రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి ఒకటి.(Chandramukhi Movie)
ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే చాలామంది టీవీలకే అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకాదరణ పొందిందీ మూవీ.
రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలైంది.
ఈ మూవీలో అత్తింధోం.. పాట చాలా ఫేమస్. ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా? ముద్దుగా బొద్దుగా కనిపించే ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్.(Praharshitha Srinivasan)
బాలనటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసిన ఆమె తర్వాత ఎక్కువగా వెండితెరపై కనిపించనేలేదు.
ఇప్పుడు ఈ చిన్నారి ఎలా ఉందోనని కొందరు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.
2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకోగా ఆమెకు కూతురు పుట్టింది.
బుల్లితెరకు దూరంగా ఉన్న ఈమె తమిళంలో ఓ కొత్త సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
సోషల్ మీడియాలో ఫోటోషూట్లు, కూతురితో ఆడుకున్న వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది.
Photo Credit : simply_bommi (instagram)


