ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం | India Shines At Venice Biennale, Nita Ambani Leads Cultural Revival World Stage | Sakshi
Sakshi News home page

ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం

May 7 2026 8:07 AM | Updated on May 7 2026 8:44 AM

India Shines At Venice Biennale, Nita Ambani Leads Cultural Revival World Stage

వెనిస్‌ బినాలేకు ‘ఇండియా పెవిలియన్‌’!

ప్రపంచ కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వెనిస్‌ బినాలే’ వేదికపై భారతీయ ప్రాభవం మెరవనుంది. భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ‘ఇండియా పెవిలియన్‌’ను తిరిగి వెనిస్‌ బినాలేకు తీసుకువెళ్లడంతోపాటు మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు.

సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేదిక

కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ముందుండే రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముందడుగుపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే అద్భుత ఘట్టమని చెబుతున్నారు. ‘ప్రపంచంలోని గొప్ప వేదికల్లో ఒకటైన వెనిస్‌లో మన దేశ కళ, సంస్కృతి, హస్తకళలను వేడుకగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని ఓ సీనియర్ ఆర్ట్ క్రిటిక్ అన్నారు.

కళాత్మక హొయలతో నీతా అంబానీ

ఈ చారిత్రాత్మక క్షణాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ తన వస్త్రధారణతో భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన షిఫాన్-జార్జెట్ చీరలో ఆమె మెరిసిపోయారు. దీనికి జతగా బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేస్ బ్లౌజ్ ధరించారు. మన నేత కళకు నిదర్శనమైన ‘స్వదేశ్’ రూపొందించిన, చేతితో నేసిన బుటిదార్ సోజ్ని శాలువా ఆమె రాజసాన్ని మరింత పెంచింది. ప్రఖ్యాత జ్యువెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ రూపొందించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

nita1
1/2

nita2
2/2

Advertisement
 
Advertisement
Advertisement