స్) ఆదాయం స్థూల ఆర్డర్ విలువ 68 శాతం పెరిగి రూ.7,881 కోట్లకు చేరింది.స్నాక్స్, పానీయాలు, రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను వేగంగా డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన ‘స్నాక్’ను మూసివేసినట్టు వాటాదారులకు రాసిన లేఖలో స్విగ్గీ తెలిపింది. అధిక డిమాండ్‌తోనే ఈ వ్యాపారం నిర్వహణ సాధ్యమని పేర్కొంది.మధ్యకాలానికి ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లకు, 4–5 శాతం ఎబిట్డాకి చేరుకుంటుందని అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక సొల్యూషన్స్
ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తమ కరెంట్ అకౌంట్‌హోల్డర్స్ కోసం రెండు కొత్త సొల్యూషన్స్‌ని ప్రవేశపెట్టింది. ఏఐ ఆధారిత రీకేవైసీ, ఏఐ ఆధారిత డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్ అప్డేట్ సర్వీసెస్ వీటిలో ఉన్నాయి.వ్యక్తిగతేతర కరెంట్ అకౌంట్ కస్టమర్లు ఒకే పీడీఎఫ్ ద్వారా సమర్పించే పలు డాక్యుమెంట్స్ నుంచి అవసరమైన కేవైసీ వివరాలను సేకరించి, అప్డేట్ చేసేందుకు రీకేవైసీ సహాయకరంగా ఉంటుంది. అటు డిజిటల్, పేపర్‌రహిత ప్రక్రియ ద్వారా వ్యాపార స్వరూపంలాంటి వివరాలను అప్డేట్ చేసేందుకు ప్రొఫైల్ అప్డేట్ సర్వీస్ ఉపయోగపడుతుంది. -
భవిష్యత్తు భారత్‌లోనే.. అమెరికాలో కాదు!
చేయడానికి ఒక ఉద్యోగం, మంచి జీతం వస్తే చాలు, అనుకునేవాళ్లే సంఘంలో చాలామంది ఉన్నారు. ఇందులో కొందరికి సొంతంగా ఏదైనా బిజినెస్ లేదా నచ్చినపని చేయాలని ఉన్నప్పటికీ.. భయం లేదా ఇతరత్రా కారణాల వల్ల ముందడుగు వేయరు. కానీ.. అమన్ గోయల్ అనే యువకుడు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఇంటర్న్‌షిప్ వదిలి, సొంతగడ్డపై స్టార్టప్ ప్రారంభించాలని స్వదేశానికి వచ్చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో చదువుతున్నప్పుడే అమన్ గోయల్.. కేవలం 20 సంవత్సరాల వయసులో అమెరికాలోని రుబ్రిక్ అనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందాడు. ఆ సమయంలో ఆయన జీతం నెలకు 8,000 డాలర్లు (రూ.7.5 లక్షలు). కానీ ఇది అతనికి అంతగా నచ్చలేదు.తన భవిష్యత్తు అమెరికాలో కాకుండా.. భారతదేశంలో ఉందని అమన్ గోయల్ గ్రహించాడు. నేను కూడా ఒక కంపెనీని నిర్మించాలి, నా దేశంలోనే ఎదగాలి అనే ఆలోచన అతనిలో బలపడింది. అందుకే తిరిగి భారతదేశానికి వచ్చి, కేవలం ఇంజనీరింగ్ జ్ఞానంతో సరిపెట్టుకోకుండా.. వ్యాపారం నిర్మాణం గురించి కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.Ten years ago, I landed in San Francisco as a 20-year-old kid from IIT Bombay, headed to Palo Alto to intern at @rubrikInc's Software Engineering Team.I was earning $8,000 a month. It felt like a dream.My mentor was an @CSE_IITBombay senior, who made me fall in love with… pic.twitter.com/EjphbHWNs9— Aman Goel (@amangoeliitb) May 9, 2026కాలేజీలో చదువుతున్న చివరి సంవత్సరంలోనే వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ప్రొడక్ట్ డిజైన్, సేల్స్ వంటి విషయాలను అభ్యసించాడు. “ఇంజనీరింగ్ నా బలం అయినా, వ్యాపారం నిర్మించడం నా అసలు లక్ష్యంగా మారింది” అని అమన్ గోయల్ చెప్పాడు.ఇదీ చదవండి: ఉద్యోగులకు సీఈఓ మదర్స్ డే గిఫ్ట్!కొన్ని సంవత్సరాల తరువాత, అతడు స్థాపించిన GreyLabs AI అనే సంస్థ 85 మందికి పైగా ఉద్యోగులతో పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించి, ప్రతి సంవత్సరం మూడు రెట్లు వృద్ధిని సాధిస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా వృద్ధిలోకి రాలేదు. ఎన్నో రిస్కులు, కష్టాలు, అనిశ్చితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గొప్ప వృద్ధిని సాధించగలిగింది. -
లాభాలు పెరిగిన బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.3,016 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు 2024–25 ఇదే క్యూ4లో ప్రకటించిన రూ.2,626 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం.సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.21,751 కోట్ల నుంచి రూ.22,685 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా ఆదాయం రూ.18,323 నుంచి రూ.19,476 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన స్థూల ఎన్పీఏ(మొండి బకాయిలు) 3.27% నుంచి 1.98 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 0.82% నుంచి 0.56 శాతానికి దిగివచ్చాయి.సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం ప్లస్ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 407 కోట్లను అధిగమించింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 342 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు బ్యాంక్ బోర్డ్ షేరుకి రూ. 0.45 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 915 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 868 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొత్తం ఆదాయం మాత్రం ఫ్లాట్‌గా రూ. 2,945 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు త్రైమాసికవారీగా 2.86 శాతం నుంచి 2.95 శాతానికి మెరుగుపడ్డాయి. వార్షికంగా 3.21 శాతం నుంచి నీరసించాయి. స్థూల డిబకాయిలు(ఎన్పీఏలు) 3.2 శాతం నుంచి 1.43 శాతానికి, నికర ఎన్పీఏలు 0.92 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 224 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు భారీగా తగ్గాయి. -
ట్రంప్ కంపెనీకి భారీ నష్టం.. వందల మిలియన్లు లాస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా సంస్థ 'ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్'కు (TMTG) ఈ ఏడాది ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కంపెనీ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఏకంగా 405.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,400 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసింది. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విలువ పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని నివేదిక వెల్లడించింది.అవాస్తవిక నష్టాల వెల్లువట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయిన టీఎంటీజీ, గతేడాది మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు క్రిప్టోకరెన్సీలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో డిజిటల్ ఆస్తులు, ఈక్విటీలలో ఏర్పడిన 370 మిలియన్ డాలర్ల వాస్తవీకరించని నష్టాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను దెబ్బతీశాయి.కంపెనీ ఖజానాలో ప్రస్తుతం 9,500 బిట్కాయిన్లు ఉన్నాయి. గత జూలైలో బిట్‌కాయిన్ విలువ గరిష్టంగా ఉన్నప్పుడు, ఒక్కో కాయిన్‌ను సగటున 1,08,519 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి చివరలో బిట్‌కాయిన్ ధర 70,000 డాలర్ల కంటే తక్కువగా ఉన్న సమయంలో కంపెనీ 2,000 బిట్కాయిన్లను విక్రయించింది. దీనివల్ల భారీగా పెట్టుబడి నష్టపోవాల్సి వచ్చింది.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 80,000 డాలర్ల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. గత అక్టోబర్‌లో 1,26,000 డాలర్ల వద్ద ఉన్న ధర, ఫిబ్రవరి నాటికి 60,000 డాలర్లకు పడిపోవడం కంపెనీ అంచనాలను తలకిందులు చేసింది.ఆర్థిక పునాది పటిష్టమేనా?భారీ నష్టాలు పీడిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే కంపెనీ ఆర్థిక ఆస్తులు మూడు రెట్లు పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 17.9 మిలియన్ డాలర్లుగా నమోదైంది.క్రిప్టో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రస్తుతానికి కాగితంపై నష్టాలు కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పకూలుతున్న స్టాక్.. సీఈఓ నిష్క్రమణఒకవైపు ఆర్థిక నష్టాలు, మరోవైపు నాయకత్వ మార్పులు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2022లో ఒకానొక దశలో 97.54 డాలర్ల వద్ద ఉన్న కంపెనీ షేర్ విలువ, ప్రస్తుతం ఏకంగా 90% పైగా క్షీణించి 8.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ సీఈఓ, మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ ఏడాది ఏప్రిల్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళన కలిగించింది.జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ట్విట్టర్ (ప్రస్తుత X) ట్రంప్‌పై నిషేధం విధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ సొంతంగా 'ట్రూత్ సోషల్' నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. రాజకీయంగా ఆదరణ ఉన్నప్పటికీ, ఆర్థికంగా లాభాల బాట పట్టడంలో ఈ సంస్థ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. -
నష్టాలు తగ్గించుకున్న స్విగ్గీ
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ (ఇన్‌స్టామార్ట్) సంస్థ స్విగ్గీ మార్చి త్రైమాసికంలో పనితీరును బలోపేతం చేసుకుంది. కన్సాలిడేటెడ్ నష్టం రూ.800 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.1,081 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.5,610 కోట్ల నుంచి రూ.7,448 కోట్లకు పెరిగిపోయాయి. స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) 15 త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 22.6 శాతం పెరిగి రూ.9,006 కోట్లుగా నమోదైంది. ఫుడ్ డెలివరీ విభాగంలో వార్షిక ఎబిట్డా రూ.1,000 కోట్లను దాటింది.‘ఇన్‌స్టామార్ట్’ (క్విక్ కామర్స్) ఆదాయం స్థూల ఆర్డర్ విలువ 68 శాతం పెరిగి రూ.7,881 కోట్లకు చేరింది. స్నాక్స్, పానీయాలు, రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను వేగంగా డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన ‘స్నాక్’ను మూసివేసినట్టు వాటాదారులకు రాసిన లేఖలో స్విగ్గీ తెలిపింది. అధిక డిమాండ్‌తోనే ఈ వ్యాపారం నిర్వహణ సాధ్యమని పేర్కొంది. మధ్యకాలానికి ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లకు, 4–5 శాతం ఎబిట్డాకి చేరుకుంటుందని అంచనా వేసింది. -
ఆరు ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నప్పటికీ, దేశీయ ఐపీఓ మార్కెట్ మాత్రం ఆశావహ సంకేతాలు ఇస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడం, కార్యకలాపాలను విస్తరించుకోవడం, డైవర్సిఫికేషన్ లక్ష్యాలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన ఆరు కంపెనీలకు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. తద్వారా ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఐపీఓలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విభిన్న రంగాలకు చెందిన జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్, హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్, సర్జివేర్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హోటల్ పోలో టవర్స్ అక్టోబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మే 4 నుంచి 8 మధ్య ఈ దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీఓలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. రాబోయే ఐపీవోల వివరాలివీ.. జెప్టో రూ.11,000 కోట్ల ఇష్యూ క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో ప్రస్తుతం మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి దిగ్గజాలతో పోటీపడుతోంది. త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమిక మార్కెట్ నుంచి దాదాపు రూ.11 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సెబీ తాజా అనుమతులతో షేరు ధరల శ్రేణి, సబ్ర్స్కిప్షన్ తేదీలు, లిస్టింగ్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీ సన్నద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్, స్టార్టప్ ఐపీఓలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ జెప్టో పబ్లిక్ ఆఫర్‌కు రావడం గమనార్హం. లిస్టింగ్ పూర్తైతే ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీల్లో ఉన్న జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది. ధూత్ ట్రాన్స్మిషన్ ఆటో ఉపకరణాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ ద్వారా దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,258 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాలను విక్రయించబోరని సమాచారం. కంపెనీలో బెయిన్ క్యాపిటల్ పెట్టుబడులు ఉన్నాయి. → జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్ సంస్థలు ‘కాని్ఫడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ రూట్’ను ఎంచుకున్నాయి. ఈ విధానం ద్వారా ముసాయిదా పత్రాలను బహిరంగపరచకుండానే సెబీ నుంచి ప్రాథమిక అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్ ఐపీఓ ద్వారా రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఓఎఫ్ఎస్ లేదు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.2,250 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. సర్జివేర్ఉత్తరప్రదేశ్కు చెందిన మెడికల్ డివైసెస్ తయారీ సంస్థ సర్జివేర్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఐపీఓకు సిద్ధమైంది. తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ. 370 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ ఘనశ్యామ్ దాస్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ.370 కోట్ల ఈక్విటీలను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త యంత్రాల కొనుగోలు, తయారీ సామర్థ్యాల పెంపు, రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ వ్యవసాయ పంటల రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతో ఐపీఓకు రానుంది. అదనంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 74.05 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఎఫ్‌సీ ఎమర్జింగ్ ఆసియా ఫండ్ వాటాలను విక్రయించనున్నాయి. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థ సఫైర్ క్రాప్ సైన్స్ మూలధన అవసరాలు, భవిష్యత్ కొనుగోళ్లు, వ్యూహాత్మక విస్తరణకు వినియోగించనుంది. హోటల్ పోలో టవర్స్ హాస్పిటాలిటీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్ పోలో టవర్స్ సంస్థ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా 71.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధి, అప్పుల తగ్గింపు, మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా ఈశాన్య, తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ‘పోలో’, ‘మ్యాక్స్’ బ్రాండ్ల పేరుతో అప్స్కేల్, మిడ్‌స్కేల్ హోటళ్లు, రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.మే 12న ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ఇష్యూ షురూ.. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీదారు ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ప్యాక్ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 47–50గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.35.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ 70.65 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.35.32 కోట్ల సమీకరించనుంది. మే 11న యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ ఉంటుంది. -
ఉద్యోగులకు సీఈఓ మదర్స్ డే గిఫ్ట్!
సాధారణంగా కొంతమంది కంపెనీ అధినేతలు, తమ ఉద్యోగులకు దీపావళి లేదా దసరా సందర్భంగా గిఫ్ట్స్ లేదా బోనస్ వంటివి అందిస్తుంటారు. అయితే ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త మాత్రం 'మదర్స్ డే' సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో సమయం గడపడానికి మూడు రోజులు సెలవు ఇవ్వడంతో పాటు.. రూ.10వేలు నగదు కూడా ఇవ్వనున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎలైట్ మార్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ గ్రోవర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమీ ఆశించకుండా.. మనకోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారికి ఉన్న చిన్న చిన్న కోరికలను తీర్చే సమయం వచ్చేసింది. వాటిని తప్పకుండా నెరవేర్చండి. తల్లిదండ్రులు ఎన్నాళ్లు మనతో ఉంటారో తెలియదు. కాబట్టి సమయం దొరికినప్పుడు వారితో గడపడానికి సమయం కేటాయించడానికి ప్రయత్నించండి అని రజత్ గ్రోవర్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rajat Grover (@rajat_grover30) -
గూగుల్ బంపరాఫర్: నియామకాల్లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం!
ఇదివరకు ఇంటర్వ్యూల సమయంలో చాలామంది అభ్యర్థులు ఏఐ ఉపయోగిస్తున్నారని చెప్పిన గూగుల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.అభ్యర్థులు ఇంటర్వ్యూల సమయంలో AI టూల్స్‌ను ఉపయోగించేందుకు అనుమతించడం అనేది.. టెక్ రంగంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. కంపెనీ అభివృద్ధి చేసిన జెమిని ఏఐ (Gemini AI) అసిస్టెంట్‌ను కొంతమంది అభ్యర్థులు కోడింగ్ రౌండ్లలో ఉపయోగించేలా ఇంటర్వ్యూలు నిర్వహించడానికి సంస్థ సిద్ధమవుతోంది.ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను ఈ ఏడాది చివర్లో అమెరికాలోని కొన్ని గూగుల్ క్లౌడ్ టీమ్‌లలో ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా జూనియర్, మిడ్ లెవల్ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులపై ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా 'కోడ్ కంప్రిహెన్షన్' రౌండ్లో అభ్యర్థులు కోడ్‌ను చదవడం, లోపాలను గుర్తించడం, మెరుగుపరచడం వంటి పనుల్లో జెమిని సహాయం తీసుకోవచ్చు. అయితే తుది నిర్ణయం మాత్రం.. అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాతే ఉంటుంది.ఇదీ చదవండి: జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!గూగుల్ ఈ విధానాన్ని 'హ్యూమన్ లెడ్, AI అసిస్టెడ్'గా పేర్కొంటోంది. అంటే.. నిర్ణయం మనుషులదే అయినా, ఏఐ ఒక సహాయక సాధనంగా పనిచేస్తుంది. ప్రస్తుతం టెక్ రంగంలో ఏఐ ఆధారిత కోడింగ్ వేగంగా పెరుగుతోంది. కోడ్ రాయడం, పరీక్షించడం, మెరుగుపరచడం వంటి పనుల్లో ఇంజినీర్లు ఇప్పటికే ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఉద్యోగ ఇంటర్వ్యూలు దానికి తగిన విధంగా ఉండేలా గూగుల్ తగిన చర్య తీసుకుంటోంది. -
ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త..
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా గ్యాస్ సమస్య ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై అప్రమత్తత పెరిగింది. ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఇండక్షన్ స్టవ్ వినియోగంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఏమరపాటుగా ఉంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఇండక్షన్ స్టవ్‌తో ఫుల్స్టాప్ పెట్టొచ్చు. అయితే ఈ కరెంట్ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని టిప్స్ పాటిస్తే సేఫ్.. మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్ పైనుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్ఛాఫ్ చేయడం మరిచిపోవద్దు. ఇండక్షన్ స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు ఉంటే ప్రమాదకరం. వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీరు లేదా తడిబట్టతో క్లీన్ చేయవద్దు. మన్నికైన స్వీచ్బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్టెన్షన్ బాక్స్‌ల వాడటం ఏమాత్రం మంచిది కాదు. వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి. -
జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!
నేటి ఉద్యోగ ప్రపంచంలో 'జెన్ జీ' (Gen Z) తరం గురించి ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, యువత పనిపట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారని, ఆఫీస్ రూల్స్ కూడా పాటించరని చెబుతున్నారు. దీనిపై యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఆర్యన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో తన అనుభవాన్ని పంచుకుంటూ.. జెన్ జీ ఉద్యోగులు నిజానికి ఎంతో కష్టపడే వారు అని స్పష్టం చేశారు.''రెండు నెలల క్రితం ఒక జెన్ జీ యువతిని ఉద్యోగంలోకి తీసుకున్నాను. మొదట్లో నేను కూడా.. అందరూ చెప్పినట్లే ఈ తరం గురించి కొన్ని సందేహాలు పెట్టుకున్నాను. కానీ ఆమె పనితీరును దగ్గరగా గమనించిన తరువాత, తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఆమె నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా వ్యవహరించడం, తన పనిపట్ల ఆసక్తి చూపించడం ఆయనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.జెన్ జీ ఉద్యోగులు పని చేయరని మాట తప్పు.. ఎందుకంటే వారు పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పాత తరాల ఉద్యోగులు సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడాన్ని ఇష్టపడితే.. జెన్ జీ యువత కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. వారు పని - వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ముఖ్యమని భావిస్తారు. ఇది వాళ్ల బలహీనత కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త దృక్పథం అని రోహిత్ ఆర్యన్ పేర్కొన్నారు.Hired a GenZ girl 2 months back, and honestly she works with full heart, super sincere. That whole "GenZ doesn't work hard" thing is totally wrong. You just need to understand how they work - their style, their way of communicating is a bit different, but that's completely fine.…— Rohit Aryan (@RohitAryannn) May 6, 2026జెన్ జీ ఉద్యోగులు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. అవసరమైతే 'ఇది సరైనది కాదు' అని ధైర్యంగా చెప్పగలరు. కొందరు దీనిని అహంకారంగా భావించినా, వాస్తవానికి అది వారి ఆత్మవిశ్వాసానికి సూచిక. సరైన ప్రోత్సాహం, గౌరవం, అర్థం చేసుకునే నాయకత్వం లభిస్తే.. వారు సంస్థకు ఎంతో విలువైనవారిగా మారగలరని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రోహిత్ ఆర్యన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చాలామంది ఆర్యన్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. తాము కూడా జెన్ జెడ్ ఉద్యోగులతో మంచి అనుభవాలు పొందామని చెప్పారు. సరైన మార్గదర్శనం, స్వేచ్ఛ, నమ్మకం ఇస్తే ఈ తరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. -
సామ్‌ను కాపాడింది సత్య సర్..
టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన ‘ఓపెన్ ఏఐ’ హైడ్రామాపై ఎట్టకేలకు తెర వీడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం సంస్థ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను అర్ధరాత్రి పూట సీఈఓ పదవి నుంచి తొలగించడం, ఆపై వారం రోజుల్లోనే ఆయన మళ్లీ పగ్గాలు చేపట్టడం వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఎలాన్ మస్క్ దాఖలు చేసిన తాజా కోర్టు కేసు విచారణలో భాగంగా అప్పటి తాత్కాలిక సీఈఓ మీరా మురాటి, సామ్ ఆల్ట్మాన్ మధ్య జరిగిన అంతర్గత సందేశాలు బయటపడ్డాయి. ఈ సందేశాలు ఆనాటి గందరగోళాన్ని కళ్లకు కడుతున్నాయి.అసలేం జరిగింది? బోర్డు ఆరోపణలేంటి?నవంబర్ 17, 2023న ఓపెన్ఏఐ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సామ్ ఆల్ట్‌మాన్‌పై నమ్మకం పోయిందని పేర్కొంటూ ఆయనను పదవి నుంచి తొలగించింది. లాభాపేక్ష లేని సంస్థ లక్ష్యాలకు ఆల్ట్మాన్ శైలి విరుద్ధంగా ఉందని బోర్డు భావించింది.మీరా మురాటి వ్యాఖ్యలుఆల్ట్మాన్ వెళ్లిపోయిన వెంటనే అప్పటి సీటీఓ మీరా మురాటిని తాత్కాలిక సీఈఓగా బోర్డు నియమించింది. ఆ సమయంలో సామ్ ఆల్ట్మాన్ తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ.. పరిస్థితి ఎలా ఉందని మీరాను ఆరా తీసినట్లు చెప్పారు. ఆల్ట్మాన్ ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన విషయాలు చెబుతూ సంస్థలో గందరగోళం సృష్టించారని మురాటి అన్నారు. తదుపరి సీఈఓ ఎవరనే విషయాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.రక్షకుడిగా నిలిచిన సత్య నాదెళ్లఓపెన్ఏఐలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఈ సంక్షోభం సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. బోర్డు మొండిగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆల్ట్మాన్, ఆయన బృందాన్ని మైక్రోసాఫ్ట్‌లో చేర్చుకుంటున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా సీన్ మార్చారు. ‘సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ మా కొత్త అడ్వాన్స్డ్ ఏఐ పరిశోధన బృందానికి నాయకత్వం వహించడానికి మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు’ అని సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఈ ఒక్క ప్రకటనతో దాదాపు 90 శాతం మంది ఓపెన్ఏఐ ఉద్యోగులు ఆల్ట్మాన్ వెంట నడుస్తామని రాజీనామా లేఖలు సిద్ధం చేశారు. సంస్థ కుప్పకూలిపోతుందని భయపడిన బోర్డు, చివరకు తలొగ్గి ఆల్ట్‌మాన్‌ను తిరిగి సీఈఓగా ఆహ్వానించింది. ఇదిలాఉండగా, ప్రస్తుతం మీరా మురాటి ఓపెన్ఏఐ నుంచి తప్పుకుని ‘థింకింగ్ మెషిన్స్ ల్యాబ్’ అనే సొంత సంస్థను స్థాపించారు.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
భారతీయ కళలను ప్రపంచానికి చాటేందుకే అమ్మ ఇలా..
వెనిస్ వేదికగా జరిగిన 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన భారతీయ కళా వైభవం ప్రపంచ దేశాలను కట్టిపడేసింది. ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవం సందర్భంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమం సాంస్కృతిక వారధిగా నిలిచింది.చారిత్రక నగరమైన వెనిస్లోని ‘స్కూలా గ్రాండే డెల్లా మిసెరికార్డియా’ వేదికగా భారతీయ సంస్కృతి, కళలు కొత్త పుంతలు తొక్కాయి. 61వ వెనిస్ బిన్నాలేలో భారత పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీతో కలిసి నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రపంచ స్థాయి కళాకారులు, సాంస్కృతిక వేత్తలు, ఫ్యాషన్ రంగ ప్రముఖులను ఒకే తాటిపైకి తెచ్చింది.అమ్మ కల.. కళాకారుల గళంఈ కార్యక్రమంలో ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీకి కృతజ్ఞలు తెలిపారు. ఒక క్లాసికల్ డ్యాన్సర్‌గా, విద్యావేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నీతా అంబానీ భారతీయ కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలనే లక్ష్యంతోనే ఎన్ఎంఏసీసీని స్థాపించారని ఇషా పేర్కొన్నారు. ‘భారతదేశపు అత్యుత్తమ కళలను ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రపంచంలోని అద్భుతమైన కళలను భారత్‌కు తీసుకురావడమే మా లక్ష్యం’ అని ఆమె స్పష్టం చేశారు.భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్ ‘జియోగ్రఫీస్ ఆఫ్ డిస్టెన్స్: రిమెంబరింగ్ హోమ్’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం సాగింది. డాక్టర్ అమీన్ జాఫర్ దీనికి క్యూరేటర్‌గా వ్యవహరించారు. అల్వార్ బాలసుబ్రమణ్యం, రంజని శెట్టార్, సుమక్షి సింగ్, స్కర్మ సోనమ్ తాషి, అసిమ్ వకీఫ్ తమ సృజనాత్మకతతో ఈ ప్రదర్శనను నిర్వహించారు.వారసత్వానికి.. ఆధునికతకు మధ్య వారధిఈ వేడుక కేవలం విందుకే పరిమితం కాకుండా గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానించే ఒక చర్చా వేదికగా మారింది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని గౌరవిస్తూ సృజనాత్మకతను సజీవంగా ఉంచే ప్రేక్షకులకు ఈ కార్యక్రమాన్ని అంకితమిచ్చారు. భారతీయ సంప్రదాయ రుచులు, కళాత్మక అలంకరణలతో కూడిన ఈ ఈవెంట్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నిధుల మళ్లింపునకు సంబంధించి రూ.27,300 కోట్ల భారీ బ్యాంకు మోసం కేసులో సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. వివాదాస్పద లావాదేవీల్లో అనిల్ అంబానీ ఎవరినీ మోసం చేయలేదని, బహుశా అతనే మోసపోయి ఉండవచ్చునని న్యాయస్థానం ముందు పేర్కొన్నారు.దర్యాప్తు సంస్థల నివేదికఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించాయి. రూ.27,300 కోట్ల నిధుల మళ్లింపుపై విచారణ సరైన దిశలోనే సాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, తదుపరి విచారణలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వెల్లడించింది. అయితే, నిధుల మళ్లింపులో అంబానీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తున్న పిటిషనర్, ఇప్పటివరకు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపిటిషనర్ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు ప్రక్రియను సంచలనాత్మకం చేయవద్దని హెచ్చరించింది. ‘అరెస్టు చేయాలని ఆదేశించడానికి కోర్టు సంకోచిస్తోంది. కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అనేది దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలే నిర్ణయించాలి. ఆ బాధ్యత వారిదే’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.ఆస్తుల అటాచ్‌మెంట్‌పై అభ్యంతరంఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్‌లలోని రూ.1,575 కోట్ల విలువైన షేర్లను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేయడంపై అంబానీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే గ్రూపునకు చెందిన కంపెనీలు కావడమే ఈ చర్యకు కారణమని, ఇది ఉద్దేశపూర్వకమని వాదించారు. అటాచ్మెంట్ వల్ల వర్కింగ్ క్యాపిటల్ స్తంభించిపోతుందని, తద్వారా దేశ రాజధానిలోని కోట్లాది మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కేసు నేపథ్యంరిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలకు చెందిన బ్యాంకు నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, తద్వారా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ భారీ ఆర్థిక కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణలో దర్యాప్తు సంస్థలు సమర్పించే నివేదికలు అనిల్ అంబానీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
భారత్‌లో ఎడోబ్ విస్తరణ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎడోబ్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీకి ఇది దేశీయంగా ఏడో ఆఫీసు. ఇందులో 700 మంది పైగా ఉద్యోగులు ఉంటారు. 1997లో ఇంజినీరింగ్ ఆర్అండ్డీ సెంటరుగా భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ఎడోబ్ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం అమెరికా వెలుపల చూస్తే ఇక్కడే అత్యధికంగా 8,000 మందికి పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీ మార్కెట్లో కంపెనీ ఇటీవలి కాలంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రెడిషన్ ఉన్న సంస్థల విద్యార్థులకు ఫైర్‌ఫ్లై, ఫొటోషాప్, యాక్రోబ్యాట్లాంటి ఏఐ ఆధారిత టూల్స్‌ని ఉచితంగా అందించేలా 2026 ఫిబ్రవరిలో కంపెనీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కి చెందిన 36 కోట్ల మంది యూజర్లకు ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. -
ఎస్బీఐ లాభం 6% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆసక్తికరమైన ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4)లో స్టాండెలోన్ (బ్యాంకు కార్యకలాపాలు మాత్రమే) ప్రాతిపదికన రూ.19,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.18,643 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. మొండి బకాయిలు కాస్త శాంతించినప్పటికీ... నికర వడ్డీ మార్జిన్, ట్రెజరీ ఆదాయం తగ్గడంతో లాభాల జోరుకు బ్రేక్ పడింది. కాగా, క్యూ4 మొత్తం ఆదాయం 2.5 శాతం దిగజారి రూ. 1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు చేరడం గమనార్హం. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 4.13 శాతం మాత్రమే పెరిగి రూ.44,380 కోట్లకు పరిమితమైంది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.14 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గింది. ఎన్పీఏలు తగ్గాయ్... ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) తగ్గుముఖం పట్టాయి. క్యూ4లో స్థూల ఎన్పీఏలు 1.49 శాతానికి చేరాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇవి 1.82 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.47 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్) రూ.3,964 కోట్ల నుంచి రూ.3,140 కోట్లకు దిగొచ్చింది. అయితే, క్యూ4లో కొత్తగా రూ.5,521 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.4,222 కోట్లు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే... అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్‌గా ఎస్బీఐ 2025–26, క్యూ4 నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.19,649 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.19,600 కోట్లుగా ఉంది. 2025–26 డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నమోదైన రూ.21,317 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం కూడా స్వల్ప పెరుగుదల (0.85%)తో రూ.1,79,562 కోట్ల నుంచి రూ.1,81,079 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఇలా... 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 13 శాతం జంప్ చేసింది. రూ.80,032 కోట్లకు ఎగబాకింది. 2024–25లో నికర లాభం రూ.70,901 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,24,172 కోట్ల నుంచి రూ.5,51,647 కోట్లకు చేరింది. బ్యాంకు రుణాలు 16.87 శాతం వృద్ధి చెందగా... డిపాజిట్లు 11.03 శాతం పుంజుకున్నాయి. డివిడెండ్ రికార్డ్ తేదీ మే 16... గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు రూ.17.35 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి మే 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా, డివిడెండ్ చెల్లింపు జూన్ 4న జరగనున్నట్లు బ్యాంకు తెలిపింది.షేరు 7 శాతం క్రాష్... ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో దాదాపు 6.6% క్షీణించి రూ.1,020 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 7.4 శాతం మేర పడింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే బ్యాంకు మార్కెట్ విలువ రూ.66,691 కోట్లు ఆవిరై... రూ.9,41,108 కోట్లకు దిగొచ్చింది. కొత్తగా 6,000 కొలువులు.. ఎస్బీఐ కొత్తగా 6,000 మంది సిబ్బందిని నియమించుకోనుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. ప్రస్తుతం 2.45 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. టెక్నాలజీ నిపుణుల్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ లో హైరింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆంత్రోపిక్ మైథోస్ ఏఐ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకులన్నీ ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నాయని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సారథిగా కూడా ఉన్న శెట్టి పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీపై ఎస్బీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.సవాళ్లున్నా 13–15% రుణ వృద్ధి... పశ్చిమాసియా యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాం. యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లు మరో ఆరు నెలల పాటు కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మా మొండిబకాయిలు అదుపులోనే ఉన్నాయి. ఈ ఏడాది 3 శాతం ఎన్ఐఎం సాధించాలనేది టార్గెట్. కాగా, 2026–27లో ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ -
వియత్నాం విమానయాన సంస్థ కీలక ఒప్పందాలు
హైదరాబాద్: భారత్, వియత్నాం దేశాల మధ్య విమానయాన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, అనుసంధానాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో వియత్నాంకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వియెట్జెట్ (Vietjet), భారతీయ దిగ్గజ సంస్థలైన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (GMR), బర్డ్ గ్రూప్‌లతో వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది. వియత్నాం అధ్యక్షుడు తో లామ్ భారత పర్యటనలో భాగంగా నిర్వహించిన 'ఇండియా – వియత్నాం బిజినెస్ ఫోరమ్'లో ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ సహకారం ద్వారా వియెట్జెట్, జీఎంఆర్ సంస్థలు విమానాశ్రయాల అభివృద్ధి, లాజిస్టిక్స్, స్మార్ట్ ఎయిర్పోర్ట్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. అలాగే, బర్డ్ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు, శిక్షణ, విమానయాన సాంకేతికతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ భాగస్వామ్యాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, పర్యాటక సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని వియెట్జెట్ ఫస్ట్ వైస్ ఛైర్మన్ దిన్ వియెట్ పువాంగ్ పేర్కొన్నారు.ప్రస్తుతం వియెట్జెట్ సంస్థ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి వియత్నాంకు వారానికి సుమారు 80 విమానాలను నడుపుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేసిన ఈ సంస్థ, తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు కలిగిన వియెట్జెట్, ఈ కొత్త ఒప్పందాల ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యతను మరింత పెంచుకోనుంది. -
హైదరాబాద్‌లో ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎంఎస్ఎంఈ సదస్సు
తెలంగాణను 2030 నాటికి దేశీ విమానయాన, రక్షణ రంగాల రాజధానిగా మార్చడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో 'ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0' (MSME Spark 3.0) సదస్సును ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI), తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి.ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తన పూర్వపు ఫైటర్ పైలట్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 2030 నాటికి తెలంగాణను విమానయాన, రక్షణ రంగాల్లో తిరుగులేని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న డీఆర్డీఓ (DRDO) ల్యాబ్‌లు, అత్యాధునిక తయారీ కేంద్రాలు, సుమారు 1,500 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ రంగానికి వెన్నెముకగా ఉన్నాయన్నారు.జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక యుద్ధ తంత్రాలలో డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3.5 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందని, 220 తేజస్ విమానాలకు ఆర్డర్లు లభించాయని వివరించారు. 2028 నాటికి రక్షణ రంగ ఎగుమతులు రూ.50,000 కోట్లకు చేరుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డా. చంద్రికా కౌశిక్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమన్నారు. 'టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పాలసీ 2025' ద్వారా డీఆర్డీఓ పేటెంట్లను రాయల్టీ లేకుండా ఎంఎస్ఎంఈలకు అందిస్తున్నట్లు తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా దేశీయ రక్షణ సామర్థ్యం నిరూపితమైందని, ఆకాశ్ క్షిపణి వంటి ప్రాజెక్టులలో ఎంఎస్ఎంఈలు గొప్పగా కృషి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. -
కేపీఐటీ కంపెనీ చైర్మన్ రవి పండిట్ కన్నుమూత
ప్రముఖ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ ఎస్బీ రవి పండిట్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆటోమోటివ్ ఇంజినీరింగ్ పరిష్కారాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేపీఐటీ టెక్నాలజీస్‌ను స్థాపించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రవి పండిట్ కీలక పాత్ర పోషించారు.మూడు దశాబ్దాలకుపైగా వ్యాపార, సాంకేతిక రంగాల్లో సేవలందించిన రవి పండిట్ పుణె కేంద్రంగా కేపీఐటీ టెక్నాలజీస్‌ను ప్రారంభించి, సంస్థ కార్యకలాపాలను 15 దేశాలకు విస్తరించారు. అలాగే 1,200 మందికిపైగా నిపుణులతో పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ కీర్తానే అండ్ పండిట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (KPCA) కు కూడా ఆయన నాయకత్వం వహించారు.సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికీ ఆయన విశేషంగా కృషి చేశారు. పుణె ఇంటర్నేషనల్ సెంటర్, జన్వానీ సంస్థలకు సహ వ్యవస్థాపకుడిగా పనిచేసిన ఆయన, గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE) లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కు మార్గనిర్దేశం చేశారు. జ్ఞాన ప్రబోధిని సంస్థ అధ్యక్షుడిగా యువ నాయకత్వ వికాసానికి తోడ్పడ్డారు.రవి పండిట్ అమెరికాలోని ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి. బంగారు పతక విజేత చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు పొందిన ఆయన, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా కూడా సేవలందించారు. అంతేకాదు.. రచయితగానూ రవి పండిట్ గుర్తింపు పొందారు. పురస్కారం పొందిన ‘లీప్‌ఫ్రాగింగ్ టు పోల్-వాల్టింగ్’ అనే గ్రంథానికి ఆయన సహ రచయితగా వ్యవహరించారు. -
భయం వద్దు.. నైపుణ్యమే హద్దు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. కోడింగ్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి రిక్రూట్మెంట్ వరకు ప్రతి రంగాన్ని ఏఐ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఈ వేగవంతమైన మార్పులను చూసి ఒకవైపు యువత ఆందోళన చెందుతుంటే, మరోవైపు దీనిని అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు కొందరు నిపుణులు. పాకిస్థాన్‌కు చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఐజా ఉస్మాన్ కథ దీనికి ఒక నిదర్శనం. ప్రపంచంలోని టాప్ ఏఐ కంపెనీలలో ఒకటిగా పేరొందిన ఆంత్రోపిక్‌లో ఉద్యోగం సాధించిన ఐజా, తన ప్రయాణాన్ని వివరిస్తూ.. ఏఐ పట్ల భయం కంటే దాన్ని అర్థం చేసుకోవడమే నేటి అవసరమని నొక్కి చెప్పారు.ఎందుకు ఆంత్రోపిక్?ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు శక్తివంతమైన ఏఐ మోడల్స్ కోసం పోటీ పడుతున్న వేళ ఐజా మాత్రం ఆంత్రోపిక్‌ను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని చెప్పింది. ‘చాలా కంపెనీలు కేవలం వేగం, శక్తివంతమైన వ్యవస్థల వైపు పరుగులు తీస్తుంటే ఆంత్రోపిక్ మాత్రం ఏఐ భద్రత, బాధ్యతాయుతమైన అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. మానవాళికి సురక్షితమైన ఏఐని అందించడమే కంపెనీ లక్ష్యం. అదే నన్ను ఆకర్షించింది’ అని ఆమె పేర్కొన్నారు.సాధారణ విద్యార్థినిగా పాకిస్థాన్ నుంచి అమెరికాకు వెళ్లిన ఐజా న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో తనకున్న పట్టుతో క్రమంగా ఏఐ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా ప్రస్తుత ఏఐ బూమ్‌కు కారణమైన జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్స్‌పై ఆమె ప్రత్యేక పరిశోధన చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక ఫిన్‌టెక్ స్టార్టప్‌లో ఏఐ ఏజెంట్లు తయారీపై ఆమె చేసిన ప్రాజెక్ట్ ఆంత్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థలో ఉద్యోగం సాధించడానికి కీలకమైందని వెల్లడించారు.యువతకు సూచనలుఏఐ ఇప్పుడు కేవలం టెక్నికల్ టీమ్స్‌కే పరిమితం కాలేదు. హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి ప్రతి రంగంలోనూ ఇది భాగమైంది. అందుకే దాని నుంచి తప్పించుకోవడం కంటే దాన్ని నేర్చుకోవడమే ఉత్తమం.కొత్త సాధనాలను ఎంత త్వరగా వాడటం నేర్చుకుంటే భవిష్యత్తు మార్కెట్లో అంతగా రాణించవచ్చు.ఏఐ అనేది మీ పనిని సులభతరం చేసే సాధనమే తప్ప, మీకు శత్రువు కాదు. దాని పనితీరును అర్థం చేసుకుంటే మీ కెరీర్ మరింత భద్రంగా ఉంటుంది.అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలో నిత్యం నేర్చుకోవాలి.గ్లోబల్ జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే పాత పద్ధతులకు అంటిపెట్టుకోకుండా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. -
కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎస్బీఐ రుణాలు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అత్యవసర రుణ హామీ పథకం (ECLGS) 5.0’ కింద ఎస్బీఐ కస్టమర్లకు పెద్ద మొత్తంలో రుణ సాయం లభించనుంది. ఈ పథకం కింద తమ కస్టమర్లకు రూ.70,000 నుంచి రూ.80,000 కోట్ల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు.విడుదలైన మార్గదర్శకాలు ప్రకారం.. తమ కస్టమర్లలో ఎవరికి ఈ పథకం కింద రుణ అర్హత ఉందో తెలిసిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడి, సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు మూలధన నిధుల మద్దతుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లతో ఈసీఎల్జీఎస్ 5.0 పథకాన్ని మంగళవారం ప్రకటించడం తెలిసిందే.ఈ పథకం కింద ఎయిర్‌లైన్స్‌కు రూ.5,000 కోట్లను పక్కన పెట్టగా, మిగిలిన రూ.2.50 లక్షల కోట్లను ఎంఎస్ఎంఈలతోపాటు, సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర వ్యాపార సంస్థల రుణాల కోసం కేటాయించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం చాలా రంగాలపై విస్తృతంగా ఉన్నట్టు శెట్టి చెప్పారు. ఈసీఎల్జీఎస్ పథకాన్ని సకాలంలో తీసుకొచ్చిన చురుకైన చర్యగా పేర్కొన్నారు. అయితే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రుణం తీసుకుంటారని చెప్పలేమన్నారు.ఈ పథకానికి అమలుకు సంబంధించి నిర్వహణ అంశాలను బ్యాంక్‌లు వచ్చే 8–10 రోజుల్లో పరిష్కరించుకుంటాయని తెలిపారు. బ్యాంకింగ్ అంతటా మొత్తం మీద 1.1 కోట్ల మంది లబ్దిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని చెప్పారు. సాధారణంగా ఎంఎస్ఎంఈలకు వర్తించే దానికంటే తక్కువ వడ్డీ రేటు ఈ పథకం కింద ఉంటుందన్నారు. -
విశ్వవేదికపై భారతీయ కళా వైభవం
ప్రపంచ కళా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వెనిస్ బినాలే వేదికపై భారతీయ ప్రాభవం మరోసారి మెరవనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) మధ్య కుదిరిన చారిత్రాత్మక భాగస్వామ్యంతో 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో ‘ఇండియా పెవిలియన్’ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళల వైవిధ్యాన్ని ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.సాంస్కృతిక రాయబారిగా..కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ ఆత్మను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే ఒక సాంస్కృతిక విప్లవమని అభివర్ణిస్తున్నారు.అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక సంభాషణ: ఇషా అంబానీ61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భారత జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇషా అంబానీ భారతదేశం, ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సాంస్కృతిక సంబంధాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి నీతా అంబానీ దార్శనికతను కొనియాడారు. భారతదేశంలోని ఉత్తమమైన వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రపంచంలోని ఉత్తమ కళలను భారతీయులకు చేరువ చేయడమే ఎన్ఎంఏసీసీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక సొంత ఇల్లు అనే భావనతో పోల్చిన ఆమె వెనిస్, భారతదేశం మధ్య సుదీర్ఘమైన, అర్థవంతమైన సాంస్కృతిక సంభాషణ జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రయత్నం మన పూర్వీకులు గర్వపడేలా ఉండడంతోపాటు మన భవిష్యత్ తరాలకు ఒక గొప్ప వారసత్వంగా నిలవాలని ఆమె పేర్కొన్నారు.Ms. Isha Ambani reflects on India’s evolving cultural dialogue with the world at the opening of the National Pavilion of India at the 61st International Art Exhibition – La Biennale di Venezia. Representing the Nita Mukesh Ambani Cultural Centre, she acknowledged her mother… pic.twitter.com/u7u5Qkd4ha— Reliance Foundation (@ril_foundation) May 7, 2026కళాకారులకు గ్లోబల్ విండోఈ భాగస్వామ్యం వల్ల భారతీయ గ్రామీణ హస్తకళాకారులు మొదలుకొని సమకాలీన కళాకారుల వరకు అందరికీ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ గుర్తింపు లభించనుంది. -
చదువు మధ్యలో వదిలేశారా? ఆందోళన వద్దు..
దశాబ్దాలుగా మన దేశంలో ఇంజినీరింగ్ అంటే ఒక సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా. కానీ, ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ డిగ్రీ మాయాజాలంలో చిక్కుకుని తీరా కొంతకాలం చదివాక తమ దారి తప్పిందని గ్రహిస్తున్నారు. ఇటీవల 21 ఏళ్ల యువకుడు రెడ్డిట్ వేదికగా పంచుకున్న అంశాలు నేటి తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు అద్దం పడుతోంది. మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్లో డ్రాపౌట్ అయిన ఆ యువకుడి కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది.రెడ్డిట్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. 17 ఏళ్ల వయసులో సమాజం, తల్లిదండ్రుల ఒత్తిడితో మెకానికల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. కానీ 21 ఏళ్లకు వచ్చేసరికి ఆ సబ్జెక్టులు అతనికి చాలా కష్టంగా అనిపించాయి. చేసే పనిపై ఇష్టం లేనప్పుడు ఆ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఒకవైపు కోర్సు పూర్తికాకపోవడం, మరోవైపు బయట గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతుండటం అతన్ని భయపెట్టాయి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక మందగమనం వల్ల ఏ రంగం సురక్షితమో తెలియని అయోమయం అతడిని చుట్టుముట్టింది. తనకు పెద్ద పెద్ద హోదాల కంటే ఆచరణాత్మకమైన జీవితం కావాలి. కనీసం 40,000 డాలర్ల(సుమారు రూ.33 లక్షలు) వార్షిక ఆదాయం, గౌరవప్రదమైన సామాజిక వృత్తి ఉంటే చాలని అతను కోరుకుంటున్నాడు. కానీ ఇంజినీరింగ్ మానేశాక, ఆ స్థాయికి ఎలా వెళ్లాలో తెలియక పార్ట్-టైమ్ ఉద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు.భావోద్వేగాల కంటే దిశానిర్దేశం ముఖ్యంచాలామంది ఇంజినీరింగ్ మధ్యలో ఆపేయడాన్ని ఒక వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తారు. కానీ వాస్తవానికి, భవిష్కత్తుపై స్పష్టమైన సంకేతం. ఆ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. ల్యాబ్‌లు, కఠినమైన కోర్సు వర్క్ అతనికి సరిపడలేదు.డ్రాపౌట్ అవ్వడం అంటే కెరీర్ ముగిసిపోవడం కాదు. అది కేవలం ఒక రీసెట్ బటన్ మాత్రమే. విశ్లేషణల కంటే ఆచరణాత్మక మార్పు కీలకం.డిగ్రీ లేదు సరే.. నైపుణ్యాల మాటేమిటి?సదరు యువకుడు తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల నమ్మకంగా ఉన్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంజినీరింగ్ పూర్తి చేయకపోయినా అతనికి ఉన్న టెక్నికల్ పరిజ్ఞానం ఇతర రంగాల్లో ప్లస్ పాయింట్ అవుతుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్) సాంకేతికతపై అవగాహన ఉండి బాగా మాట్లాడితే ఈ రంగంలో ఏడాదికి 40,000 డాలర్లు (సుమారు రూ.33 లక్షలు) కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారికి వైద్య రంగంలోని యంత్రాల గురించి త్వరగా అవగాహన కలుగుతుంది. రియల్ ఎస్టేట్, బిజినెస్ రంగంలో కస్టమర్లతో డీల్ చేయగలిగే నేర్పు ఉంటే ఇక్కడ ఆకాశమే హద్దు.ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకేవలం వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా 'ట్రేడ్ స్కిల్స్' వైపు చూడటం కూడా మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. లో-వోల్టేజ్ టెక్నీషియన్, ఏవియేషన్ మెకానిక్స్ వంటి రంగాల్లో అప్రెంటిస్‌షిప్ ద్వారా నేరుగా ఆదాయం పొందవచ్చు. సర్టిఫికేషన్ కోర్సుల్లో భాగంగా అకౌంటింగ్ లేదా డేటా అనలిటిక్స్ వంటి స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసి త్వరగా స్థిరపడవచ్చు.కెరీర్ పునర్నిర్మాణానికి..ఆందోళనను పక్కన పెట్టి గత అనుభవాన్ని విశ్లేషించుకోవడం.మీకు ఉన్న బలాలు (ఉదా: సేల్స్, డ్రాయింగ్, కోడింగ్) గుర్తించడం.ఎంచుకున్న రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంలో చేరడం.కృత్రిమ మేధ వంటి మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకోవడం.డిగ్రీ ఒక అధ్యాయం మాత్రమే..ఇంజినీరింగ్ మధ్యలో వదిలేశాను అన్న మాట వినడానికి కాస్త కఠినంగా ఉండవచ్చు. కానీ, ప్రపంచ ప్రఖ్యాత విజేతలు చాలామంది తమ కెరీర్ ప్రారంభంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నవారే. డ్రాపౌట్ అవ్వడం వల్ల అవకాశాలు తగ్గిపోవు. కానీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడం వల్ల మాత్రమే ఎదుగుదల ఆగిపోతుంది. ఆర్థిక స్థిరత్వం అనేది కేవలం డిగ్రీతోనే రాదు. మనం చేసే పనిలో చూపే ప్రతిభతో వస్తుందని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: రూ.28 లక్షల జాబ్ వదులుకున్న మేనేజర్ -
జాబ్ స్కాములపై అప్రమత్తంగా ప్రొఫెషనల్స్
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాల పేరిట జరిగే స్కాముల గురించి భారతీయ ప్రొఫెషనల్స్‌లో అవగాహన పెరుగుతోంది. 82 శాతం మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకునే ముందు సదరు జాబ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ రూపొందించిన జాబ్ సెర్చ్ సేఫ్టీ పల్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగం నిఖార్సయినదేనా లేదా ఏదైనా కుంభకోణం అయి ఉంటుందా అని ఆలోచించి, అడుగేసే ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే, వేగం, పోటీ తీవ్రంగా ఉండే మార్కెట్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నదై ఉంటోంది. ఈ నేపథ్యంలో జాబ్ ప్లాట్‌ఫాంలు, కంపెనీలు, ఉద్యోగార్థులు.. అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా, ఉద్యోగావకాశాల వ్యవస్థను విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దడం అవసరమని లింక్డ్ఇన్ ఇండియా హెడ్ (లీగల్, పబ్లిక్ పాలసీ) అదితి ఝా తెలిపారు. 2026 మార్చి 16–30 మధ్య భారత్‌తో పాటు బ్రిటన్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్లో నిర్వహించిన ఈ సర్వేలో 8,512 మంది పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో అప్రమత్తతను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ని అప్పుడప్పుడే మొదలుపెట్టే ఉద్యోగార్థుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. చాలా మంచి అవకాశంగా భావించి హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని 54 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగార్థులు తెలిపారు. జెన్ జెడ్ ప్రొఫెషనల్స్‌లో దాదాపు సగం మంది 49 శాతం జాబ్ స్కాము నుంచి తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. జెన్ ఎక్స్‌లో ఇలాంటి వారి సంఖ్య 36 శాతంగా ఉంది. → ఉద్యోగం కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడే అవకాశాలు (20 శాతం), సరైన వివరాలేమీ ఉండని, నమ్మశక్యంగా అనిపించని రిక్రూటర్ /కంపెనీ స్వయంగా సంప్రదించిన పరిస్థితుల్లో (18 శాతం) .. స్కామ్ అయి ఉంటుందేమోననే సందేహాలు ఉంటున్నాయి. → చర్చల పేరిట ఉద్యోగార్థులను విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల నుంచి వేరే వేదికల వైపు మళ్లించి, స్కామర్లు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం స్కామ్‌లలో, మెంబర్లను వ్యక్తిగత మెసేజింగ్ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు. -
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు. -
యూనికార్న్ క్లబ్‌లోకి హైదరాబాద్ స్కైరూట్
హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ ‘స్కైరూట్’ 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 570 కోట్లు) నిధులను సమీకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో కంపెనీ దేశంలోనే తొలి స్పేస్-టెక్ 'యూనికార్న్' హోదాను దక్కించుకుంది. ఈ లేటెస్ట్ ఫండింగ్‌తో కంపెనీ మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది.సాధారణంగా ఒక స్టార్టప్ విలువ 1 బిలియన్ డాలర్లను దాటితే.. దాన్ని యూనికార్న్‌గా పరిగణిస్తారు. భారత అంతరిక్ష రంగంలో.. ఇది గొప్ప విజయంగా భావిస్తారు. దీన్నిబట్టి చూస్తే భారతీయ స్పేస్ కంపెనీల వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ పెట్టుబడి రౌండ్‌కు షెర్పలో వెంచర్స్, జీఐసీ నాయకత్వం వహించాయి. అంతే కాకుండా గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు, ఆర్‌కామ్ వెంచర్స్ వంటి ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ ఇన్వెస్టర్, అలాగే గూగుల్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు, బోర్డు సభ్యుడైన రామ్ శ్రీరామ్ కూడా ఇందులో చేరనున్నారు.కంపెనీ కొత్తగా సేకరించిన నిధులను మూడు ప్రధాన లక్ష్యాల కోసం వినియోగించనుంది. మొదటగా, 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగాలను తరచుగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెండవది, రాకెట్ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. మూడవది, మరింత శక్తివంతమైన 'విక్రమ్-2' రాకెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది.ఈ రాకెట్ ఒక టన్ను వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యంతో రూపొందుతుంది. అధునాతన క్రయోజెనిక్ ఇంజిన్‌తో ఇది మరింత పెద్ద మిషన్లకు ఉపయోగపడనుంది.ప్రస్తుతం స్కైరూట్ సంస్థ 'విక్రమ్-1' ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది భారత్‌లో పూర్తిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా గుర్తింపు పొందుతోంది. ఈ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతో, అనుకూలమైన స్పేస్ లాంచ్ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు బ్రేక్: కారణం ఇదే!
మెమొరీ చిప్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది 10–12 శాతం మేర క్షీణించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఒక నివేదికలో తెలిపింది.ధరలపరమైన ఒత్తిళ్లు, డిమాండ్ నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. ‘డీఆర్ఏఎం, ఎన్ఏఎన్డీ ధరలు పెరగడంతో డివైజ్‌ల ధర పెరిగింది. దీనితో మాస్ సెగ్మెంట్‌కి సంబంధించిన ఉత్పత్తులు భారంగా మారాయి. వాటితో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రభావం తక్కువగా ఉంది‘ అని సీఎంఆర్ వీపీ ప్రభు రామ్ తెలిపారు. నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో షిప్మెంట్లు రెండు శాతం తగ్గాయి. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..ట్రాన్షన్, వన్‌ప్లస్ అమ్మకాలు వరుసగా 30 శాతం, 28 శాతం క్షీణించాయి.టాప్ 5 బ్రాండ్లలో వివో, ఒప్పో అమ్మకాలు వరుసగా 1 శాతం, 12 శాతం పెరిగాయి. శాంసంగ్, షావోమీ, రియల్మీ విక్రయాలు వరుసగా 8%, 7%, 12 శాతం క్షీణించాయి.చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో 21 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శాంసంగ్ (17 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (12 శాతం), రియల్మీ (10 శాతం) ఉన్నాయి.ఐఫోన్ 16 దన్నుతో యాపిల్ షిప్మెంట్లు 6 శాతం పెరగ్గా, సంస్థ మార్కెట్ వాటా 9 శాతంగా నమోదైంది.ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో చైనా బ్రాండ్ ఐటెల్ మొబైల్ అమ్మకాలు 26 శాతం పడిపోయినప్పటికీ 35 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత స్థానాల్లో లావా (34 శాతం వాటా), హెచ్ఎండీ (18 శాతం వాటా) ఉన్నాయి.చిప్సెట్స్ తయారీ సంస్థల్లో భారత్‌లో మీడియాటెక్ 48 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 25,000 పైబడిన ఫోన్లు) క్వాల్కామ్ 36 శాతం వాటాను దక్కించుకుంది. -
రూ.28 లక్షల జాబ్ వదులుకున్న మేనేజర్
కార్పొరేట్ ప్రపంచంలో ప్రమోషన్ అనేది ఒక అపురూపమైన మైలురాయి. హోదా, భారీ వేతనం, సమాజంలో గుర్తింపు.. వీటి కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తుంటారు. కానీ, ఆ ఊహల పల్లకీ ఒక్కోసారి ఊపిరి సలపని ఉచ్చుగా మారుతుందని హర్మన్ జోత్ కౌర్ ఉదంతం నిరూపిస్తోంది. ఏడాదికి రూ.28 లక్షల వేతనం వచ్చే సీనియర్ మేనేజర్ పదవిని తృణప్రాయంగా వదులుకుని ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఎనిమిదేళ్ల నిరీక్షణ.. తీరా చూస్తే?హర్మన్ జోత్ కౌర్ ఎనిమిదేళ్ల పాటు సంస్థ కోసం తీవ్రంగా పనిచేసింది. ఆమె కష్టానికి ఫలితంగా 2025లో ఆమెకు సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి లభించింది. రూ.28 లక్షల భారీ ప్యాకేజీ. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం, స్నేహితుల అభినందనలు. తను అనుకున్న గమ్యాన్ని చేరానన్న తృప్తి ఆమెలో ఉండేది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.పదవి తెచ్చిన ప్రమోషన్ ట్రాప్కొత్త బాధ్యతలు పెరగడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. ఈ మార్పును వివరిస్తూ.. ‘రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పనిలోనే గడపాల్సి వచ్చేది. పని ఒత్తిడిలో పడి నా కుమార్తె మొదటి స్కూల్ ఫంక్షన్‌కు కూడా వెళ్లలేకపోయాను. నిరంతర ఆందోళన కారణంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. మీటింగ్‌లకు వెళ్లేముందు భయాందోళనలు మొదలయ్యాయి. వృత్తిపరమైన ఒత్తిడి ప్రభావం వైవాహిక జీవితంపై పడి అది విచ్ఛిన్నమయ్యే స్థాయికి చేరుకుంది. ఒకరోజు ఆఫీస్ వాష్‌రూమ్‌లో ఒంటరిగా ఏడ్చేశాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. చేతిలో మరో ఉద్యోగం లేకపోయినా అదే వారంలో రాజీనామా చేశాను’ అని కౌర్ తన ఆవేదనను పంచుకున్నారు.వెనక్కి తగ్గుదాం..రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పంజాబ్‌లో సొంతంగా ఒక చిన్న ఏఐ సర్వీస్ స్టార్టప్‌ను నడుపుతున్నారు. ‘మునుపటి కంటే ఇప్పుడు సంపాదన తక్కువే కావచ్చు. కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నాను. నా కుటుంబంతో గడుపుతున్నాను. నేను వెంబడించిన ఆ ప్రమోషన్ నేను నిర్మించుకున్న ఒక పంజరంగా అనిపించింది’ అని ఆమె పేర్కొన్నారు.🚨 The promotion I worked 8 years for almost destroyed me.2025: Finally promoted to Senior Manager - ₹28 LPA.Everyone congratulated me. Parents were proud. I thought I had “arrived”.6 months later:• 14–16 hour days became normal• Missed my daughter’s first school…— Harmanjot Kaur (@itsharmanjot) May 5, 2026మనశ్శాంతి ముఖ్యంఈ వార్తపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ, ‘అసలైన సంపద మీ ఆఫర్ లెటర్లో ఉండే అంకెలు కాదు.. మీ సమయం, మీ మనశ్శాంతిపై మీకు ఉండే నియంత్రణ’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కే క్రమంలో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చను హర్మన్ జోత్ కథ మరోసారి తెరపైకి తెచ్చింది. కెరీర్ ఎదుగుదల ముఖ్యమే, కానీ అది ఒక బంగారు పంజరం కాకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా? -
50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వచ్ఛంద విరమణ
సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగుల కోసం ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు కోసం గతంలో లే-ఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు) చేపట్టిన కంపెనీ ఈసారి ఉద్యోగుల గౌరవప్రదమైన వీడ్కోలు కోసం భారీ ఆర్థిక ప్యాకేజీతో కూడిన ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.అర్హత ఎవరికి? (రూల్ ఆఫ్ 70)ఈ పథకం అందరికీ వర్తించదు. మైక్రోసాఫ్ట్ దీని కోసం రూల్ ఆఫ్ 70 అనే నిబంధనను విధించింది. దీని ప్రకారం.. ఉద్యోగి ప్రస్తుత వయస్సు + మైక్రోసాఫ్ట్‌లో వారు పనిచేసిన కాలం (సర్వీస్) కలిపి 70 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.ఉదాహరణకు 50 ఏళ్ల వయస్సు ఉండి, కంపెనీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు లేదా 55 ఏళ్ల వయస్సు ఉండి 15 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7 శాతం మంది (సుమారు 8,750 మంది) ఈ ఆఫర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది.నగదు, బీమా, స్టాక్స్స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ అత్యంత ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీని రూపొందించింది.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగం వదులుకున్న తొలి ఏడాది మెడికల్, డెంటల్, విజన్, వెల్నెస్ ఖర్చులను కంపెనీయే 100% భరిస్తుంది. ఆ తర్వాతి నాలుగు ఏళ్ల వరకు (మొత్తం ఐదేళ్లు) ఉద్యోగులు స్వల్ప ప్రీమియంతో ఈ సౌకర్యాన్ని పొందే వెసులుబాటు కల్పించింది.నగదు చెల్లింపు: లెవల్ 64 వరకు ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనాన్ని అందిస్తారు. లెవల్ 65 - 67 (సీనియర్ హోదాలు) వారికి ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు రెండు వారాల వేతనాన్ని ఇస్తారు. అయితే, ఏ కేటగిరీలోనైనా గరిష్టంగా 39 వారాల వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు.స్టాక్ ప్రయోజనాలు: సాధారణంగా వచ్చే స్టాక్ రివార్డులకు అదనంగా మరో 6 నెలల వెస్టింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కల్పిస్తారు. ఒకవేళ 24 ఏళ్లు పైబడి సర్వీస్ ఉంటే ఏకంగా 12 నెలల వెస్టింగ్ ప్రయోజనం లభిస్తుంది.ఒక రోజు ఆదాయం.. ఉద్యోగుల కోసం!మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమం కోసం దాదాపు 900 మిలియన్ డాలర్లను (సుమారు రూ.7,500 కోట్లు) కేటాయించినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ మొత్తం కంపెనీ కేవలం ఒక్క రోజు ఆదాయంతో సమానం. ఈ ఆఫర్‌పై నిర్ణయం తీసుకోవడానికి అర్హులైన ఉద్యోగులకు 30 రోజుల సమయం ఇచ్చారు. ‘అర్హులైన ఉద్యోగులు కంపెనీ అందించే ఉదారమైన మద్దతుతో తమ తదుపరి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇదొక మంచి అవకాశం’ అని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) అమీ కోల్మన్ అన్నారు.అంతర్గత మార్పులు.. పనితీరుకే పట్టంరిటైర్మెంట్ ప్లాన్‌తో పాటు కంపెనీ తన అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా మార్పులు చేసింది. ఉద్యోగుల మూల్యాంకన కేటగిరీలను 9 నుంచి 5కి తగ్గించారు. దీనివల్ల పనితీరు అంచనా వేగంగా జరుగుతుంది. స్టాక్ రివార్డులను కేవలం నగదు బోనస్‌లతో ముడిపెట్టకుండా ప్రతిభావంతులను గుర్తించే విషయంలో మేనేజర్లకు అదనపు అవకాశాలు కల్పించారు.ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా? -
ఇండియా క్లీన్ ఎనర్జీలోకి యాపిల్ ఎంట్రీ
టెక్ దిగ్గజం యాపిల్ తన సుస్థిరత లక్ష్యాల దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంతోపాటు పర్యావరణ హితమైన ఇంధన వనరుల వినియోగంలోనూ అగ్రగామిగా నిలవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ముంబైకి చెందిన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ‘క్లీన్ మ్యాక్స్’తో చేతులు కలిపింది. దాదాపు రూ.100 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ ప్రాజెక్టులను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిగతంలో యాపిల్ తన కార్యాలయాలు, రిటైల్ స్టోర్ల కోసం కేవలం రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు పరిమితం కాగా తాజా ఒప్పందం మరింత కీలకంగా మారనుంది. కేవలం విద్యుత్తును కొనుగోలు చేయడం కాకుండా, విద్యుత్ ఉత్పత్తి చేసే ఆస్తుల నిర్మాణంలో నేరుగా మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టడం ఈ డీల్‌లోని ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ 150 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి వస్తే సుమారు 1.5 లక్షల కుటుంబాల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చేంత శక్తి ఉత్పత్తి అవుతుంది.2030 లక్ష్యం దిశగా ప్రయాణం2030 నాటికి తన గ్లోబల్ సప్లై చైన్, ఉత్పత్తుల వినియోగం మొత్తాన్ని కార్బన్ న్యూట్రల్(వాతావరణంలోకి మనం విడుదల చేసే కార్బన్ ఉద్గారాలను అంతే పరిమాణంలో తిరిగి తొలగించడం)గా మార్చాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు కేవలం ఒక తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారుతోంది.‘భారతదేశ గ్రీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం, దేశంలోని సహజ వనరులను రక్షించడం మాకు గర్వకారణం. మా పర్యావరణ లక్ష్యాలు ఆవిష్కరణలకు చోదకశక్తిగా పనిచేస్తాయి’ అని యాపిల్ సప్లై చైన్ ఇన్నోవేషన్, వైస్ ప్రెసిడెంట్ సారా చాండ్లర్ అన్నారు. క్లీన్ మ్యాక్స్ వ్యవస్థాపకుడు కుల్దీప్ జైన్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు నెట్-జీరో భాగస్వామిగా ఉండటమే తమ లక్ష్యమని, యాపిల్ వంటి దిగ్గజంతో పనిచేయడం వల్ల పర్యావరణ వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా? -
మేనేజర్లకు కాలం చెల్లిందా?
టెక్ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తోన్న ఒకే మంత్రం ‘పని చేయండి లేదా పక్కకు తప్పుకోండి’. ఒకప్పుడు కేవలం పర్యవేక్షణకే పరిమితమైన మేనేజర్ల పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కృత్రిమ మేధ ఉత్పాదకతను విప్లవాత్మకంగా మారుస్తున్న తరుణంలో ఐటీ, టెక్ దిగ్గజాలు తమ సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా మారుస్తున్నాయి. కాయిన్‌బేస్, బ్లాక్, స్నాప్ వంటి సంస్థల్లో జరుగుతున్న తాజా పరిణామాలు ఈ మార్పుకు సాక్ష్యాలు.కాయిన్‌బేస్ సంచలనంప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్‌బేస్ ఇటీవల తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో 14% (సుమారు 700 మంది) ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ తొలగింపుల వెనుక ఉన్న కారణం ఖర్చుల తగ్గింపుతోపాటు సంస్థను ఏఐ-ఆధారితంగా మార్చడమేనని ఆ సంస్థ సీఈఓ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ మేనేజర్ల భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. ‘కాయిన్‌బేస్‌లో ప్రతి నాయకుడు కూడా ఒక బలమైన వ్యక్తిగత కంట్రిబ్యూటర్ అయి ఉండాలి. మేనేజర్లు కేవలం పక్కన నిలబడి సూచనలిచ్చే వారు కాదు. వారు ప్లేయర్-కోచ్‌లా ఉండాలి. అంటే, జట్టును నడిపిస్తూనే స్వయంగా పనిలో తలమునకలు కావాలి’ అన్నారు.క్యూ కట్టిన టెక్ దిగ్గజాలుబ్లాక్ (Block): కంపెనీ సీఈఓ జాక్ డోర్సే ఇప్పటికే 40% సిబ్బంది కోతను ప్రకటించారు. మేనేజర్లను ప్లేయర్-కోచ్‌లుగా మారాలంటున్నారు.స్నాప్ (Snap): కంపెనీ చీఫ్ ఇవాన్ స్పీగెల్ ఏఐ ఆధారిత చిన్న ‘స్క్వాడ్స్’ ఏర్పాటులో భాగంగా 1,000 ఉద్యోగాలను తొలగించారు.మెటా, అట్లాసియన్: మార్క్ జుకర్‌బర్గ్ వంటి నాయకులు సైతం ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ పేరుతో మేనేజర్ల సంఖ్యను తగ్గించి సంస్థను పునర్నిర్మించే ప్రక్రియలో ఉన్నారు.పేపాల్ (PayPal): ఏఐ పరివర్తన ద్వారా రాబోయే రెండేళ్లలో 1.5 బిలియన్ల డాలర్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 20% సిబ్బంది తగ్గింపు జరిగే అవకాశం ఉందని సమాచారం.అలాంటివారికి కష్టమే..హ్యూమన్ రిసోర్స్ విశ్లేషకుడు జోష్ బెర్సిన్ అభిప్రాయం ప్రకారం, పారిశ్రామిక విప్లవం నాటి ‘పర్యవేక్షణ మాత్రమే చేసే మేనేజర్’ పాత్రకు ఇక ముగింపు పలకాల్సిందే. ‘2026 నాటికి మేనేజర్‌గా కొనసాగాలంటే, మీరు కేవలం మనుషులను మాత్రమే కాదు, ఏఐ ఏజెంట్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక మేనేజర్ కంటే ఏఐ ఏజెంట్‌కే ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి, నాయకులు స్వయంగా ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి’ అని ఆయన విశ్లేషించారు. దీనినే ఇప్పుడు మెగామేనేజర్ సంస్కృతిగా పిలుస్తున్నారు.నైపుణ్యం లేకపోతే నిష్క్రమణే!క్రిప్టోజాబ్స్ లిస్ట్ వ్యవస్థాపకుడు రామన్ షాలుపౌ మాటల్లో చెప్పాలంటే, ఇది ఒక అనివార్యమైన మార్పు. కంపెనీలు ఏఐ వాషింగ్ (అత్యాధునికంగా కనిపించే ప్రయత్నం) చేస్తున్నాయా లేదా నిజంగా ఉత్పాదకత పెరుగుతోందా అనేది పక్కన పెడితే, ఉద్యోగంలో కొనసాగాలంటే ఏఐ నైపుణ్యాలు కలిగి ఉండటం ఇప్పుడు తప్పనిసరి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
విజయానికి మంత్రం ఇదే..
నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం మేధస్సు, వనరులు ఉంటే సరిపోదు.. అంతకుమించి వేగం అత్యంత అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఒక ఆలోచనాత్మకమైన కోట్ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.అతిగా ఆలోచించకండి..విజయవంతమైన వ్యక్తుల జీవనశైలిని నిశితంగా గమనించిన గోయెంకా వారిలో ఒకే రకమైన సామాన్య లక్షణం కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘విజయవంతమైన వ్యక్తులు అతిగా ఆలోచించరు, అతిగా ప్లాన్ చేయరు లేదా సరైన సమయం కోసం వేచి ఉండరు. వారు కేవలం ముందుకు సాగిపోతుంటారు. ఇతరులు చర్చలు, పరిశోధనలతో సమయం గడుపుతున్నప్పుడు.. వీరు ఇప్పటికే పని మొదలుపెట్టి, అందులో ఎదురయ్యే సవాళ్లను నేర్చుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు’ అని ఆయన వివరించారు.పరిపూర్ణత కంటే కార్యాచరణే మిన్నచాలామంది పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తూ నెలల తరబడి సమయాన్ని వృథా చేస్తారని, దానివల్ల అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉందని గోయెంకా హెచ్చరించారు. ఆరు నెలల తర్వాత అమలు చేసే పరిపూర్ణ ప్రణాళిక కంటే ఈరోజే అమలు చేసే మంచి ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఎయిరిండియా సంచలన నిర్ణయం
టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో మే నెలలో పలు కీలక అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను భారీగా తగ్గించింది. వివిధ మార్గాల్లో 5 శాతం నుంచి ఏకంగా 25 శాతం వరకు విమానాల రద్దు జరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.ముఖ్యమైన రూట్లలో కోతలు ఇలా..చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మే 1 నుంచి అంతర్జాతీయ విమాన ఇంధన ధరలను 5 శాతం పెంచడంతో ఎయిరిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.ఉత్తర అమెరికా: ఈ మార్గంలో కార్యకలాపాలను 20 శాతం తగ్గించారు. షెడ్యూల్ చేసిన 200 విమానాల్లో సుమారు 40 విమానాలను రద్దు చేశారు.యూరోప్: పారిస్, కోపెన్హాగన్, జ్యూరిచ్ వంటి నగరాలకు వారంతపు సర్వీసులను తగ్గించారు. మొత్తం 450 విమానాల్లో దాదాపు 20 విమానాలు రద్దు అయ్యాయి.ఆస్ట్రేలియా: మెల్బోర్న్, సిడ్నీ రూట్లలో వారానికి నడిచే ఏడు విమానాల్లో రెండింటిని నిలిపివేశారు.ఆగ్నేయ ఆసియా: ఈ ప్రాంతానికి సర్వీసులను 10 శాతం వరకు కుదించారు.కారణాలేమిటి?.. సీఈఓ వివరణనెట్వర్క్ ఆప్టిమైజేషన్, డిమాండ్‌లో మార్పులు, పెరుగుతున్న ఇంధన ధరలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విమాన మార్గాల మూసివేత వల్ల ప్రయాణ కాలం పెరగడం, కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల అనేక అంతర్జాతీయ సర్వీసులు నష్టాల్లో నడుస్తున్నాయి’ అని చెప్పారు.దేశీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ జోక్యం వల్ల ధరల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ రూట్లలో మాత్రం భారం తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో కూడా పరిస్థితులను బట్టి షెడ్యూల్లో మార్పులు ఉండొచ్చని సూచించారు.ఇండిగో, అంతర్జాతీయ సంస్థల పరిస్థితిమరోవైపు, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. మే నెలలో అంతర్జాతీయ సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే గల్ఫ్ దేశాలకు సర్వీసులను ఇప్పటికే 10 శాతం తగ్గించింది. అంతర్జాతీయంగా చూస్తే.. లుఫ్తాన్సా మే నుంచి అక్టోబర్ మధ్య ఏకంగా 20,000 విమానాలను రద్దు చేయగా క్వాంటాస్ భారత్‌కు నడిపే తన సర్వీసులను అక్టోబర్ వరకు తగ్గించుకుంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం
ప్రపంచ కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వెనిస్ బినాలే’ వేదికపై భారతీయ ప్రాభవం మెరవనుంది. భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ‘ఇండియా పెవిలియన్’ను తిరిగి వెనిస్ బినాలేకు తీసుకువెళ్లడంతోపాటు మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు.సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేదికకళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ముందుండే రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముందడుగుపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే అద్భుత ఘట్టమని చెబుతున్నారు. ‘ప్రపంచంలోని గొప్ప వేదికల్లో ఒకటైన వెనిస్లో మన దేశ కళ, సంస్కృతి, హస్తకళలను వేడుకగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని ఓ సీనియర్ ఆర్ట్ క్రిటిక్ అన్నారు.కళాత్మక హొయలతో నీతా అంబానీఈ చారిత్రాత్మక క్షణాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ తన వస్త్రధారణతో భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన షిఫాన్-జార్జెట్ చీరలో ఆమె మెరిసిపోయారు. దీనికి జతగా బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేస్ బ్లౌజ్ ధరించారు. మన నేత కళకు నిదర్శనమైన ‘స్వదేశ్’ రూపొందించిన, చేతితో నేసిన బుటిదార్ సోజ్ని శాలువా ఆమె రాజసాన్ని మరింత పెంచింది. ప్రఖ్యాత జ్యువెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ రూపొందించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఎఫ్‌డీఐలతో బీమాకు మేలే..
బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడమనేది పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోగ్య బీమా రంగ దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో మరిన్ని పెట్టుబడులు, మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తాయని, ఇన్సూరెన్స్ రంగ విస్తృతి మరింత పెరుగుతుందని మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,000 కోట్ల మేర స్థూల రిటెన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఇది సుమారు రూ.20,400 కోట్లుగా ఉండగా, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయ్ వివరించారు. చిన్న పట్టణాల్లో మరింతగా విస్తరించడం ద్వారా దీన్ని సాధించనున్నట్లు చెప్పారు. బీమాను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా చిన్న పట్టణాల్లోని వారి కోసం తక్కువ ప్రీమియంలతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 15 శాతం వాటా లక్ష్యంసంస్థ వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 10 శాతంగా ఉన్నట్లు రాయ్ చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో దీన్ని 12–15 శాతానికి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,254 కోట్లు విలువ చేసే 1.8 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించామని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24 శాతం అధికమని రాయ్ వివరించారు. జాతీయ స్థాయిలో 30.6 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 11,903 కోట్లు సెటిల్ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీపై ఏటా రూ. 200–250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. బీమా ప్రీమియంలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
500 మందిని తొలగించిన టెక్ కంపెనీ
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ బిజినెస్ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఫ్రెష్‌వర్క్స్’ తాజాగా తన ఉద్యోగుల్లో 11 శాతం మందిని, అంటే దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న తరుణంలో తాజా నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.ఎందుకు ఈ నిర్ణయం?ఏఐ రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే క్రమంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డెన్నిస్ వుడ్‌సైడ్ స్పష్టతనిచ్చారు. ‘మా కోడింగ్ ప్రక్రియలో ఇప్పటికే సగానికి పైగా ఏఐ ద్వారానే జరుగుతోంది. ఆటోమేషన్ వల్ల సాంకేతిక విభాగాల్లోని సాధారణ పనులు గణనీయంగా తగ్గాయి. ఈ మార్పులను సమర్థవంతంగా నిర్వహించడానికి లేఆఫ్స్ అవసరం ఏర్పడింది’ అని ఆయన వివరించారు.పునర్నిర్మాణ వ్యూహంఈ తొలగింపుల వల్ల కంపెనీపై సుమారు 8 మిలియన్ డాలర్ల భారం పడనుందని అంచనా. అయితే, ఈ పొదుపు ద్వారా వచ్చిన నిధులను కంపెనీ తన ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అయిన ‘ఫ్రెష్సర్వీస్’ వంటి వ్యాపార విభాగాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రాంతం అది..
టెక్ ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుసరించే ప్రశాంతమైన నాయకత్వ శైలి వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేశారు. దశాబ్దాల క్రితం హవాయి తీరంలో జరిగిన ఒక స్కూబా డైవింగ్ అనుభవం నేడు ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆయనకు ఒక దిశానిర్దేశక సూత్రంగా నిలుస్తున్నట్లు చెప్పారు.అలల గందరగోళం... అడుగున నిశ్శబ్దంచాలా ఏళ్ల క్రితం హవాయి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో పిచాయ్ అనుకోని చిక్కుల్లో పడ్డారు. సముద్రపు ఉపరితలంపై అలలు ఉధృతంగా ఉన్నాయి. నీటిలోకి దిగగానే సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వెనక్కి వెళ్లిపోవాలన్న ఆలోచన ఆయనకు కలిగిందట. అయితే, భయపడకుండా మరింత లోతుకు డైవ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సముద్ర ఉపరితలంపై ఉన్న గందరగోళం, అలల వేగం అంతా కొన్ని అడుగుల లోతుకు వెళ్లేసరికి మాయమైపోయింది. అక్కడ అత్యంత ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణాన్ని అనుభవించాను. ఆ క్షణం ఇంకా నా మదిలో నిక్షిప్తమై ఉంది’ అన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో స్పష్టతతరువాతి కాలంలో ఆల్ఫాబెట్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ తన నాయకత్వ శైలి గురించి వివరిస్తూ తరచుగా ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు. గూగుల్ వంటి అతిపెద్ద సంస్థను నడపడం అంటే.. నిరంతరం మారుతున్న నిబంధనలు, కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న పెను మార్పులు, ప్రపంచ ప్రభావం చూపే కీలక నిర్ణయాల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ‘ఉపరితలంపై ఉండే గందరగోళానికి వెంటనే ప్రతిస్పందించడం కంటే, లోతుల్లోకి వెళ్లి స్పష్టతను వెతుక్కోవడం ముఖ్యం’ అని ఆయన విశ్వసిస్తారు. క్లిష్ట సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి పెట్టడమే ఉత్తమమైన మార్గమని పిచాయ్ నిరూపించారు.సహకారంతో కూడిన నాయకత్వంసాంకేతిక రంగంలో చాలామంది దిగ్గజాలు దూకుడుగా, ఘర్షణాత్మక శైలిలో నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ, పిచాయ్ శైలి పూర్తిగా భిన్నమైనది. ఆయన నిర్ణయాల్లో సహకారం, అంతర్గత సమన్వయం స్పష్టంగా కనిపిస్తాయి.ప్రతి సవాలుకు ఆవేశంగా స్పందించడం కంటే, సంక్లిష్ట పరిస్థితుల్లో సమతుల్యతను కోల్పోకుండా ఉండటమే గొప్ప నాయకత్వ లక్షణమని పిచాయ్ భావిస్తారు.తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయడం ఆల్ఫాబెట్ వృద్ధికి దోహదపడింది.అనిశ్చితి నెలకొన్న సమయంలో నాయకుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మొత్తం సంస్థ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని ఆయన నమ్ముతారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
పీఎన్బీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14% ఎగసి రూ. 5,225 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది (2024–25) ఇదే కాలంలో రూ. 4,567 కోట్లు ఆర్జించింది.వాటాదారులకు బ్యాంక్ బోర్డ్ షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్ప వెనకడుగుతో రూ. 36,319 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 36,705 కోట్ల ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.95% నుంచి 2.95 శాతానికి, నికర ఎన్పీఏలు 0.4 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు బీఎస్ఈలో 0.8 శాతం నష్టంతో రూ. 108 వద్ద ముగిసింది. -
బయోకాన్ వారసురాలిగా కిరణ్ మేనకోడలు
భారత బయోటెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన బయోకాన్ సంస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా తన మేధస్సుతో ప్రపంచ స్థాయి బయోటెక్ సామ్రాజ్యాన్ని నిర్మించిన సంస్థ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్‌షా తన వారసురాలిని ఖరారు చేశారు. తన మేనకోడలు క్లైర్ మజుందార్ బయోకాన్ పగ్గాలు చేపట్టనున్నారని ప్రకటించారు.క్లైర్ మజుందార్37 ఏళ్ల క్లైర్ మజుందార్ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఆంకాలజీ (క్యాన్సర్) పరిశోధన సంస్థ ‘బికారా థెరప్యూటిక్స్’కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2018లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె సంస్థను ఒక నూతన స్థాయికి తీసుకెళ్లారు. సంస్థను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మార్చడంతోపాటు లిస్టింగ్ తర్వాత దాని విలువను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. క్లైర్ నాయకత్వంలో బికారా సంస్థ క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నిర్మూలించే ‘బై-స్పెసిఫిక్ యాంటీబాడీస్’ వంటి అత్యాధునిక చికిత్సలపై దృష్టి సారించింది.క్లైర్ విద్యా నేపథ్యంమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ రంగాల్లో ఆమె పట్టా పొందారు. ఆమె కుటుంబ నేపథ్యం కూడా సైన్స్, టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఆమె సోదరుడు ఎరిక్ మజుందార్ కాల్టెక్లో ఏఐ నిపుణుడిగా పనిచేస్తుండగా ఆమె భర్త థామస్ రాబర్ట్స్ ప్రముఖ క్యాన్సర్ నిపుణులు.భవిష్యత్తు కార్యాచరణకిరణ్ మజుందార్-షా తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఫార్చ్యూన్ ఇండియాకు వివరించారు. ‘ఏకైక యజమానిగా సంస్థను సురక్షితమైన చేతుల్లో ఉంచడం నా బాధ్యత. క్లైర్ సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. తన వారసురాలిగా క్లైర్‌ను ప్రకటించినప్పటికీ తాను వెంటనే బయోకాన్ ఛైర్పర్సన్ బాధ్యతల నుంచి వైదొలిగే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. బాధ్యతలను ఒకేసారి కాకుండా దశలవారీగా తనకు అప్పగిస్తానని ఆమె తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. వారసురాలి ప్రకటనపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సంస్థపై, తన పదవిపై ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.రూ.2,600 కోట్ల పైచిలుకు వ్యయంఈ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం కాగ్నిజెంట్ 230 మిలియన్ డాలర్ల నుంచి 320 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,900 కోట్ల నుంచి రూ.2,600 కోట్లు) నిధులను కేటాయించింది. ఇందులో ప్రధానంగా 200 మిలియన్ల నుంచి 270 మిలియన్ డాలర్లను ఉద్యోగులకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కంపెనీ అధికారికంగా తొలగింపుల సంఖ్యను వెల్లడించనప్పటికీ అంతర్గత వ్యయ అంచనాలు, వివిధ ప్రాంతాల్లోని జీతభత్యాల ప్రమాణాల ఆధారంగా ఈ గణాంకాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.భారత్‌పైనే తీవ్ర ప్రభావం?కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3,57,000 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండగా ఇందులో 2,50,000 మందికి పైగా భారత్‌లోనే పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ జీతభత్యాల వ్యయం తక్కువగా ఉండటం, ఉద్యోగ విరమణ/తొలగింపు ప్రక్రియకు సంబంధించిన ఖర్చులు సాపేక్షంగా తక్కువ కావడంతో ఈ కోతలు భారత్‌లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
లేఆఫ్స్ వేళ ఉద్యోగుల హక్కులివే!
ప్రస్తుత కాలంలో అగ్రశ్రేణి టెక్ కంపెనీలు చేపడుతున్న సామూహిక తొలగింపులు (లేఆఫ్స్) ఉద్యోగ రంగంలో అనిశ్చితిని పెంచుతున్నాయి. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం ఏ ఉద్యోగికైనా ఒత్తిడితో కూడిన విషయమే. అయితే, తొలగింపునకు గురైనప్పుడు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు.. తమకు ఎటువంటి సమయం లేదా బేరసారాలు ఆడే అవకాశం లేదని భావించడం. కానీ, చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకుంటే మీకు కొన్ని అవకాశాలున్నాయని ఉపాధి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.40 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక రక్షణముఖ్యంగా 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులకు ‘ఓల్డ్ వర్కర్స్ బెనిఫిట్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఓడబ్ల్యూబీపీఏ)’ కింద ఫెడరల్ చట్టం(యూఎస్) ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం.. సెవెరెన్స్ అగ్రిమెంట్ పరిశీలించడానికి మీకు కనీసం 21 రోజులు (సామూహిక తొలగింపులైతే 45 రోజులు) గడువు ఇవ్వాలి. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా మనసు మార్చుకోవడానికి మీకు 7 రోజుల సమయం ఉంటుంది.కంపెనీలు హడావిడిగా సంతకం చేయమని ఒత్తిడి చేయడం సరికాదు. పైన పేర్కొన్న గడువును ఎవరూ తప్పించలేరు. బలవంతపు సంతకాలు చేయించుకోకూడదు.ప్యాకేజీని చర్చించడం ఎలా?చాలామంది ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన మొదటి ఆఫర్‌ను అంగీకరిస్తుంటారు. కానీ, ఆ గణాంకాలు వేరేలా చెబుతున్నాయి. నోలో/మార్టిన్ డేల్-నోలో డేటా ప్రకారం, బేరసారాలు జరిపిన ఉద్యోగులు సగటున 41,500 డాలర్లు వరకు అందుకుంటే, నేరుగా సంతకం చేసిన వారు సగటున 19,200 డాలర్లు పరిహారం మాత్రమే పొందగలిగారు.చర్చించాల్సిన అంశాలుసాధారణంగా సర్వీసులో ఉన్న సంవత్సరానికి ఒకటి లేదా రెండు వారాల వేతనం ప్రాతిపదికగా ఉంటుంది. దీన్ని పెంచే అవకాశం ఉంటుంది.కోబ్రా వంటి ఆరోగ్య బీమా కవరేజీని కంపెనీయే చెల్లించేలా బేరమాడవచ్చు.స్టాక్ ఆప్షన్లను వేగవంతం చేయమని చర్చించవచ్చు.రెజ్యూమ్ సపోర్ట్, జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, పాజిటివ్ రిఫరెన్స్ లెటర్లు అడగడం మర్చిపోవద్దు.సంతకానికి ముందు..చాలా ఒప్పందాల్లో వేధింపులు, వివక్ష లేదా తప్పుడు తొలగింపులకు వ్యతిరేకంగా మీరు పోరాడే హక్కులను వదులుకోవాలంటూ క్లాజ్‌లుంటాయి. ఈ క్లాజులపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీపై అకస్మాత్తుగా ఏదైనా ఒక కారణంచేత తొలగించామని ముద్ర వేస్తే అది మీ కెరీర్‌కు ఆటంకం కావచ్చు. మీ పనితీరు బాగున్నప్పటికీ ఇలా జరిగితే రికార్డులను సవరించమని కోరండి. కంపెనీ సిస్టమ్‌ల నుంచి యాక్సెస్ కోల్పోయేలోపే.. మీ పనితీరు సమీక్షలు, ఈమెయిల్స్, ఒప్పంద పత్రాలను డౌన్లోడ్ చేసుకోండి.న్యాయ సలహా అవసరమా?న్యాయవాదిని సంప్రదించడం ఖరీదైన వ్యవహారమని భావించకండి. చాలామంది న్యాయవాదులు నిర్ణీత ఫీజుతో సర్వీసులు అందిస్తారు. మీ కంపెనీతో ఉన్న ఒప్పందంలోని లొసుగులను గుర్తించి చర్చల ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందడంలో వారి సలహా ఎంతో కీలకం. కంపెనీలు పెట్టే గడువుల కంటే మీ హక్కులు గొప్పవి. తొలగింపునకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
ఎల్పీజీపై రూ.300 తగ్గించుకోండిలా!
అంతర్జాతీయంగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం సామాన్యుడి వంటగదిపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరడం హోటల్, రెస్టారెంట్ రంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, దేశీయ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొంతవరకు ఊరటనిస్తోంది.గరిష్టానికి కమర్షియల్ గ్యాస్ ధరలుమే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచింది. రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.993 పెరిగి రూ.3,071.50కు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక ధర. కేవలం మూడు నెలల కాలంలోనే ధరలు రూ.1,303 మేర పెరగడం వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గత మూడు నెలల గణాంకాలుమార్చి: రూ.114.50 పెంపుఏప్రిల్: రూ.195.50 పెంపుమే: రూ.993 పెంపుచిన్న సిలిండర్లు: 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.549 నుంచి రూ.810.50కి పెరగడంతో చిన్న వ్యాపారులకు కూడా భారం పెరిగింది.డిమెస్టిక్ వినియోగదారుల పరిస్థితి ఏమిటి?ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ (14.2 కేజీలు) ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, మార్చి నెలలో జరిగిన చివరి సవరణలో సిలిండర్‌పై రూ.60 పెంచిన విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా చమురు ధరల అస్థిరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.సబ్సిడీతో ఉపశమనం.. రూ.300 ఆదా ఇలా!ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఉజ్వల లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని పొందుతున్నారు. ఇది సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్లకు వర్తిస్తుంది. 5 కిలోల సిలిండర్ వాడే వారికి దామాషా పద్ధతిలో సబ్సిడీ అందుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, ఇన్స్టలేషన్ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఉజ్వల 2.0 కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మొదటి రీఫిల్, స్టవ్‌ను కూడా ఉచితంగా అందిస్తూ సామాన్యులు క్లీన్ ఫ్యూయెల్ ఎల్పీజీ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది.వాణిజ్య సిలిండర్ ధరల పెంపు ప్రభావం హోటల్ మెనూ ధరలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి సబ్సిడీల రూపంలో కొంత రక్షణ ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు గ్యాస్ ధరలను ఎలా శాసిస్తాయనేది వేచి చూడాలి. ఈ తరుణంలో ఉజ్వల పథకం వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సామాన్యులకు ఊపిరినిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
తెరవెనుక మస్క్ బెదిరింపులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ మధ్య న్యాయ పోరాటం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు విచారణ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మస్క్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్‌కు పంపిన సందేశాలు ప్రస్తుతం ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఏమిటా సందేశం?సీఎన్‌బీసీ నివేదికల ప్రకారం, విచారణకు కేవలం రెండు రోజుల ముందు ఎలాన్ మస్క్, గ్రెగ్ బ్రోక్‌మన్‌కు సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలను విరమించుకుని కేసును పరిష్కరించుకుందామని బ్రోక్మన్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనకు మస్క్ ఇచ్చిన స్పందన అత్యంత తీవ్రంగా ఉంది. ‘ఈ వారం చివరి నాటికి మీరు, సామ్ ఆల్ట్మాన్ అమెరికాలోనే అత్యంత అసహ్యించుకునే వ్యక్తులుగా మారుతారు. మీరు పట్టుబట్టి ముందుకు వెళితే అలాగే ఉంటుంది’ అని మస్క్ హెచ్చరించినట్లు న్యాయస్థానంలో దాఖలు చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.ఓపెన్ఏఐ వాదనఈ సందేశాన్ని ఓపెన్ఏఐ న్యాయ బృందం చాలా సీరియస్‌గా పరిగణించింది. మస్క్ తన పోటీదారులను, ఆ సంస్థల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఓపెన్ఏఐ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మస్క్ ఈ దావాను కేవలం ఒక పోటీ వ్యూహంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.వివాదం నేపథ్యం2024లో మొదలైన ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 2015లో ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలాన్ మస్క్, ఆ సంస్థకు దాదాపు 38 మిలియన్ డాలర్ల విరాళం అందించారు. ఆ సంస్థ లాభాపేక్ష లేని (నాన్ ప్రాఫిట్), అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేయాలని మస్క్ అప్పట్లో ఆకాంక్షించారు. అయితే, సంస్థ ప్రస్తుతం లాభాపేక్ష దిశగా మళ్లడంపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వారం కోర్టులో సాక్ష్యం చెబుతూ సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లు ఒక స్వచ్ఛంద సంస్థను తీరునే మారుస్తున్నారని ఆరోపణలు చేశారు.తదుపరి పరిణామాలుమస్క్ ఆరోపణలను ఓపెన్ఏఐ వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి మరింత వ్యాపారం లభించేందుకు, మార్కెట్ పోటీని దెబ్బతీయడానికి ఆడుతున్న నాటకమని సంస్థ వాదిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
బెంగాల్లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ సంస్థ శ్రేయాస్ గ్రూప్ తాజాగా మీడియా, స్పోర్ట్స్ తదితర రంగాల్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10,000 మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్‌రావు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారు శ్రేయాస్ ప్రతినిధిగా చేరి, ఈవెంట్స్, రిటైల్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్‌లాంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విధానంలో యువత తమ సొంత ప్రాంతాల్లోనే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని శ్రీనివాస్‌రావు చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా గ్రూప్ హిందీ, పంజాబీలాంటి ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోకి విస్తరిస్తోంది. అలాగే కార్పొరేట్ క్లబ్, ఉత్సవ్ పేరిట ఈవెంట్స్ రంగంలో, ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ద్వారా రియల్టీలోనూ అడుగుపెట్టింది. ఏఐ ఫ్రేమ్స్ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత వీడియో ప్రొడక్షన్ స్టూడియో, ఎనీటైమ్ థియేటర్ అనే వినూత్న వినోద ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తోంది. -
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఊరట
డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు (బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్ ఫండ్ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్బీఎఫ్సీలు ఈ జాబితాలో ఉంటాయి.ప్రస్తుతం టైప్ 1 ఎన్‌బీఎఫ్‌సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45ఐఏ ప్రకారం ఎన్బీఎఫ్సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది. -
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్ పోస్ట్
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు.వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది. తొలగని పావెల్ నీడ!ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.అసలు బాస్ ఎవరు?కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz)."ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం. -
ఏఐపై జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు
నేడు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తోంది. రోజుకో కొత్త సాంకేతికత, శక్తివంతమైన ఏజెంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఎంత మేధస్సును కలిగి ఉన్నా సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీశాయి.మెటా సంస్థ 2026 మొదటి త్రైమాసిక పలితాల విశ్లేషణ సమావేశంలో మాట్లాడుతూ, జుకర్ బర్గ్ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఏఐ ఏజెంట్లు అత్యంత శక్తివంతమైనవి కావొచ్చు, కానీ అవి సామాన్యులకు అర్థం కానంత క్లిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన ‘మదర్ టెస్ట్’గా అభివర్ణించారు.‘నా తల్లి సైతం అర్థం చేసుకునేంత సరళంగా ఈ ఏజెంట్లు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిలో మెజారిటీ సాధనాలు ఆ మదర్ టెస్ట్‌లో విఫలమవుతున్నాయి’ అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. సాంకేతిక నిపుణులు, కోడింగ్ తెలిసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించగలుగుతున్నారు తప్ప, సాధారణ వినియోగదారులకు ఇవి భారంగా మారాయని ఆయన విశ్లేషించారు.మెటా వ్యూహంప్రస్తుతం ఓపెన్ సోర్స్, కోడింగ్ ఆధారిత ఏజెంట్లను అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు తీవ్రమైన పోటీలో ఉన్నాయి. అయితే, మెటా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. వేగం కంటే వినియోగ సౌలభ్యానికి తమ కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, కమాండ్-లైన్ సెటప్‌లు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికే ఏఐ ఏజెంట్లు చేరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది వినియోగదారులు ఎటువంటి అదనపు శిక్షణ లేకుండా అత్యంత సహజంగా ఉపయోగించగల సాధనాలను రూపొందించాలని మెటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్క్ చెప్పారు.పెట్టుబడుల వెనుక ఆంతర్యంపెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మెటా తన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల ఖర్చులు పెరుగుతున్నా దీర్ఘకాలికంగా మార్కెట్‌ను శాసించేది వినియోగదారులకు అత్యంత చేరువలో ఉండే ఏఐ సాధనాలేనని మెటా భావిస్తోంది. ‘సాంకేతిక పురోగతి మాత్రమే ముఖ్యం కాదు. అది మనిషి జీవితంలో ఎంత సులభంగా భాగమైందనేదే అసలైన విజయానికి కొలమానం’ అని జుకర్ బర్గ్ గుర్తు చేశారు.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు -
రూ. 656 కోట్లను దాటిన ‘డీమార్ట్’ లాభం
న్యూఢిల్లీ: రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 19 శాతం ఎగసి రూ. 656 కోట్లను అధిగమించింది.2024–25 ఇదే కాలంలో రూ. 551 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఆదాయం సైతం 19 శాతం బలపడి రూ. 17,684 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 14,872 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 16,798 కోట్లను తాకాయి. నికర లాభ మార్జిన్లు నిలకడను చూపుతూ 3.7 శాతంగా నమోదయ్యాయి.మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్ స్టోర్ల దిగ్గజం నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,970 కోట్లయ్యింది. మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 68,895 కోట్లను తాకింది. క్యూ4లో ప్రారంభించిన 58 కొత్త స్టోర్లతో కలిపి వీటి సంఖ్య 500 మైలురాయికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. -
చమురు నౌక హైజాక్.. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో కలకలం
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.నౌక వివరాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్‌కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.ప్రాంతీయ ఉద్రిక్తతలుప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
తెలంగాణలో న్యూట్రిషన్ నెక్ట్స్ తయారీ ప్లాంటు
హైదరాబాద్: పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులకు సంబంధించి తెలంగాణలోని వర్గల్లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రారంభించనున్నట్లు న్యూట్రిషన్ నెక్ట్స్ సహ వ్యవస్థాపకులు వెంకట ధర్మేంద్ర బొప్పన తెలిపారు. కొత్తగా పిల్లుల కోసం పేరెంట్ పేరిట, శునకాల కోసం బోనస్ పేరిట ట్రీట్స్ ఆహారోత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.అంతర్జాతీయ పోషకాహార ప్రమాణాలకి అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ వార్షికంగా 5.2 శాతం వృద్ధి రేటుతో 8.6 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుందని వ్యవస్థాపకుడు, సీఈవో సి. ప్రహర్ష తెలిపారు. తెలిపారు.ఇందులో ఆహారం, ట్రీట్స్ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, 2.52 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని వివరించారు. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పుణె, ముంబై తదితర ఐదు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోను విస్తరించినట్లు చెప్పారు. -
డాలర్ ‘బిగ్ బాస్’ గుప్తా కన్నుమూత
కోల్‌కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ దీన్‌దయాళ్ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్‌కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.1972లో డాలర్ ఇండస్ట్రీస్‌కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ స్థానంలో రోహిత్ జైన్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్ జైన్ నియామకానికి ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. రవి శంకర్‌కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.వీరిలో ఇద్దరిని రిజర్వ్ బ్యాంక్ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్ బ్యాంకింగ్ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్.సి. ముర్ము, పూనమ్ గుప్తా, స్వామినాథన్ జే తదితరులు ఉన్నారు. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ. 4,027 కోట్లు
న్యూఢిల్లీ: రుణాల వృద్ధి, మొండిబాకీలకు ప్రొవిజనింగ్ తగ్గుదల వంటి సానుకూలాంశాల ఊతంతో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 4,027 కోట్ల నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 3,663 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. లాభం సుమారు రూ. 3,737 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ. 7,284 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ. 7,876 కోట్లకు పెరిగింది. రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై బ్యాంక్ బోర్డు రూ. 0.65 మేర డివిడెండ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాబోయే రోజుల్లో మార్జిన్లు నిర్దిష్ట శ్రేణికి పరిమితం కావచ్చని బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దేవాంగ్ ఘీవాలా తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ వేల్యుయేషన్ భారీగా ఉండటం వల్లే దాని కోసం పోటీపడలేదని ఎండీ అశోక్ వాస్వానీ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర కన్నా తక్కువ రేటుకే బిడ్లు రావడమనేది అంచనాలకి, వాస్తవానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాపారం యథాప్రకారంగానే ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు సహా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి ఇతరత్రా ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గృహ రుణాల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉనట్లు పేర్కొంది. సైబర్ రిస్క్ లు, ఏఐ సంబంధ ముప్పులను ఎదుర్కొనేందుకు సిస్టమ్స్‌ను పటిష్టం చేసుకోవడంపై బ్యాంకు మరింతగా పెట్టుబడులు పెడుతోంది.మరిన్ని విశేషాలు..→ నిర్వహణ లాభం వార్షికంగా 7 శాతం పెరిగి రూ. 5,855 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.8 శాతం వృద్ధితో రూ. 14,175 కోట్లకు, వడ్డీ వ్యయాలు 0.9 శాతం పెరిగి రూ. 6,299 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం 2.1 శాతం క్షీణించి రూ. 3,116 కోట్లకు తగ్గింది. → అసెట్ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.30 శాతం నుంచి 1.20 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్ఎన్పీఏ) 0.31 శాతం నుంచి 0.25 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజనింగ్ గణనీయంగా 43 శాతం మేర తగ్గి రూ. 909 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు నెమ్మదించి, లాభాలకు ఊతమిచ్చింది. → నికర వడ్డీ మార్జిన్ వార్షికంగా 4.97 శాతం నుంచి 4.67 శాతానికి చేరింది. క్రితం క్వార్టర్లో ఇది 4.54 శాతంగా నమోదైంది. నిధుల సమీకరణ వ్యయాలు 5.09 శాతం నుంచి 4.45 శాతానికి తగ్గాయి. → 2026 మార్చి 31 నాటికి నికరంగా రుణాలు 16 శాతం వృద్ధితో రూ. 4.96 లక్షల కోట్లకు చేరాయి. → మొత్తం డిపాజిట్లు 15 శాతం వృద్ధి చెంది రూ. 5.72 లక్షల కోట్లకు చేరగా, కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 43.3 శాతంగా ఉంది. రుణ, డిపాజిట్ల నిష్పత్తి 86.6 శాతంగా ఉంది. → స్లిప్పేజీలు 32 శాతం తగ్గి రూ. 1,018 కోట్లకు దిగి వచ్చాయి. → మొత్తం కస్టమర్ల సంఖ్య 5.2 కోట్లుగా ఉంది. → కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం 10 శాతం వృద్ధితో రూ. 4,933 కోట్ల నుంచి రూ. 5,423 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19,288 కోట్లుగా నమోదైంది. -
వైట్ కాలర్ ఉద్యోగాలు పెరిగాయ్..!
ముంబై: దేశీయంగా కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) ఏప్రిల్‌లో పెరిగాయి. గతేడాది ఇదే నెల నియామకాలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్, ఐటీ ఆధారిత రంగాలు (ఐటీఈఎస్) / బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ), రియల్ ఎస్టేట్ రంగాలు హైరింగ్‌లో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. ‘‘నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం 6 శాతం వార్షిక వృద్ధితో, నియామకాలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ రంగాలు నియామకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది ఆయా రంగాల్లో ఉన్న మౌలిక డిమాండ్‌తో పాటు, పెరుగుతున్న వినియోగదారుల కార్యకలాపాలను సూచిస్తోంది. ఐటీ నియామకాలు నిలకడగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో మాత్రం కొంత మందగమనం కనిపిస్తోంది. మొత్తంగా, రంగాల వారీగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ... భారత జాబ్ మార్కెట్ మాత్రం నిలకడగా ఉంది’’ అని నౌకరీడాట్‌కామ్ ఎండీ, సీఈవో హితేష్ ఒబెరాయ్ తెలిపారు. ‘నౌకరీ డాట్‌కామ్’ వెబ్సైట్లో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ సంబంధిత అన్వేషణల ఆధారంగా రూపొందించిన నెలవారీ నివేదిక ప్రకారం.... → బీమా రంగం 21 శాతం వృద్ధితో నియామకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బీపీఓ/ఐటీఈఎస్ (15%), రియల్ ఎస్టేట్ (12%), హెల్త్‌కేర్ (11%), విద్యా రంగం (9%) నిలిచాయి. టెలికామ్, బ్యాంకింగ్ రంగాల నియామకాల్లో వరుసగా నాలుగో నెలా క్షీణత నమోదైంది. ఏప్రిల్‌లో ఇవి వరుసగా 11%, 10 శాతం తగ్గాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) హైరింగ్ 4% తగ్గడం గమనార్హం. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల నియాకాల్లో పెద్దగా మార్పు లేదు. దక్షిణాదిలోనే అధికం: వైట్ కాలర్ ఉద్యోగ నియామకాల్లో దక్షిణాది మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్ 12 శాతం వృద్ధితో టాప్‌లో ఉండగా, బెంగళూరు (7 శాతం), చెన్నై (6 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ (3 శాతం) స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, కోల్‌కతా (1 శాతం) దాదాపు స్థిరంగా ఉంది. అయితే, ప్రధాన మెట్రో నగరం ముంబైలో హైరింగ్ 3% తగ్గింది. → మెట్రోలే కాకుండా, అభివృద్ధి చెందుతున్న నగరాలు జైపూర్ (12%), కోయంబత్తూరు (11%), అహ్మదాబాద్(7%) సైతం నియామాల్లో బలమైన వృద్ధిని కనబరిచాయి. వైట్‌కాలర్ హైరింగ్ సంస్కృతి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది. -
ఇంధన ధరల ప్రభావం.. అమెరికా విమానయాన సంస్థ క్లోజ్!
సుమారు మూడు దశాబ్దాలు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలను అందిస్తున్న అమెరికన్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్, తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు, తక్షణమే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని.. ఆ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మా ప్రయాణికులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. కాగా ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు కూడా వెల్లడించింది.కోవిడ్ తరువాత స్పిరిట్ కంపెనీ లాభాలను ఆర్జించకపోగా.. ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. దీంతో సంస్థ తన సర్వీసులను నిలిపివేయడానికి సన్నద్ధమైంది. ఈ ప్రభావం సుమారు 17వేలమంది ఉద్యోగులపై పడనుంది.pic.twitter.com/Wz3ilRHD2z— Spirit Airlines (@SpiritAirlines) May 2, 2026 -
బీమా రంగంలో సంచలనం: 100% విదేశీ పెట్టుబడులు!
భారత ప్రభుత్వం.. తాజాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. బీమా కంపెనీలలో 100% విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించింది. అంటే.. విదేశీ సంస్థలు ఇకపై భారత బీమా రంగంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేకుండా సులభంగా ప్రవేశించగలవు. ఈ నిర్ణయం ద్వారా భారత బీమా రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి.అయితే.. విదేశీ పెట్టుబడులు 1938 బీమా చట్టానికి లోబడి ఉండాలి. అంతే కాకుండా బీమా, సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి కంపెనీలు తప్పనిసరిగా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) నుంచి లైసెన్సులు లేదా అనుమతులు పొందాలి. అంటే, విదేశీ పెట్టుబడులు వచ్చినా కూడా భారత ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందన్నమాట.ఆటోమేటిక్ రూట్ కింద LICలో విదేశీ పెట్టుబడి 20%కి పరిమితం చేశారు. LICలో విదేశీ పెట్టుబడి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని నిబంధనలకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని సెక్షన్ 43 నిబంధనల ప్రకారం LICకి వర్తించే ఇన్సూరెన్స్ చట్టం, 1938 (4 ఆఫ్ 1938)లోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది'' అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే.. విదేశీ పెట్టుబడులు ఉన్న భారతీయ బీమా సంస్థల్లో, కనీసం ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తి (చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓ) భారత నివాసి పౌరుడై ఉండాలి. ఇది దేశీయ నియంత్రణ, బాధ్యతను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం.ఇక బీమా మధ్యవర్తుల (ఇంటర్మీడియరీస్) విషయంలో కూడా 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఇందులో బ్రోకర్లు, రీ-ఇన్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, లాస్ అసెసర్లు, మేనేజింగ్ జనరల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ రిపాజిటరీలు ఉంటారు.ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు! -
అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!
భారతీయులు ఒక ఉద్యోగంలో చేరితే, అది ఎంత కష్టమైన జాబ్ అయినా.. అంత సులభంగా వదులుకోరు. కానీ అమెరికన్స్ ఆలా కాదు. ఎలాంటి ఉద్యోగాన్ని అయినా తృణప్రాయంగా వదులుకుంటారు. దీనికి గల కారణం ఏమిటి?, భారతీయులు ఎందుకు ఉన్న ఉద్యోగాల్లోనే ఉండిపోతున్నారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలో స్వేచ్ఛ - భారతదేశంలో బాధ్యతఅమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని తన ఇష్టానుసారం తీర్చిదిద్దుకోవాలని భావిస్తారు. ఉద్యోగం వదిలేయడం కూడా ఒక వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ దానిని తప్పుగా చూడరు. ఒకరు తమ ఆసక్తి కోసం, కొత్త వ్యాపారం కోసం లేదా కొంత విశ్రాంతి కోసం ఉద్యోగాన్ని వదిలేయడం అక్కడ సాధారణం.కానీ.. భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కుటుంబం, సమాజం చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి ఉద్యోగం అతని వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక స్థితితో కూడా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఉద్యోగం వదిలేయడం అంటే కుటుంబంతో చర్చించి తీసుకునే నిర్ణయం.ఆర్థిక భద్రతఅమెరికాలో నిరుద్యోగ భృతి, సామాజిక భద్రత, క్రెడిట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల ఉద్యోగం పోయినా లేదా వదిలేసినా కొంత భద్రత ఉంటుంది. కాబట్టి కొంత సమయంలో వారు మళ్లీ కొత్త అవకాశాలను పొందటానికి కొంత సమయం తీసుకుంటారు. నమ్మకంతో ఉంటారు.భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి భద్రత ఉండదు. ఒక ఉద్యోగం కోల్పోతే ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయి. అందువల్ల ఉద్యోగం వదిలేయడం చాలా పెద్ద రిస్క్‌గా భావిస్తారు.ఉద్యోగ సంస్కృతిఅమెరికాలో ఉద్యోగాలు మారడం అనేది సర్వ సాధారణమైన విషయం. కొత్త కంపెనీలకు మారడం ద్వారా జీతం పెరగడం, కొత్త అవకాశాలు పొందడం జరుగుతుంది. ఇది వారి కెరీర్‌కు మంచిదిగా భావిస్తారు.భారతదేశంలో అయితే.. ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేయడం నమ్మకంగా భావిస్తారు. తరచుగా ఉద్యోగాలు మారితే స్థిరత్వం లేదు అని అనుకుంటారు. అందువల్ల చాలా మంది తమకు ఇష్టంలేని ఉద్యోగంలో కూడా సంవత్సరాలుగా కొనసాగుతారు.మనస్తత్వం - విలువలుభారతదేశంలో చాలా మంది పిల్లలు, తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరుగుతారు. అందువల్ల వారికి స్థిరమైన ఉద్యోగం అంటే చాలా విలువ ఉంటుంది. అది వారి జీవితంలో భద్రతకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఉద్యోగం వదిలేయడం అనేది దాదాపు ఉండదనే చెప్పాలి.ఇదీ చదవండి: నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!అమెరికాలో చాలా మంది సౌకర్యవంతమైన పరిస్థితుల్లో పెరిగి ఉండటం వల్ల వారు తమ ఆసక్తులు, అభిరుచులను అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారికి భద్రత కంటే ప్యాషన్ చాలా ముఖ్యం.భయం!భారతదేశంలో ఫెయిల్యూర్ అంటే చాలా మంది భయపడతారు. ఉద్యోగం వదిలి.. కష్టాలపాలైతే సమాజం విమర్శిస్తుంది అనే భయం ఉంటుంది. అమెరికాలో అపజయాన్ని ఒక అనుభవంగా, నేర్చుకునే అవకాశంగా చూస్తారు. అక్కడ కొత్తగా ప్రారంభించడం గౌరవంగా భావిస్తారు.భారతదేశంలో కూడా ప్రస్తుతం ఉద్యోగం విషయంలో మార్పులు వస్తున్నాయి. యువత కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. దీంతో స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతోంది. వర్క్ - లైఫ్ బ్యాలన్స్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. -
పారిపోయిన ‘పైసల దొంగలు’ 21 మంది!
దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన 'ఆర్థిక నేరగాళ్ల'పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 21 మందిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు'గా (FEO) ప్రకటించింది.ఎవరీ ఆర్థిక నేరగాళ్లు?ఒక వ్యక్తి చేసిన ఆర్థిక నేరం విలువ రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండి, వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ.. విచారణను ఎదుర్కోకుండా విదేశాలకు పారిపోయి, తిరిగి రావడానికి నిరాకరిస్తే వారిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు' (FEO-Fugitive Economic Offender) గా గుర్తిస్తారు.లిస్టులో కీలక వ్యక్తులు వీరే..ఈడీ ప్రకటించిన 21 మంది జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్తలు, గ్యాంగ్స్టర్ల అనుచరులు ఉన్నారు. బ్యాంకులకు కన్నం వేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, బ్రిటన్‌కు చెందిన వివాదాస్పద ఆయుధ సరఫరాదారు సంజయ్ భండారీ, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, దివంగత ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ ఇందులో ఉన్నారు.అంతేకాకుండా, మెహుల్ చోక్సీ, ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్, మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ వంటి వారిని కూడా ఎఫ్‌ఈవోలుగా ప్రకటించే ప్రక్రియ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఈడీ వెల్లడించింది.భారీగా రికవరీగత రెండేళ్లలో (2024-25, 2025-26) ఈడీ కార్యకలాపాలు అత్యంత వేగవంతమయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ. 2,178.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసింది. ఈ 21 మందిలో తొమ్మిది మందిని కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఎఫ్ఈఓలుగా ప్రకటించడం విశేషం. మొత్తంగా 54 మంది వ్యక్తులపై ప్రస్తుతం ఎఫ్ఈఓఏ (FEOA) చట్టం కింద చర్యలు కొనసాగుతున్నాయి.సంజయ్ భండారీ కేసులో కీలక మలుపుఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై ఈడీ కీలక వివరాలను వెల్లడించింది. 2016లో ఆదాయపు పన్ను దాడుల తర్వాత నేపాల్ మీదుగా లండన్‌కు పారిపోయిన భండారీపై 2017లో రెడ్ నోటీసు జారీ అయింది. దర్యాప్తులో అతనికి రూ. 655 కోట్ల విదేశీ ఆదాయం, రూ. 100 కోట్లకు పైగా విదేశీ ఆస్తులు ఉన్నట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా యూఏఈ, బ్రిటన్లలో పెట్టిన పెట్టుబడులను జప్తు చేయాలని ఈడీ కోర్టును కోరింది.పరారీలో ఉన్న నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, వారిని భారత్‌కు రప్పించడంతో పాటు ఆస్తుల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించామని ఈడీ తన నివేదికలో స్పష్టం చేసింది. -
నమ్మావో ముంచేస్తారు!
నేటి వేగవంతమైన ఐటీ రంగంలో ఉద్యోగ మార్పు అనేది సర్వసాధారణం. అయితే, ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన కెరీర్ విషయంలో ఎదుర్కొన్న సందిగ్ధత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. కొత్త ఉద్యోగ ఆఫర్ ఒకవైపు, ప్రస్తుత సంస్థ ఇస్తున్న స్ప్లిట్ కౌంటర్ ఆఫర్ మరోవైపు.. ఈ మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక ఒక మిడ్-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పంచుకున్న అనుభవం అనేక మంది ఐటీ నిపుణుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది.ఏమిటీ సమస్య?భారతదేశంలోని ఒక ప్రముఖ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మిడ్-లెవల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సదరు ఉద్యోగికి కుటుంబ బాధ్యతలు పెరగడంతో వేతన పెంపు అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో వేరే కంపెనీలో ప్రయత్నించగా తన ప్రస్తుత వేతనం కంటే సుమారు 1.5 రెట్లు ఎక్కువ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. దీంతో ఆయన తన ప్రస్తుత కంపెనీకి రాజీనామా సమర్పించారు.అయితే, ఆయనను వదులుకోవడానికి ఇష్టపడని ప్రస్తుత యాజమాన్యం బయటి ఆఫర్‌తో సమానమైన వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఆ పెంపును ఒకేసారి కాకుండా కొంత భాగాన్ని వెంటనే, మిగిలిన భాగాన్ని కొన్ని నెలల తర్వాత ఇస్తామని (స్ప్లిట్ ఆఫర్) యాజమాన్యం ప్రతిపాదించింది. దీనిని డాక్యుమెంట్ చేస్తామని హామీ ఇచ్చినా ఈ పరిస్థితి ఆయనను గందరగోళానికి గురిచేసింది.నెటిజన్ల భిన్న అభిప్రాయాలుఈ అనుభవాన్ని ‘బయటి ఆఫర్ లేదా కౌంటర్ ఆఫర్.. ఏది ఎంచుకోవాలి’ అనే శీర్షికతో సదరు ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారిలో మెజారిటీ వర్గం మాత్రం ‘కౌంటర్ ఆఫర్‌ను అంగీకరించకుండా, కొత్త సంస్థకే వెళ్లడం ఉత్తమం’ అని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!నెటిజన్లు లేవనెత్తిన అంశాలుఒకసారి మీరు రాజీనామా చేశారంటే మీరు సంస్థను వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారని యాజమాన్యానికి స్పష్టమవుతుంది. భవిష్యత్తులో కంపెనీలో ఏవైనా లే-ఆఫ్స్ (ఉద్యోగ తొలగింపులు) జరిగితే ముందుగా టార్గెట్ అయ్యే అవకాశం మీకే ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.కంపెనీలు వాగ్దానం చేసినట్లుగా కొన్ని నెలల తర్వాత రెండో విడత పెంపును ఇస్తాయనే దానికి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. వ్యాపార పరిస్థితులు మారితే ఆ వాగ్దానాలు పాటించరని అనుభవజ్ఞులు గుర్తు చేస్తున్నారు.ఒక కొత్త సంస్థలో చేరడం వల్ల కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడమే కాకుండా మీ మార్కెట్ విలువ పెరుగుతుందని, అదే పాత సంస్థలో ఉండటం వల్ల కెరీర్ ఎదుగుదల మందగించవచ్చని మరికొందరు సూచిస్తున్నారు. కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం జీతం మాత్రమే కాకుండా పని సంస్కృతి, భవిష్యత్తు అవకాశాలు, మానసిక ప్రశాంతతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. -
లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్ ఫిక్స్
సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. కృత్రిమ మేధ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న క్రమంలో వ్యయ నియంత్రణలో భాగంగా మే 20వ తేదీ నుంచి సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మెటా శ్రామిక శక్తిలో తీవ్ర అనిశ్చితిని నింపుతోంది.ఏమిటీ తాజా పరిణామాలు?ఇటీవల కంపెనీ నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే మెటా ఆర్థికంగా స్థిరమైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థాగత మార్పులు తప్పవని యాజమాన్యం స్పష్టం చేసింది. మే 20న ఈ మొదటి దశలో 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2026 పూర్తయ్యే నాటికి ఈ ఉద్యోగ కోతలు మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.యాజమాన్యం ఏమంటోంది?మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్లె గేల్ మాట్లాడుతూ, తదుపరి రౌండ్ల తొలగింపులు ఉండబోవనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘మేము అత్యంత పోటీ వాతావరణంలో పనిచేస్తున్నాం. వ్యాపార ప్రాధాన్యతలను బట్టి జట్లు, ఖర్చుల విషయంలో చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ప్రభావితమైన కొంతమందిని వేరే విభాగాలకు తరలించే ప్రయత్నం చేస్తామని, మానవతా దృక్పథంతో బాధితులకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.ఏఐ పెట్టుబడుల ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా ఉద్యోగాల కోతలకు కారణం కాదని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కంపెనీ తన బడ్జెట్లో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తోంది. ఈ ఏడాది ఏఐ పరిశోధనలు, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం మెటా దాదాపు 125 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. ‘ఒక విభాగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మరో విభాగంలో వ్యయం తగ్గించక తప్పదు’ అని జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఏఐ విస్తరణ కోసం ఉద్యోగ భద్రతను బలి పెడుతున్నారనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.ఉద్యోగుల్లో ఆందోళనప్రస్తుతం మెటాలో 77,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. పనితీరులో సామర్థ్యాన్ని పెంచే పేరుతో సాగుతున్న ఈ తొలగింపుల వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతర్గత ఫోరమ్‌లలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పారదర్శకమైన కమ్యూనికేషన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్! -
మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలు సామాన్యులకు నిత్యకృత్యం కావచ్చు. కానీ, ఐదు గంటల పాటు వాహనాల మధ్య చిక్కుకుపోవడం అంటే అంటే మాటలు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి తాజాగా అలాంటి భయంకరమైన అనుభవాన్నే ఎదుర్కొన్నారు. ముంబై నుంచి పుణె వెళ్తుండగా మన్‌ఖుర్ద్ వంతెనపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఆమె తన నిస్సహాయతను, ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.పూర్తిగా చిక్కుకుపోయాం..సోనాలి కులకర్ణి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె తన ముందు, వెనుక ఆగిపోయిన వందలాది వాహనాలను చూపిస్తూ పరిస్థితి తీవ్రతను వివరించారు. ‘మేము ఇక్కడ మన్‌ఖుర్ద్ వంతెనపై ఉన్నాం. మేము ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి సరిగ్గా ఐదు గంటలు అయింది. కదలడానికి వీలులేని పరిస్థితి. వెనక్కి వెళ్దామంటే అదీ సాధ్యం కాదు. దయచేసి మా కోసం ప్రార్థించండి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యంపై అసహనంట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించినప్పుడు తమకు ఎదురైన అనుభవాన్ని కూడా సోనాలి బయటపెట్టారు. ‘మేము సహాయం కోసం ట్రాఫిక్ అధికారులను ఫోన్ చేసి అడిగాం. వారు ఓపిక పట్టండి అని మాత్రమే చెబుతున్నారు. అసలు ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ముందు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. కనీసం పోలీసులు పరిస్థితిని అంచనా వేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం లేదా మాకు కనీసం సమాచారం అందించడం వంటివి చేస్తే బాగుంటుంది’ అని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sonali Kulkarni (@sonalikul)నెటిజన్ల స్పందనసోనాలి షేర్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఆమె అనుభవంతో ఏకీభవిస్తున్న నెటిజన్లు నగరాల్లో ట్రాఫిక్ వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము కూడా అదే సమయంలో రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం’, ‘విపత్తు నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు’, ‘ప్రణాళికా లోపం వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు’ అంటూ పలువురు నెటిజన్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. -
ఒక్క మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేసింది!
సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం ‘జనరేటివ్ ఏఐ’ హవా నడుస్తోంది. అద్భుతమైన చాట్బాట్లు, ఆకట్టుకునే చిత్రాలను సృష్టించే ఏఐ టెక్నాలజీపై కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్నాయి. కానీ, ఈ హడావుడికి భిన్నంగా సాధారణ మిస్డ్ కాల్ సమస్యను పరిష్కరించడం ద్వారా ఒక భారతీయ సంతతి ఇంజినీర్ చరిత్ర సృష్టించారు. ఆయనే అపూర్వ శ్రీవాస్తవ. ఆయన టైసన్ చెన్‌తో కలిసి ప్రారంభించిన ‘అవోకా’ స్టార్టప్ ఇప్పుడు ఏకంగా 1 బిలియన్ డాలర్ల (యూనికార్న్-సుమారు రూ.9300 కోట్లు) విలువను చేరుకుని ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.అక్కడే మొదలైందిమిచిగాన్లో పెరిగిన అపూర్వ శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచే వ్యాపారాల్లోని కష్టనష్టాలపై అవగాహన ఉంది. మొదటి తరం భారతీయ-అమెరికన్‌గా తన కుటుంబం నడుపుతున్న చిన్న వ్యాపారం కోసం వచ్చే ఫోన్ కాల్స్‌ను ఆయన స్వయంగా నిర్వహించేవారు. ఆ సమయంలో ఆయన ఒక చేదు నిజాన్ని గ్రహించారు. సాధారణంగా మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తకపోతే ‘సరే, తర్వాత చేస్తాలే’ అనుకుంటాం. కానీ, ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ లాంటి వారి విషయంలో పరిస్థితి వేరు. ఏసీ ఆగిపోయినా లేదా ఇంట్లో పైపు లీకై నీళ్లు వస్తున్నా ఆ కస్టమర్‌కు అది అత్యవసర పరిస్థితి. ఆ సమయంలో ఫోన్ ఎత్తకపోతే కస్టమర్ వెంటనే వేరే వారికి ఫోన్ చేస్తారు. వ్యాపారస్థులకు ఒక్క ఫోన్ కాల్ మిస్ అవ్వడం అంటే ఒక కస్టమర్ చేజారడమే కాదు.. ఆ కస్టమర్ ద్వారా వచ్చే వేల రూపాయల పని (ఉదాహరణకు కొత్త ఏసీ ఇన్స్టాలేషన్ లేదా పెద్ద రిపేర్ వర్క్) మరొకరికి వెళ్లిపోయినట్లు లెక్క.ఐడియా పుట్టిందిక్కడే..మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ మొదట రెస్టారెంట్ల కోసం ఏఐ ఆధారిత ఆన్సరింగ్ సేవలను రూపొందించడంపై ప్రయోగాలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఒక రెస్టారెంట్లో ఫోన్ కాల్ మిస్ అయితే 40 డాలర్ల నష్టం జరగవచ్చు, కానీ ఒక హెచ్‌వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) అత్యవసర పరిస్థితిలో కాల్ మిస్ అయితే అది 40 వేల డాలర్ల భారీ కాంట్రాక్టును పోగొట్టుకోవడంతో సమానం. ఈ కోణాన్ని గుర్తించిన శ్రీవాస్తవ టైసన్ చెన్‌తో కలిసి ‘అవోకా’కు శ్రీకారం చుట్టారు.అవోకా ప్రత్యేకత ఏమిటి?చాలా ఏఐ సంస్థలు డెస్క్ వర్క్ ఆటోమేషన్ మీద దృష్టి పెడితే అవోకా మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే సాంకేతిక నిపుణుల కష్టాలను తీరుస్తోంది. అవోకాలోని ఏఐ ఏజెంట్లు మనుషుల లాగే స్పష్టంగా మాట్లాడగలవు. ఏ సమయంలో కాల్ వచ్చినా సెకన్ల వ్యవధిలో సమాధానం ఇస్తాయి. ఇవి కేవలం సందేశాలను తీసుకోవడమే కాకుండా కంపెనీ క్యాలెండర్లను తనిఖీ చేసి నేరుగా అపాయింట్మెంట్లను బుక్ చేస్తాయి. పాత ఆర్డర్లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తాయి.అవోకా పనితీరు పట్ల మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 800కు పైగా ప్రముఖ కంపెనీలు వీరి సేవలను వాడుకుంటున్నాయి. 2025లో ఈ సంస్థ వార్షిక ఆదాయం ఎనిమిది అంకెల స్థాయిని దాటేసింది. ఈ పురోగతికి గుర్తింపుగా మెరిటెక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్, క్లీనర్ పెర్కిన్స్ వంటి సంస్థల నేతృత్వంలో జరిగిన తాజా ఫండింగ్ రౌండ్లో కంపెనీ 125 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించింది. తద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ.9300 కోట్లు)కు చేరింది. జనరల్ పర్పస్ ఏఐ కోసం ప్రపంచం పోటీ పడుతుంటే శ్రీవాస్తవ, చెన్ మాత్రం హోం సర్వీసుల ఆర్థిక వ్యవస్థలోని ఫోన్ కాల్‌లను నమ్ముకుని యూనికార్న్ స్థాయికి చేరుకోవడం విశేషం.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
ట్రైన్ టికెట్లపై H1, A1 కోడ్లు: వీటి అర్థం ఏంటో తెలుసా?
ట్రైన్లలో ప్రయాణించే చాలామందికి.. రైల్వే వ్యవస్థ గురించి బహుశా తెలిసి ఉండక పోవచ్చు. ట్రైన్‌పై ఉండే బోర్డుల దగ్గర నుంచి నెంబర్ల వరకు అనేక విషయాలు వెనుక ఒక సరైన అర్థం ఉంటుంది. అయితే టికెట్స్ మీద కూడా మీరు గమనించినట్లయితే.. ఇక్కడ కూడా H1, H2, A1, B1 అని ఉండటం కనిపిస్తుంది. ఈ కథనంలో వీటి గురించి తెలుసుకుందాం.టికెట్ మీద H1, H2అని ఉంటే.. అది ఏసీ ఫస్ట్ క్లాస్ అని అర్థం. దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ కోచ్ మీద ఇలాంటి గుర్తు ఉంటుంది. ఇందులో చాలా సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ టికెట్ ధర విమానం టికెట్ ధరకు సమానంగా ఉంటుంది. భోజన సదుపాయం, ఛార్జింగ్ పాయింట్లు, బెల్ సిస్టం, బెడ్ షీట్స్ మొదలవునవి ఉంటాయి. H1, H2 అంటే రెండు కోచ్‌లు అన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచుల్లో కూపే, క్యాబిన్ అనేవి ఉంటాయి. కూపే అంటే ఇద్దరు ప్రయాణికులకు ప్రత్యేకంగా కంపార్ల్‌మెంట్ ఉంటుంది. ఇక క్యాబిన్ అంటే నలుగురు ప్రయాణికులు ఉంటారు.మీ టికెట్ మీద A1, B1 అని ఉంటే.. టూ టైర్ ఏసీ కోచ్‌లని అర్థం. ఇందులో కర్టెన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి సెక్షన్లో 6 బెర్త్‌ల వరకు ఉంటాయి. ఇక B1, B2, B3 అని ఉంటే అవి ఏసీ త్రీ టైర్ కోచ్‌లని అర్థం. S1, S2 అంటే సాధారణ స్లీపర్ కోచ్‌లన్నమాట. CC అంటే ఏసీ చైర్ కార్. ఏసీ సౌకర్యం ఉంటుంది, కూర్చుని ప్రయాణించాలి.ఇదీ చదవండి: భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే! -
70 కోట్లు దాటిన ఫోన్‌పే యూజర్లు!
ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. 2026 ఏప్రిల్ 29 నాటికి తమ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 70 కోట్లు దాటినట్లు సంస్థ తెలిపింది. తొలి 10 లక్షల మంది యూజర్ల స్థాయిని చేరడానికి 136 రోజులు పట్టగా, ప్రస్తుతం ప్రతి 6 రోజులకు ఈ మైలురాయిని దాటేస్తున్నామని పేర్కొంది. 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో యూజర్ల సంఖ్య వార్షికంగా 56.25 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరిన్ని ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.700 Million 💜A number this big only happens because of the trust you place in us every single day.To our users, merchants and partners across every corner of India thank you for making us 700 Mn strong! 🙏Read More: https://t.co/e9vyvz9uI4#PhonePeFamily #Milestone… pic.twitter.com/mcgjBlEzzR— PhonePe (@PhonePe) April 29, 2026 -
నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!
మాజీ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్, రీసెర్చ్ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు. -
విమాన ప్రయాణాలు మరింత ప్రియం?
విదేశీ ప్రయాణికులకు చేదు వార్త. అంతర్జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలపై భారం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.ఢిల్లీలో కొత్త ధరలుదేశంలో ఏటీఎఫ్ ధరలకు బెంచ్‌మార్క్‌గా నిలిచే ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది.దేశీయ సంస్థలకు ఊరటప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఎందుకు ఈ పెంపు?ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి.దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్‌లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ గమనంపై అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్మికుల దినోత్సవం రోజు చేదు వార్త తెలిపింది. తన ఉద్యోగులలో సుమారు 1శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనివల్ల 4,000కు పైగా ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. AI , డిజిటల్ ఆఫరింగ్‌లపై ఖర్చును పెంచుతూనే, కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మించాలని చూస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ లీప్ ద్వారా ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతోంది.లైవ్ మింట్ నివేదిక ప్రకారం, తగ్గుతున్న డిమాండ్, ఆటోమేషన్ వైపు మొగ్గు చూపడం వృద్ధిపై భారం మోపుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలుడుతుంది. ముఖ్యంగా కంపెనీ తన పూర్తి-సంవత్సర అంచనాలను తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.కంపెనీ ప్రకటించిన 'ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఏఐ (AI), సమీకృత డిజిటల్ సేవలు మరియు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై అధిక పెట్టుబడి పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి 230 మిలియన్ల డాలర్లనుంచి 320 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో ఉద్యోగుల తొలగింపు , ఇతర సిబ్బంది సంబంధిత ఖర్చుల కోసం200 మిలియన్ల డాలర్లనుంచి 270 మిలియన్ల డాలర్ల వరకు ఉంటాయని, అదే సమయంలో ఈ ఏడాది 300 మిలియన్ల డాలర్ల వరకు ఆదా అవుతుందని కాగ్నిజెంట్ తెలిపింది.ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారో కాగ్నిజెంట్ స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఆదాయాల ప్రకటన తర్వాత జరిగిన విశ్లేషకుల సమావేశంలో యాజమాన్యం మాట్లాడుతూ, ఈ ఏడాది 20,000 మందికి పైగా ఫ్రెషర్లు చేరతారని, దీనిని బట్టి ఈ కోతలు మధ్య-స్థాయి ఉద్యోగాలపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని సూచించింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్ ఫిదా!ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ, మార్చి 2026 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,000 పెరిగి 357,600కు చేరుకుంది. 2023 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్. రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగాల కోతలలో ఇది రెండవ విడత. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల తర్వాత, మే 2023లో కాగ్నిజెంట్ నాన్-బిల్లబుల్ పాత్రలలో సుమారు 3,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదీ చదవండి : నో లైఫ్ జాకెట్స్, పట్టించుకోలేదు : బోట్ విషాదంలో సంచలన ఆరోపణలు -
పిచాయ్ విజయ రహస్యం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన టెక్ దిగ్గజాల్లో ఒకరైన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సుమారు రూ.12,600 కోట్ల (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) సంపదకు అధిపతి అయినప్పటికీ ఆయన అనుసరించే సరళమైన జీవనశైలి, క్రమశిక్షణ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తులు తమ రోజును ఎలా ప్లాన్ చేసుకుంటారు? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ కోణంలో సుందర్ పిచాయ్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం.ఉదయాన్నే స్పష్టమైన ఆలోచనలుచాలామంది మేల్కోగానే స్మార్ట్‌ఫోన్‌ల్లో నోటిఫికేషన్లను తనిఖీ చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. కానీ, పిచాయ్ శైలే వేరు. ఆయన రోజూ ఉదయం 6:30 గంటల నుంచి 7:00 గంటల మధ్య నిద్రలేస్తారు. ఉదయాన్నే హడావుడి లేకుండా ఉండడం ఆయనకు ఇష్టం. మేల్కొన్న వెంటనే ఆయన చేసే మొదటి పని వార్తాపత్రికలు చదవడం. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా తన మేధస్సును పదును పెడుతుంటారు. ఈ అలవాటే ఆయనకు సమాచార విశ్లేషణలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు.పోషకాహారంసుందర్ శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ, తన రోజువారీ అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఉదయం పూట తీసుకునే ప్రోటీన్ మెదడుకు, శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుందని ఆయన నమ్ముతారు. ఆయన ఉదయం అల్పాహారంలో సాధారణంగా ఒక కప్పు టీ, ఆమ్లెట్, టోస్ట్ ఉంటాయి. ఇందులో ఆమ్లెట్ ప్రోటీన్ కోసం, టోస్ట్ కార్బోహైడ్రేట్ల కోసం దోహదపడతాయి. ఇది చాలా సాధారణంగా అనిపించినా పోషక విలువల పరంగా ఇది ఒక పరిపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్. భారతీయ మూలాలున్న పిచాయ్‌కు టీ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఉదయాన్నే వేడివేడి టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి కొత్త ఉత్సాహంతో డే ప్రారంభించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడతారు.విజయానికి అసలైన సూత్రంసుందర్ పిచాయ్ జీవితం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే.. విజయం అంటే సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కాదు, ఉన్న చిన్న అలవాట్లను క్రమశిక్షణతో ఆచరించడం.ఉదయాన్నే ప్రశాంతంగా రోజును ప్రారంభించడం.వార్తాపత్రికలు చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడం.సరళమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం.రూ.12,600 కోట్ల ఆస్తులున్న ఒక వ్యక్తి తన దినచర్య పరంగా ఎంతో సాధారణంగా కనిపిస్తూనే ఆ క్రమశిక్షణను ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకోవడం యువతకు ఒక పాఠం. భవిష్యత్తుపై స్పష్టత, సమకాలీన అంశాలపై పట్టు ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుందర్ పిచాయ్ జీవనశైలి నిరూపిస్తోంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
బెంగళూరులో సెమీకండక్టర్ హబ్ కోసం 140 ఎకరాలు
దేశంలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న కర్ణాటక మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్ పరికరాల తయారీ దిగ్గజం ‘అప్లైడ్ మెటీరియల్స్ ఇంక్’ కోసం బెంగళూరులో 140 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ‘బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్’ (బీఎస్బీపీ)లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భూ కేటాయింపు ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగం మరింత బలోపేతం కానుంది.కేటాయింపు ముఖ్యాంశాలుప్రాజెక్టు స్థలం: కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్.కేటాయింపు భూమి: 140 ఎకరాలు.నిబంధన: లీజు-కమ్-సేల్ ప్రాతిపదికన కేటాయింపు.ధర: చదరపు అడుగుకు రూ.1,288 చొప్పున, మొత్తం రూ.780 కోట్ల విలువైన భూమిని కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వ్యూహాత్మక ప్రాధాన్యతరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, రాష్ట్రంలో చిప్ తయారీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని పేర్కొన్న తరుణంలో ఈ వార్త వెలువడింది. కర్ణాటక ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్లైడ్ మెటీరియల్స్ రాకతో ఈ రంగంలో రాష్ట్రం తన పట్టును మరింత పెంచుకోనుందని మంత్రి చెప్పారు.పారదర్శకతకు పెద్దపీటఈ భూ కేటాయింపు చట్టబద్ధమైన అనుమతులు, ధరల నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, బీఎస్బీపీలో మిగిలి ఉన్న 267 ఎకరాల భూమిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారదర్శకత కోసం పోటీ బిడ్డింగ్, నిపుణుల సలహాల మేరకు తదుపరి విధివిధానాలను రూపొందించనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
‘ఆఫీస్ పిక్నిక్’ వేళ.. అందరూ ఒక్కటే!
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో డెడ్లైన్లు, క్లయింట్ కాల్స్, మీటింగ్‌లు.. అంటూ ఉద్యోగులు నిరంతరం ఒత్తిడిలో గడుపుతుంటారు. కనీసం ప్రశాంతంగా భోజనం చేసే సమయం కూడా దొరకని ఈ రోజుల్లో ఒక సంస్థ మాత్రం వినూత్న సంస్కృతికి తెరలేపింది. పని వేళల్లో రోజూ తప్పనిసరిగా ఒక గంట పాటు పనులకు బ్రేక్ ఇచ్చి ఉద్యోగులందరూ కలిసి భోజనం చేయాలనే నియమాన్ని ‘కేకే క్రియేట్’(KK Create) వ్యవస్థాపకురాలు కావ్య అమలు చేస్తున్నారు. ఈ ‘ఆఫీస్ పిక్నిక్’ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వర్క్ కల్చర్‌పై చర్చకు దారితీసింది.ఎవరూ ఒంటరిగా తినరుకేకే క్రియేట్ సంస్థలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో కఠినమైన టార్గెట్లతో పని చేసే ఈ బృందం మధ్యాహ్నం 2 గంటలయ్యిందంటే చాలు పని ఒత్తిడిని పక్కనపెట్టాల్సిందే. ఓ గంటపాటు ఎటువంటి మినహాయింపులు ఉండవు. మేనేజర్ నుంచి ఫ్రెషర్ వరకు అందరూ ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటా భోజనం చేస్తారు.ఈ సంస్కృతిపై కావ్య కర్ణాటక లింక్డ్ఇన్లో రాస్తూ ‘మా కార్యాలయంలో ప్రతిరోజూ ఒక గంట పిక్నిక్ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. ఆ సమయంలో ఆఫీసులో హైరార్కీ ఉండదు. అందరం కలిసి కూర్చుంటాం. జోకులు వేసుకుంటాం. ఆటలు ఆడుకుంటాం. దీనివల్ల పని పట్ల భారం తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.పని తర్వాత చూద్దాం.. ముందు భోజనం చేద్దాంసాధారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇక్కడ సీనియర్ సభ్యులే ముందుండి ‘ఆజావో లంచ్ కర్నే, కామ్ బాద్ మే కర్నా’ (రండి భోజనం చేద్దాం, పని తర్వాత చూద్దాం) అని ప్రోత్సహిస్తుంటారు. ఈ సమయం కేవలం భోజనానికే పరిమితం కాకుండా ఉద్యోగుల మధ్య బలమైన బంధాలను పెంచే సామాజిక సమయంగా మారుతోందని కావ్య వివరించారు.నెటిజన్ల ప్రశంసల వెల్లువఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. పని సంస్కృతి అంటే కేవలం సమావేశాలు, విధానాలు మాత్రమే కాదని ఇలాంటి చిన్న వ్యవహారాలే అసలైన బంధాలను నిర్మిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రొడక్టివిటీ పెంచమని చెప్పే క్రమంలో చాలా కంపెనీలు మానవ సంబంధాలను మర్చిపోతున్నాయి. కానీ, ఇలాంటి విధానం ఉద్యోగులను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు, అత్యవసరమైన క్లయింట్ కాల్స్ లేదా డెడ్లైన్ల సమయాల్లో ఈ ఒక గంట విరామాన్ని ఎలా నిర్వహిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి కావ్య స్పందిస్తూ, ‘ఆ సమయంలో మాకు ఏదీ ముఖ్యం కాదు. ఒక గంట పాటు పని నుంచి పూర్తిగా దూరమవ్వడం వల్ల తిరిగి పనిలో చేరినప్పుడు మరింత సామర్థ్యంతో పనిచేయగలుగుతున్నాం’ అని బదులిచ్చారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
వొడాఫోన్ ఐడియాకి భారీ ఊరట
టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీలను పునసమీక్షించిన తర్వాత 27 శాతం మేర తగ్గించింది. దీనితో కంపెనీ కట్టాల్సిన బాకీ రూ.64,046 కోట్లకు దిగివచ్చింది. దీన్ని చెల్లించేందుకు అయిదేళ్ల మారటోరియం కూడా లభించింది. అటుపైన పదేళ్ల వ్యవధిలో రెండు రకాలుగా చెల్లించాల్సి ఉంటుంది.2031–32 నుంచి 2034–35 వరకు ఏటా కనీసం రూ.100 కోట్లు చొప్పున కట్టాలి. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని 2035–36 నుంచి 2040–41 మధ్య కాలంలో ఆరేళ్ల వ్యవధిలో ఏటా సమాన వాయిదాల్లో చెల్లించాలి. కంపెనీ కట్టాల్సిన బాకీలను కొన్నాళ్లు ఫ్రీజ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ 2025 డిసెంబర్ 31న ప్యాకేజీనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి సంస్థ కట్టాల్సిన మొత్తాన్ని రూ. 87,695 కోట్లుగా నిర్ణయించారు. అయితే, మరోసారి మదింపు చేసిన మీదట తుది మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను టెలికం శాఖకు (డాట్) కమిటీ అప్పగించారు. తాజాగా డాట్ కమిటీ ఈ మేరకు బాకీలను ఖరారు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్ -
రిలయన్స్ రిటైల్ చేతికి ప్రియాంక చోప్రా అనామలి
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (RRL) సంస్థ.. ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ 'అనామలి'(Anomaly)ని, దాని ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ ప్రాపర్టీలతో సహా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కంపెనీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.అనామలి కొనుగోలు.. రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించనుంది. అంతేకాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్థ తన వృద్ధిని సాధించే బ్రాండ్లను నిర్మించి, విస్తరించాలనే దాని నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది.అనామలి బ్రాండ్‌ను 2021లో ప్రముఖ నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలో లభించే ఒక పాపులర్ హెయిర్‌కేర్ బ్రాండ్. ప్రారంభం నుంచే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్.. కొద్ది కాలంలోనే బలమైన అంతర్జాతీయ ఉనికిని ఏర్పరచుకుంది.ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ తమ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో ఉన్న పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో పెద్ద రిటైల్ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా టీరా వంటి ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు విభిన్న బ్రాండ్లను అందిస్తోంది. ఇప్పుడు అనామలి కూడా ఈ వ్యవస్థలో చేరడంతో, బ్రాండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ.. అనోమలి తమ బ్యూటీ పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టి.. జుట్టు, చర్మ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా ప్రియాంక చోప్రా బ్రాండ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వెల్లడించారు.Reliance Retail Acquires Priyanka Chopra Jonas’s Anomaly, Accelerating Expansion of Its Beauty Portfolio~ Acquires ‘Anomaly’ trademarks and digital assets to drive India and global growth ~~ To accelerate Omnichannel scale-up across retail network and Tira ~Reliance Retail… pic.twitter.com/UjIAQCHWzQ— Reliance Industries Limited (@RIL_Updates) April 30, 2026 -
అదానీ పవర్ మెరుపులు.. మెరిపించిన ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం అదానీ పవర్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 4,271 కోట్లను అధిగమించింది. ఆదాయంలో వృద్ధి, తగ్గిన పన్ను వ్యయాలు ఇందుకు దోహదపడ్డాయి.అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2,599 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,535 కోట్ల నుంచి రూ. 15,989 కోట్లకు ఎగసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 12,971 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 12,750 కోట్ల లాభం అందుకుంది. 2026 మార్చి31కల్లా మహన్(1,600 మెగావాట్లు), రాయ్‌పూర్(1,600 మెగావాట్లు), రాయ్‌గఢ్(1,600 మెగావాట్లు) రెండో దశల పనులు 86–47 శాతం మధ్య పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.సొంత అనుబంధ కంపెనీ కోబ్రా పవర్ 1320 మెగావాట్ల రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27)లో పూర్తికాగలదని పేర్కొంది. 2031–32కల్లా 23.7 గిగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది క్యూ4లో మహారాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 25ఏళ్లపాటు 1,600 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఎల్‌వోఏను అందుకుంది. -
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్‌పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం'' -
జియో దూకుడు.. ట్రాయ్ పరీక్షల్లో అగ్రస్థానం!
టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో.. వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా స్పీడ్, వాయిస్ క్వాలిటీ, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్లోడ్ వేగం నమోదు కాగా.. కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ ఫలితాలు తెలంగాణ టెలికాం వినియోగదారుల అనుభవంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 5జీ నెట్వర్క్ పనితీరును అంచనా వేయడంలో డ్రైవ్ టెస్ట్‌లు అత్యంత విశ్వసనీయ పద్ధతి.ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జియో నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 260.01 Mbpsగా నమోదైంది. అదే సమయంలో ఎయిర్టెల్ 161.18 Mbps, వోడాఫోన్ ఐడియా 27.83 Mbps, బీఎస్ఎన్ఎల్ 8.32 Mbps వద్ద నిలిచాయి. అంటే ఒక వినియోగదారుడు వీడియో స్ట్రీమింగ్ లేదా గేమింగ్ చేస్తే జియో వినియోగదారుడు మిగతా నెట్‌వర్క్‌లతో పోలిస్తే రెండు రెట్లు వేగంగా సేవలు పొందుతున్నాడని అర్థం.నగరంలోని హాట్‌స్పాట్ ప్రాంతాల్లో వేగం మరింత పెరిగింది. హనుమకొండ బస్ స్టాండ్ వద్ద 471.60 Mbps పీక్ స్పీడ్ నమోదు కాగా రెడ్డి కాలనీలో 456.67 Mbps నమోదైంది. ఈ సంఖ్యలు కేవలం టెక్నికల్ డేటా కాదు, రోజువారీ డిజిటల్ జీవితంలో వేగవంతమైన మార్పుకు సూచికగా నిలుస్తున్నాయి.ట్రాయ్ అధికారిక నివేదిక ప్రకారం.. వాయిస్ కాల్ నాణ్యతలో కూడా జియో ముందంజలో ఉంది. మీన్ ఓపీనియన్ స్కోర్ 4.46గా నమోదైందని మార్చి 2026 పరీక్షలో వెల్లడైంది. ఎయిర్టెల్ 3.98, వోడాఫోన్ ఐడియా 3.76, బీఎస్ఎన్ఎల్ 2.97 వద్ద నిలిచాయి. అంటే పది కాల్లలో ఎక్కువ భాగం జియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.ట్రాయ్ డేటా ప్రకారం జియో లేటెన్సీ 21.94 msగా ఉండగా ఇతర నెట్‌వర్క్‌లు 38 ms పైగా నమోదయ్యాయి. లేటెన్సీ తగ్గడం వల్ల గేమింగ్, వీడియో కాలింగ్ అనుభవం మెరుగుపడుతుంది. 20 మిల్లీసెకన్లకు దగ్గరగా ఉండే లేటెన్సీ వినియోగదారుడికి రియల్ టైమ్ అనుభూతి ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం వేగం మాత్రమే కాకుండా స్థిరత్వం కూడా పెరిగిందని సూచిస్తున్నాయి. కాల్ డ్రాప్ రేటు 0%గా నమోదు కావడం నెట్వర్క్ విశ్వసనీయతకు నిదర్శనం.తెలంగాణలో 5జీ విస్తరణ గత రెండు సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. 2024లో ప్రారంభమైన సేవలు 2026 నాటికి ప్రధాన నగరాల్లో స్థిరపడ్డాయి. వరంగల్ వంటి టియర్-2 నగరాల్లో కూడా హైస్పీడ్ నెట్వర్క్ అందుబాటులోకి రావడం డిజిటల్ విస్తరణకు కీలక సూచనగా మారింది. ట్రాయ్ వంటి నియంత్రణ సంస్థలు ఈ పరీక్షలను కొనసాగించడం వల్ల నెట్వర్క్ నాణ్యతపై కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. వినియోగదారుల కోసం ఇది ప్రయోజనకరం. భవిష్యత్తులో 5జీ ఆధారిత సేవలు పెరగడంతో డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5జీ విస్తరణపై దృష్టి పెట్టింది. టెలికాం కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో నమోదైన ఈ ఫలితాలు ఒక నగరానికి మాత్రమే పరిమితం కావు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల దిశను సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పరీక్షలు జరిగితే పోటీ మరింత స్పష్టమవుతుంది. -
2032 వరకు అన్ని హక్కులు మావే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్ తన భాగస్వామ్య సంస్థ ఓపెన్ఏఐతో కుదుర్చుకున్న సవరించిన ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓపెన్ఏఐ సాంకేతికతను, మేధో సంపత్తిని (ఐపీ) అత్యున్నత స్థాయిలో వినియోగించుకోవడమే తమ తదుపరి లక్ష్యమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. టెక్ విశ్లేషకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యూహాత్మక మార్పులపై వివరణ ఇచ్చారు.విజేతల్లా నిలిచే ఒప్పందంఓపెన్ఏఐతో కుదిరిన తాజా మార్పుల గురించి నాదెళ్ల మాట్లాడుతూ, ఇది ఇరు సంస్థలకు ప్రయోజనకరమైన విన్-విన్ ఒప్పందమని అభివర్ణించారు. ‘ఏదైనా భాగస్వామ్యంలో రెండు పక్షాలకు సమాన ప్రయోజనం ఉండాలని నేను కోరుకుంటాను. ఓపెన్ఏఐతో మా అనుబంధం విషయంలో కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం 20 శాతం వాటాను కలిగి ఉంది. సవరించిన ఒప్పందం ప్రకారం ఈ వాటా 2032 వరకు కొనసాగుతుంది. ఇది సంస్థకు దీర్ఘకాలిక ఆర్థిక, సాంకేతిక భద్రతను కల్పిస్తుంది.2032 వరకు ప్రత్యేక హక్కులుఓపెన్ఏఐ ఇకపై తన మోడళ్లను కేవలం మైక్రోసాఫ్ట్‌కే పరిమితం చేయకుండా అమెజాన్ వంటి ఇతర దిగ్గజ సంస్థలతోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. దీనిపై వస్తున్న ఆందోళనలను నాదెళ్ల తోసిపుచ్చారు. 2032 వరకు ఓపెన్ఏఐ రూపొందించే సరిహద్దు నమూనాలు (ఫ్రంటీర్ మోడల్స్), ఏజెంట్ టూల్స్, అన్ని ఐపీ హక్కులపై మైక్రోసాఫ్ట్‌కు పూర్తి అవకాశం ఉంటుందన్నారు. ‘మా దగ్గర అత్యాధునిక మోడల్స్ ఉన్నాయి. 2032 వరకు మాకు లభించిన ఈ సాంకేతిక హక్కులను వ్యాపార పరంగా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని నాదెళ్ల ధీమా వ్యక్తం చేశారు.పెరుగుతున్న పోటీఓపెన్ఏఐ తన సేవలను అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు కూడా విస్తరించడం వల్ల మైక్రోసాఫ్ట్ ఆధిపత్యం తగ్గుతుందా? అన్న ప్రశ్నకు నాదెళ్ల ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఏదో ఒక సంస్థే దీనిని శాసించే రోజులు పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కంప్యూటింగ్ అవసరాలకు సంబంధించి ఓపెన్ఏఐ మాకు అతిపెద్ద కస్టమర్. వారికి అత్యుత్తమ సేవలు అందించడం మా బాధ్యత’ అని ఆయన గుర్తుచేశారు.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్ -
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు బ్యాంకు సెలవులు
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎంత పెరిగినా నేరుగా బ్యాంకు బ్రాంచికి వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇలా ఈ మే నెలలో బ్యాంకు పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నవారి కోసం ఈ కథనం. ఏప్రిల్ నెల ముగుస్తున్న తరుణంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2026 నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. మే నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, జయంతి కార్యక్రమాలు, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు.తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులుఈ మే నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు వారాంతపు సెలవులు, పండుగలతో కలిపి మొత్తం 9 రోజులు మూతపడనున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించే బ్యాంకు సెలవుల పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ముందస్తు ప్రణాళిక లేకపోతే మీ అత్యవసర లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి, సెలవుల జాబితాను ఒకసారి పరిశీలించండి..సెలవుల వివరాలుమే 1 - శుక్రవారం - మే డే (కార్మిక దినోత్సవం) / బుద్ధ పూర్ణిమమే 3 - ఆదివారం - సాధారణ సెలవుమే 9 - శనివారం - రెండో శనివారంమే 10- ఆదివారం- సాధారణ సెలవు మే 17- ఆదివారం - సాధారణ సెలవుమే 23 - శనివారం - నాలుగో శనివారంమే 24 - ఆదివారం - సాధారణ సెలవుమే 27 - బుధవారం- బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా)మే 31 - ఆదివారం - సాధారణ సెలవుఅయితే చంద్రుని దర్శన ఆధారంగా బక్రీద్ సెలవు తేదీలో మార్పు ఉండవచ్చు.డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో..బ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు (ATM) యధావిధిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధుల బదిలీ (NEFT/RTGS/IMPS) చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. -
రైలు టికెట్ బుకింగ్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ‘క్లియర్‌ట్రిప్’
ముంబై: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ క్లియర్‌ట్రిప్ రైలు టికెట్ బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ట్రైన్ టికెటింగ్ సెగ్మెంట్లో సింగిల్ డిజిట్ మార్కెట్ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించింది.రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు జనరల్, తత్కాల్ కోటాల్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే రియల్‌టైమ్ సీట్ల లభ్యత, చార్జీల వివరాలు, పీఎన్ఆర్ స్టేటస్ ట్రాకింగ్, బెర్త్ ఎంపికలు, సురక్షిత డిజిటల్ చెల్లింపులు వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ప్రతి ఏటా 80 కోట్లకు పైగా రిజర్వేషన్ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇది భారీ మార్కెట్ అవకాశమే కాకుండా, వినియోగదారులకు భిన్నమైన సేవా అనుభవాన్ని అందించే అవకాశం కూడా ఉందని క్లియర్‌ట్రిప్ ఎయిర్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గౌరవ్ పట్వారీ తెలిపారు.ఈ ఏడాది ముగిసేలోపు ఆన్లైన్ ట్రావెల్ సర్వీసెస్ (ఓటీఎస్) విభాగంలో సింగిల్ డిజిట్ మార్కెట్ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైలు ప్రయాణం భారత మొబిలిటీ ఎకోసిస్టమ్‌లో కీలక భాగమని, ఈ ప్రారంభం సమగ్ర బహుళ రవాణా సేవల వేదికగా ఎదగాలన్న సంస్థ లక్ష్యానికి కీలక అడుగని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మంజరీ సింఘాల్ తెలిపారు. దీంతో సంస్థ వృద్ధి వేగవంతమవడంతో పాటు పోటీ సామర్థ్యం పెరుగుతుందన్నారు. మొత్తం వ్యాపారంలో రైలు టికెట్ బుకింగ్ వాటా 5 నుంచి 10 శాతానికి చేరుతుందని, రాబోయే కొన్నేళ్లలో ఈ విభాగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతుందని సింఘాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
సాఫ్ట్వేర్ రంగం అంటేనే నిరంతర మార్పులకు వేదిక. ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే వెనుకబడిపోతామన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి కొనసాగుతూ మనం నిజంగా ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా? ప్రమోషన్ వచ్చే వరకు వేచి చూడాలా? లేక మనకు మనమే ఒక గీటురాయిని నిర్ణయించుకోవాలా? దీనిపై మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన సీనియర్ ఇంజినీర్ కున్ చెన్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.ప్రమోషన్ అనేది ‘లాగింగ్ ఇండికేటర్’చాలామంది ఉద్యోగులు తమ ఎదుగుదలను ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లతో కొలుస్తారు. కానీ, కున్ చెన్ అభిప్రాయం ప్రకారం.. ప్రమోషన్ రాకపోవడం అనేది మీరు ఎదగడం లేదని చెప్పే, చాలా ఆలస్యంగా తెలిసే ఒక ‘లాగింగ్ ఇండికేటర్’ (వెనుకబడిన సూచిక) మాత్రమే. స్టీవ్ హుయిన్ నిర్వహించే ‘ఎ లైఫ్ ఇంజనీర్డ్’ పాడ్‌కాస్ట్‌లో చెన్ మాట్లాడుతూ కెరీర్ స్తబ్దతను గుర్తించడానికి ప్రమోషన్ల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఆ ఒక్క ప్రశ్నతో కెరీర్ అంచనా!తన కెరీర్ ప్రారంభం నుంచి కున్ చెన్ ‘గత నెలలో నేను చేయలేని పనిని, ఈ నెలలో కొత్తగా ఏం చేయగలుగుతున్నాను?’ అనే సరళమైన, అత్యంత శక్తివంతమైన ప్రశ్న తనకు తాను వేసుకునేవారట. ఈ ప్రశ్నకు వరుసగా కొన్ని నెలల పాటు సమాధానం దొరకకపోతే మీరు నేర్చుకునే ప్రక్రియ ఆగిపోయిందని అర్థం. మైక్రోసాఫ్ట్‌లో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తన పని పునరావృతం అవుతోందని, కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదని ఈ పరీక్ష ద్వారానే ఆయన గ్రహించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.రాజీనామానే మార్గమా?నేర్చుకోవడం ఆగిపోయిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెన్ సూచిస్తున్నారు. కంపెనీని వీడకముందే కొన్ని అంతర్గత మార్గాలను అన్వేషించాలని ఆయన సలహా ఇచ్చారు. మేనేజర్లతో చర్చించి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. కంపెనీలోనే ఎక్కువ లెర్నింగ్ స్కోప్ ఉన్న మరో టీమ్‌కు బదిలీ అవ్వొచ్చన్నారు. చెన్ కూడా మైక్రోసాఫ్ట్ లో అంతర్గత మార్పును ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో వేగంగా ఎదుగుతున్న ‘ఫేస్బుక్’ (మెటా) వైపు వెళ్లడమే సరైనదని భావించారు. వేగవంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుందని ఆయన నమ్మినట్లు చెప్పారు.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు నిరంతరం తమను తాము ప్రశ్నించుకోవాలని చెన్ హెచ్చరిస్తున్నారు. ప్రతి నెల మనలో కొత్త నైపుణ్యం తోడవ్వకపోతే ఈ వేగవంతమైన పరిశ్రమలో మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి, ప్రమోషన్ల కోసం ఎదురుచూడకుండా మీరు ఏమేరకు కొత్త అంశాలు నేర్చుకుంటున్నారో ప్రతి నెలా చెక్ చేసుకోండి!ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలి తాలుసాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 89 శాతం దూసుకెళ్లి రూ. 9,352 కోట్లను తాకింది. అంతర్జాతీయంగా మెటల్ ధరలు బలపడటం, అమ్మకాల పరిమాణంలో వృద్ధి, రూపాయి మారకపు విలువ క్షీణత ఇందుకు దోహదపడ్డాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,961 కోట్లు ఆర్జించింది. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం 29 శాతం జంప్‌చేసి రూ. 51,524 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,789 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 13,702 కోట్ల నుంచి రూ. 19,119 కోట్లకు పెరిగాయి. విడదీయనున్న కంపెనీల లిస్టింగ్‌కు వీలుగా వచ్చే వారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు దరఖాస్తు చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో జూన్మధ్యకల్లా ఆయా బిజినెస్‌లు ప్రత్యేక కంపెనీలుగా లిస్టయ్యే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది. రూ. 14,918 కోట్ల పెట్టుబడులు కొత్త సామర్థ్యాల వినియోగం, పటిష్ట నిర్వహణా సామర్థ్యాలను ప్రతిఫలిస్తూ 2.9 మిలియన్ టన్నుల(ఎంటీ) అల్యూమినా, 2.46 ఎంటీ అల్యూమినియం, 1.1 ఎంటీ మైన్డ్ మెటల్‌ను డెలివరీ చేసినట్లు వేదాంతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. గతేడాది వృద్ధికి వీలుగా రూ. 14,918 కోట్ల పెట్టుబడులను వెచ్చించినట్లు వెల్లడించారు. 2026 మార్చి31కల్లా కంపెనీ స్థూల రుణ భారం రూ. 81,470 కోట్లుగా నమోదైంది. నికర రుణ భారం రూ. 53,254 కోట్లుకాగా.. క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నిర్వహణ లాభం, నికర లాభాలను సాధించినట్లు వేదాంతా సీఎఫ్‌వో అజయ్ గోయెల్ పేర్కొన్నారు. వేదాంతా లిమిటెడ్ నుంచి అల్యూమినియం(వీఏఎంఎల్), మర్చంట్ పవర్(టీఎస్పీఎల్), ఆయిల్ అండ్ గ్యాస్(ఎంఈఎల్), ఇనుప ఖనిజ(వీఐఎస్ఎల్) బిజినెస్‌లను నాలుగు లిస్టెడ్ కంపెనీలుగా విడదీస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు మే 1 రికార్డ్ డేట్‌గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 4.7 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది. -
‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్టమన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సాగుతున్న న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. మస్క్ దాఖలు చేసిన దావాపై కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. ఓపెన్ఏఐ సంస్థ స్థాపన లక్ష్యాలను తుంగలో తొక్కారన్న మస్క్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్న ఓపెన్ ఏఐ వాదనలతో ఈ కేసు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.2015లో ఓపెన్ ఏఐ స్థాపన సమయంలో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్ వంటి దిగ్గజాలు ఒక్కటయ్యారు. అప్పట్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఏజీఐ అభివృద్ధి, లాభాపేక్ష లేని పరిశోధనలు అనేవి ప్రధాన సూత్రాలుగా ఉండేవి. 2018 వరకు బోర్డులో చురుగ్గా ఉన్న మస్క్, ఆ తర్వాత సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ అందులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం కోర్టులో సాక్ష్యమిచ్చిన మస్క్, సంస్థ మూల సూత్రాల నుంచి తప్పుకుందని మండిపడ్డారు. ‘నేనే ఈ ఆలోచనను ప్రారంభించాను, పేరు పెట్టాను, కీలక నిపుణులను నియమించాను, భారీగా నిధులు సమకూర్చాను. ఇది నా బ్రెయిన్ చైల్డ్. కానీ ఇప్పుడు దాని తీరుతెన్నులే మారిపోయాయి’ అన్నారు.మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..మస్క్ నిష్క్రమణ తర్వాత 2019లో ఓపెన్ ఏఐ ‘క్యాప్డ్ ప్రాఫిట్’ (పరిమిత లాభాపేక్ష) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అజూర్, కోపైలట్ వంటి ఉత్పత్తుల్లో ఓపెన్ ఏఐ సాంకేతికతను వాడటంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓపెన్ ఏఐ మళ్లీ పాత లాభాపేక్షలేని మోడల్‌కు మారాలి. దాదాపు 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుత నాయకత్వంలో మార్పులు జరగాలి’ అని మస్క్ అంటున్నారు.ఓపెన్ ఏఐ కౌంటర్మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తరపు న్యాయవాది విలియం సావిట్ తీవ్రంగా ఖండించారు. సంస్థ లాభాపేక్షలేనిదిగా ఉండటానికి ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఆయన వాదించారు. ఆధునిక ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ నిధులు, భారీ మౌలిక సదుపాయాలు అవసరమని అందుకే నిర్మాణంలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ‘మిస్టర్ మస్క్ కోరుకున్నట్లుగా సంస్థపై నియంత్రణ దక్కలేదు కాబట్టే ఈ దావా వేశారు. గతంలో ఆయనే స్వయంగా సంస్థపై ఎక్కువ నియంత్రణ కోసం ఒత్తిడి చేశారు. ఇప్పుడు దొంగ ఏడుపు నటిస్తున్నారు’ అని సావిట్ కోర్టుకు వివరించారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం తన పాత ప్రకటనలను సమర్థించుకుంటూ.. ‘ప్రపంచస్థాయి మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సాధారణంగా సేకరించే నిధుల కంటే ఎక్కువ మూలధనం అవసరం. మా లక్ష్యం ఎప్పుడూ మానవాళి శ్రేయస్సే’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..
కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియలు ఒక్కోసారి వింత పోకడలకు వేదికవుతున్నాయి. ఒక అభ్యర్థికి ఆఫర్ లెటర్ ఇచ్చి, అతను దానికి అంగీకారం తెలిపి, ఇక విధుల్లో చేరతాడు అనే సమయానికి.. చివరి నిమిషంలో భారీ ప్యాకేజీ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'నాట్ డేటింగ్' (Knot Dating) స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ తన కంపెనీలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇది పూర్తిగా ‘నాన్ సెన్స్’ అన్నారు.అసలేం జరిగింది?జస్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బ్యాకెండ్ డెవలపర్ నియామకం కోసం తమ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఓ అభ్యర్థి ప్రస్తుతం రూ.21 ఎల్పీఏ సంపాదిస్తున్నారు. తనకు కంపెనీ సుమారు 33 శాతం పెంపుతో ఏటా రూ.28 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అభ్యర్థి ఈ ఆఫర్‌ను సంతోషంగా అంగీకరించి కంపెనీలో చేరతానని ధ్రువీకరించారు. కానీ, ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు ఆ అభ్యర్థి కంపెనీకి ఒక ఈమెయిల్ పంపారు. తనకు మరో సంస్థ నుంచి రూ.32 లక్షలు ఆఫర్ వచ్చిందని, కాబట్టి తన జీతాన్ని రూ.36 లక్షలకి పెంచితేనే చేరుతానని డిమాండ్ చేశారు.‘మనం చివరిసారి మాట్లాడుకున్నప్పుడు రూ.28 లక్షలకి అంగీకరించాను. కానీ ఇప్పుడు రూ.32 లక్షలు ఆఫర్ వచ్చింది. నాకు మీ కంపెనీ అంటే ఇష్టమే అందుకే నా ప్యాకేజీని రూ.36 లక్షలకు సవరించే వెసులుబాటు ఉందేమో చూడండి. అలాగే, నేను వారాంతాల్లో పని చేయను’ అని ఆ అభ్యర్థి నిస్సంకోచంగా మెయిల్లో పేర్కొన్నారు.‘ఇది ప్రొఫెషనలిజం కాదు’ఈ మెయిల్ చూసి విస్మయానికి గురైన జస్వీర్ సింగ్ అభ్యర్థి ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్యాకేజీ గురించి చర్చలు జరపడం సహజమే కానీ, ఒక ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. ‘ప్రస్తుత కంపెనీలో నోటీసు పీరియడ్ ముగిసే వరకు వేచి చూసి కొత్త కంపెనీలో చేరడానికి రెండు రోజుల ముందు ఇలా డిమాండ్ చేయడం వల్ల కంపెనీ సమయం, వనరులు వృథా అవుతాయి. ఇంకా ఆఫర్ల కోసం వెతుకుతుంటే ఆ విషయాన్ని ముందే చెప్పాలి. ఇది నాన్సెన్స్’ అని జస్వీర్ అన్నారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడికి వెళ్లడం సహజం. కంపెనీలు కూడా అవసరం తీరాక ఉద్యోగులను తొలగిస్తాయి కదా, అప్పుడు లేని నైతికత ఇప్పుడెందుకు?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక మాట ఇచ్చాక తప్పడం సరికాదు. మరిన్ని ఆఫర్లు కావాలనుకుంటే అసలు ఆఫర్ లెటర్ మీద సంతకం చేయకూడదు. ఇది రిక్రూటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని మరికొందరు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’ -
‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సందీప్ బక్షి పదవీకాలం పొడిగింపుపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. బక్షి నాయకత్వంలో బ్యాంక్ వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, నియంత్రణ ఉల్లంఘనలు, మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి లేఖ రాశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించవద్దని, అది బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని భూషణ్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.నియంత్రణ ఉల్లంఘనల పరంపరసాధారణంగా మూడేళ్ల పాటు ఉండే పదవీకాలాన్ని కాదని వారసత్వ ప్రణాళికలో భాగంగా సందీప్ బక్షికి రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని ఐసీఐసీఐ బ్యాంక్ జనవరిలో ఆర్బీఐని కోరింది. ఈ నేపథ్యంలో భూషణ్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్లు 35A, 35B, 36AA, 10B కింద ఆర్బీఐ తన చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు.‘బక్షి హయాంలో నిరంతర నియంత్రణ ఉల్లంఘనలు జరిగాయి. ఆయనను కొనసాగించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని భూషణ్ హెచ్చరించారు. ముఖ్యంగా 2020-21 కాలంలో (చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత) రుణాల వ్యవహారం, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ రక్షణ వంటి అంశాలలో విఫలమైనందుకు బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.12 కోట్ల జరిమానా విధించడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.రూ.245 కోట్ల మోసాలు.. డేటా ఉల్లంఘనలు2024 నుంచి ఇప్పటివరకు సుమారు 23 ఆర్థిక మోసాలు జరిగినట్లు భూషణ్ తన లేఖలో జాబితా చేశారు. ‘22 శాఖల్లో సుమారు రూ.245 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కస్టమర్ల గోప్యతకు సంబంధించిన డేటా ఉల్లంఘనలు కూడా చోటుచేసుకున్నాయి’ అన్నారు. అయితే, ఈ నష్టాలు బ్యాంకు నికర లాభంలో కేవలం 0.25% మాత్రమేనని, పైగా వీటిలో బక్షి వ్యక్తిగతంగా నిందితుడు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక విపత్తు సంభవించే వరకు ఆర్బీఐ వేచి చూడకూడదని భూషణ్ వాదించారు.కార్మిక చట్టాల ఉల్లంఘన.. ఉద్యోగుల ఆత్మహత్యలుబ్యాంకులో పని ఒత్తిడి, ఉద్యోగుల వేధింపులపై భూషణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘2024 జనవరి - జూన్ మధ్య సుమారు 800 మంది ఉద్యోగులు పని మానేసినట్లు సమాచారం. ఇది మొత్తం సిబ్బందిలో 0.39%. పని ఒత్తిడి కారణంగా ఇటీవల నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్మిక అధికారులు కోరినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, రికార్డులు అందించడంలో బ్యాంక్ విఫలమైంది’ అని ఆరోపించారు. దీనిపై బక్షిపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరడానికి చర్యలు ప్రారంభించినట్లు లేఖలో పేర్కొన్నారు.రూ.1,224 కోట్ల జీఎస్టీ డిమాండ్లుపన్ను చెల్లింపుల్లో కూడా బ్యాంక్ విఫలమైందని భూషణ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,224 కోట్లకు పైగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు రావడం అంతర్గత ఆడిట్ నియంత్రణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు.చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత బ్యాంకును గాడిలో పెట్టిన బక్షి తన చిరకాల ప్రత్యర్థి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. మరి ఈ ఆర్థిక విజయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఆయనకు పదవి పొడిగింపు ఇస్తుందా? లేక ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన నియంత్రణ లోపాలపై విచారణ చేపడుతుందా? అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
దేశంలో 16.77 కోట్ల మంది విమానమెక్కారు..
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంచనాలకు అనుగుణంగా పెరిగింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 0–3 శాతం అంచనా వేయగా 1.4 శాతం వృద్ధి నమోదైంది. 16.77 కోట్ల మంది ప్రయాణికులను దేశీ ఎయిర్‌లైన్స్ గమ్యస్థానాలకు చేర్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది 16.54 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 1 శాతం పెరిగి 1.47 కోట్లుగా ఉంది.మార్చిలో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ 89.5 శాతంగా ఉన్నట్లు, గతేడాది ఇదే వ్యవధిలో ఇది 86 శాతంగా ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా విమాన ఇంధనం రేట్ల పెంపు భారం తక్కువగా ఉన్నట్లు వివరించింది. నెలవారీగా చూస్తే మార్చిలో క్రూడాయిల్ రేట్లు 45.5 శాతం పెరిగినా, ఏటీఎఫ్ ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ 25 శాతం పరిమితి విధించినట్లు తెలిపింది.దేశీయంగా ఏవియేషన్ రంగంపై ప్రభావం పడకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సీక్వెన్షియల్‌గా ఏప్రిల్‌లో ఏటీఎఫ్ రేట్లను 9.2 శాతం మాత్రమే పెంచాయి. అయితే, క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగుతున్నందున భవిష్యత్తులో ఏటీఎఫ్ రేట్లపై ప్రభావం పడొచ్చని, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటం మరో ఆందోళనకరమైన విషయమని ఇక్రా తెలిపింది. -
ఒక ప్రీమియం.. జీవితాంతం ఆదాయం!
అవివా ఇండియా.. అవివా సెక్యూర్ నెస్ట్ యాన్యుటీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక పథకం. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించి.. జీవితాంతం నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది రిటైర్మెంట్ తరువాత ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. 80 సంవత్సరాల వయస్సు వరకు ప్రవేశం లభిస్తుంది. అంటే, జీవితంలో ఏ దశలో ఉన్నవారైనా తమ భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చన్నమాట. దీనిలో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వివిధ యాన్యుటీ ఎంపికలు ఉన్నాయి. వీటిలో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ కవరేజ్ ఉన్నాయి.అంతే కాకుండా.. అనువైన చెల్లింపు వ్యవధులతో హామీతో కూడిన జీవితకాల ఆదాయం, నామినీల వారసత్వాన్ని రక్షించడానికి కొనుగోలు ధర వాపసు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనలకు కూడా అనుగుణంగా ఉంది, అందువల్ల ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులకు ఒక సరైన ఎంపికగా నిలుస్తుంది. -
ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. మొబిక్విక్‌కు NBFC లైసెన్స్!
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా సేవలు అందించేందుకు వన్ మొబిక్విక్ సిస్టమ్స్ చేసుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్బీఎఫ్సీ లైసెన్స్ జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో రుణ విభాగం ‘మొబిక్విక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్’ను ఆరంభించేందుకు అవకాశం లభించిందని, తమ రుణ వ్యాపార అవకాశాల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.వర్తకులు, వినియోదారులకు మరింత విస్తృతమైన సేవలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుగు నెలల్లోనే తమ దరఖాస్తుకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, తమ గ్రూప్ విశ్వసనీయతకు ఇది నిదర్శనమని మొబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు, ఈడీ ఉపాసనా టకు పేర్కొన్నారు. తమ గ్రూప్‌నకు ఉన్న 18.6 కోట్ల యూజర్ల బేస్, బలమైన టెక్నాలజీ వసతులు, వసూలు సామర్థ్యాల పునాదులపై ఎన్బీఎఫ్సీని నిర్మించనున్నట్టు చెప్పారు. -
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!
బ్రిటన్‌లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.ఈజిప్టులో జన్మించి, ఖతార్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. -
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ
కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్‌లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అయిన అనంత్ అంబానీ.. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్‌కు ఒక లేఖ రాశారు.అనంత్ అంబానీ రాసిన లేఖలో.. 80 హిప్పోపొటమస్‌లను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాకు తరలించవచ్చని, ఇక్కడ జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, వైద్య సదుపాయాలు, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంతువులను చంపడం కంటే.. ఇది సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు.''ఆ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు'' కాబట్టి వాటిని చంపడం తగదు. సురక్షితమైన పరిష్కారం ద్వారా వాటిని కాపాడే సామర్థ్యం మనకు ఉంటే, ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉందని అనంత్ అంబానీ అన్నారు.వంతారా గురించిగుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్ద. అత్యంత అధునాతన వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్‌లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. -
సన్ ఫార్మా మెగా డీల్..!
న్యూఢిల్లీ: దేశీ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా మరో భారీ డీల్‌కి తెరతీసింది. అమెరికాకు చెందిన ఆర్గానాన్ అండ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సంస్థ విలువను 11.75 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 1.10 లక్షల కోట్లు) లెక్క కట్టారు. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించి ఆర్గానాన్ను సన్ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఇది పూర్తిగా నగదు రూపంలో ఉంటుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2027 తొలినాళ్లలో ఒప్పందం పూర్తవుతుందని అంచనా. దీనికి కావాల్సిన మొత్తాన్ని 2–2.5 బిలియన్ డాలర్లను అంతర్గతంగాను, మిగతా 9.25–9.75 బిలియన్ డాలర్లను రుణం రూపంలో సన్ ఫార్మా సమకూర్చుకోనుంది. కాస్త ఆనందం.. కాస్త ఉత్కంఠ.. ఇరు కంపెనీల కలయికతో మరింత శక్తివంతమైన సంస్థ ఏర్పడుతుందని సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ తెలిపారు. ‘ఈ డీల్ విషయంలో కాస్త ఆనందంగాను, ఉత్తేజంగాను, కాస్త ఉత్కంఠగాను ఉంది. ఇది చాలా భారీ ఒప్పందం కావడం, పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సి రానుండటమే ఇందుకు కారణం. మేము రుణానికే తప్ప రిస్కుకు వ్యతిరేకం కాదు. అయితే, ఇప్పుడు తీసుకుబోయే రుణం భారీగానే ఉన్నప్పటికీ ఉమ్మడి సంస్థ ఎబిటాకు 2.3 రెట్లు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను బట్టి దీన్ని త్వరలోనే తగ్గించుకోగలమనే ధీమా ఉంది. గతంలో ర్యాన్‌బాక్సీ డీల్‌ని ఇది గుర్తు తెస్తోంది. అప్పట్లో మాది చిన్న కంపెనీ అయినప్పటికీ చాలా పెద్ద సంస్థను కొన్నాం. ఇప్పుడు అర్గానాన్ దాదాపు సన్ ఫార్మా స్థాయిదే అయినప్పటికీ సుమారు 25 శాతం తక్కువ వేల్యుయేషన్కే లభిస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన మీదట నగదు రూపంలో ఉండే ఈ లావాదేవీ మా వాటాదారులకు గణనీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయంగా మా వ్యాపారాలు, ఉద్యోగులు, పేషెంట్లకు సన్ ఫార్మా దన్నుగా ఉంటుందని ఆశిస్తున్నాం‘ అని ఆర్గానాన్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ క్యారీ కాక్స్ తెలిపారు. ఆర్గానాన్ కథ ఇదీ... 2021లో దిగ్గజ సంస్థ మెర్క్ నుంచి విడగొట్టడం ద్వారా ఏర్పాటైన గ్లోబల్ హెల్త్‌కేర్ కంపెనీ ఆర్గానాన్. మెర్క్ని అమెరికా, కెనడా వెలుపల ఎంఎస్డీగా వ్యవహరిస్తారు. ఆర్గానాన్కి యూరోపియన్ యూనియన్, వర్ధమాన మార్కెట్లలో ఆరు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల్లో గ్లోబల్ లీడరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మహిళల హెల్త్, జనరల్ మెడిసిన్స్ విభాగాల్లో బయోసిమిలర్స్ సహా 70కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. 140 దేశాల్లో విక్రయిస్తోంది. అమెరికా, యూరప్, చైన్, కెనడా, బ్రెజిల్ మొదలైనవి భారీ మార్కెట్లుగా ఉన్నాయి. 2025 డిసెంబర్ 31తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ 6.2 బిలియన్ డాలర్ల ఆదాయం, 1.9 బిలియన్ డాలర్ల ఎబిటాను (సవరించిన) ఆర్జించింది. 8.6 బిలియన్ డాలర్ల రుణభారం, 574 మిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇటీవలే ఒక ఉత్పత్తి విక్రయానికి గాను ముందస్తుగా 440 మిలియన్ డాలర్లు అందుకుంది. డీల్స్ కింగ్.. సన్ .. సన్ ఫార్మా గతంలో కూడా పలు భారీ స్థాయి కొనుగోళ్లు చేసింది. 2014లో ర్యాన్‌బాక్సీని 4 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. అలాగే 2007లో ఇజ్రాయెల్‌కి చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌ని 454 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దేశీ దిగ్గజాల భారీ షాపింగ్.. అంతర్జాతీయంగా మన కంపెనీల భారీ కొనుగోళ్ల ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. 2007లో కోరస్‌ను టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. తర్వాత 2010లో కువైట్ దిగ్గజం జెయిన్ టెలికంనకు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని భారతి ఎయిర్టెల్ 10.7 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. సన్ ఫార్మాకు ప్రయోజనాలు.. → 12.4 బిలియన్ డాలర్ల ఉమ్మడి ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సంస్థ నిలుస్తుంది. → గ్లోబల్‌గా మహిళల ఆరోగ్య సంరక్షణ ఔషధాలకు సంబంధించి టాప్ 3 కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కుతుంది. → బయోసిమిలర్స్ మార్కెట్లో 7వ పెద్ద సంస్థగా ఉంటుంది. → 150 దేశాలు, 18 భారీ మార్కెట్లలో కార్యకలాపాలు. ఒక్కో మార్కెట్ నుంచి 100 మిలియన్ డాలర్ల కు పైగా ఆదాయం లభిస్తుంది.షేరు 7 శాతం అప్.. సోమవారం బీఎస్ఈలో సన్ ఫార్మా షేరు 7 శాతం ఎగిసింది. రూ. 1,733.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 27,307 కోట్లు పెరిగి రూ. 4,15,987 కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరుగా నిల్చింది. అమెజాన్ నౌ 100 నగరాల్లోకి విస్తరణలిస్టులో హైదరాబాద్, వైజాగ్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సరీ్వసులను దేశవ్యాప్తంగా 100 నగరాల్లోకి విస్తరించనుంది. హైదరాబాద్, వైజాగ్‌తో పాటు పుణే, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూ రు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషన ల్ క్యాపిటల్ రీజియన్) అమెజాన్ నౌ సేవ లు లభిస్తున్నాయి. అమెజాన్ ఇండి యా ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల పెట్టుబడుల ప్రణాళికల్లో ఈ విస్తరణ భాగంగా ఉండనుంది. 1,000కి పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు తమ క్విక్ కామర్స్ కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఎవ్రీడే ఎజెన్షియల్స్) హర్‡్ష గోయెల్ తెలిపారు. క్విక్ కామర్స్ విస్తరణతో 16,000 మందికి పైగా రైతులు తమ టెక్నాలజీ, నెట్వర్క్ని ఉపయోగించుకుని, ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. -
అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!
ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అయిన శ్రీనివాస్ నారాయణన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని వీడి భారతదేశానికి రానున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడు సంవత్సరాలు సంస్థలో పనిచేసిన తరువాత.. శ్రీనివాస్ నారాయణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ విషయాన్ని కంపెనీకి తెలియజేసి ఈ ప్రయాణాన్ని "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించారు.నారాయణన్ తన తదుపరి ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోకముందు భారత్‌కు వెళ్లి తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పారు. టెక్నాలజీ, సమాజంలో కీలక మార్పులు జరుగుతున్న ఈ కాలంలో సంస్థలో పని చేయడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. మీ అందరికీ భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''ఎవరీ శ్రీనివాస్ నారాయణన్?శ్రీనివాస్ నారాయణన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొంది, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్లో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెటాలో దశాబ్దానికి పైగా పని చేసి, ఫేస్బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, విస్తరించారు. ఈ బృందమే పరిశోధనను లక్షలాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మారుస్తుంది.After 3 incredible years, I am leaving OpenAI at the end of next week.I shared my decision with the OpenAI leadership team at the start of the month and here is a shorter version of what I shared with my team earlier this week.===Hi Team,I have decided to leave OpenAI. The…— Srinivas Narayanan (@snsf) April 17, 2026


