తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలతో వైవిధ్యభరితమైన నటనతో మెప్పిస్తుంటాడు ఈ సూపర్ స్టార్. ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లాడిని ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటారనేది.. పలు ఇంటర్వ్యూల్లో అజిత్ చెప్పిన మాటలే నిదర్శనం.
ఆఖరికి ఇటీవల పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్నప్పుడూ కూడా ఆ క్రెడిట్ మొత్తాన్ని భార్యకే ఇచ్చేశారు. ఫ్యామిలీకి, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆయన డైట్ విషయంలో ఎంత కేర్‌గా ఉంటారో తెలిస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు దివ్య కె పురుషోత్తం అరవింద్ సురేష్ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. అవేంటంటే..
తాను చాలామంది సెలబ్రిటీలో పనిచేశాను కానీ అజిత్ ఫ్యామిలీ ఆహారం విషయంలో పాటించే క్రమశిక్షణను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటానని అన్నారు దివ్య. అది కేవలం అజిత్ సార్‌లోనే కాదు మేడమ్ షాలిని కూడా ఆహారం విషయంలో చాలా కేర్‌గా ఉంటారని చెప్పారు.
తను నోట్లో పెట్టుకునే ప్రతి ఆహారానికి, తన పిల్లలకు, ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా మంచి ఆహారమే ఉండేలా చూస్తారు. శుభ్రంగా, ఆరోగ్యకరమైనది, పోషకాలతో కూడినదే తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజంగా ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం అని అన్నారామె.
నిపుణులు ఏం అంటున్నారంటే..
ఇంతలా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమేనని, ముఖ్యంగా మితంగా తినడం మంచిదని అన్నారు. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఇలాంటి శ్రద్ధ ఫలితం అధిక జంక్ ఫుడ్, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉండగలుగుతారని అన్నారు.
శ్రద్ధగా ఉండటం మంచిదే కానీ ప్రతి ముద్దను తనిఖీ చేసేంత అతి వద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి తప్ప..అందుకోసం ఆందోళనల, ఒత్తిడి వద్దన్నారు. క్లీన్ ఈటింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు ఆరోగ్య నిపుణులు.
“క్లీన్ ఈటింగ్” అంటే ..
క్లీన్ ఈటింగ్ అనే భావనను తరచుగా ఖరీదైనదిగా లేదా పరిమితమైనదిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. “క్లీన్ ఈటింగ్ అంటే పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, ఇంట్లో వండిన తాజా భోజనం వంటి సహజమైన ఆహారాన్ని తినడం. ఇది ఏమి ఠినమైన డైటింగ్ కూడా కాదు. కేవంల ఎక్కువగా ప్రాసెస్ చేసే జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండటం లాంటిది. ఇంట్లో క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తే..పిల్లలు కూడా ఆటోమేటిగ్గా ఆ అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.


