ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి | Swarn Shatabdi Express pelted with stones at Firozabad in UP RSS chief target deets inside | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి

Jun 12 2026 11:21 AM | Updated on Jun 12 2026 11:34 AM

Swarn Shatabdi Express pelted with stones at Firozabad in UP RSS chief target deets inside

లక్నో నుంచి ఢిల్లీ  వెళ్లే 'స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్' (Swarn Shatabdi Express)  రైలుపై ఫిరోజాబాద్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న  రైల్లో ఈ ఘటన జరగడంతో ఆందోళన రేగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ భాగవత్‌ సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ జరిగిందంటే..

గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12003) రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మఖన్‌పూర్ స్టేషన్‌ను దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలుపై రాయి పడటంతో E-1 కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు ఉత్తరప్రదేశ్ ఫేరోజాబాద్ జిల్లాలోని తుండ్లా జంక్షన్ వద్ద వద్ద రైలును నిలిపివేశారు.

మోహన్  భగవత్ టార్గెట్‌?
అయితే రాయి తగిలిన కోచ్‌లోనే మోహన్  భగవత్ ప్రయాణిస్తున్నట్లు GRP ఇన్‌స్పెక్టర్ షేర్ సింగ్ ధృవీకరించారు. కోచ్‌లోని అవతలి వైపు (ఆపోజిట్ సీట్లో) కూర్చోవడంతో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. అలాగే ఆయనతో పాటు, ఇతర ప్రయాణికులు కూడా  సురక్షితంగా ఉన్నారని సింగ్ తెలిపారు.  అధికారుల తనిఖీల అనంతరం రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.

ఘటనా స్థలానికి  ఉన్నతాధికారులు
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే  పోలీసు ఉన్నతాధికారులు ఫిరోజాబాద్‌లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. రైలులో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని  ఎస్‌ఎస్‌పీ ఆదిత్య లాంగే  చెప్పారు. విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

గతంలోనూ రాళ్ల దాడులు 
ఫిరోజాబాద్ గుండా వెళ్లే ఈ రైల్వే ట్రాక్ పరిసరాల్లో గతంలోనూ పలుమార్లు రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన ఘటనలను, ప్రస్తుత కేసును పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఎస్ఎస్పీ లాంగే స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement