పారిస్‌లోని పోర్ట్ డి క్లిచీ సమీపంలో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. రెండు పొడవైన కత్తులతో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే డ్యూటీ పోలీస్ అధికారి చాకచక్యంగా అతడిని బంధించి, అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. ఈ ఘటన 'పోర్ట్ డి క్లిచీ' ప్రాంతం సమీపంలో జరిగింది.
ఫ్రాన్స్ రక్షణ మంత్రి లారెంట్ నునెజ్ తెలిపిన వివరాల ప్రకారం,నిందితుడు రెండు వంటగది కత్తులతో 19, 24, 36 ఏళ్ల వయస్సున్న మహిళలపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు గర్భిణి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. డ్యూటీలో ఉన్న పోలీసు బాటసారులతో కలిసి అడ్డుకుని నిందితుడిని ఆ టకట్టించడం ప్రశంసలందుకుంటోంది. గుర్తుతెలియని ఆ నిందితుడు, తానీ నేరం చేయడానికి "అల్లాహ్" ఆజ్ఞాపించాడని పేర్కొన్నాడు. పారిస్ వీధిలో ఆ వ్యక్తి కత్తితో దాడికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి స్నాప్‌చాట్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో నిజమైనదేనని రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించింది.
Pregnant woman among two people rushed to hospital after mass stabbing in Paris.
Suspect shouted: "It's Allah who made me do it"! pic.twitter.com/APe5MSPBzD— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) July 27, 2026
>
ఆ వీడియోలో పొడవాటి నల్లని జుట్టు, క్రీమ్ రంగు ట్రాక్‌సూట్ ధరించిన ఒక వ్యక్తి రెండు చేతుల్లో పెద్ద కత్తులు పట్టుకుని, ఒక యువతిపై దాడి చేసి పొడవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే అదే వ్యక్తి నేలపై పడిపోగా, బాటసారులు అతడిని కదలకుండా పట్టుకున్నారు. నేలపై పడి ఉన్న ఆ వ్యక్తి "నన్ను ఇలా చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించాడు" అని అనడం వీడియోలో వినిపిస్తోంది.
ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
ఎలా పట్టుకున్నారంటే..
నిందితుడు ఒక మహిళ వెనుక భాగంలో పొడవడం చూసి, 'రండి, అతడిని ఆపుదాం!' అని గట్టిగా అరిచాడు పోలీసు అధికారి. వెంటనే పలువురు ముందుకు వచ్చారు. ఇంతలో మరో వ్యక్తి అతనిపైకి సూట్‌కేస్‌ను విసిరాడు. దాంతో అతని చేతిలో కింత పడిపోయాయి.. ఆ సమయంలో పోలీసు అతడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో నిందితుడిని బంధించిన ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారిని మంత్రి నునెజ్ ప్రశంసించారు.
ఈ దాడికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని నునెజ్ తెలిపారు. నిందితుడి వివరాలను నిర్ధారించలేదు. ఈ ఘటనపై తీవ్రవాద నిరోధక విచారణ చేపట్టాలా వద్దా అనే కోణంలో ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూటర్ కార్యాలయం పరిశీలిస్తోంది.
ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది


