షాకింగ్‌ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్‌! | Karnataka Man Hangs Wife Video Calls Her Parents To Show Her Dying | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్‌!

Jul 28 2026 1:28 PM | Updated on Jul 28 2026 1:42 PM

Karnataka Man Hangs Wife Video Calls Her Parents To Show Her Dying

సాక్షి, బెంగళూరు :  కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో దిగ్భాంతి రేపే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 23 ఏళ్ల భార్యను భార్యను ఉరివేసి హత్య చేశాడు.   అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను రికార్డు చేసి, ఆ వీడియోను బంధువులకు, స్నేహితులకు పంపిన ఘోరాన్ని అత్తమామలకు వీడియో కాల్‌ చేసి చూపించిన కిరాకత ఘటన కలకలం రేపింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలిని భాగ్యశ్రీ జిగళూర్ (23)గా, నిందితుడైన ఆమె భర్తను ప్రవీణ్ జిగళూర్ (28)గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గొడవ జరిగిన సమయంలో ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై దుంగతో దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఉరితాడుకు వేలాడుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ప్రవీణ్ ఆ ఘోరాన్ని వీడియో రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటాన్ని వారికి  చూపించాడు. అంతేకాదు ఆ వీడియోను పలువురికి షేర్ కూడా చేశాడు.ఈ ఘటన బాగల్‌కోట్ జిల్లా గలగలి గ్రామంలోని వారి నివాసంలో చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్‌

గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో భాగ్యశ్రీ రెండు నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉందామని, గొడవలు పడనని నమ్మబలికి ప్రవీణ్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన ఆ రోజే ఆమెను ఈ రకంగా దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్‌యూ’ చెప్పాడు!
ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement