ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్‌.. మొబిక్విక్‌కు NBFC లైసెన్స్‌! | RBI Approves Mobikwik NBFC License | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్‌.. మొబిక్విక్‌కు NBFC లైసెన్స్‌!

Apr 28 2026 5:40 PM | Updated on Apr 28 2026 6:03 PM

RBI Approves Mobikwik NBFC License

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా సేవలు అందించేందుకు వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ చేసుకున్న దరఖాస్తుకు ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ జారీ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో రుణ విభాగం ‘మొబిక్విక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌’ను ఆరంభించేందుకు అవకాశం లభించిందని, తమ రుణ వ్యాపార అవకాశాల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.

వర్తకులు, వినియోదారులకు మరింత విస్తృతమైన సేవలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుగు నెలల్లోనే తమ దరఖాస్తుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని, తమ గ్రూప్‌ విశ్వసనీయతకు ఇది నిదర్శనమని మొబిక్విక్‌ సహ వ్యవస్థాపకురాలు, ఈడీ ఉపాసనా టకు పేర్కొన్నారు. తమ గ్రూప్‌నకు ఉన్న 18.6 కోట్ల యూజర్ల బేస్, బలమైన టెక్నాలజీ వసతులు, వసూలు సామర్థ్యాల పునాదులపై ఎన్‌బీఎఫ్‌సీని నిర్మించనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement